రూ.5 లక్షల విలువైన చక్కెర లోడు లారీ పట్టివేత
వరంగల్: వాహనాల ఆకస్మిక తనిఖీల్లో భాగంగా వరంగల్ నగరంలోని బీట్ బజారులో చక్కెర లోడుతో ఉన్న లారీని అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గోడౌన్లో అన్లోడ్ చేస్తుండగా రూ.5 లక్షల విలువైన చక్కెర ఉన్న లారీని అధికారులు పట్టుకుని తదుపరి చర్యలు తీసుకునేందుకు బీట్ బజార్ సీటీఓకు అప్పగించారు.