Superfast express train
-
పట్టాలు తప్పిన సబర్మతి రైలు
జైపూర్: రాజస్థాన్‌లో సబర్మతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. గూడ్స్ రైలును ఢీకొట్టిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. అజ్మీర్‌లోని మడర్ రైల్వేస్టేషన్లో సోమవారం తెల్లవారుజామున ఒంటి గంటకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సబర్మతి రైలులోని పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. #WATCH | Rajasthan: Four coaches including the engine of a passenger train travelling from Sabarmati-Agra Cantt derailed near Ajmer. Further details awaited. pic.twitter.com/fX9VeLKw2e — ANI (@ANI) March 18, 2024 సబర్మతి సూపర్‌ఫాస్ట్ డ్రైవర్ అత్యవసర బ్రేకులు వేసి రైలును ఆపడానికి ప్రయత్నించినప్పటికీ అది గూడ్స్ రైలును ఢీ కొట్టింది. ఈ ఘటనపై నార్త్ వెస్టర్న్ రైల్వే ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేసింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది. ప్రమాదానికి సంబంధించి వివరాల కోసం హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఇదీ చదవండి.. కుప్పకూలిన ఐదంతస్తుల భవనం -
న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం జరిగింది. రైలులో మంటలు చెలరేగి మూడు బోగీలు దగ్ధం అయ్యాయి. యూపీలోని ఇట్టావా స్టేషన్ దగ్గర ఈ ఘటన జరిగింది. సరాయ్ భూపత్ స్టేషన్ నుంచి దాటిపోతున్న క్రమంలో స్లీపర్ కోచ్ నుంచి పొగలు వెలువడ్డాయి. ఈ విషయాన్ని గమనించిన స్టేషన్ మాస్టర్.. ట్రైన్ డ్రైవర్, గార్డ్‌కు విషయాన్ని చేరవేశాడు. #WATCH | Fire broke out in the S1 coach of train 02570 Darbhanga Clone Special when it was passing through Sarai Bhopat Railway station in Uttar Pradesh. According to CPRO, North Central Railways, there are no injuries or casualties (Earlier Video; Source: Passenger) pic.twitter.com/mTFHcTlhak — ANI (@ANI) November 15, 2023 దీంతో రైలును అక్కడే నిలిపివేయగా ప్రయాణికులందరూ భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరగలేదని అధికారులు తెలిపారు. రైలుకు పూర్తి స్థాయిలో మంటలు అంటుకున్నాయి. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదీ చదవండి: కామ్రేడ్ శంకరయ్య కన్నుమూత.. నేరుగా ఆస్పత్రికి వెళ్లిన సీఎం స్టాలిన్ -
మొరాయించిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్
కాజీపేట రూరల్: హైదరాబాద్ నుంచి కొత్త ఢిల్లీ వెళ్లాల్సిన తెలంగాణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం మార్గమధ్యలో పలు ప్రాంతాల్లో మొరాయించింది. బుధవారం ఉదయం బయలు దేరిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్ భువనగిరి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాక బ్రేక్ బోల్డు స్టార్ రిలీజింగ్ పైపు విరగగా అక్కడ 20 నిమిషాల పాటు ఆపి తాత్కాలిక మరమ్మతు చేసి, కాజీపేట పంపించారు. కాజీపేటలో మెకానిక్ సిబ్బంది కూడా 10 నిమిషాల పాటు శ్రమించి మరమ్మతు పూర్తి చేశారు. ఇక రామగుండం వెళ్లే సరికి మళ్లీ ఆగిపోయింది. దీంతో కాజీపేట నుంచి మెకానిక్ సిబ్బంది కొత్త బోల్డు స్టార్ పైప్ తీసుకెళ్లారు. అక్కడి సిబ్బందితో కలసి గంట పాటు శ్రమించి బోల్డు స్టార్‌ను తొలగించి కొత్తది అమర్చారు. ఇలా సాంకేతిక సమస్య కారణంగా తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రెండు గంటల పాటు ఆలస్యంగా వెళ్లినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. -
సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు
-
ఆ రైళ్లలో సూపర్‌ఫాస్ట్ బాదుడు
సాక్షి,న్యూఢిల్లీ: రైల్వేలను లాభాల ట్రాక్‌పైకి ఎక్కించాలనే తపన ప్రయాణీకులకు పెనుభారమవుతోంది. తాజాగా 48 మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను సూపర్‌ఫాస్ట్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ చార్జీలు పెంచడంతో ప్రయాణీకులపై అదనపు భారం పడింది. అయితే ఆయా రైళ్ల సగటు వేగాన్ని కేవలం 5 కిలోమీటర్లు పెంచి అధికారులు చేతులుదులుపుకున్నారు. రైళ్లు సకాలంలో నడిచే పరిస్థితి లేకపోవడం, వేగాన్ని పెద్దగా పెంచకపోవడంతో అప్‌గ్రేడేషన్‌తో ప్రయాణీకులకు ఆశించిన ప్రయోజనం చేకూరడం లేదు. నవంబర్ 1న వెల్లడించిన టైమ్‌టేబుల్ ప్రకారం అప్‌గ్రేడ్ చేసిన రైళ్ల సగటు వేగాన్ని గంటకు 50 కిమీ నుంచి 55 కిమీకి పెంచారు. పొగమంచు కారణంగా ఉత్తరాదికి వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్న సీజన్ ఆరంభంలో సూపర్‌ఫాస్ట్ లెవీని విధించడం ప్రయాణీకులకు ఏరకంగానూ ఉపయోగపడదని భావిస్తున్నారు. ప్రస్తుతం రాజధాని, దురంతో, శతాబ్ధి వంటి ప్రీమియర్ సర్వీసులు సహా అన్ని రైళ్లూ ఆలస్యంగా నడుస్తున్నాయి. సూపర్‌ఫాస్ట్ రైళ్లుగా అప్‌గ్రేడ్ చేసిన రైళ్లలో కొత్తగా ప్రయాణీకుల కోసం అదనంగా ఎలాంటి సౌకర్యాలూ కల్పించలేదు. అయినా ప్రయాణీకులు స్లీపర్ క్లాస్‌కు అదనంగా రూ 30, సెకండ్, థర్డ్ ఏసీలపై రూ 45, ఫస్ట్ ఏసీ క్లాస్‌పై రూ 75 సూపర్‌ఫాస్ట్ చార్జీలు చెల్లించాల్సి వస్తోంది.సూపర్‌ఫాస్ట్ లెవీగా అదనంగా రూ 70 కోట్లు సమీకరించాలని రైల్వేలు అంచనా వేస్తున్నాయి.48 ట్రెయిన్లను సూపర్‌ఫాస్ట్ జాబితాలో చేర్చడంతో మొత్తం ఈ విభాగంలో చేరిన రైళ్ల సంఖ్య 1072కు పెరిగింది. -
దక్షిణ రైల్వే భేష్!
చెన్నై, సాక్షి ప్రతినిధి : తమిళనాడు ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న రాయపురం రైల్వేస్టేషన్ అభివృద్ధిపై సర్వేసాగుతోందని రైల్వే మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే చెన్నైలో మూడో స్టేషన్‌గా అందుబాటులోకి వస్తుందని హామీ ఇచ్చారు. కొత్తగా ప్రవేశపెట్టిన చెన్నై సెంట్రల్ - విశాఖపట్టణం వారాంతపు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను మంత్రి ఆదివారం ప్రారంభించారు. అలాగే చెన్నై సెంట్రల్- కామాఖ్య ప్రీమియం ఎక్స్‌ప్రెస్ రైలును త్వరలో ప్రవేశపెట్టబోతున్నట్లు ఆయన ప్రకటించారు. రాయపురం స్టేషన్‌కే కాదు ఏ అభివృద్ధి పనులకైనా బడ్జెట్‌తో నిమిత్తం లేకుండా మంజూరు చేసేందుకు సిద్ధమని తెలిపారు. అయితే రైల్వే పనుల్లో రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరమన్నారు. ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వం తమకు ఎంతో సహకరిస్తోందని తెలిపారు. బేసిన్‌బ్రిడ్జ్-సెంట్రల్ మధ్య అదనపు రైల్వేట్రాక్ పనులు ప్రారంభించామని, బీచ్‌స్టేషన్, తిరువళ్లూరు, వేలాచ్చేరీల్లో సైతం ప్రయాణికుల సౌకర్యార్థం అదనపు ఫ్లాట్‌ఫారం మంజూరు చేశామని తెలిపారు. భారతీయ రైల్వేలోనే దక్షిణ రైల్వే పనితీరు భేషుగ్గా ఉందని కితాబిచ్చారు. సాధారణ ప్రయాణికులు ఎంతో ఇష్టపడే రైల్వే సేవలను దేశవ్యాప్తంగా రోజుకు 2.75 కోట్ల మంది అందుకుంటున్నారని చెప్పా రు. నగరాలకు సాధారణ రైళ్లతోపా టూ శివారు ప్రాంతాలకు సబర్బన్ రైళ్ల సేవలు ఎంతో ప్రయోజనకారిగా ఉన్నాయని చెప్పారు. రైల్వేకు ప్రయాణికులే ప్రాణమని, రైల్వేకు మూడొం తుల ఆదాయం కార్గో నుంచే లభిస్తోందని చెప్పారు. మహిళా ప్రయాణికుల రక్షణకు మహిళాగార్డులను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర నౌకాయాన శాఖా మంత్రి పొన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ, విశాఖ నుంచి చెన్నైకి వచ్చే ఈరైలును కన్యాకుమారి వరకు పొడిగిస్తే బాగుంటుందని కోరారు. తమిళనాడుకు సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలపై రైల్వే మంత్రికి తెలియజేశానని చెప్పారు. ఎంపీ రంగరాజన్ మాట్లాడుతూ, చెన్నై-విశాఖ వారాంతపు రైలును రోజువారిరైలుగా మార్చాలని కోరారు. ఎంపీ విజయకుమార్ మాట్లాడుతూ, విద్య, వైద్యం ప్రాధాన్యత కలిగిన చెన్నై నగరానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేవారికి ఈ రైలు ఎంతో సౌకర్యమన్నారు. రైళ్లలో చోరీలు అరికట్టేందుకు భద్రతా చర్యలు చేపట్టాలని, నేరాలు జరిగినపుడు ప్రయాణికులు రైలు నుంచి దిగకుండానే పోలీసులకు ఫిర్యాదు చేసేలా మొబైల్ సేవలను ఏర్పాటు చేయాలని కోరారు.