Sundupalle
-
40 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
సుండుపల్లె: శేషాచలం ప్రాంతమైన కడప, చిత్తూరు జిల్లా సరిహద్దు సరిహద్దు మండలాలయిన సుండుపల్లె మండలం పింఛా ప్రదేశం బొమ్మల కనుమ ప్రదేశంలో సోమవారం అర్ధరాత్రి రాజంపేట, పీలేరు, సానీపాయి ఫారెస్టు అధికారులు నిఘా పెట్టగా 40 ఎర్రచందనం దుంగలు, ఈచర్ వాహనం, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటిని రాజంపేట ఫారెస్టు కార్యాలయానికి (ఠానా) తరలించినట్లు విశ్వసనీయ సమాచరం. అదే విధంగా ఫారెస్టు అధికారులు అటవీ ప్రాంతంలో కూబింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. -
15 మంది తమిళ కూలీల అరెస్ట్
-
15 మంది తమిళ కూలీల అరెస్ట్
సుండుపల్లి (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా సుండుపల్లి సమీపంలోని కృష్ణారెడ్డి చెరువు వద్ద శనివారం 20 ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న 15 మంది తమిళ కూలీలను సుండుపల్లి ఎస్ఐ మధుసూదనరెడ్డి అరెస్ట్ చేశారు. ముందస్తు సమాచారం మేరకు ఎస్ఐ సిబ్బందితో దాడి చేసి ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని 15మందిని అరెస్ట్ చేసారు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ రూ.11.20 లక్షలు ఉంటుందని ఎస్ఐ చెప్పారు. తమిళనాడులోని వేలూరుకు చెందిన తలారి విజయకుమార్ తమ నాయకుడని, ఆయన ఆదేశం మేరకే ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నామని కూలీలు చెప్పినట్లు ఎస్ఐ మీడియాకు వివరించారు. కూలీలను ప్రత్యేక బస్సులో రాయచోటి కోర్టుకు తరలించారు. -
వరద నీటిలో మహిళ గల్లంతు
-
వరద నీటిలో మహిళ గల్లంతు
సుండుపల్లె (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఒక మహిళ వరద నీటిలో కొట్టుకుపోయింది. సుండుపల్లె మండలం మాచిరెడ్డిపల్లె పంచాయతీ రాయవరం గ్రామానికి చెందిన పాలెం చంద్ర, ఆయన భార్య మణెమ్మ(35).. కుమార్తె, మరొక స్త్రీతో కలసి సోమవారం రాయవరం వైపు కాలినడకన బయలుదేరారు. మార్గమధ్యంలో వారు మడికాడు వద్ద బాహుదా నది లో లెవల్ వంతెనపైకి వచ్చిన వరద నీటి ఉధృతికి కొట్టుకుపోయారు. అప్రమత్తమైన చుట్టుపక్కలవారు ముగ్గురిని కాపాడగలిగారు. మణెమ్మ వరద నీటిలో గల్లంతయ్యింది. ఆమె కోసం అధికారులు గాలిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న తహశీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి లో లెవల్ వంతెన వద్ద సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఆ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఆదినారాయణరెడ్డి ప్రాజెక్టులోకి 30వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండటంతో రెండు గేట్లెత్తి 30 వేల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు జేఈ రెడ్డయ్య తెలిపారు.