strike Success
-
సింగరేణిలో సమ్మె సక్సెస్..
సాక్షి, కొత్తగూడెం: వారసత్వ ఉద్యోగాల సాధనే లక్ష్యంగా ఐదు జాతీయ కార్మిక సం ఘాలు ఇచ్చిన పిలుపుతో సింగరేణిలో గురు వారం నుంచి ప్రారంభమైన సమ్మె తొలిరోజు ప్రశాంతంగా జరిగింది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో మొదటి షిఫ్టులో 39.85 శాతం కార్మికులు విధులకు హాజరుకాగా 60.15 శాతం కార్మికులు సమ్మెలో పాల్గొ న్నారు. సమ్మెతో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడింది. సమ్మె సందర్భంగా పలు ప్రాంతాల్లో కార్మిక సం ఘాలు వారసత్వ ఉద్యోగాల అంశాన్ని సత్వరం పరిష్కరించాలని కోరుతూ ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించాయి. మరోవైపు సింగరేణిలో తొలిరోజు సమ్మె ప్రభావంపై స్పందించిన సింగరేణి యాజ మాన్యం కార్మి కులను తక్షణం సమ్మె విర మించి విధుల్లో చేరా లని విజ్ఞప్తి చేసింది. కార్మికులు అధికశాతంలో సమ్మెలో పాల్గొన్న పటికీ బొగ్గు ఉత్పత్తి మాత్రం 98 శాతం జరిగినట్లు అధికారులు లెక్కలు చెప్తున్నారు. 11 ఏరియాల్లో అత్య ధికంగా కార్పొరేట్ ఏరి యాలో 92.33 శాతం కార్మికులు హాజరు కాగా, అత్యల్పంగా అడ్రి యాల ప్రాజెక్టులో 24.10 శాతం కార్మికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సింగరేణి ప్రధాన కార్యాలయం తోపాటు అన్ని ఏరియా ల్లోనూ గనులు, డిపార్ట్మెంట్ల వద్ద పోలీ సులు, స్పెషల్‌పార్టీ సిబ్బందితో భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. గనులకు వెళ్లే ప్రతీ ఒక్కరి వద్ద గుర్తింపు కార్డులను పరిశీలించి అనుమతిం చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏరియాలో సమ్మె ప్రభావాన్ని డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్.చంద్రశేఖర్ పరిశీలిం చారు. కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట జాతీయ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిం చారు. 1981 ఒప్పందం ప్రకారం సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పించే వరకు కార్మికులు సమ్మెలో పాల్గొనాలని నాయకులు కోరారు. సమ్మెకు స్థానిక కార్మిక సంఘాలు మద్దతు తెలపగా, టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సమ్మెకు దూరంగా ఉంది. వారసత్వ ఉద్యోగాల సాధన కోసం.. గోదావరిఖని: సింగరేణిలో వారసత్వ ఉద్యో గాల సాధన కోసం కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపునకు కార్మికులు స్పందించారని, మెజార్టీ కార్మికులు విధులకు హాజరు కాకుండా తమ ఆకాంక్షను వ్యక్తం చేసి విజయ వంతం చేశారని జాతీయ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ బి.జనక్‌ప్రసాద్ తెలిపారు. సమ్మె నేపథ్యంలో ఆయన గురువారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో విలేకరులతో మాట్లాడారు. -
సమ్మె సక్సెస్
కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసించిన కార్మిక, ఉద్యోగ సంఘాలు మూతపడిన వాణిజ్య, వ్యాపార, విద్యా సంస్థలు స్తంభించిన రవాణా వ్యవస్థ సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి న్యూశాయంపేట : కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో సమ్మె విజయవంతమైంది. దేశంలోని పది ప్రధాన కార్మిక సంఘాలు, కేంద్ర ప్రభుత్వ రంగంలోని సుమారు 20 ఉద్యోగ సంఘాల ఫెడరేషన్లు, ఉద్యోగ సంఘాలు ఐక్యంగా సమ్మెకు దిగాయి. పన్నెండు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచి ఈ సమ్మెలో పాల్గొన్నాయి. ఈ సమ్మెలో బీజేపీ అనుబంధ బీఎంఎస్ మినహా సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీల అనుబంధ కార్మి సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. సమ్మె ప్రభావంతో బ్యాంకులు, వాణిజ్య, వ్యాపార, విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఆటో కార్మిక సంఘాలు కూడా సమ్మెలో పాల్గొన్నాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. బస్సులు నడవకపోవడంతో ప్రైవేటు వాహనాల వారు ప్రయాణికుల నుంచి అధిక మెత్తంలో డబ్బులు వసూలు చేశారు. బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో లావాదేవీలు నిలిచిపోయాయి. సినిమా హాళ్లు మూతపడ్డాయి. కార్మికుల ర్యాలీలు, ధర్నాలో పలు పార్టీల నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు. ప్రధానంగా.. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, కనీస వేతనం రూ.18వేలు ఇవ్వాలని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దుచేసి ఇప్పుడున్న ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, అసంఘటిత, వ్యవసాయ కార్మికులకు సామాజిక భద్రతతో పాటు, కేంద్ర ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్న వారిని కార్మికులుగా గుర్తించాలని, ప్రభుత్వరంగ సంస్థల్లో వాటా అమ్మకాలను నిలిపివేయాలని, రక్షణ, బ్యాంకు, ఇన్సూరెన్స్ తదితర రంగాల్లో ఎఫ్‌డీఐలను అనుమతించొద్దని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. నిలిచిన బొగ్గు ఉత్పత్తి సింగరేణి భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 1, 2, 5, 6, ఓసీపీ, కేఎల్పీ గనుల్లో ఉత్పత్తి పూర్తిగా స్తంభించింది. కేవలం అత్యవసర సర్వీసులలో పనిచేసే కార్మికులు మాత్రమే వి«ధులకు హాజరయ్యారు. ఏరియాలో ఒకరోజు ఉత్పత్తి 12వేల టన్నులు పూర్తిగా నిలిచిపోయి రూ.3 కోట్ల నష్టం వాటిల్లింది. -
బ్యాంక్ ఉద్యోగుల సమ్మె జయప్రదం
పాల్గొన్న వేలాది మంది బ్యాంకు సిబ్బంది నిలిచిపోయిన ఆర్థిక లావాదేవీలు ఖమ్మం గాంధీచౌక్: ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం, ప్రైవేటీకరణ, పేరుకుపోయిన బకాయిలను వసూలు చేయాలనే అంశాలపై యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బీయూ) పిలుపు మేరకు శుక్రవారం జిల్లాలో నిర్వహించిన బ్యాంక్ ఉద్యోగుల సమ్మె జయప్రదంగా ముగిసింది.సమ్మెలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 40 బ్యాంకుల్లోని రెండు వేల మంది ఉద్యోగులు పాల్గొన్నారు.సమ్మె కారణంగా జిల్లాలో సుమారు రూ.250 కోట్లకు పైగా ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి. సమావేశంలో ఏఐటీయూసీ నాయకుడు సింగు నర్సింహారావు,యూఎఫ్‌బీయూ జిల్లా కన్వీనర్, ఎస్బీఐ బ్యాంక్ ఉద్యోగుల సంఘ నాయకుడు నందన్‌లు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో బకాయిలు పేరుకుపోతున్నా..లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ రంగ బ్యాంకులకు తిరిగి చెల్లంచకుండా బ్యాంకులను నష్టాల పాలు చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. రికవరీ చట్టాలను కఠినతరంగా మార్చి కార్పొరేట్ రంగంలో పేరుకుపోయిన బాకీలను వసూలు చేయకుండా ఆయా సంస్థలకు ప్రభుత్వం కొమ్ముకాస్తుందని విమర్శించారు.ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రభుత్వమే నిర్వహించాలని, ఎన్పీఏలను సమర్థవంతంగా వసూలు చేయాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో వివిధ బ్యాంకుల ప్రతినిధులు నర్సింగరావు, వెంకన్న పాల్గొన్నారు. -
చిత్ర పరిశ్రమ దీక్ష సక్సెస్
తమిళసినిమా: ప్రస్తుతం సినిమాలు క్యూబ్, యూఎఫ్ఓ టెక్నాలజీ ద్వారానే థియేటర్లలో ప్రదర్శింపబడుతున్న విష యం తెలిసిందే. అయితే ఈ క్యూబ్, యూఎఫ్ఓ సంస్థలు నిర్మాతల నుంచి అధిక మొత్తాలను వసూలు చేస్తున్నాయి. అదే విధంగా తమిళనాడులో థియేటర్ల లో ప్రకటన ద్వారా ఏడాది 400 కోట్లు వ రకు ఆదాయాన్ని పొందుతున్న ఈ సం స్థ నిర్మాతలకు అందులో కొంత బ ౠగం కూడా చెల్లించకుండా దోచుకుం టున్నాయంటూ ధ్వజమెత్తిన నిర్మాతలు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగాను, క్యూబ్ యూఎఫ్ఓ సంస్థలను ఇకపై ప్రభుత్వమే నిర్వహిం చాలని విజ్ఞప్తి చేస్తూ ఆదివారం నిరాహా రదీక్షకు దిగారు. తమిళ నిర్మాతల మం డలి అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను, తమిళనాడు దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్, దక్షిణ భారత సినీ నటు ల సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య అధ్యక్షుడు జి.శివల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దీక్షకు స్థానిక నుంగంబాక్కంలోని వళ్లువర్‌కోట్టం ప్రాంతం వేది కైంది. చిత్ర పరిశ్రమకు చెందిన వందలాదిమంది దీక్షలో పాల్గొనడంతో పోలీసు లు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ వేదికపై పలువురు ప్రముఖులు క్యూబ్, యూఎఫ్ఓ సంస్థల నిర్వాకాన్ని ఖండి స్తూ ప్రసంగించారు. నటుడు ఆర్య, జీవా, సంతానం, ఉదయనిధి స్టాలిన్, దుష్యంత్, విజయకుమార్, వివేక్, శరవణన్, రమేష్‌ఖన్నా, నటి కుయిలీ, నిర్మాత ఆర్.బి.చౌదరి, టి.జి.త్యాగరాజన్, ఎడిటర్ మోహన్, డిజిటల్ నిర్మాతలు సంఘం కలైపులి జి.శేఖరన్, దర్శకుడు మనోజ్‌కుమార్,, వి.శేఖర్, మనోజ్‌కుమార్, ఇబ్రహీం దావుత్తర్, శివశక్తి పాండియన్, అళగన్ తమిళమణి, పిరమిడ్ నటరాజన్, కల్పాత్తి అఘోరం, మొదలగు పలువురు సినీ ప్రముఖులు దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. వివాదం: కాగా ఈ దీక్షలో చిన్న వివాదం కలకలానికి దారి తీసింది. నిర్మాత ఇబ్రహీం దావుత్తర్ మాట్లాడుతూ నిర్మాతలను కొందరు దర్శకులు మోసం చేస్తున్నారని, చెత్త చిత్రాలను తెరకెక్కిస్తున్నారని ఆర్పణలు గుప్పించారు. దీంతో తమిళనాడు దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్ ఇబ్రహీం దావుత్తర్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. దర్శకులను విమర్శించడాన్ని అనుమతించామంటూ దీక్ష వేదిక నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆయనతో పాటు మరికొందరు దర్శకులు వెళ్లడంతో అక్కడ కొంత కలకలం చెలరేగింది. దీంతో నిర్మాత ఇబ్రహీం దావుత్తర్ తాను కొందరు దర్శకుల గురించే ప్రస్తావించానని వివరణ ఇవ్వడంతో దర్శకుడు విక్రమన్ తిరిగి దీక్షలో పాల్గొన్నారు.