‘38.7% పిల్లల్లో ఎదుగుదల లోపాలు’
న్యూఢిల్లీ: భారత్లో 38.7 శాతం పిల్లలు పోషకాహార లోపం వల్ల సరిగా ఎదగలేకపోతున్నారని ప్రపంచ పోషకాహార నివేదిక(జీఎన్ఆర్)లో వెల్లడైంది. ఇది ప్రపంచ సగటు 23.8 కన్నా ఎంతో అధికం. సర్వే జరిపిన 132 దేశాల్లో భారత్ 114వ స్థానంలో నిలిచిందని తెలిపింది. ఇదే సరళి కొనసాగితే భారత్... 2030 కల్లా ఘనా, టోగోలను 2055 వరకు చైనా అధిగమిస్తుందని అంచనా వేసింది.
చైనా భారత్ కన్నా 106 అధిక పాయింట్లతో 26వ స్థానంలో ఉంది. టోగో, ఘనాలు వరసగా 52, 80 ర్యాంకులు దక్కించుకున్నాయి. ఇంకా, దేశంలో 9.5 శాతం పెద్దలు డయాబెటిస్తో బాధపడుతున్నారని, 190 దేశాల్లో జరిపిన మధుమేహ వ్యాధి సర్వేలో భారత్కు 104వ స్థానం దక్కినట్లు నివేదిక తెలిపింది.