చంద్రబోస్ సాహిత్యం అద్భుతం: సుభాష్ ఆనంద్
‘‘అలా నిన్ను చేరి’ సినిమాలోని ప్రతీ పాట అద్భుతంగా ఉంటుంది. ఒక్కో పాటను ఒక్కో శైలిలో కంపోజ్ చేసే చాన్స్ నాకు దొరికింది. నవరసాలను చూపించేలా ఇందులోని పాటలుంటాయి’’ అని సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్ అన్నారు. దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. మారేష్ శివన్ దర్శకత్వం వహించారు. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న రిలీజవుతోంది.
ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్ మాట్లాడుతూ– ‘‘ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చిత్రమిది. ప్రేమ కథా చిత్రాలకు సంగీతమే ప్రాణం. నేను చాలా సినిమాలకు సంగీతం అందించాను. చంద్రబోస్ లాంటి లెజెండరీ వ్యక్తితో పని చేయడం ఆనందంగా ఉంది. ఆయన అందించిన సాహిత్యం అద్భుతంగా ఉంటుంది. ‘అలా నిన్ను చేరి’ నా కెరీర్‌కి గుడ్ టర్న్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.