తమిళసినిమా: ప్రస్తుతం సినిమాలు క్యూబ్, యూఎఫ్‌ఓ టెక్నాలజీ ద్వారానే థియేటర్లలో ప్రదర్శింపబడుతున్న విష యం తెలిసిందే. అయితే ఈ క్యూబ్, యూఎఫ్‌ఓ సంస్థలు నిర్మాతల నుంచి అధిక మొత్తాలను వసూలు చేస్తున్నాయి. అదే విధంగా తమిళనాడులో థియేటర్ల లో ప్రకటన ద్వారా ఏడాది 400 కోట్లు వ రకు ఆదాయాన్ని పొందుతున్న ఈ సం స్థ నిర్మాతలకు అందులో కొంత బ ౠగం కూడా చెల్లించకుండా దోచుకుం టున్నాయంటూ ధ్వజమెత్తిన నిర్మాతలు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగాను, క్యూబ్ యూఎఫ్‌ఓ సంస్థలను ఇకపై ప్రభుత్వమే నిర్వహిం చాలని విజ్ఞప్తి చేస్తూ ఆదివారం నిరాహా రదీక్షకు దిగారు. తమిళ నిర్మాతల మం డలి అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను, తమిళనాడు దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్, దక్షిణ భారత సినీ నటు ల సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య అధ్యక్షుడు జి.శివల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దీక్షకు స్థానిక నుంగంబాక్కంలోని వళ్లువర్‌కోట్టం ప్రాంతం వేది కైంది.
చిత్ర పరిశ్రమకు చెందిన వందలాదిమంది దీక్షలో పాల్గొనడంతో పోలీసు లు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ వేదికపై పలువురు ప్రముఖులు క్యూబ్, యూఎఫ్‌ఓ సంస్థల నిర్వాకాన్ని ఖండి స్తూ ప్రసంగించారు. నటుడు ఆర్య, జీవా, సంతానం, ఉదయనిధి స్టాలిన్, దుష్యంత్, విజయకుమార్, వివేక్, శరవణన్, రమేష్‌ఖన్నా, నటి కుయిలీ, నిర్మాత ఆర్.బి.చౌదరి, టి.జి.త్యాగరాజన్, ఎడిటర్ మోహన్, డిజిటల్ నిర్మాతలు సంఘం కలైపులి జి.శేఖరన్, దర్శకుడు మనోజ్‌కుమార్,, వి.శేఖర్, మనోజ్‌కుమార్, ఇబ్రహీం దావుత్తర్, శివశక్తి పాండియన్, అళగన్ తమిళమణి, పిరమిడ్ నటరాజన్, కల్పాత్తి అఘోరం, మొదలగు పలువురు సినీ ప్రముఖులు దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు.
వివాదం: కాగా ఈ దీక్షలో చిన్న వివాదం కలకలానికి దారి తీసింది. నిర్మాత ఇబ్రహీం దావుత్తర్ మాట్లాడుతూ నిర్మాతలను కొందరు దర్శకులు మోసం చేస్తున్నారని, చెత్త చిత్రాలను తెరకెక్కిస్తున్నారని ఆర్పణలు గుప్పించారు. దీంతో తమిళనాడు దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్ ఇబ్రహీం దావుత్తర్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. దర్శకులను విమర్శించడాన్ని అనుమతించామంటూ దీక్ష వేదిక నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆయనతో పాటు మరికొందరు దర్శకులు వెళ్లడంతో అక్కడ కొంత కలకలం చెలరేగింది. దీంతో నిర్మాత ఇబ్రహీం దావుత్తర్ తాను కొందరు దర్శకుల గురించే ప్రస్తావించానని వివరణ ఇవ్వడంతో దర్శకుడు విక్రమన్ తిరిగి దీక్షలో పాల్గొన్నారు.
చిత్ర పరిశ్రమ దీక్ష సక్సెస్
Published Mon, May 11 2015 2:39 AM | Last Updated on Sun, Sep 3 2017 1:48 AM
Advertisement
Advertisement