suddapalli
-
వైఎస్సార్సీపీ సవాల్,తోక ముడిచి పారిపోయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
-
సుద్దపల్లిలో 2014–19 మధ్యే భారీగా అక్రమ క్వారీయింగ్
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామం పరిధిలో 2014–19 మధ్య కాలంలోనే భారీగా అక్రమ క్వారీయింగ్ జరిగిందని డైరెక్టర్ ఆఫ్ మైనింగ్, జియాలజీ (డీఎంజీ) వీజీ వెంకటరెడ్డి వెల్లడించారు. సుద్దపల్లిలో అక్రమ గ్రావెల్ క్వారీయింగ్‌పై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మైనింగ్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా గురువారం ఆ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు గుర్తించిన కీలక అంశాలను వెంకటరెడ్డి వివరించారు. చేబ్రోలు మండలంలోని సుద్దపల్లి, ఇతర గ్రామాల పరిధిలో రహదారులు, నిర్మాణాలకు అవసరమైన నాణ్యమైన గ్రావెల్ నిల్వలు ఉన్నాయి. 2014–19 మధ్య నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరపడంతో ఒక్క సుద్దుపల్లిలోనే ప్రమాదకరమైన 19 గోతులు ఏర్పడ్డాయి. భూగర్భ జలాలు ఎండిపోయాయి. సుద్దపల్లిలో 2014–19 మధ్య 3 వేల క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌కు ఒక్క క్వారీకి తాత్కాలిక అనుమతి ఇచ్చారు. కానీ ఇష్టారాజ్యంగా క్వారీయింగ్ జరగ్గా, ఇద్దరికి మాత్రమే నోటీసులు ఇచ్చారు. కేవలం 16,399 క్యూబిక్ మీటర్లకు రూ.33,28,769 జరిమానా విధించారు. రాష్ట్రంలో మైనింగ్ అక్రమాలు, అక్రమ రవాణా నిరోధానికి ప్రభుత్వం విజిలెన్స్ స్క్వాడ్లు, నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఆకస్మిక దాడులతో మాఫియాకు ముక్కుతాడు వేస్తోంది. 2019–22 మధ్య సుద్దపల్లిలో కేవలం 4 క్వారీల ద్వారా 31,515 క్యూబిక్ మీటర్లకు తాత్కాలిక పర్మిట్లు జారీ అయ్యాయి. అక్రమాలకు పాల్పడుతున్న ఐదుగురికి నోటీసులు ఇచ్చారు. మొత్తం 56,834 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ అక్రమ క్వారీయింగ్‌కు బాధ్యులైన వారికి భారీగా రూ.2,06,63,127 జరిమానా విధించారు. అప్పుడు.. ఇప్పుడు చేబ్రోలు మండలంలో 2014–19 మధ్య 3,46,716 క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌కు 14 క్వారీలకు ప్రభుత్వానికి రూ.1,21,05,272 ఆదాయం వచ్చింది. 1,38,200 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ కోసం 4 లీజులకు రూ.42,05,070 వచ్చింది. ఆ ఐదేళ్ళలో అక్రమ తరలింపుపై 661 కేసులు పెట్టి రూ.1,08,24,898 జరిమానా విధించారు. అక్రమ క్వారీయింగ్‌పై 12 కేసులు పెట్టి రూ.5,39,17,924 జరిమానా వసూలు చేశారు. 2019–22 కాలంలో 4,00,684 క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌కు 48 తాత్కాలిక అనుమతులు ఇవ్వగా రూ.1,62,27,994 ఆదాయం వచ్చింది. అలాగే 42,198 క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌కు 4 లీజులకు అనుమతి ఇవ్వగా రూ.30,28,860 ఆదాయం వచ్చింది. 2019–22 మధ్య అక్రమంగా గ్రావెల్‌ను తరలిస్తున్న వారిపై 665 కేసులు నమోదు చేసి రూ.1,02,37,112 జరిమానా విధించాం. అక్రమ క్వారీయింగ్‌కు పాల్పడుతున్న వారిపై 23 కేసులు నమోదు చేసి రూ.8,13,05,703 జరిమానాగా వసూలు చేశాం. -
సుద్దపల్లి రైతులకు సంఘీభావం
సుద్దపల్లి (చేబ్రోలు): సాగు నీటి చెరువును క్వారీగా మార్చటానికి వ్యతిరేకంగా సుద్దపల్లి రైతులు చేపట్టిన ఆందోళనలకు శనివారం పలువురు సంఘీబావం తెలిపారు. 800 ఎకరాలకు సాగునీరు అందించే చేబ్రోలు మండలం సుద్దపల్లి పెద్ద చెరువు వద్ద తవ్వకాలు చేపట్టవద్దంటూ స్థానిక రైతులు నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సుద్దపల్లి గ్రామానికి వచ్చి రైతులకు మద్దతు తెలిపారు. శనివారం సీపీఐ జిల్లా నాయకులు అద్దేపల్లి మురళి, ప్రజా సంఘాల ఐక్య వేదిక తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు దాసరి థామస్ సుద్దపల్లి పెద్ద చెరువు వద్దకు వచ్చి రైతులకు సంఘీబావం తెలిపారు. అలాగే జనసేన పార్టీ జిల్లా నాయకులు బండ్రెడ్డి శివ, చందు, సుంకర సతీష్, మహిళా సంఘం నాయకులు సుద్దపల్లి రైతులకు మద్దతు తెలియజేశారు. రైతుల సంక్షేమాన్ని విస్మరించి పెద్ద చెరువు తవ్వకాలు జరిపితే అందరి సహకారంతో ఉద్యమిద్దామని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ సభ్యుడు మైలా హనుమంతరావు, స్థానిక నాయకులు ఎం.పోతురాజు, ముత్యం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
మైనింగ్ ఆపకుంటే దీక్షకు దిగుతా
-
మైనింగ్ ఆపకుంటే దీక్షకు దిగుతా: వైఎస్ జగన్
గుంటూరు: రైతుల కడుపుకొట్టి చెరువు మట్టితో టీడీపీ నేతలు వ్యాపారాలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుద్దపల్లిలో రైతుల దీక్షకు మద్దతు తెలిపిన వైఎస్ జగన్ అక్కడే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మూడు రోజులుగా చేబ్రోలు మండలం సుద్దపల్లిలో రైతులు దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల అక్రమ క్వారీలకు వ్యతిరేకిస్తూ దీక్ష చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని అన్నారు. ఎమ్మేల్యే నరేంద్ర వ్యాపారానికి చంద్రబాబు మద్దతిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకింత నీకింత అంటూ కమిషన్లు తీసుకుంటున్నారని చెప్పారు. చెరువులో మైనింగ్ వెంటనే ఆపేయాలని లేదంటే తానే దీక్ష చేస్తానని వైఎస్ జగన్ హెచ్చరించారు. -
సుద్దపల్లి రైతులకు వైఎస్ జగన్ మద్దతు
గుంటూరు: అధికార పార్టీ నేతల అక్రమ క్వారీలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన దీక్షకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలిపారు. గుంటూరు జిల్లా సుద్దపల్లిలో రైతులు మూడు రోజులుగా దీక్ష చేస్తున్నారు. శుక్రవారం సుద్దపల్లికి చేరుకున్న వైఎస్ జగన్.. అక్రమ క్వారీలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న పోరాటానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.