బాధితులకు రూ. ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు
అమలాపురం రూరల్ :
సూదాపాలెం ఘటనలో బాధితులకు ప్రభుత్వం రూ. ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా, ఇంటికొక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. అమలాపురం ఏరియా ఆస్పత్రిలో చిక్సిత పొందుతున్న బాధితులను ఆయన, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున, పార్టీ పీఏసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, నియోజకవర్గ కో ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్ గురువారం పరామర్శించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కన్నబాబు డిమాండ్ చేశారు. బాధితులకు ప్రభుత్వపరంగా రూ. ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ద్వారా వచ్చే సహాయం అందజేయాలన్నారు. బాధితులకు కాకినాడ లేదా రాజమహేంద్రవరంలలోని కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యసేవలందించాలని కన్నబాబు డిమాండ్ చేశారు. బాధితులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని విశ్వరూప్, చిట్టబ్బాయి పేర్కొన్నారు. దళితులపై దాడులు చేస్తున్న నిందితులకు కఠినమైన శిక్షలు పడనందునే ఇటువంటి దాడులు తరచూ జరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గ కో ఆర్డినేటర్లు కొండేటి చిట్టిబాబు, పితాని బాలకృష్ణ, శ్రీకాకుళం జిల్లా ఇన్చార్జి కొయ్యే మోషీన్రాజు, ఎస్సీ, ఎస్టీసెల్ ప్రధాన కార్యదర్శి మూర్తి నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శులు సుంకర సీతారామ్, ఎం.రామసతీష్, సంయుక్త కార్యదర్శి మెల్లం మహాలక్ష్మి ప్రసాద్, రాష్ట్ర నాయకులు ఎడ్ల ప్రసాద్నవీన్, సంయుక్త కార్యదర్శి ముత్తాబత్తుల మణిరత్నం, జెడ్పీ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్నకుమార్, రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, బొమ్మి ఇజ్రాయిల్, మిండగుదిటి మోహన్, గుత్తుల సాయి, లింగాల రవి, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పెట్టా శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టిబత్తుల రాజబాబు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ, రైతు విభాగం అధ్యక్షుడు జున్నూరి వెంకటేశ్వరరావు, విద్యార్థి విభాగం అధ్యక్షుడు జక్కంపూడి కిరణ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అడ్డగళ్ల సాయిరాం, ఆర్గనైజింగ్ కార్యదర్శులు మోకా వీరరాఘవులు, కాశి మునికుమారి, జిల్లా కార్యదర్శులు జంపన రమేష్‌రాజు, మట్టా వెంకట్రావు, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు గనిశెట్టి రమణ్‌లాల్, వాసంశెట్టి సుభాష్, కడిమి చిన్నవరాజు, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు మట్టపర్తి నాగేంద్ర, బొంతు గోవింద్శెట్టి పాల్గొన్నారు.