Subsidiary bank
-
బీఎఫ్‌ఎస్‌ఎల్‌లో బీవోబీ వాటాల విక్రయం
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవో బీ) తన సబ్సిడరీ అయిన బీవోబీ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ (బీఎఫ్ఎస్ఎల్)లో 49 శాతం వరకు వాటాలను విక్రయించనుంది. ఇందుకు సంబంధించి బోర్డు స్థాయిలో నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని స్టాక్ ఎక్సేంజ్‌లకు తెలియజేసింది. బీఎఫ్‌ఎస్‌ఎల్‌లో బీవోబీకి ప్రస్తుతం 100 శాతం వాటా కలిగి ఉంది. అర్హత కలిగిన ఇన్వెస్టర్లు, వ్యూహాత్మక భాగస్వాముల నుంచి ఆసక్తి వ్యక్తీకరణలు కోరుతూ త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని బీవోబీ తెలిపింది. -
అనుబంధ బ్యాంకుల విలీనానికి త్వరలో ఆర్బీఐ అనుమతి: ఎస్బీఐ
న్యూఢిల్లీ: అనుబంధ బ్యాంకుల సమగ్ర విలీన ప్రణాళికకు ఆర్బీఐ నుంచి అతి త్వరలోనే అనుమతి లభిస్తుందని ఎస్బీఐ ఆశిస్తోంది. సమగ్ర ప్రణాళికలో భాగమైన ఆర్థిక చిక్కుముళ్లు, మానవవనరులు, ఆస్తు లు, రుణాల వంటి అంశాలను ఆర్బీఐ పరిశీలించినట్టు ఎస్బీఐ వర్గాలు తెలిపారుు. ఆర్బీఐ నుంచి అనుమతి ఏ సమయంలోనైనా రావచ్చని వెల్లడించారుు. విలీన పథకం వివరాలు, నిపుణుల కమిటీ నివేదికను ఆర్బీఐ పరిశీలనకు సమర్పించినట్టు తెలిపారుు. ఆర్బీఐ ఆమోదం తెలిపిన అనంతరం దాన్ని ప్రభుత్వ ఆమోదం కోసం పంపిస్తుందని వివరించారుు. ఇక అనుబంధ బ్యాంకులను విలీనం చేసుకోనున్న దృష్ట్యా ఖాతాల నంబర్ల మార్పు ప్రక్రియను ప్రారంభించినట్టు ఎస్బీఐ వర్గాలు తెలిపారుు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలాతోపాటు భారతీయ మహిళా బ్యాంకులను ఎస్బీఐలో విలీనానికి లోగడ కేంద్రం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. -
నేడు ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల సమ్మె
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల ఉద్యోగులు శుక్రవారం సమ్మెకు పిలుపునిచ్చారు. మే 20న జరిగే సమ్మెకు సభ్యులంతా మద్దతివ్వాలంటూ ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ఒక ప్రకటనలో పేర్కొంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌తో పాటు అయిదు అనుబంధ బ్యాంకుల ఉద్యోగులు ఇందులో పాల్గొంటారని తెలిపింది. మరోవైపు ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీన ప్రతిపాదనను ఆమోదించవద్దంటూ ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీవోఏ) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. -
అనుబంధ బ్యాంకుల విలీనం ఇప్పుడే కాదు: ఎస్బీఐ
న్యూఢిల్లీ: అనుబంధ బ్యాంకులను విలీనం చేసుకునే ప్రతిపాదనను ప్రస్తుతం పరిశీలించడంలేదని ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ పేర్కొంది. ఎస్బీఐకు ఐదు అనుబంధ బ్యాంకులున్నాయి. వీటిలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ బికనీర్, ట్రావెన్కోర్, పాటియాలా, మైసూర్‌లతోపాటు, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఉన్నాయి. విలీన ప్రతిపాదనను ప్రస్తుతం చేపట్టలేదని బీఎస్ఈకి ఎస్బీఐ వెల్లడించింది. అయితే తగిన సమయం వచ్చినప్పుడు ఈ విషయాన్ని తాజాగా పరిశీలిస్తామని తెలిపింది. ఇందుకు కనీసం కొన్ని నెలల సమయం పడుతుందని వివరించింది. ఇకపై మొబైల్ పీవోఎస్: మొబైల్ పాయింట్ ఆఫ్‌సేల్(ఎంపీవోఎస్) ఏర్పాటు చేసేందుకు వీలుగా ఎస్బీఐ ఈజీటాప్ మొబైల్ సొల్యూషన్స్‌తో జతకట్టింది. తద్వారా స్మార్ట్ఫోన్ల ఆధారంగా ఎంపీవోఎస్కు తెరలేపే యోచనలో ఉంది. రానున్న ఐదేళ్లలో స్మార్ట్ఫోన్ల ద్వారా బిల్ చెల్లింపులకు అవకాశమిచ్చే 5 లక్షల ఎంపీవోఎస్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు బ్యాంక్ డిప్యూటీ ఎండీ ఎస్కే మిశ్రా చెప్పారు.