న్యూఢిల్లీ: నోయిడాలోని రెసిడెన్షియల్ బ్లాక్‌లకు చెందిన కొనుగోలుదారులకు వడ్డీతోసహా అసలు మొత్తాన్ని రోజుల వ్యవధిలోగా చెల్లించాలంటూ సూపర్‌టెక్ బిల్డర్స్ సంస్థను సుప్రీంకోర్టు బుధవారం ఆదేశిం చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం.లోధా, జస్టిస్ కురియన్, జస్టిస్ రోహిణిల నేతృత్వం లోని ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. కాగా నిబంధనలకు లోబడి నిర్మించని కారణంగా ఈ జంట భవనాలను కూల్చివేయాలంటూ గతంలో అలహాబాద్ ఉన్నత న్యాయస్థానం ఆదేశించిన సంగతి విదితమే. ‘వాళ్లు వ్యాజ్యాలను కొనుగోలు చేయలేదు. ఫ్లాట్లను మాత్రమే కొనుగోలు చేశారు. కొనుగోలుదారులందరూ బాధపడడాన్ని చూడాల్సి రావడం బాధాకరం’ అని ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది. ఏప్రిల్ 1వ తేదీన మీరు ప్రకటించిన విధంగానే వారు మూలధనం వెనక్కి ఇచ్చేయాలని కోరుకుంటున్నారు.
వాళ్లు ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి. ఎదురుచూసే పరిస్థితి లేదు. కొనుగోలుదారులు వివక్షకు గురవడాన్ని అనుమతించబోం. తమ సొమ్మును తాము వెనక్కి తీసుకునే అధికారం, హక్కు కొను గోలు దారులకు ఉంది. ఈ వివాదానికి మీరే కార కులు. ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకుని వారు ఈ మొత్తం మీకు చెల్లించారు. వ్యాజ్యాల కోసం వారు కోర్టుల చుట్టూ తిరగలేరు.’ అని పేర్కొంది. కాగా జంట భవనాల్లో ఒక్కొక్క ఫ్లాట్ ఖరీదు రూ. 65 నుంచి రూ. 90 లక్షలవరకూ ఉంది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను శిరసావహిస్తామని సూపర్‌టెక్ బిల్డర్స్ సంస్థ బుధవారం విడుదల చేసి న ఓ ప్రకటనలో పేర్కొంది. కొనుగోలుదారులకు వీలైనంత త్వరగా వారి మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించేందుకు యత్నిస్తామని తెలిపింది. ఇందులో ఎటువంటి అనుమానాలకు తావులేదని ఆ ప్రక టనలో వివరించింది.
అడ్వాన్సు వెనక్కిచ్చేయండి
Published Wed, Jul 30 2014 10:51 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement