సింగరేణిలో సమ్మె సక్సెస్‌.. | Strike Success in Singareni | Sakshi
Sakshi News home page

సింగరేణిలో సమ్మె సక్సెస్‌..

Published Fri, Jun 16 2017 1:27 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

Strike Success in Singareni

సాక్షి, కొత్తగూడెం: వారసత్వ ఉద్యోగాల సాధనే లక్ష్యంగా ఐదు జాతీయ కార్మిక సం ఘాలు ఇచ్చిన పిలుపుతో సింగరేణిలో గురు వారం నుంచి ప్రారంభమైన సమ్మె తొలిరోజు ప్రశాంతంగా జరిగింది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో మొదటి షిఫ్టులో 39.85 శాతం కార్మికులు విధులకు హాజరుకాగా 60.15 శాతం కార్మికులు సమ్మెలో పాల్గొ న్నారు. సమ్మెతో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడింది. సమ్మె సందర్భంగా పలు ప్రాంతాల్లో కార్మిక సం ఘాలు వారసత్వ ఉద్యోగాల అంశాన్ని సత్వరం పరిష్కరించాలని కోరుతూ ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించాయి. మరోవైపు సింగరేణిలో తొలిరోజు సమ్మె ప్రభావంపై స్పందించిన సింగరేణి యాజ మాన్యం కార్మి కులను తక్షణం సమ్మె విర మించి విధుల్లో చేరా లని విజ్ఞప్తి చేసింది.

కార్మికులు అధికశాతంలో సమ్మెలో పాల్గొన్న పటికీ బొగ్గు ఉత్పత్తి మాత్రం 98 శాతం జరిగినట్లు అధికారులు లెక్కలు చెప్తున్నారు. 11 ఏరియాల్లో అత్య ధికంగా కార్పొరేట్‌ ఏరి యాలో 92.33 శాతం కార్మికులు హాజరు కాగా, అత్యల్పంగా అడ్రి యాల ప్రాజెక్టులో 24.10 శాతం కార్మికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సింగరేణి ప్రధాన కార్యాలయం తోపాటు అన్ని ఏరియా ల్లోనూ గనులు, డిపార్ట్‌మెంట్‌ల వద్ద పోలీ సులు, స్పెషల్‌పార్టీ సిబ్బందితో భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు.

 గనులకు వెళ్లే ప్రతీ ఒక్కరి వద్ద గుర్తింపు కార్డులను పరిశీలించి అనుమతిం చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏరియాలో సమ్మె ప్రభావాన్ని డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) ఎస్‌.చంద్రశేఖర్‌ పరిశీలిం చారు. కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట జాతీయ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిం చారు. 1981 ఒప్పందం ప్రకారం సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పించే వరకు కార్మికులు సమ్మెలో పాల్గొనాలని నాయకులు కోరారు.  సమ్మెకు స్థానిక కార్మిక సంఘాలు మద్దతు తెలపగా, టీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సమ్మెకు దూరంగా ఉంది.

వారసత్వ ఉద్యోగాల సాధన కోసం..
గోదావరిఖని: సింగరేణిలో వారసత్వ ఉద్యో గాల సాధన కోసం కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపునకు కార్మికులు స్పందించారని, మెజార్టీ కార్మికులు విధులకు హాజరు కాకుండా తమ ఆకాంక్షను వ్యక్తం చేసి విజయ వంతం చేశారని జాతీయ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్‌ బి.జనక్‌ప్రసాద్‌ తెలిపారు. సమ్మె నేపథ్యంలో ఆయన గురువారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో విలేకరులతో మాట్లాడారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement