Succession planning
-
ఆస్తుల బదిలీ.. ఇలా ఈజీ!
కుటుంబ సభ్యుల ఆర్థిక భద్రత ప్రతి ఒక్కరికీ ప్రథమ ప్రాధాన్యంగా ఉండాలి. జీవితాంతం ఎంతో కష్టించి, ఆస్తులు, సంపద కూడబెట్టుకోవడంతోనే సరికాదు. తమ వారికి సాఫీగా బదిలీ అయ్యేలా చర్యలు తీసుకున్నప్పుడే ఆకాంక్ష ఫలిస్తుంది. ఒక ఆస్తికి ఒకటికి మించిన వారసులు ఉంటే పంపకం సమస్యగా మారకూడదు. క్లిష్టమైన కుటుంబ నిర్మాణం ఉన్న వారు ఈ విషయంలో ముందుచూపుతో వ్యవహరించాల్సిందే. దురదృష్టవశాత్తూ తమకు ఏదైనా జరిగితే, తమ పేరిట ఉన్న ఆస్తులు వారసులకు సాఫీగా బదిలీ అయ్యేది ఎలా? ఆస్తులకు సంబంధించి వివాదాలు ఏర్పడకుండా చూసుకునేది ఎలా..? ఎస్టేట్ (ఆస్తి) ప్లానింగ్ ఇందుకు పరిష్కారం అవుతుంది. వీలునామా రాస్తే సరిపోతుందిలే అనుకోవద్దు. దీనికంటే మెరుగైనది కుటుంబ ట్రస్ట్. ఆస్తులనే కాకుండా, కుటుంబ వ్యాపారాల సాఫీ పంపిణీ సైతం ఎస్టేట్ ప్లానింగ్‌తో సాధ్యపడుతుంది. ఎస్టేట్ ప్లానింగ్ అంటే..? ఆస్తుల పంపకాన్నే ఎస్టేట్ ప్లానింగ్‌గా చెబుతారు. తమ మరణానంతరం కుటుంబ సభ్యులకు ఆస్తులు ఎలా పంపిణీ చేయాలన్నది ఇందులో ఉంటుంది. తమ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటే కుటుంబ వ్యాపారానికి ఎవరు నాయకత్వం వహించాలి? అనే వివరాలు కూడా ఇందులో భాగమే. ప్లాట్లు, ఇళ్లు, పొలాలు, బంగారం, ఆభరణాలు, బ్యాంక్ బ్యాలన్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు అన్నింటికీ ఇందులో చోటు ఉంటుంది. కాయిన్లు, పెయింటింగ్‌లు తదితర అన్నింటి పంపిణీని ఎస్టేట్ ప్లానింగ్‌తో సులభతరం చేసుకోవచ్చు. ట్రస్ట్ ఏర్పాటు కొన్ని కుటుంబాల నిర్మాణం సంక్లిష్టంగా ఉంటుంది. అలాగే, కొన్ని పెద్ద కుంటుంబాలు ఉంటాయి. మొదటి వివాహం ద్వారా పిల్లలు ఉండి, తర్వాత రెండో వివాహం ద్వారా పిల్లలు కన్న వారికి ఆస్తుల పంపిణీలో సహజంగా వివాదాలు ఏర్పడుతుంటాయి. అలాగే, ప్రత్యేక అవసరాల (దివ్యాంగులు) వారూ ఉండొచ్చు. అలాంటి వారికి ఆస్తుల పంపిణీని తమ ఇష్ట ప్రకారం చేసుకోవాలంటే అందుకు వీలునామా లేదా ఫ్యామిలీ ట్రస్ట్ మార్గాలవుతాయి. తమ సంపద సాఫీగా బదిలీ అయ్యేందుకు ట్రస్ట్ వీలు కలి్పస్తుంది. ట్రస్ట్ అంటే ధర్మనిధి. ట్రస్ట్ ఏర్పాటు చేసే వ్యక్తికి, ధర్మ కర్తలకు మధ్య ఒప్పందమే ట్రస్ట్ డీడ్. దీని ద్వారా తనకు సంబంధించిన ఆస్తులను ధర్మకర్తలకు అప్పగిస్తారు. ట్రస్ట్ ఏర్పాటు చేసిన వ్యక్తి మరణానంతరం ట్రస్ట్ డీడ్‌లో పేర్కొన్న విధంగా ఆస్తుల బదిలీ పూర్తి చేయాల్సిన బాధ్యత ట్రస్ట్ నిర్వాహకులపై ఉంటుంది. ట్రస్ట్ ఏర్పాటు చేయాలని అనుకునే వారు ట్రస్ట్ డీడ్ రాయాల్సి ఉంటుంది. సంపదను ఎలా బదిలీ చేయాలన్నది అందులో స్పష్టంగా పేర్కొనాలి. స్థిర, చరాస్తులను ట్రస్ట్‌కు బదిలీ చేయాలి. ట్రస్ట్ డీడ్ రాసిన తర్వాత దాని నిర్వహణకు ట్రస్టీ (ధర్మకర్త)ని నియమించాలి. స్టాంప్ డ్యూటీ చెల్లించి, ట్రస్ట్‌ను రిజి్రస్టార్ కార్యాలయం వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. ట్రస్ట్ ఏర్పాటు ఉద్దేశాన్ని ట్రస్ట్ డీడ్ తెలియజేయాలి. దీని ఏర్పాటు ఉద్దేశం, ఎలా పనిచేయాలన్నది స్పష్టంగా పేర్కొనాలి. ట్రస్టీ లేదంటే ట్రస్టీలుగా ఎవరిని నియమించాలి? అన్న సందేహం రావచ్చు. స్నేహితులు లేదా బంధువులను ట్రస్టీలుగా నియమించుకోవచ్చు. లేదా కార్పొరేట్ సంస్థను అయినా ట్రస్టీగా నియమించొచ్చు. కొన్ని కార్పొరేట్ సంస్థలు ట్రస్ట్ సేవలను అందిస్తున్నాయి. ట్రస్ట్ వ్యవస్థాపకుడు మరణించినా లేదా తీవ్ర ఆరోగ్య సమస్యలకు గురైన సందర్భాల్లో ఆస్తులను ఎలా వినియోగించుకోవాలన్న సూచనలను ట్రస్ట్ డీడ్‌లో పేర్కొనొచ్చు. అలాగే, ధర్మకర్త జీవించి లేకపోయినా లేక రిటైర్మెంట్ తీసుకున్నా.. తదుపరి ట్రస్టీగా ఎవరు వ్యవహరించాలన్నది కూడా టస్ట్ర్ డీడ్‌లో పేర్కొనాలి. వీలునామా.. కోర్టు విచారణలు! వీలునామా గురించే ఎక్కువ మందికి తెలుసు. సులభమైన, మెరుగైన సాధనమని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఇందులో కొన్ని ప్రతికూలతలు లేకపోలేదు. వీలునామా రిజిస్టర్ చేసినా, చేయకపోయినా దాన్ని కోర్టుల్లో సవాలు చేయవచ్చు. వీలునామా అనేది కేవలం వ్యక్తి మరణానంతరం అమల్లోకి వచ్చే పత్రం. వైకల్యం లేదా తీవ్ర అనారోగ్యం బారిన పడిన సందర్భాల్లో వీలునామా పని చేయదు. మరణించిన వ్యక్తి ఆస్తుల బదిలీకి సంబంధించినదే కానీ, ఆ ఆస్తుల నిర్వహణకు సంబంధించినది కాదు. వీలునామా కింద లబి్ధదారులు హక్కులను కోర్టులో నిరూపించుకోవాల్సి వస్తుంది. ఇందుకు ఆరు నెలల నుంచి ఏడాది సమయం పట్టొచ్చు. అప్పటి వరకు ఆ ఆస్తులను వినియోగించుకోవడానికి వీలు పడదు. మోసం, ఫోర్జరీ, ఒత్తిడితో రాయించినట్టు లేదా మానసిక వైకల్యంతో బాధపడుతున్న సమయంలో రాయించినట్టు, తెలియకుండా రాయించుకున్నట్టు తదితర ఆరోపణలపై వీలునామాను కోర్టులో సవాలు చేయవచ్చు. వీలునామాను రిజిస్టర్ చేసినంత మాత్రాన అది చట్టబద్ధంగా చెల్లుబాటు అయిపోతుందని అనుకోవడం పొరపాటు. రిజిస్టర్ చేయించిన వీలునామా సైతం కోర్టుల విచారణ పరిధిలోకి వస్తుంది. మనదేశంలో ఎస్టేట్ ప్లానింగ్ కోసం హిందు అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) ఏర్పాటును కొంత మంది అనుసరిస్తుంటారు. ఇది పన్నుకు సంబంధించిన ప్రత్యేక ఏర్పాటు. ఒక్కసారి హెచ్‌యూఎఫ్ రిజిస్టర్ చేసి, ఆస్తులు దానికి బదలాయించారంటే.. ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు దఖలు పడతాయి. హెచ్‌యూఎఫ్ పరిధిలోని ఆస్తులను విభజించడం వివాదాలు, కోర్టు కేసులకు దారితీయవచ్చు. వీటన్నింటిలోకి మెరుగైనది ఫ్యామిలీ ట్రస్ట్. పిల్లలకు కూడా.. మైనర్ చిన్నారులు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఎస్టేట్ ప్లానింగ్ ప్రయోజనకరంగా ఉంటుంది. తాము లేని రోజున తమ పిల్లల బాధ్యతను బంధువులపై మోపడం.. వారు చూస్తారని ఆశించడం అన్ని సందర్భాల్లో సరైనది అనిపించుకోదు. ఇది పూర్తిస్థాయి, పెద్ద బాధ్యత. ట్రస్ట్ ఏర్పాటు చేసి, దాని నిర్వహణ బాధ్యతను కార్పొరేట్ ట్రస్టీకి అప్పగించడం మెరుగైనది అవుతుంది. కార్పొరేట్ ట్రస్టీ అయితే.. ప్రత్యేక అవసరాల పిల్లలకు (దివ్యాంగులు) పూర్తి సమయం పాటు సహాయకుడు/సహాయకురాలిని అందుబాటులో ఉంచుతారు. అలాగే వంట మనిíÙ, వైద్య సాయం సహాయకులు, స్పెషలిస్ట్ డాక్టర్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. పిల్లలు సాధారణంగా తమ హక్కులను క్లెయిమ్ చేసుకోలేరు. అందుకుని వీలునామా రాస్తే, దాని నిర్వహణ బాధ్యతను ఒకరికి అప్పగించాల్సి వస్తుంది. అందుకే వీలునామాలో ఉన్న ప్రతికూలతల దృష్ట్యా పిల్లల కోసం ఫ్యామిలీ ట్రస్ట్ మెరుగైనది అవుతుంది. ఎవరికి అవసరం..? నిజానికి ఎస్టేట్ ప్లానింగ్ లేదా వీలునామా అనేవి సంపన్నులకేనన్న ఒక అపోహ నెలకొంది. ఇది నిజం కాదు. ప్రతి ఒక్కరికీ ఇది ఎంతగానో సాయపడుతుంది. తమ పేరిట ఆస్తులు ఉన్నా, లేదా అప్పులు ఉన్నా సరే ఎస్టేట్ ప్లానింగ్‌తో వారసులకు మార్గం స్పష్టంగా మారుతుంది. అకాల మరణం ఎదురైతే, తమ పేరిట ఉన్న ఆస్తులు ఎలా పంచాలి? అప్పులు ఎలా తీర్చాలి? ఏ ఆస్తి విక్రయించి అప్పు చెల్లించాలి? వీటికి ఎవరు బాధ్యత వహించాలి? ఇలాంటి వాటికి స్పష్టత ఇవ్వొచ్చు. నిజానికి మనలో 90 శాతం మంది ఆస్తులకు సంబంధించి భవిష్యత్ ప్రణాళిక గురించి ఆలోచించరు. వీలునామా కూడా రాయరు. తాము క్షేమంగా ఉన్నందున, మరణం గురించి చర్చించడం, ఆస్తులపై చర్చను కోరుకోకపోవడం వల్ల ప్రణాళికకు దూరంగా ఉంటుంటారు. నిజానికి ఎంతో ముఖ్యమైన ఈ పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకూడదు. దీనివల్ల ఉపయోగాలే కానీ, నష్టం ఉండదు. కనుక ప్రతి ఒక్కరూ దీనికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. మార్గాలు.. నామినేషన్, వీలునామా (విల్లు), ఫ్యామిలీ ట్రస్ట్ ఇవన్నీ ఎస్టేట్ ప్లానింగ్‌లో పలు రకాల సాధనాలు. ఆర్థిక సాధనాలకు నామినేషన్ సదుపాయం ఉంటుంది. సంబంధిత ఆస్తి ఎవరికి వెళ్లాలని అనుకుంటే వారి పేరును నామినీగా నమోదు చేసుకోవచ్చు. కానీ, అన్నింటికీ నామినేషన్ సదుపాయం ఉండదు. ముఖ్యంగా స్థిరాస్తులకు నామినేషన్ చేసుకోలేరు. కనుక అన్నింటికీ పరిష్కారంగా ఫ్యామిలీ ట్రస్ట్ అక్కరకు వస్తుంది. ఇలాంటి ఏర్పాట్లు ఏవీ లేకుండా ఓ కుటుంబ యజమాని మరణించిన సందర్భాల్లో లేదా వారసులు కాని వ్యక్తి నామినీగా ఉండి వివాదాలు ఏర్పడిన సందర్భాల్లో.. ఆస్తుల పంపిణీ అన్నది ఆయా మతస్థుల వారసత్వ చట్టం ప్రకారం చేసుకోవాల్సి వస్తుంది. దీనికి కోర్టులను ఆశ్రయించాల్సిందే. హిందూ వారసత్వ చట్టం ప్రకారమైతే మరణించిన వ్యక్తి జీవిత భాగస్వామి, అతని తల్లి, పిల్లలకు సమానంగా ఆస్తులు బదిలీ చేసుకోవాలి. ఈ విషయంలో వివాదం ఏర్పడితే అప్పుడు పరిష్కారానికి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇది నిజం కాదు.. ట్రస్ట్ ఏర్పాటు చేస్తే, తమ ఆస్తులన్నీ ట్రస్టీ నిర్వహణలోకి వెళ్లిపోతాయని, వాటిపై తాము నియంత్రణ కోల్పోతామనే అపోహ ఉంది. ట్రస్ట్ ఏర్పాటు చేసి, దానికి తమ ఆస్తులను బదిలీ చేసిన తర్వాత అప్పుడు ట్రస్టీయే యజమాని అవుతారు. నిజానికి ట్రస్ట్ డీల్‌లో పేర్కొన్న మేరకు బాధ్యతలను నిర్వహించడమే ట్రస్టీ పని. అంతేకానీ, సంబంధిత ట్రస్ట్ నిర్వహణలోని ఆస్తులను వినియోగించుకునే, అనుభవించే హక్కులు ట్రస్టీలకు ఉండవు. కేవలం ట్రస్ట్ డీడ్‌లో పేర్కొన్న లబి్ధదారుల ప్రయోజనాల కోసమే ఆ ఆస్తులను వినియోగించాల్సి ఉంటుంది. ట్రస్ట్ ఏర్పాటు చేసిన వారు జీవించి ఉన్నంత వరకు బదిలీ చేసిన ఆస్తులు, ట్రస్ట్ కార్యకలాపాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు. నేడు పలు ప్రొఫెషనల్ ట్రస్ట్ ఏజెన్సీలు ట్రస్టీ సేవలను అందిస్తున్నాయి. అవి ఎలాంటి పక్షపాతం లేకుండా వ్యవహరిస్తాయి. ట్రస్ట్ డీడ్‌కు పూర్తి స్థాయి నిర్వాహకుడి మాదిరే పనిచేస్తాయి. -
Reliance AGM 2023: జియో ఎయిర్‌ఫైబర్ వచ్చేస్తోంది..
ముంబై: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ వృద్ధి లక్ష్యాల సాధన దిశగా ప్రణాళికలు ప్రకటించింది. ఇందులో భాగంగా వినాయక చవితి కల్లా జియో ఎయిర్‌ఫైబర్‌ను అందుబాటులోకి తేనుంది. అలాగే, జియో ఫైనాన్షియల్స్ విభాగం ద్వారా బీమా ఉత్పత్తులను ఆవిష్కరించనుంది. వచ్చే అయిదేళ్లలో 100 కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్లను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ సర్వ సభ్య సమావేశంలో (ఏజీఎం) చైర్మన్ ముకేశ్ అంబానీ ఈ విషయాలు ప్రకటించారు. అదే క్రమంలో వారసత్వ ప్రణాళికలను కూడా వెల్లడించారు. ఆయన ముగ్గురు సంతానం (ఆకాశ్, ఈషా, అనంత్) కంపెనీ బోర్డులో నియమితులైనట్లు పేర్కొన్నారు. అలాగే, 2024 ఏప్రిల్ 19తో తన పదవీకాలం ముగియనున్నప్పటికీ.. మరో అయిదేళ్ల పాటు చైర్మన్‌గా కొనసాగనున్నట్లు ఆయన తెలిపారు. ఏజీఎంలో మరిన్ని విశేషాలు.. ఎయిర్‌ఫైబర్‌తో వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్.. సెప్టెంబర్ 19న వినాయక చవితి సందర్భంగా జియో ఎయిర్‌ఫైబర్ సరీ్వసులు ప్రారంభమవుతాయి. ఇది వైర్లు అవసరం లేని 5జీ బ్రాడ్‌బ్యాండ్ సరీ్వసులాంటిది. నెట్ కనెక్టివిటీకి ఎదురయ్యే అవరోధాలను అధిగమించేందుకు .. 5జీ నెట్‌వర్క్‌ను, అధునాతన వైర్లెస్ టెక్నాలజీలను ఉపయోగించుకుని ఇది వరుసలో చిట్టచివర్న ఉన్న వారికి కూడా బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందుబాటులోకి తేగలదని ముకేశ్ అంబానీ తెలిపారు. ఆప్టికల్ ఫైబర్‌తో రోజూ 15,000 ప్రాంగణాలను కనెక్ట్ చేయగలుగుతుంటే, జియోఎయిర్‌ఫైబర్ దీనికి పది రెట్లు అధికంగా కనెక్ట్ చేయగలదు. తద్వారా 20 కోట్ల గృహాలు, ప్రాంగణాలకు జియో మరింత చేరువ కాగలదు. ఈ సందర్భంగా జియో ట్రూ5జీ డెవలపర్ ప్లాట్‌ఫాంను కూడా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ ప్రకటించారు. రిలయన్స్ కార్పొరేట్ పార్క్‌లో ఏర్పాటు చేసే తొలి జియో ట్రూ5జీ ల్యాబ్‌లో టెక్నాలజీ భాగస్వాములు, ఎంటర్ప్రైజ్ కస్టమర్లు .. వివిధ పరిశ్రమలకు అవసరమైన సొల్యూషన్స్‌ను రూపొందించవచ్చు. వాటిని పరీక్షించవచ్చు. అటు, కృత్రిమ మేధ (ఏఐ) ప్రయోజనాలను అందరికీ, అన్నిచోట్ల అందుబాటులోకి తెచ్చేందుకు జియో ప్లాట్‌ఫామ్స్ కృషి చేస్తోందని ముకేశ్ అంబానీ చెప్పారు. డిసెంబర్ ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా 5జీ నెట్వర్క్ విస్తరణ పూర్తి చేసే దిశగా పనులు సాగుతున్నాయని తెలిపారు. జియోసినిమా వినోదానికి దేశీయంలోనే అతి పెద్ద డిజిటల్ వేదికగా మారిందని ఆయన పేర్కొన్నారు. సీబీజీ ప్లాంట్లు.. గిగా ఫ్యాక్టరీలు.. 2035 నాటికి కర్బన ఉద్గారాల విషయంలో తటస్థ స్థాయిని సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ముకేశ్ అంబానీ తెలిపారు. జామ్‌నగర్‌లో రెండు కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) డెమో యూనిట్లను నెలకొల్పాక, కేవలం 10 నెలల వ్యవధిలోనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీలో వాణిజ్యావసరాల కోసం తొలి సీబీజీ ప్లాంటును ఏర్పాటు చేసినట్లు అంబానీ చెప్పారు. వీటిని త్వరితగతిన 25కి, అటుపైన వచ్చే అయిదేళ్లలో 100కు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన వివరించారు. 2026 నాటికి బ్యాటరీ గిగా ఫ్యాక్టరీ నెలకొల్పే లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు. సోలార్ ప్యానెళ్లు, బ్యాటరీల తయారీ కోసం జామ్‌నగర్ రిఫైనరీ కాంప్లెక్స్‌లో రూ. 75,000 కోట్లతో నాలుగు గిగాఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. బీమాలోకి జేఎఫ్ఎస్... జియో ఫైనాన్షియల్ సరీ్వసెస్ (జేఎఫ్ఎస్) బీమా రంగంలోకి విస్తరించనున్నట్లు ముకేశ్ అంబానీ తెలిపారు. ఇది సరళమైన ఆరోగ్య, జీవిత, సాధారణ బీమా పాలసీలను అందిస్తుందని పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారంలోకి విస్తరించేందుకు బ్లాక్‌రాక్‌తో కలిసి జేఎఫ్ఎస్ జాయింట్ వెంచర్‌ను ప్రకటించింది. టెలికం విభాగం జియోకి ఉన్న 45 కోట్ల మంది మొబైల్ ఫోన్ యూజర్లకు తమ ఉత్పత్తులను విక్రయించే యోచనలో ఉంది. టాప్ 4లో రిటైల్.. పలు అంతర్జాతీయ దిగ్గజాలు రిలయన్స్ రిటైల్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ముకేశ్ అంబానీ చెప్పారు. ఒకవేళ దీన్ని స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ చేసి ఉంటే ప్రస్తుత వేల్యుయేషన్ ప్రకారం టాప్ 4 లిస్టెడ్ సంస్థల్లో రిటైల్ కూడా ఒకటిగా ఉండేదని ఆయన తెలిపారు. ‘‘2020 సెప్టెంబర్‌లో నిధులు సమీకరించినప్పుడు రిటైల్ వేల్యుయేషన్ రూ. 4.28 లక్షల కోట్లుగా ఉంది. మూడేళ్ల కన్నా తక్కువ వ్యవధిలోనే ఇది రెట్టింపయింది. రూ. 8.278 లక్షల కోట్ల వేల్యుయేషన్‌తో ఇటీవలే ఖతర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (క్యూఐఏ) 1 శాతం వాటాను కొనుగోలు చేసింది. నాణ్యత, నవకల్పన, కస్టమరు ప్రధానంగా కార్యకలాపాలు నిర్వహించడం, పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకోగలుగుతుండటం వంటి సామర్థ్యాలకు ఇది నిదర్శనం’’ అని అంబానీ తెలిపారు. అటు రూ. 22 కోట్లకు కొనుగోలు చేసిన సాఫ్ట్‌డ్రింక్ క్యాంపా కోలాను ఆసియా, ఆఫ్రికాతో పాటు అంతర్జాతీయ మార్కెట్లకు కూ డా తీసుకెళ్లనున్నట్లు ఈషా అంబానీ తెలిపారు. వారసత్వ ప్రణాళికలు.. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన వివిధ వ్యాపార విభాగాల కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముకేశ్ అంబానీ ముగ్గురు సంతానం తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో చేరారు. నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు. వారు ఈ హోదాను ‘కష్టపడి సంపాదించుకున్నారని’ అంబానీ తెలిపారు. ‘‘ఈషా, ఆకాశ్, అనంత్‌లో నేను, మా తండ్రిగారు ధీరుభాయ్ అంబానీ నాకు కనిపిస్తారు. ధీరుభాయ్లోని ఆ మెరుపు వారిలో నాకు కనిపిస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం జియో ఇన్ఫోకామ్‌ను ఆకాశ్, రిటైల్ వ్యాపారాన్ని ఆయన కవల సోదరి ఈషా (31), కొత్త ఇంధన వ్యాపార విభాగాన్ని అనంత్ (27) పర్యవేక్షిస్తున్నారు. 2002లో ధీరుభాయ్ మరణానంతరం సోదరుడు అనిల్ అంబానీతో వ్యాపార పంపకాలపరంగా వివాదం తలెత్తిన నేపథ్యంలో ముకేశ్ తాజా వారసత్వ ప్రణాళికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, రిలయన్స్ ఫౌండేషన్ కార్యకలాపాలపై మరింతగా దృష్టి పెట్టే ఉద్దేశంతో ముకేశ్ సతీమణి నీతా అంబానీ రిలయన్స్ బోర్డు నుంచి తప్పుకున్నారు. అయితే, ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా శాశ్వత ఆహా్వనితురాలు హోదాలో ఆమె బోర్డు సమావేశాలన్నింటికి యథాప్రకారంగా హాజరవుతారు. అత్యధిక డిమాండ్ ఉన్నవి, అనేక దశాబ్దాల పాటు ఆరోగ్యకరమైన వృద్ధి సాధించగలిగేవి అయిన వ్యాపారాలను మేము ఎంచుకున్నాం. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారాలను నిర్మించగలిగాం. మా మూడు వృద్ధి చోదకాలు .. (ఓ2సీ, రిటైల్, జియో డిజిటల్ సర్వీసులు) మరింత విలువ జోడించగలవు. కొత్తగా మా నాలుగో వృద్ధి ఇంజిన్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా వీటికి తోడుగా చేరింది. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ చైర్మన్ -
రిటైర్మెంట్ దిశగా ప్రపంచ అపరకుబేరుడు!
ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరు?.. కొన్నిరోజుల కిందటి దాకా టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ఉండేవాడు. కానీ, ట్విటర్ కొనుగోలు వ్యవహారం.. దానికి తోడు టెస్లా నష్టాలతో రికార్డు స్థాయి పతనం చెంది రెండో స్థానానికి దిగజారాడు. అప్పటి నుంచి ఫ్రాన్స్ వ్యాపార దిగ్గజం బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రపంచ అపరకుబేరుడిగా తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే.. ఈ పెద్దాయన ఇప్పుడు రిటైర్మెంట్ ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తన విలాసవంతమైన వ్యాపార సామ్రాజ్యానికి వారసులను ఒక్కొక్కరిగా ప్రకటించుకుంటూ వెళ్తున్నారు బెర్నార్డ్ ఆర్నాల్ట్(73). తాజాగా కూతురు డెల్‌ఫైన్‌కు ఎల్వీఎంహెచ్ తరపున రెండో అతిపెద్ద బ్రాండ్ డియోర్ బాధ్యతలు అప్పజెప్తున్నట్లు ప్రకటించారాయన. నెల కిందట.. పెద్ద కొడుకు ఆంటోనీ ఆర్నాల్ట్‌కు వ్యాపారంలో విస్తృత బాధ్యతలు అప్పజెప్తున్నట్లు ప్రకటించారాయన. అలాగే.. బెర్నాల్ట్ ఆర్నాల్ట్‌కు ఇద్దరు భార్యల(ఒకరు మాజీ) ద్వారా మొత్తం ఐదుగురు పిల్లలు. ఆ ఐదుగురికి తన వ్యాపారాన్ని అప్పజెప్పే ప్రణాళికను ఒక్కోక్కటిగా అమలు చేస్తూ ముందుకెళ్తున్నారు. తద్వారా వ్యాపార రంగం నుంచి తప్పుకుని విశ్రాంతి తీసుకోవాలనే యోచనలో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ► మరేయితర కంపెనీలు, ఫ్రాంఛైజీలతో సంబంధం లేకుండా.. కేవలం ఎల్వీఎంహెచ్ వ్యాపార సామ్రాజ్యం ద్వారానే బెర్నార్డ్ ఆర్నాల్ట్.. ఆదాయం అర్జిస్తున్నారు. ప్రస్తుతం ఫోర్బ్స్ ప్రకారం ఆ విలువ 196 బిలియన్ డాలర్లు. ► యూరప్‌లోనే లగ్జరీ బ్రాండ్‌గా పేరున్న LVMH Moët Hennessy – Louis Vuitton SEకు సహ వ్యవస్థాపకుడు, చైర్మన్, సీఈవో బాధ్యతలు కూడా ప్రస్తుతం బెర్నాల్డ్ ఆర్నాల్ట్ నిర్వహిస్తున్నాడు. ► 1949 మార్చి 5వ తేదీన రౌబయిక్స్లో జన్మించాడు బెర్నార్డ్ జీన్ ఎటిన్నె ఆర్నాల్ట్. బార్న్ విత్ గోల్డెన్‌గా ఆర్నాల్ట్‌కు పేరుంది. తల్లిదండ్రులిద్దరూ వ్యాపార దిగ్గజాలే. అయితే.. ఇంజినీరింగ్ చదువు పూర్తి చేసుకుని.. సొంతంగా రియల్ ఎస్టేట్ కంపెనీతో ఎదగడం ప్రారంభించాడు ఆర్నాల్ట్. ► ఆపై తండ్రి వ్యాపారాలను గమినిస్తూ, ఆయన నుంచి ఏసాయం ఆశించకుండా.. సొంత బిజినెస్‌లతో ఎదిగాడు. 80వ దశకం వచ్చేనాటికి.. సొంతంగా ఓ లగ్జరీ ఉత్పత్తుల కంపెనీ ఉండాలనే ఆలోచనలతో.. LVMH ను 1987లో నెలకొల్పాడు. ► ఏడాది తిరిగే సరికి అది బిలియన్‌న్నర డాలర్ల విలువ గల కంపెనీగా ఎదిగింది. అటుపై కంపెనీలో మేజర్ షేర్లు కొనుగోలు చేసి.. ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ బోర్డుకు చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. ► 2001 నుంచి ఎల్వీఎంహెచ్ విపరీతమైన లాభాలు ఆర్జించడం మొదలుపెట్టింది. తద్వారా ఫ్రాన్స్.. యూరప్ నుంచి కాస్ట్లీ బ్రాండ్ కంపెనీగా ఎదిగింది. ► 2013లో ఫ్రాన్స్ ఎన్నో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంది. ఆ సమయంలో పన్నుల ఎగవేత కోసం ఆయన బెల్జియం పౌరసత్వం కోసం దరఖాస్తు చేశాడనే ప్రచారం తెర మీదకు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. దరఖాస్తును వెనక్కి తీసుకున్నారాయన. ► ప్రముఖుల విమానాల కదలికలపై ట్విటర్ నిఘా వేయడంతో.. 2022లో ఆయన ప్రైవేట్ జెట్‌ను అమ్మేసినట్లు ప్రకటించారు. అప్పటి నుంచి ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను అద్దెకు తెచ్చుకుని, లేదంటే బిజినెస్ ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్నాడాయన. ► తన బిడ్డలకు పాఠాలు చెప్పిన మాస్టార్‌కు కృతజ్ఞతగా.. అతని కొడుకుకు అధ్యక్ష ఎన్నికల్లో మద్దతు ఇచ్చారు ఆర్నాల్ట్. 2017లో ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో ఈ అపర కుబేరుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్‌ను మద్దతు ప్రకటించారు. ఆయన తండ్రి బ్రిగిట్టే మాక్రోన్.. ఆర్నాల్ట్ పిల్లలకు పాఠాలు చెప్పేవారట. ► డెల్ఫైన్(47) ఆర్నాల్ట్ వారసుల్లో పెద్దది. పదేళ్లుగా తండ్రి వెంట ఉంటూ ఆయన వ్యాపారాలను దగ్గరగా గమనిస్తోంది. దీంతో తదుపరి బాధ్యతలు ఆమెకే అప్పగిస్తారనే చర్చ ఇప్పటి నుంచే జోరందుకుంది. అయితే.. ► గత పదేళ్లలో ఆమె తీసుకున్న స్వతంత్ర నిర్ణయాలు బెడిసి కొట్టింది లేదు. సమర్థవంతమైన నిర్ణయాలకు కేరాఫ్ అనే పేరుంది ఆమెకు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి డియోర్ బాధ్యతలు స్వీకరిస్తారామె. లూయిస్ విట్టన్ వ్యాపారాన్ని సమర్థవంతంగా నడిపిస్తుండడంతో.. ఎల్‌వీఎంహెచ్‌ను కూడా ఆమె ముందకు తీసుకెళ్లగలరనే ధీమాతో బోర్డు మెంబర్స్ ఉండడం కూడా ఆమెకు కలిసొచ్చే అంశం. ► అత్యంత లగ్జరీ బ్రాండ్‌గా పేరున్న ఎల్వీఎంహెచ్(LVMH) కంపెనీ సీఈవో బాధ్యతల నుంచి ఆర్నాల్ట్ అంత సులువుగా తప్పుకోకపోవచ్చనే వాదనా ఒకటి వినిపిస్తోంది. అందుకు కారణం కిందటి ఏడాది సీఈవో వయసు పరిమితిని ఎల్వీఎంహెచ్ ఎత్తేయడం. తద్వారా ఆర్నాల్ట్ 80 ఏళ్లు వచ్చేదాకా కూడా తన బాధ్యతల్లో కొనసాగవచ్చు. కానీ, ► అనారోగ్య కారణాల దృష్ట్యానే ఆయన బాధ్యతల నుంచి విరమణ తీసుకోవాలని భావిస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెప్తుండడం గమనార్హం. -
15 ఏళ్లదాకా 44,842 టీచర్ పోస్టులే
* భవిష్యత్తులో డీఎస్సీలు కష్టమే * మరోవైపు 10 లక్షలకు చేరనున్న బీఎడ్, డీఎడ్ల సంఖ్య * 2030 నాటికి పరిస్థితులపై సక్సెషన్ ప్రణాళిక రూపొందించిన విద్యాశాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే 15 ఏళ్లలో ఉపాధ్యాయ పోస్టులు, బీఈడీ, డీఎడ్ అభ్యర్థుల నిష్పత్తిలో భారీ వ్యత్యాసం ఏర్పడనుంది. లక్షలాది మంది అభ్యర్థులకు ఉద్యోగాలు లభించే పరిస్థితి లేదు. విద్యాశాఖలో రిటైర్మెంట్ ద్వారా 44,842 పోస్టులు మాత్రమే ఖాళీ కానున్నాయి. అంటే 2030 నాటికి వాటిని మాత్రమే భర్తీ చేసే అవకాశమున్నట్లు పాఠశాల విద్యాశాఖ నివేదిక రూపొందించింది. మరోవైపు రాష్ట్రంలోని బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఎడ్), డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్) అభ్యర్థుల సంఖ్య మాత్రం 10 లక్షలకు చేరనుందని పేర్కొంది. సక్సెషన్ రిపోర్టు పేరుతో 2030 నాటికి రాష్ట్రంలో బీఎడ్, డీఎడ్ అభ్యర్థుల సంఖ్య, ఉపాధ్యాయ ఖాళీల సంఖ్యను అంచనా వేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1.24 ల క్షల మంది, ప్రైవేటు పాఠశాలల్లో 1.10 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని 44,842 మంది ఉపాధ్యాయులు 2030 నాటికి పదవీ విరమణ పొందనున్నారు. వారిలో బీఎడ్ అర్హతతో ఉద్యోగాలు పొందిన స్కూల్ అసిస్టెంట్లు దాదాపు 23 వేల మంది, మరో 21,482 మంది డీఎడ్ అర్హత కలిగిన సెకండరీ గ్రేడ్ టీచర్లు ఉండే అవకాశముంది. అయితే, పదవీ విరమణ పొందే స్కూల్ అసిస్టెంట్లలో 30 శాతం మందిని రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. మిగతా 70 శాతం స్కూల్ అసిస్టెంట్ పోస్టులను సెకండరీ గ్రేడ్ టీచర్లతో పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన వచ్చే 15 ఏళ్లలో రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ రెండు, మూడుసార్లకు మించి చేపట్టే అవకాశం కనిపించడం లేదు. 10 లక్షలకు చేరనున్న అర్హులు రాష్ట్రంలో టెట్ పేపరు-1 లో అర్హత సాధించినవారు లక్షన్నర మంది ఉండగా, పేపరు-2లో అర్హత సాధిం చినవారు 2.5లక్షల మంది ఉన్నారు. టెట్ రాసేం దుకు సిద్ధంగా మరో 2 లక్షల మంది ఉన్నారు. అంటే ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నవారు 5లక్షల వరకు ఉన్నారు. ఇక రాష్ట్రంలోని డీఎడ్, బీఎడ్ కాలేజీల నుంచి ఏటా 40 వేల మంది బయటకు వస్తున్నారు. 2030 నాటికి ఈ సంఖ్య 10 లక్షలు దాట నుంది. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 61 లక్షల మంది విద్యార్థులుండగా, జనాభా నియంత్రణ నేపథ్యంలో 2030 నాటికి ఆ సంఖ్యలో మార్పు లక్ష లోపే ఉండే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో కొత్త పోస్టుల సృష్టి పెద్దగా ఉండే అవకాశం లేదు.