కర్నూలు: కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వసంతరావు(55) దారుణ హత్యకు గురయ్యారు. పాత కక్ష్యల నేపథ్యంలో గుర్తుతెలియని దుండగులు ఆయనపై దాడి చేసి హతమార్చారు. ఈ సంఘటన శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లాలోని శ్రీశైలం రెండో జలవిద్యుత్ కేంద్రం వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితేసున్నిపెంట మండల కేంద్రానికి చెందిన వసంతరావు ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్‌కు పని నిమిత్తం బయలుదేరారు.
ఈ క్రమంలోనే మార్గ మధ్యలో కొంతమంది దుండగులు ఆయన కారుపై రాళ్ల వర్షం కురిపించి, అనంతరం వేటకొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో వసంతరావు అక్కడికక్కడనే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ మండల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
(సున్నిపెంట)