Sudip Bandyopadhyay
-
ఢిల్లీలో తృణమూల్ ఎంపీల ఆందోళన
న్యూఢిల్లీ: తమ పార్టీ నాయకులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనకు దిగారు. ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి ర్యాలీగా బయలుదేరారు. వీరిని పోలీసులు అడ్డుకుని తుగ్లక్ రోడ్డు పోలీసు స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ లోనూ ఎంపీలు ఆందోళన కొనసాగించారు. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కళ్యాణ్ బెనర్జీ, సౌగతా రాయ్ తదితరులు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు ఒడిశాలోని భువనేశ్వర్ లో నిన్న అరెస్ట్ చేసిన తృణమూల్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయను సీబీఐ అధికారులు ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. -
మమతా బెనర్జీకి కేంద్రం మరో షాక్
-
బీజేపీ కార్యాలయంపై దాడి.. తీవ్ర ఉద్రిక్తత!
-
బీజేపీ కార్యాలయంపై దాడి.. తీవ్ర ఉద్రిక్తత!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి చెందిన ఇద్దరు ఎంపీలను సీబీఐ అరెస్టు చేయడంతో ఆ పార్టీ శ్రేణులు భగ్గుమన్నారు. రోజ్‌వ్యాలీ కుంభకోణంలో సోమవారం టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్‌ను సీబీఐ అరెస్టు చేసింది. అంతకుమునుపు ఇదే స్కాంలో టీఎంసీ ఎంపీ తపస్ పాల్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టులను వ్యతిరేకిస్తూ టీఎంసీ విద్యార్థి విభాగం ఆందోళనకు దిగింది. కోల్‌కతాలోని బీజేపీ ప్రధాన కార్యాలయంపై ఆ పార్టీ శ్రేణులు దాడి చేశాయి. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీనిని పోలీసులు అడ్డుకోవడంతో వారిపై రాళ్లతో దాడులు చేశారు. ఈ ఘటనతో బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెద్దనోట్ల రద్దును తాను బాహాటంగా వ్యతిరేకిస్తుండటంతోనే రాజకీయ కక్షతో తమ పార్టీ ఎంపీలను కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు అరెస్టు చేయిస్తున్నదని, దీనికి తాను బెదిరేది లేదని టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతాబెనర్జీ అంటున్నారు. ఈ విషయంలో తాను చట్టబద్ధమైన పోరాటం చేస్తానని, న్యాయం కోసం కోర్టులను ఆశ్రయిస్తానని ఆమె అంటున్నారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, అసోం, జార్ఖండ్, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, త్రిపుర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కోట్లాది మంది చిన్న పెట్టుబడిదారులను మోసం చేసి రూ. 17వేల కోట్ల కుంభకోణానికి రోజ్‌వ్యాలీ చిట్‌ఫండ్ సంస్థ పాల్పడిందని, ఈ వ్యవహారంలో అధికార టీఎంసీ నేతల ప్రమేయం కూడా ఉందని సీబీఐ పేర్కొంటున్నది. -
మమతా బెనర్జీకి కేంద్రం మరో షాక్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమాల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. వారం రోజుల వ్యవధిలో ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలను సీబీఐ అరెస్ట్ చేసింది. మంగళవారం రోజ్ వాలీ చిట్ ఫండ్ కుంభకోణంలో టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇటీవల సమన్లు జారీ చేసిన సీబీఐ ఈ రోజు సుదీప్‌ను విచారించిన అనంతరం అదుపులోకి తీసుకుంది. డిసెంబర్ 30న ఇదే కేసులో టీఎంసీకే చెందిన ఎంపీ తపస్ పాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రోజ్ వ్యాలీ కంపెనీలో తపస్ పాల్ డైరెక్టర్‌గా ఉన్నారు. 17 వేల కోట్ల రూపాయల మేరకు వేలాది మందిని మోసం చేసినట్టు రోజ్ వ్యాలీపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై మమతా బెనర్జీ స్పందిస్తూ.. ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున కేంద్రం సీబీఐని అడ్డుపెట్టుకుని తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. -
సభలో జరిగింది కాంగ్రెస్ వ్యూహంలో భాగమే: సుష్మా
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్టామని ప్రభుత్వం చెప్పుకుంటున్నా, దాన్ని తాము అంగీకరించడం లేదని ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు. స్పీకర్‌తో భేటీ అనంతరం ఆమె మీడియూతో మాట్లాడారు. ‘‘గురువారం సభలో జరిగింది దురదృష్టకరమే గాక సిగ్గుచేటు కూడా. ఇందుకు పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదే. పార్లమెంటు హుందాతనాన్నీ, సంప్రదాయాలనూ మంటగలిపారు. సభ్యులందరూ లోక్‌సభను వీడిన తర్వాత, తెలంగాణ బిల్లును పెట్టామంటూ నమ్మించేలా ఓ తంతు నడపజూశారు. బిల్లును ఇంత బాధ్యతారహిత పద్ధతిలో సభలో పెడతారని మేం కలలో కూడా ఊహించలేదు’’ అని తూర్పారబట్టారు. తెలంగాణ బిల్లుతో పాటు ఏ విషయం మీదా కేంద్రంతో ఇక మీదట ఎలాంటి సంప్రదింపులూ జరపబోమని సుష్మ ప్రకటించారు. తెలంగాణ బిల్లు పెడుతున్నట్టుగా గురువారం లోక్‌సభ చేపట్టబోయే కార్యకలాపాల అజెండాలో పేర్కొననే లేదన్నారు. మధ్యాహ్నం దాకా అనుబంధ అజెండాలో కూడా ఆ అంశం లేదన్నారు. మధ్యాహ్నం 2 గంటలప్పుడు బిల్లును అనుబంధ అజెండాలో చేర్చారంటూ ఆక్షేపించారు. ‘‘నేను గురువారం ఆసాంతం సభలోనే ఉన్నాను. పెప్పర్ స్ప్రే ఉదంతం జరిగినప్పుడు, ఆ తర్వాత కూడా సభలోనే కూర్చుని ఉన్నా. నా ఆరోగ్యానికి హాని కలగవచ్చు గనుక వెళ్లిపోవాలంటూ మార్షల్స్ సలహా ఇచ్చేదాకా కదల్లేదు. స్పీకర్ ఎప్పుడొచ్చారో, బిల్లును సభలో ఎప్పుడు ప్రవేశపెట్టారో కూడా నాకు తెలియదు. నేను సభలో ఉన్నంతసేపూ కనీసం బిల్లును ‘ప్రవేశపెడుతున్నాం’ అన్న పదంలో తొలి అక్షరాన్ని కూడా ఉచ్ఛరించిన (ప్రభుత్వం) పాపాన పోలేదు’’ అని చెప్పుకొచ్చారు. ‘‘స్పీకర్ ఇంకా సభలోకి కూడా రాకముందే గందరగోళం మొదలైంది. కాంగ్రెస్ ఎంపీలే ముందుగా పరస్పరం భౌతిక దాడులకు దిగారు. తర్వాత ఏదో చల్లారు. దాంతో ఎంపీలంతా దగ్గసాగారు’’ అని వివరించారు. ఇదంతా కాంగ్రెస్ వ్యూహంలో భాగంగానే జరిగిందని ఆరోపించారు. ఇలా గలాభా జరగాలనే కాంగ్రెస్ కోరుకుందన్నారు. ‘‘పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం (ఏ బిల్లును ప్రవేశపెట్టినా) ముందుగా మధ్యాహ్న వేళకల్లా పత్రాలను సమర్పిస్తారు. తర్వాత సభా కార్యకలాపాలు మొదలవుతాయి. కానీ (తెలంగాణ బిల్లు విషయంలో) ఎలాంటి పత్రాలనూ సమర్పించలేదు. బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు నోటీసులిచ్చారు’’ అని చెప్పారు. తృణమూల్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సుదీప్ బంధోపాధ్యాయ కూడా యూపీఏ, కాంగ్రెస్‌ల వైఖరిని దుయ్యబట్టారు. బిల్లు పెడుతున్న విషయమే ఎంపీల్లో అత్యధికులకు తెలియదని, మొత్తం ప్రక్రియను కాంగ్రెస్ గబ్బు పట్టించిందని విమర్శించారు.