అవినీతి అధికారులపై కఠిన చర్యలు : మంత్రి పోచారం | pocharam srinivas rao visits khammam distirict | Sakshi
Sakshi News home page

అవినీతి అధికారులపై కఠిన చర్యలు : మంత్రి పోచారం

Published Wed, Mar 4 2015 3:03 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

అవినీతి అధికారులపై కఠిన చర్యలు : మంత్రి పోచారం - Sakshi

అవినీతి అధికారులపై కఠిన చర్యలు : మంత్రి పోచారం

అశ్వారావుపేట: ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో ఆయిల్‌ఫెడ్‌కు చెందిన పామాయిల్ ఫ్యాక్టరీలో అవినీతికి పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. పామాయిల్ ఫ్యాక్టరీలో బుధవారం రైతులతో నిర్వహించిన సమావేశంలోమంత్రులు పోచారం,  తుమ్మల నాగేశ్వరరావు లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ... పామాయిల్ రికవరీ 20 శాతానికి తక్కువ కాకుండా వచ్చేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. గతంలో ఫ్యాక్టరీలో అధికారులు చేసిన అవినీతిపై మాట్లాడుతూ... ప్రత్యేక పైపులైన్ ద్వారా పామాయిల్ మళ్లించి రైతులను దోచుకోవడం తీవ్రమైన నేరంగా పేర్కొన్నారు.

 తప్పు చేసిన అధికారులను సస్పెండ్ చేస్తే సరిపోదన్నారు. మరెవరూ అలాంటి తప్పు చేయకుండా భయపడే రీతిలో చర్యలు తీసుకోవాలని ఆయిల్‌ఫెడ్ జాయింట్ డెరైక్టర్ అచ్యుతరావుకు మంత్రి పోచారం సూచించారు. పామాయిల్ రైతులకు మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement