Supertech builders
-
నోయిడా జంట టవర్ల కూల్చివేత: వంచితుల వ్యథ తీరేదెప్పుడు!
-ఎస్.రాజమహేంద్రారెడ్డి రెండు ఆకాశ హర్మ్యాలు.. ఒకటి 32 అంతస్తులు, మరొకటి 29 అంతస్తులు. 12 సెకండ్లలో నేలమట్టమయ్యాయి. నోయిడా జంట టవర్ల నిర్మాణానికి అయిన ఖర్చు రూ.70 కోట్లు. కూల్చడానికి అయిన ఖర్చు రూ.20 కోట్లు. వెరసి అక్షరాలా మొత్తం రూ.90 కోట్లు 12 సెకండ్లలో మట్టిలో కలిసిపోయాయి. అక్రమ కట్టడం కుప్పకూలింది. అక్రమార్కులకు ఇదో పెద్ద హెచ్చరిక అని అనుకోవడం వరకు బాగానే ఉంది కానీ, ఈ అక్రమ కట్టడం ఆకాశం ఎత్తు లేచే వరకు సాయం చేసిన అధికారులను ఏం చేశారు? వాళ్లనెలాగూ కూల్చలేం. కనీసం వాళ్ల ఉద్యోగాలనైనా కూల్చారా? కోర్టులు ఈ విషయంలో చొరవ తీసుకున్నట్టు లేదు. ప్రభుత్వాలు నోరు మెదపకుండా చోద్యం చూస్తున్నాయి. టవర్లు కోర్టు ఆదేశానుసారం కూలిపోయాయి. శిథిలాలు పోగయ్యాయి. ఎంత ఇంకో మూడు నెలల్లో శిథిలాలను తొలగిస్తాం అని నోయిడా మున్సిపల్ అధికారులు మాటిచ్చేశారు. తాము ఖర్చు పెట్టిన రూ.20 కోట్లలో(కూల్చడానికి) టవర్ల నిర్మాణానికి వాడిన స్టీల్‌ను అమ్ముకుంటే రూ.15 కోట్లయినా వస్తాయని వారి అంచనా. మరి ఈ జంట టవర్లలో ఫ్లాట్లు కొన్నవారు ఎటుపోవాలి? వారు అప్పో సప్పో చేసి ఫ్లాట్లు కొనుక్కొని ఉంటారు. ఇంకా నెలసరి వాయిదాలు(ఈఎంఐలు) చెల్లిస్తూనే ఉంటారు. వీరి గోస ఎప్పుడు తీరేనూ? ఢిల్లీలో సొంతింటి కల నెరవేర్చుకోలేక శివార్లలో ఉన్న నోయిడాలో కాస్త తక్కువ ధరకు ఈ కోరిక తీర్చుకొని ఉంటారు. ఈ రెండు టవర్లను(అపెక్స్, సెయాన్) నిర్మించిన సూపర్‌టెక్ కంపెనీ ఫ్లాట్ల కొనుగోలుదారుల నుంచి దాదాపు రూ.180 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడీ డబ్బంతా నిరాశ్రయులైన ఫ్లాట్ యజమానులకు తిరిగి చెల్లించాలి. సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బోపన్న, జస్టిస్ పార్దీవాలాల ధర్మాసనం ఈ నెల 26న ఈ విషయంలో ఆదేశాలు జారీ చేస్తూ ‘కొనుగోలుదారులందరికీ వారు చెల్లించిన డబ్బు మొత్తం 12% వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి’’ అని సూపర్‌టెక్ సంస్థకు స్పష్టం చేసింది. ముందస్తు చర్యగా సూపర్‌టెక్ రూ.1 కోటి మొత్తాన్ని కోర్టు రిజిస్ట్రీలో సెప్టెంబర్ 30లోగా జమ చేయాల్సి ఉంటుంది. మొత్తం బకాయిలు అందేది ఎప్పుడో? కోర్టు నియమించిన అమికస్ క్యూరీ గౌరవ్ అగర్వాల్ అక్టోబర్ మొదటివారంలో సూపర్‌టెక్ సంస్థ ప్రతినిధులతో సమావేశమై కొనుగోలుదారులకు రావాల్సిన బకాయిలను లెక్కతేల్చి సమర్పిస్తారని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. సూపర్‌టెక్ కంపెనీ నెలవారీ ఆదాయం రూ.20 కోట్లని, అందులో రూ.15 కోట్లను ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి కేటాయించాల్సి ఉంటుందని అమికస్ క్యూరీ వివరించారు. మిగతా రూ.5 కోట్ల సొమ్మును ఫ్లాట్ల కొనుగోలుదారులకు బకాయిలు చెల్లించేందుకు వినియోగిస్తామన్నారు. 59 మంది కొనుగోలుదారులకు చెల్లించాల్సి ఉందని మిగతా వాళ్లలో చాలామందికి డబ్బు తిరిగి చెల్లించడం గానీ, వేరే టవర్లలో ఫ్లాట్ కేటాయించడం గానీ జరిగిందని సూపర్‌టెక్ యజమాన్యం వెల్లడించింది. కొనుగోలుదార్లలో చాలామందికి ఎంతోకొంత ఇంకా రావాల్సి ఉందని తెలిసింది. టవర్లయితే 12 సెకండ్లలో నేటమట్టమయ్యాయి. కానీ, చివరి కొనుగోలుదారుడికి బకాయిలు అందేసరికి ఎన్ని రోజులు పడుతుందో వేచి చూడాల్సిందే! సుప్రీంకోర్టు ఆదేశం కాబట్టి కొనుగోలుదారులందరికీ వారి కష్టార్జితం వడ్డీతో సహా అందుతుందనే ఆశిద్దాం. వడ్డీ కడుతూనే ఉన్నాం.. సెయాన్‌లో ఫ్లాట్ కొనేందుకు 2011లో రూ.26 లక్షలు అప్పు తీసుకున్నాం. అన్ని అనుమతులు వచ్చాక నిర్మాణం చేపట్టారని నమ్మాం. అందుకే అప్పు తెచ్చి మరీ కొన్నాం. అక్రమ నిర్మాణమని కోర్టులు తేల్చడంతో గుండెలో రాయి పడ్డట్టు అయ్యింది. ఈ ఒత్తిడి తట్టుకోలేక మా నాన్నగారు అనారోగ్యం పాలయ్యారు. తెచ్చిన అప్పునకు ఇప్పటికీ వడ్డీ కడుతూనే ఉన్నాం. పెట్టిన డబ్బంతా మా చేతికి వస్తేగానీ కుటుంబం కుదుటపడదు. – కె.వర్మ (ఉద్యోగి) కనువిప్పు కావాలి 2009లో రూ.50 లక్షలు అప్పు తెచ్చి అపెక్స్ టవర్‌లో ఫ్లాట్ బుక్ చేశా. కోరుకున్న చోట ఇల్లు కొంటున్నామన్న సంతోషం కోర్టు ఆదేశంతో నీరుగారిపోయింది. అక్రమ కట్టడమని తేల్చడానికి అన్ని రోజులు ఎందుకు పట్టిందో అర్థం కాలేదు. అనుమతులన్నీ ఉన్నాయని నిర్మాణ సంస్థ బుకాయించడం కూడా జీర్ణం కాలేదు. విధిలేక ఈ ఫ్లాట్‌కు బదులుగా సూపర్‌టెక్ సంస్థ ఇవ్వజూపిన వేరే ఫ్లాట్‌తో సరిపెట్టుకోవాల్చి వచ్చింది. కూల్చివేతతో వివాదం ముగిసినప్పటికీ డబ్బు చెల్లించాక మాకు ఇష్టమైన ఫ్లాట్‌ను పొందలేకపోయామన్న బాధ మిగిలే ఉంది. అక్రమ నిర్మాణాలకు తెగబడే బిల్డర్లకు, వారితో లాలూచీ పడి కళ్లు మూసుకొని అన్ని అనుమతులు మంజూరు చేసే అధికారులకు ఈ సంఘటన కనువిప్పు కావాలి. – గుప్తా (వ్యాపారి) ఆరంభం నుంచి నేలమట్టం దాకా.. ► 2004: నోయిడా ‘సెక్టార్ 93ఎ’లో గృహ సముదాయం కోసం సూపర్‌టెక్ సంస్థకు స్థలం కేటాయింపు (ఎమెరాల్డ్ కోర్టు హౌజింగ్ సొసైటీలో) ► 2005: ఎమెరాల్డ్ కోర్టు హౌజింగ్ సొసైటీ భవన నిర్మాణ ప్లాన్‌కు నోయిడా అథారిటీ అనుమతి మంజూరు. 10 అంతస్తుల చొప్పున 14 రెసిడెన్షియల్ టవర్ల నిర్మాణానికి అనుమతి ► 2006: మరింత స్థలం కావాలన్న సూపర్‌టెక్ సంస్థ వినతికి నోయిడా అథారిటీ అంగీకారం. తొలుత అనుమతి ఇచ్చిన భవన నిర్మాణ ప్లాన్‌కు సవరణలు. 14 టవర్లకు బదులుగా మరో టవర్ నిర్మాణానికి ఓకే. దీంతో మొత్తం 15 టవర్లకు అనుమతి ఇచ్చింది. ► 2009: నిర్మాణ సంస్థ మరోసారి ప్లాన్‌ను మార్చి మరో రెండు టవర్ల(అపెక్స్, సెయాన్)ను అదనంగా చేర్చింది. అయితే, ఈ రెండు టవర్లలో 24 అంతస్తులు ఉండేటట్టుగా ప్లాన్ మార్చడంతోపాటు వెంటనే నిర్మాణం కూడా చేపట్టింది. దీనికి స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ► 2012: నిర్మాణ సంస్థ మరోసారి తన ప్లాన్‌ను సవరించి అపెక్స్, సెయాన్ టవర్లను 40 అంతస్తులకు పెంచింది. నిర్మాణ పనులను వేగవంతం చేసింది. ► 2012 డిసెంబర్: ఎమెరాల్డ్ కోర్టు సొసైటీలోని కొందరు ఈ విషయాన్ని అలహాబాద్ హైకోర్టుకు విన్నవిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ► 2014: జంట టవర్లను కూల్చివేయాల్సిందిగా అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిర్మాణ సంస్థతో కుమ్మక్కయ్యారని నోయిడా అథారిటీని తప్పుపట్టింది. దాంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. ► 2014 మే: అనుమతులన్నీ ఉన్నాయంటూ సూపర్‌టెక్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ► 2021 ఆగస్టు 31: దాదాపు ఏడేళ్ల వాదోపవాదాల తర్వాత జంట టవర్లను కూల్చివేయాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. మూడు నెలల్లోగా పని పూర్తికావాలని ఆదేశించింది. ► 2022 ఫిబ్రవరి: మే 22న కూల్చివేస్తామని నోయిడా అథారిటీ సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ► 2022 మే 17: కూల్చివేత కాల పరిమితిని సుప్రీంకోర్టు ఆగస్టు 28కి పొడిగించింది. ► 2022 ఆగస్టు 28: జంట టవర్లు నేలమట్టం. సూపర్‌టెక్ సంస్థ నిర్మించిన 15 టవర్ల ఎమెరాల్డ్ కోర్టు హౌజింగ్ కాంప్లెక్స్‌లో మొత్తం 650 ఫ్లాట్లు ఉన్నాయి. నేలమట్టమైన అపెక్స్, సెయాన్ టవర్లు ఇప్పటికీ నిలిచి ఉంటే మరో 915 ఫ్లాట్లు, 21 దుకాణాలు అదనంగా ఉండేవి. రూ. 31.5 లక్షలు రావాలి ‘‘నేను 2010లో సెయాన్‌లో రూ.42 లక్షలు పెట్టుబడి పెట్టాను. ఈ కట్టడం అక్రమమని కోర్టు తీర్పు ఇచ్చినప్పుడే మా కుటుంబం యావత్తూ కుంగిపోయాం. బిల్డర్స్‌తోపాటు నోయిడా అథారిటీ కూడా దీనికి బాధ్యత వహించాలి. అక్రమమని తెలిసి కూడా అనుమతులు ఎలా మంజూరు చేశారో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఇదో పెద్ద అవినీతి సౌధం. 12 శాతం వడ్డీతో కలిపి నాకు రూ.80 లక్షలు బకాయిపడ్డారు. ఇందులో భాగంగా వేరేచోట ఇంకో ఫ్లాట్ ఇచ్చారు. అదిపోనూ ఇంకా రూ.31.5 లక్షలు రావాల్సి ఉంది’’ – పునీత్ (వ్యాపారి) -
ట్విన్ టవర్ల కూల్చివేతకు రంగం సిద్ధం: భారీ తరలింపులు, హై టెన్షన్!
న్యూఢిల్లీ:నోయిడా వివాదాస్పద, అక్రమ జంట టవర్ల కూల్చివేతకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 21 న నోయిడాలోని సెక్టార్ 93Aలో సూపర్‌టెక్ జంట టవర్లు అపెక్స్ (32 ఫోర్లు), సెయానే (31 ఫోర్ల)కూల్చివేతకు రంగం సిద్దమైంది. టన్నుల కొద్దీ పేలుడు పదార్థాలతో దాదాపు 100 మీటర్ల ఎత్తైన ఈ టవర్లను ఎడిఫైస్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో నేలమట్టం చేయనున్నారు. ఎంపిక చేసిన నిపుణుల సమక్షంలో ఆగస్ట్ 2 నుండి ఆగస్టు 20 వరకు ఈ జంట టవర్లను పేలుడు పదార్థాలతో నింపుతారు. అనంతరం ఆగస్టు 21 మధ్యాహ్నం 2.30 గంటలకు క్షణాల్లో వీటిని పూర్తిగా కూల్చివేయ నున్నారు. నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు జరిగాయని గత ఆగస్టులో సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన అనంతరం ఈ పరిణామం జరగనుంది. అలాగే సుప్రీం ఆదేశాల మేరకు గృహాలను కొనుగోలు చేసి మోసపోయిన వారికి సంబంధిత నగదును వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడి ఫ్లాట్లలో నివసిస్తున్న వారిని తరలించేందుకు అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. నోయిడాలో సూపర్‌టెక్ అక్రమ జంట టవర్లలో 1,396 ఫ్లాట్లలో నివసిస్తున్న దాదాపు 5 వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు. దీంతో చుట్టుపక్కల నివసిస్తున్నవారిలో ఆందోళన నెలకొంది. అంతకుముంద జూలై 27నాటి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్, పోలీస్ ఆర్డబ్ల్యుఎలతో నోయిడా అథారిటీ, పోలీసులు, ఇతర అధికారుల సమావేశంలో తరలింపు ప్రణాళిక, భద్రతా వివరాలను చర్చించారు. ఈ మేరకు ఆగస్టు 14న కూల్చివేతకు సంబంధించిన పూర్తిస్థాయి డ్రెస్ రిహార్సల్ నిర్వహించనున్నట్లు నోయిడా అధికారులు తెలిపారు. ఈ ప్రాంగణంలో రెడ్ జోన్‌గా ప్రకటించారు. అంతేకాదు నో-ఫ్లై జోన్‌గా ప్రకటించాలని కేంద్రం అనుమతి కోరనున్నారు. నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాల రాకపోకలు నిలిపి వేస్తామన్నారు. దశలవారీగా ఎక్స్‌ప్లోజివ్స్ ద్వారా వీటిని కూల్చివేయనున్నారు. ఈ పేలుడుకు మూడు గంటల ముందు, రెండు గంటల తర్వాత ఐదు గంటల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని నోయిడా అథారిటీ సీనియర్ అధికారి తెలిపారు. దీంతో ట్విన్ టవర్లకు ఆనుకుని ఉన్న ఎమరాల్డ్ కోర్ట్ ఏటీఎస్ విలేజ్ సొసైటీ నివాసితులపై కూడా ఈ కూల్చివేత తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. -
దివాలా తీసిన రియల్ ఎస్టేట్ డెవలపర్ సూపర్‌టెక్.. ఆ 25 వేల మంది పరిస్థితి ఏంటి?
ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ సూపర్‌టెక్ కంపెనీ దివాలా తీసినట్లు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) నేడు ప్రకటించింది. సూపర్‌టెక్ సంస్థ బకాయిలు చెల్లించడంలో విఫలం అయ్యిందంటూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యుబీఐ) దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ ఎన్సీఎల్టీ బెంచ్ ఈ తీర్పు ఇచ్చింది. హితేష్ గోయల్'ను దివాలా ప్రక్రియ పరిష్కార నిపుణుడిగా నియమించింది. ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(ఎన్‌సీఏఎల్‌టీ)లో అప్పీల్ దాఖలు చేస్తామని రియల్ ఎస్టేట్ డెవలపర్ సూపర్‌టెక్ పేర్కొంది. ఎన్సీఎల్టీ ఇచ్చిన ఆదేశాల వల్ల పలు సంవత్సరాలుగా కంపెనీలో తమ ఇళ్లను బుక్ చేసుకున్న 25 వేల మంది గృహ కొనుగోలుదారులపై ప్రభావం పడే అవకాశం ఉంది అని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ విషయంపై స్పందించిన కంపెనీ.. "అన్ని ప్రాజెక్టులు ఆర్థికంగా లాభదాయకంగా ఉన్నందున, ఏ పార్టీకి లేదా ఆర్థిక రుణదాతకు నష్టం కలిగించే అవకాశం లేదు. ఈ ఆదేశాల వల్ల మరే ఇతర సూపర్‌టెక్ గ్రూప్ కంపెనీ కార్యకలాపాలను ప్రభావితం చేయదు" అని రియల్ ఎస్టేట్ సంస్థ తెలిపింది. గత 7 ఏళ్లలో 40,000 కంటే ఎక్కువ ఫ్లాట్లను అందజేసిన గొప్ప రికార్డు మాకు ఉంది. మా 'మిషన్ కంప్లీషన్ - 2022' కింద మా కొనుగోలుదారులకు ఫ్లాట్లను ఇవ్వడం కొనసాగిస్తాము, 2022 డిసెంబర్ నాటికి 7,000 యూనిట్లను డెలివరీ చేయాలనే లక్ష్యాన్ని మేము చేపట్టాము అని సంస్థ తెలిపింది. సూపర్‌టెక్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ మోహిత్ అరోరాను ఈ విషయమై ప్రస్తావించగా.. "సూపర్‌టెక్ లిమిటెడ్‌లో దాదాపు 11-12 హౌసింగ్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి, వాటికి సంబందించి దివాలా చర్యలు ప్రారంభమయ్యాయి. వీటిలో 90 శాతం ప్రాజెక్టులు పూర్తయ్యాయి’ అని పేర్కొన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి దాదాపు రూ.150 కోట్ల రుణాలు తీసుకుంటే, సూపర్‌టెక్ లిమిటెడ్ రుణాల మొత్తం దాదాపు రూ. 1,200 కోట్లు అని ఆయన తెలిపారు. అరోరా తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ-ఎన్సీఆర్టీలో లగ్జరీ ప్రాజెక్ట్ సూపర్నోవా సహా పలు ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్న గ్రూప్‌లో మూడు, నాలుగు ఇతర కంపెనీలు ఉన్నాయి. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్(ఐబీసీ) కింద కంపెనీల దివాలా పరిష్కార ప్రక్రియపై ఎన్సీఎల్టీ అథారిటీ ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా ఎన్‌సీఏఎల్‌టీలో అప్పీల్ చేయవచ్చు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నోయిడాలోని సూపర్‌టెక్ ట్విన్ టవర్లను మే 22న కూల్చివేస్తామ నోయిడాని అధికారులు ప్రకటించారు. (చదవండి: కొత్త కారు కొనేవారికి షాక్ ఇచ్చిన బీఎండబ్ల్యూ..!) -
40 అంతస్తులు..4 టన్నుల మందు గుండు..9 సెకన్లలో ట్విన్ టవర్స్ మాయం..!
Supertech Twin Towers Demolition: నిబంధనలకు విరుద్ధంగా భవనాల నిర్మాణం చేపట్టిన సూపర్‌టెక్ లిమిటెడ్‌కి చెందిన ఎమరాల్డ్ కోర్ట్ ప్రాజెక్టు 40 అంతస్తుల ట్విన్ టవర్స్ భవనాలను మే 22 నాటికి కూల్చివేస్తామని నోయిడా అథారిటీ సుప్రీంకోర్టుకు తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ కూల్చివేత పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు అధికారులు కోర్టుకు తెలిపారు. కాగా తాజాగా కూల్చివేత పనులకు సంబంధించిన వివరాలను నోయిడా అధికారులు వెల్లడించారు. 9 సెకన్లలో మాయం..! సుమారు 4 టన్నుల మందు గుండు సహాయంతో కేవలం 9 సెకన్లలో ట్విన్ టవర్స్‌ను నేలమట్టం చేస్తామని అధికారులు పేర్కొన్నారు. కోర్టులో పేర్కొన్న విధంగా కూల్చివేత పనులు జరుగుతాయని తెలిపారు. మే 22న మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో ట్విన్ టవర్స్‌ను కూల్చివేస్తామని వెల్లడించారు. కాగా కూల్చివేత సమయంలో టవర్స్‌కు సమీపంలోని సెక్టార్-93Aలో నివసిస్తున్న సుమారు 1,500 కుటుంబాలను ఐదు గంటల పాటు వారి ఇళ్ల నుంచి తరలించనున్నట్లు అధికారులు తెలిపారు . అంతేకాకుండా సైట్‌కు దగ్గరగా ఉన్న నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేను కూడా ఒక గంట పాటు మూపివేయబడుతుందని పేర్కొన్నారు. ఎడిఫైస్ నేతృత్వంలో..! ట్విన్ టవర్స్ అపెక్స్, సెయాన్ భవనాలను ఎడిఫైస్ ఇంజినీరింగ్ సంస్థ కూల్చివేయనుంది. కూల్చివేత పనులకు సంబంధించిన వివరాలను సంస్థ ప్రతినిధులు తెలిపారు.ఈ కంపెనీ 2019లో దక్షిణాఫ్రికా జోహన్నెస్‌బర్గ్‌లో 108 మీటర్ల పొడవైన బ్యాంక్ ఆఫ్ లిస్బన్‌ను కూల్చివేసింది. కాగా కూల్చివేతకు అయ్యే ఖర్చులను పూర్తిగా మొత్తం బిల్డర్ భరించాలని కోర్టు ఆదేశించింది. కుమ్మక్కు..! ట్విన్ టవర్స్ నిర్మాణంలో అధికారులు కూడా కుమ్మకునట్లు తెలుస్తోంది. బిల్డర్‌తో కుమ్మక్కయిన నోయిడా అధికారులను ప్రాసిక్యూట్ చేయాలని కోర్టు ఆదేశించింది. బిల్డర్లు, నోయిడా అధికారుల కుమ్మక్కయిన విధానం ఈ కేసు రికార్డు చూస్తే అర్థం అవుతోందని, ప్రణాళికా విభాగం అధికారుల ఉల్లంఘన స్పష్టమవుతోందని పేర్కొంది. ఇక రెండు టవర్ల (టి–16, టి–17) ఫ్లాట్ యజమానులకు మొత్తం సొమ్ము 12 శాతం వడ్డీతోసహా తిరిగి చెల్లించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చదవండి: ట్విన్ టవర్స్ కూల్చోద్దు.. ఒక్కసారి మా మాట వినండి -
నోయిడా జంట టవర్ల కూల్చివేత అప్పుడే..!
నోయిడాలోని సూపర్‌టెక్ ఎమరాల్డ్ సంస్థకు చెందిన జంట టవర్లను మే 22 నాటికి పూర్తిగా నేలమట్టం చేయనున్నట్లు నోయిడా అథారిటీ నేడు(ఫిబ్రవరి 28) సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఇప్పటికే కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయని నోయిడా అథారిటీ తెలిపింది. ఆగస్టు 22 నాటికి శిధిలాలను కూడా తొలగిస్తారని జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సూర్య కాంత్'లతో కూడిన ధర్మాసనంకు అథారిటీ తెలియజేసింది. భాగస్వాములందరితో సమావేశం ఫిబ్రవరి 9న జరిగిందని కోర్టుకు తెలిపింది. ఈ కేసులో తదుపరి విచారణ మే 17న జరగనుంది. కూల్చివేతకు గెయిల్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్ఓసీ) అందిందని అథారిటీ సుప్రీంకోర్టుకు తెలిపింది. నోయిడాలోని సెక్టార్ 93లోని 40 అంతస్తుల జంట టవర్లను కూల్చివేయాలనే తన ఆదేశాలను పాటించనందుకు డైరెక్టర్లను జైలుకు పంపాలని హెచ్చరించింది. యూపీలోని నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భారీ జంట టవర్లను కూల్చివేయాలని ఫిబ్రవరి 7న సుప్రీంకోర్టు ఆదేశించింది. సూపర్‌టెక్ ఎమరాల్డ్ సంస్థ 40 అంతస్తులతో 2 టవర్లు నిర్మించింది. అయితే ఇవి నిబంధనలకు విరుద్ధమంటూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు జంట టవర్లను కూల్చివేయాలని ఆదేశించింది. మూడునెలల్లోపు కూల్చివేతలు పూర్తిచేయాలని.. దానికయ్యే ఖర్చునూ సూపర్‌టెక్ సంస్థ నుంచే వసూలు చేయాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు టవర్లలో దాదాపు వెయ్యి ప్లాట్లు ఉండగా.. ప్లాట్లు కొన్న వారందరికీ 12 శాతం వడ్డీతో నగదు తిరిగి చెల్లించాలని సర్వోన్నత న్యాయస్థానం గతంలోనే ఆదేశించింది. (చదవండి: మీ పాన్ కార్డుతో ఎవరైనా లోన్ తీసుకున్నారో తెలుసుకోండి ఇలా..!) -
ట్విన్ టవర్స్ కూల్చోద్దు.. ఒక్కసారి మా మాట వినండి
ట్విన్ టవర్స్ కూల్చివేత తీర్పుపై నిర్మాణ సంస్థ సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేసింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై తమకు గౌరవం ఉందని సూపర్ టెక్ చైర్మన్ ఆర్కే అరోరా అన్నారు. రేరా చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారమే ఈ భవనాలు నిర్మించామని తెలిపారు. అంతేకాదు కోర్టు తీర్పు వల్ల తమ కంపెనీపై చెడు ప్రభావం ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని నోయిడాలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి 40 అంతస్థుల ట్విన్ టవర్స్ నిర్మిచండంపై ఇటు అలహాబాద్ హైకోర్టుతో పాటు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేశాయి. మూడు నెలలల్లోగా ఈ భవనాలను కూల్చేయడంతో పాటు అందులో ప్లాట్లను కొనుగోలు చేసిన వారికి 12 శాతం వడ్డీతో డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ కోర్టు తీర్పు వెలువరించింది. ట్విట్ టవర్స్‌లో 21 దుకాణాలతో పాటు 915 ప్లాట్స్ ఉన్నాయి. చదవండి: నోయిడా ట్విన్ టవర్ల కూల్చివేత.. ‘రేరా’ ఎక్కడ విఫలమవుతోంది? -
కుమ్మక్కయ్యారు.. కూల్చేయండి: సుప్రీంకోర్టు ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: నోయిడాలో సూపర్‌టెక్ లిమిటెడ్‌కి చెందిన ఎమరాల్డ్ కోర్ట్ ప్రాజెక్టు 40 అంతస్తుల జంట భవనాలను కూల్చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2014లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కోర్టు సమర్థించింది. నిబంధనలకు విరుద్ధంగా భవనాల నిర్మాణం చేపడుతున్నారంటూ దాఖలైన పిటిషన్లను విచారించి కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. మూడు నెలల్లో కూల్చివేత పూర్తిచేయాలని, దానికయ్యే ఖర్చులు మొత్తం బిల్డర్ భరించాలని పేర్కొంది. రెండు టవర్ల (టి–16, టి–17) ఫ్లాట్ యజమానులకు మొత్తం సొమ్ము 12 శాతం వడ్డీతోసహా తిరిగి చెల్లించాలని స్పష్టం చేసింది. బిల్డర్‌తో కుమ్మక్కయిన నోయిడా అధికారులను ప్రాసిక్యూట్ చేయాలని పేర్కొంది. బిల్డర్లు, నోయిడా అధికారుల కుమ్మక్కయిన విధానం ఈ కేసు రికార్డు చూస్తే అర్థం అవుతోందని, ప్రణాళికా విభాగం అధికారుల ఉల్లంఘన స్పష్టమవుతోందని పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో... అదీ ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీల్లో అనధికార నిర్మాణాలలో విపరీతమైన పెరుగుదల, సందేహాస్పదమైన లావాదేవీలు గతంలో కోర్టు గుర్తించినట్లు తెలిపింది. బిల్డర్లు, ప్లానింగ్ అథారిటీ మధ్య ఇలాంటి కుమ్మక్కు లావాదేవీలు చిన్నస్థాయిలో జరిగేది కాదని తీర్పులో పేర్కొంది. చదవండి: మౌఖిక ఆదేశాలొద్దు: సుప్రీంకోర్టు -
అడ్వాన్సు వెనక్కిచ్చేయండి
న్యూఢిల్లీ: నోయిడాలోని రెసిడెన్షియల్ బ్లాక్‌లకు చెందిన కొనుగోలుదారులకు వడ్డీతోసహా అసలు మొత్తాన్ని రోజుల వ్యవధిలోగా చెల్లించాలంటూ సూపర్‌టెక్ బిల్డర్స్ సంస్థను సుప్రీంకోర్టు బుధవారం ఆదేశిం చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం.లోధా, జస్టిస్ కురియన్, జస్టిస్ రోహిణిల నేతృత్వం లోని ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. కాగా నిబంధనలకు లోబడి నిర్మించని కారణంగా ఈ జంట భవనాలను కూల్చివేయాలంటూ గతంలో అలహాబాద్ ఉన్నత న్యాయస్థానం ఆదేశించిన సంగతి విదితమే. ‘వాళ్లు వ్యాజ్యాలను కొనుగోలు చేయలేదు. ఫ్లాట్లను మాత్రమే కొనుగోలు చేశారు. కొనుగోలుదారులందరూ బాధపడడాన్ని చూడాల్సి రావడం బాధాకరం’ అని ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది. ఏప్రిల్ 1వ తేదీన మీరు ప్రకటించిన విధంగానే వారు మూలధనం వెనక్కి ఇచ్చేయాలని కోరుకుంటున్నారు. వాళ్లు ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి. ఎదురుచూసే పరిస్థితి లేదు. కొనుగోలుదారులు వివక్షకు గురవడాన్ని అనుమతించబోం. తమ సొమ్మును తాము వెనక్కి తీసుకునే అధికారం, హక్కు కొను గోలు దారులకు ఉంది. ఈ వివాదానికి మీరే కార కులు. ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకుని వారు ఈ మొత్తం మీకు చెల్లించారు. వ్యాజ్యాల కోసం వారు కోర్టుల చుట్టూ తిరగలేరు.’ అని పేర్కొంది. కాగా జంట భవనాల్లో ఒక్కొక్క ఫ్లాట్ ఖరీదు రూ. 65 నుంచి రూ. 90 లక్షలవరకూ ఉంది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను శిరసావహిస్తామని సూపర్‌టెక్ బిల్డర్స్ సంస్థ బుధవారం విడుదల చేసి న ఓ ప్రకటనలో పేర్కొంది. కొనుగోలుదారులకు వీలైనంత త్వరగా వారి మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించేందుకు యత్నిస్తామని తెలిపింది. ఇందులో ఎటువంటి అనుమానాలకు తావులేదని ఆ ప్రక టనలో వివరించింది.