subscriber
-
30 కోట్ల సబ్బర్లను సాధించిన తొలి యూట్యూబర్ ఇతడే..!
-
జియో జోరు..బీఎస్ఎన్ఎల్కు ఎదురుదెబ్బ
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్కు ప్రైవేట్ టెలికం రంగ సంస్థ జియో భారీ షాక్ ఇచ్చింది. ఈ ఏడాది ఆగస్టు నెలలో జియో అతిపెద్ద ల్యాండ్‌లైన్ సర్వీసుల్ని వినియోగించే సంస్థల జాబితాలో చేరింది. దేశంలో టెలికాం సేవలు ప్రారంభించిన తర్వాత తొలిసారిగా వైర్‌లైన్ విభాగంలో ఓ ప్రైవేట్ కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది. టెలికం రెగ్యులేటరీ ట్రాయ్ గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం జియో ఫిక్స్డ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ జియో ఫైబర్ వినియోగదారుల సంఖ్య 73.52 లక్షలకు చేరింది. దీంతో జియో ఫైబర్ అగ్రస్థానానికి చేరింది. బీఎస్ఎన్ఎల్ యూజర్లు 71.32 లక్షలుగా ఉన్నారు. వైర్లెస్ మొబైల్ నెట్వర్క్ వినియోగదారుల జాబితాలో జియో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఆగస్టులో జియోకు కొత్తగా 32.8 లక్షల వినియోగదారులు చేరడంతో, తన మొత్తం కస్టమర్ బేస్ 41.92 కోట్లకు పెంచుకుంది. -
టెలికం సబ్స్క్రైబర్లు @ 119.88 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో టెలికం సబ్స్క్రైబర్ల సంఖ్య ఏప్రిల్ నెలలో 119.88 కోట్లకు చేరింది. నెలవారీగా చూస్తే యూజర్ల పెరుగుదలలో 0.36 శాతం వృద్ధి నమోదయ్యింది. ఈ వృద్ధి రేటు ఏడు నెలల కనిష్ట స్థాయి. చివరగా గతేడాది అక్టోబర్ నెలలో వృద్ధి 2.67 శాతంగా నమోదయ్యింది. టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ ఈ విషయాలను వెల్లడించింది. మొబైల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 117.46 కోట్లుగా ఉంది. కొత్త యూజర్లను ఆకర్షించడంలో రిలయన్స్ జియో తన దూకుడును కొనసాగిస్తోంది. ఇది ఏప్రిల్ నెలలోని మొత్తం కొత్త మొబైల్ సబ్స్క్రైబర్ల సంఖ్యలో 87 శాతం వాటాను ఆక్రమించింది. అయితే జియో గతేడాది డిసెంబర్లో 2 కోట్ల మంది కొత్త యూజర్లను పొందితే.. ఈ ఏప్రిల్‌లో మాత్రం కేవలం 38.7 లక్షల మంది కొత్త యూజర్లను మాత్రమే సొంతం చేసుకోగలిగింది. ఇక జియో తర్వాతి స్థానంలో ఎయిర్టెల్ ఉంది. దీని మొబైల్ సబ్స్క్రైబర్ల సంఖ్య కొత్తగా 28.5 లక్షలు పెరిగింది. ఇక ల్యాండ్‌లైన్ యూజర్లలో 0.42 శాతం క్షీణత నమోదయ్యింది.