sunnipenta
-
వైన్ షాప్ వద్దంటూ పబ్లిక్ నిరసన
-
సున్నిపెంట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం
-
అంధకారంలో సున్నిపెంట
విద్యుత్ బకాయి చెల్లించకపోవడంత సరఫరా నిలిపివేత శ్రీశైలం ప్రాజెక్టు : ఏపీ ట్రాన్స్‌కోకు శ్రీశైలం ప్రాజెక్టు ఇరిగేషన్ శాఖ విద్యుత్ బకాయి చెల్లించపోవడంతో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కాలనీ మొత్తం అంధకార మయమైంది. ఇరిగేషన్ శాఖ రూ.14 కోట్లు బకాయి ఉంది. ఇదిలా ఉండగా సున్నిపెంట కాలనీలో ఏపీ ›ట్రాన్స్‌కో మీటర్లు బిగించి కనెక్షన్లను స్వాధీనం చేసుకోవాల్సిందిగా గతంలో జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాన్స్‌కో మీటర్లు బిగిస్తున్నా కనెక్షన్లను తమ కంట్రోల్లోకి తీసుకోకపోవడంతో బిల్లుల వసూలు బాధ్యత ఎవరి తీసుకోవాలనే సందిగ్ధం నెలకొంది. విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని ఇరిగేషన్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ట్రాన్స్‌కో అధికారులను కోరారు. -
వైఎస్ఆర్ సీపీ నేత దారుణ హత్య
-
వైఎస్ఆర్ సీపీ నేత దారుణ హత్య
కర్నూలు: కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వసంతరావు(55) దారుణ హత్యకు గురయ్యారు. పాత కక్ష్యల నేపథ్యంలో గుర్తుతెలియని దుండగులు ఆయనపై దాడి చేసి హతమార్చారు. ఈ సంఘటన శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లాలోని శ్రీశైలం రెండో జలవిద్యుత్ కేంద్రం వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితేసున్నిపెంట మండల కేంద్రానికి చెందిన వసంతరావు ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్‌కు పని నిమిత్తం బయలుదేరారు. ఈ క్రమంలోనే మార్గ మధ్యలో కొంతమంది దుండగులు ఆయన కారుపై రాళ్ల వర్షం కురిపించి, అనంతరం వేటకొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో వసంతరావు అక్కడికక్కడనే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ మండల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. (సున్నిపెంట)