అనుబంధ బ్యాంకుల విలీనానికి త్వరలో ఆర్బీఐ అనుమతి: ఎస్బీఐ
న్యూఢిల్లీ: అనుబంధ బ్యాంకుల సమగ్ర విలీన ప్రణాళికకు ఆర్‌బీఐ నుంచి అతి త్వరలోనే అనుమతి లభిస్తుందని ఎస్‌బీఐ ఆశిస్తోంది. సమగ్ర ప్రణాళికలో భాగమైన ఆర్థిక చిక్కుముళ్లు, మానవవనరులు, ఆస్తు లు, రుణాల వంటి అంశాలను ఆర్‌బీఐ పరిశీలించినట్టు ఎస్‌బీఐ వర్గాలు తెలిపారుు. ఆర్‌బీఐ నుంచి అనుమతి ఏ సమయంలోనైనా రావచ్చని వెల్లడించారుు. విలీన పథకం వివరాలు, నిపుణుల కమిటీ నివేదికను ఆర్‌బీఐ పరిశీలనకు సమర్పించినట్టు తెలిపారుు.
ఆర్‌బీఐ ఆమోదం తెలిపిన అనంతరం దాన్ని ప్రభుత్వ ఆమోదం కోసం పంపిస్తుందని వివరించారుు. ఇక అనుబంధ బ్యాంకులను విలీనం చేసుకోనున్న దృష్ట్యా ఖాతాల నంబర్ల మార్పు ప్రక్రియను ప్రారంభించినట్టు ఎస్‌బీఐ వర్గాలు తెలిపారుు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలాతోపాటు భారతీయ మహిళా బ్యాంకులను ఎస్‌బీఐలో విలీనానికి లోగడ కేంద్రం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.