Supporting
-
జన్మదాతా సుఖీభవ... కనిపెంచినవారిని కడుపులో పెట్టుకుని
వృద్ధాప్యం వచ్చాక తల్లిదండ్రులు పిల్లలు అవుతారు.కాని వారి కడుపున పుట్టిన పిల్లలు వారికి పూర్తిగా తల్లిదండ్రులుగా మారడంలో ఫలమవుతున్నారు.మనల్ని కని పెంచిన వారికి తల్లిదండ్రులుగా మారాల్సిన సందర్భం వచ్చాక పూర్తి సమయం, శ్రద్ధ ఇవ్వడంలో చాలామంది విఫలం అవుతున్నారు. కాని పెద్దల సంరక్షణ గొప్ప బాధ్యత. దాని గురించి మనల్ని మనం తీర్చిదిద్దుకోవాల్సిందే.ఏం చేయాలి?చిన్నప్పుడు మనం ‘అమ్మా.. యూనిఫామ్ ఎక్కడా’ అనడిగితే వృద్ధులయ్యాక మన తల్లిదండ్రులు ‘నాన్నా.. నా కళ్లద్దాలు ఎక్కడున్నాయో చూడు’ అంటారు. చిన్నప్పుడు మనం ‘అప్పచ్చి కావాలి’ అని మారాం చేస్తే వృద్ధులయ్యాక తల్లిదండ్రులు ‘కొన్ని అరటి పండ్లు తెచ్చి పెట్టు’ అని అడుగుతారు. మనం చిన్నగా ఉన్నప్పుడు వాళ్లు బజారుకు వెళ్లి మనకు కావలసినవన్నీ తెచ్చి పెడతారు. మనం పెద్దవాళ్లయ్యాక వాళ్లకు కావలసిన వాటిని తేవడానికి ‘టైమ్ లేదంటాం’, ‘వచ్చే నెల చూద్దాం’ అంటాం... ‘ఉన్నవాటితో సర్దుకో’ అంటాం. ఎన్నో అంటాం. ఎన్నో అంటే పడాల్సిన వారా వారు? తల్లిదండ్రులు. వయసు మళ్లిన మన జన్మదాతలు.రెండు రకాల పిల్లలువృద్ధులైన తల్లిదండ్రులను చూసుకునే పిల్లలు రెండు రకాలు. తమతో ఉంచుకుని చూసుకునేవారు, వేరే ఏరియా/ ఊరు/దేశంలో ఉంటూ చూసుకునేవారు. ఈ రెండు విధాల పిల్లలకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయినా సరే తల్లిదండ్రుల విషయంలో ఆ ఇబ్బందులను స్వీకరించి ముందుకు సాగాల్సిందే.ముందు చేయాల్సిన పని తల్లిదండ్రులను చూసుకోవాల్సిన వయసుకు వారు వచ్చి, నిస్సహాయస్థితికి చేరుకున్నాక పిల్లలు చేయాల్సిన పని వారి గత తప్పులు, ΄పొరపాట్లు అన్నీ మన్నించి ఇక వీరి అంతిమక్షణాల వరకు మనదే బాధ్యత అని సంకల్పం చెప్పుకోవడం. మనం చిన్నగా ఉన్నప్పుడు వారు అది చేయకపోవచ్చు, ఇది చేయకపోవచ్చు, మన కలలను భగ్నం చేసి ఉండొచ్చు... కాని ఇప్పుడు ఆపాత బాకీలు గుర్తు చేసి పేచీ పెట్టే సమయం కాదు. ఇక వారు చిన్నపిల్లలు అయిపోయారు. వారి మీద ప్రేమ మాత్రమే చూపగలం.దూరంగా ఉండి చూసుకోవాల్సిన వారు మొదట తమలో ఆ గిల్ట్‌ను తీసేయాలి. మీ భృతి కోసమో మరో కారణం కోసమో మీరు తల్లిదండ్రులతో ఉండే వీలు లేదు. ఆల్రైట్. కాని వారిని చూసుకోవడంలో మీకు నిజాయితీ ఉంటే చాలు. మీరు నిజాయితీగా ఏ మేరకు చూసుకోగలరో ఆ మేరకు చూసుకుంటున్నారని మీ తల్లిదండ్రులకు అర్థమైతే వారు ఇక ఫిర్యాదులు ఏమీ చేయరు.బంధాలు నిలబెట్టుకోవాలిదగ్గర ఉండి చూసుకుంటున్నా దూరంగా ఉన్నా రోజూ తల్లిదండ్రులతో మాట్లాడటం తప్పనిసరి. ఈ బంధం ఏమీ మారలేదు అనే భరోసా వారికి సగం బలాన్ని ఇస్తుంది. వీడియో కాల్స్ చేయడం, రోజువారీ ఫొటోలేమైనా పంపడం, మనవలు, మనవరాళ్లతో మాట్లాడించడం, కోడలు/అల్లుడు తప్పకుండా పలకరించేలా చూడటం... ఇవన్నీ పెద్దలకు బెంగ తీరుస్తాయి.వినోదంపెద్దలకు బోర్ కొట్టకుండా మంచి ఫోన్లు ఇచ్చి అవి ఎలా ఆపరేట్ చేయాలో నేర్పిస్తే వారు కాలక్షేపం చేస్తారు. టీవీలో ఓటీటీ చానల్స్ సబ్స్క్రయిబ్ చేసి వాటిని ఎలా చూడాలో నేర్పాలి. అంతే కాదు వారు ఉంటున్న ఏరియాలో వారి వయసు వారు నడిపే వాట్సప్ గ్రూపుల్లో చేరేలా చూడటం, వారి వయసు వారు ఎక్కడైనా కలుస్తూ ఉంటే వెళ్లి వచ్చే ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం.ఆ సమస్య వద్దుఒకరి కంటే ఎక్కువ సంతానం ఉంటే ఆ సంతానం మధ్య ΄పొర΄పొచ్చాలు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఉన్నా తల్లిదండ్రుల దృష్టికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. తాము జీవించి ఉండగా తమ సంతానం కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండటం తల్లిదండ్రులకు క్షోభ. వారిని వీలైనంత సంతోషం పెట్టాలి. ముఖ్యమైన పండగలకు అందరూ కలుస్తూ ఉంటే అదే పెద్ద పెన్నిధి. పెద్దలు వారి జీవితంలో ఎన్నో మాటలు పడి ఉంటారు. ఇక పిల్లల నుంచి మాటలు పడే శక్తి ఉండదు. పెద్దలను మాటలతో బాధించ రాదు.పెద్దలు ఉండగా వారి విలువ తెలియదు. వారు లేనప్పుడు అదెంత పెద్ద లోటో తెలుస్తుంది. అందుకే వృద్ధులైన తల్లిదండ్రులకు ప్రతి సంతానం తల్లిదండ్రులుగా మారాలి. ఆ పసివాళ్లను ప్రేమగా చూసుకోవాలి.తల్లిదండ్రులతో ఉన్నవారైనా, తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చూసుకునేవారైనా తప్పనిసరిగా చేయాల్సిన పనులు⇒ వారికి హెల్త్ ఇన్సూరెన్సులు చేసి పెట్టడం ⇒ వ్యక్తిగత సహాయానికి, వైద్య సహాయానికి మనుషుల్ని ఏర్పాటు చేయడం ⇒ వారికి ఇష్టమైన వంటలు, ఆహారం తినే ఏర్పాటు చేయడం ⇒ రి ఎమర్జెన్సీ అవసరాలకు కాల్ చేయదగ్గ మనుషులున్నారని చెప్పడం⇒ ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా తగినన్ని డబ్బులు వారి ఆధీనంలో కూడా పెట్టడం⇒ ఆస్తి పత్రాలు, ఇతర డాక్యుమెంట్ల వంటివి వారి అనుమతితో సంరక్షించడం -
ప్లాన్ మార్చిన మాస్ మహారాజ్ రవితేజ
-
పీఓకేను ఖాళీ చేయండి: భారత్
ఐక్యరాజ్యసమితి: పాకిస్తాన్లో ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతారని చరిత్ర ఇప్పటికే నిరూపించిందని, ఉగ్రవాదులకు కొమ్ముకాయడం, వారికి శిక్షణ, ఆర్థిక సహకారం అందివ్వడం పాక్ విధానమని భారత్ దుయ్యబట్టింది. మంగళవారం జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో యూఎన్‌లో భారత శాశ్వత మిషన్ కౌన్సెలర్ కాజల్ భట్ మాట్లాడారు. పాకిస్తాన్ రాయబారి మునీర్ అక్రమ్ జమ్మూ కశ్మీర్‌పై చేసిన వాదనని కాజల్ తిప్పికొట్టారు. యూఎన్ వేదికల్ని ఉపయోగించుకొని కశ్మీర్‌పై అవాస్తవాలను ప్రచారం చేయడం పాక్‌కు కొత్త కాదన్నారు. కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలన్నీ భారత్‌లో అంతర్భాగమని స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా భారత్ దేశానిదేనని, చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న ప్రాంతాలన్నీ పాక్ వెంటనే ఖాళీ చేయాలని ఆమె అల్టిమేటమ్ జారీ చేశారు. పాకిస్తాన్ సహా ఇరుగుపొరుగు దేశాలతో సామరస్యంగా ఉండాలనే భారత్ కోరుకుంటుందని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపితేనే పాకిస్తాన్‌తో శాంతియుత వాతావరణంలో చర్చలు జరుగుతాయని భట్ అన్నారు. అప్పటివరకు భారత్ సీమాంతర ఉగ్రవాదంపై కఠినమైన విధానంతోనే ముందుకు వెళుతుందని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి నిషేధిత ఉగ్రవాదుల్లో అత్యధికులు పాక్‌లోనే తలదాచుకోవడాన్ని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని అన్నారు. -
వైఎస్ జగన్ పాదయాత్రకు కువైట్ వాసుల మద్దతు
-
ఎంపీల ఆమరణ దీక్ష మద్దతుగా విశాఖ వాసులు
-
ఎంపీల ఆమరణ దీక్ష మద్దతుగా అనంత వాసులు
-
ఎంపీల ఆమరణ దీక్ష మద్దతుగా శ్రీకాకుళం జిల్లా వాసులు
-
ఆ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు!
న్యూ ఢిల్లీ: ఇంతకు ముందు మార్కెట్లో మాంచి క్రేజ్ ఉన్న ఫోన్లు కొన్ని ఇప్పుడు పరిమిత సంఖ్యలో వాడుకలో ఉన్నాయి. ఇటీవల ఫేస్బుక్ ఆధీనంలోకి వెళ్లిపోయిన వాట్సప్.. ఇలాంటి కొన్ని మొబైల్‌లలో ఈ సంవత్సరాంతానికి తమ సేవలను నిలిపేయాలని భావిస్తోంది. ఈ జాబితాలో ఒకప్పటి పాపులర్ మొబైల్‌లు ఉన్నాయి. అన్ని బ్లాక్ బెర్రీ ఆపరేటింగ్ సిస్టం వర్షన్ మొబైల్లకు( బ్లాక్ బెర్రీ 10తో సహా), నోకియాకు చెందిన సింబియాన్ యస్40, సింబియాన్ యస్60 వెర్షన్లకు సేవలను నిలిపేయాలని వాట్సప్ సంస్థ నిర్ణయం తీసుకుంది. 2009లో వాట్సప్‌ను ప్రారంభించినప్పుడు ఇప్పుడున్న మొబైల్ మార్కెట్‌కు భిన్నమైన పరిస్థితులు అప్పుడు ఉన్నాయి. మార్కెట్లోని 70 శాతం ఫోన్లకు బ్లాక్ బెర్రీ, నోకియా సంస్థలే ఆపరేటింగ్ సిస్టంను సమకూర్చేవి. ఇప్పుడు మాత్రం యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు ఆపరేటింగ్ సిస్టంలు అందిస్తున్న మొబైల్‌లు 99 శాతం మార్కెట్‌ను ఆక్రమించాయి. ఈ నేపథ్యంలో ఎక్కువమంది వినియోగదారులు ఉపయోగించే మొబైల్ ఫోన్లకు అనుకూలంగా తమ మెసేజింగ్ యాప్ పనిచేసేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాట్సప్ సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. -
సహాయ చర్యలకు సర్వం సిద్ధం
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ :జిల్లాకు పొంచి ఉన్న ‘పై-లీన్’ పెను తుపాను ముప్పును ఎదుర్కొని సహాయ చర్య లు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసిందని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ చెప్పారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తుపాను ప్రభావం వల్ల గంటకు 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందన్నారు. సముద్ర తీరంలో ఇప్పటికే 3 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుతో కెరటాలు వస్తున్నాయన్నారు. పెనుగాలుల ధాటికి చెట్లు, టెలిఫోన్, విద్యుత్ స్తంభాలు, ఇళ్లు కూలిపోయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరిం చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందవచ్చని తెలిపారు. మండల కేంద్రాల్లో కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చే యటంతోపాటు సహాయ చర్యలు చేపట్టేందుకు ప్రత్యేకాధికారులను నియమించామని చెప్పారు. అత్యంత ప్రమా దం ఉన్న 49 తీరప్రాంత గ్రామాలను ఖాళీ చేయించి ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలించామన్నారు. మొత్తం 47 వేల మందిని తరలించాల్సి ఉండగా ఇప్పటివరకు 12,500 మందిని 37 పునరావాసకేంద్రాలకు తరలించామని చెప్పారు. అయితే కొంతమంది ఇళ్లు విడిచి రావడానికి ఇష్టపడడం లేదన్నారు. పిల్లలు, వృద్దులు, మహిళలను ప్రత్యేక వాహనాల్లో తీసుకువెళుతున్నారని తెలిపారు. తుపాను వల్ల 2.60 లక్షల మంది ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. జాతీయ విపత్తు రక్షణ దళాలను ఇచ్ఛాపురం, సోంపేట, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి మండలాల్లో ఉంచామన్నారు. ఆర్మీ, నేవీ, కోస్టుగార్డు అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని వెల్లడించారు. సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, ఆర్మడ్ రిజర్వ పోలీస్ బృందాలు జిల్లాలో ఉన్నాయని తెలిపారు. సకాలంలో అవగాహన కల్పించడం వల్ల మత్స్యకారులు రెండు రోజులుగా వేటకు వెళ్లలేదని, దీనివల్ల ప్రాణనష్టం నివారించగలిగామన్నారు. ప్రతి మండల కేంద్రంలోనూ జనరేటర్తోపాటు 3 రోజులకు సరిపడా బియ్యం, నూనె, చింతపండు, పప్పు ఇతర నిత్యావసర సామగ్రిని నిల్వ చేశామన్నారు. అవసరమైన మేరకు పోలీసు వైర్లెస్ సెట్లను ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. జిల్లాకు ప్రత్యేకాధికారిగా గతంలో కలెక్టర్‌గా పనిచేసిన వెంకట్రామిరెడ్డి వచ్చారని తెలిపారు. తుపాను సమాచారం లైజనింగ్ అధికారిగా డీఆర్ఓ నూర్‌బాషాఖాసీం వ్యవహరిస్తారని, పునరావాస కేంద్రాలకు సామగ్రి పంపిణీని ఏజేసీ రాజ్‌కుమార్ సమన్వయం చేస్తారని తెలిపారు. టెక్కలి డివిజన్‌పై ప్రత్యేక శ్రద్ధ తుపాను ప్రభావం టెక్కలి డివిజన్‌పై ఎక్కువగా ఉండవచ్చని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారని, దీంతో ఈ డివిజన్‌ను జిల్లా అధికారుల పర్యవేక్షణలో ఉంచామని కలెక్టర్ వివరించారు. డివిజన్లోని ఆరు మండలాల్లో పెట్రోల్, గ్యాస్, డీజిల్, నీరు, పాలు, మోటారు వాహనాలు, ఇతర సామగ్రిని అధికంగా అందుబాటులో ఉంచామని, ప్రత్యేక అంబులెన్సలు సిద్ధం చేశామని వెల్లడించారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై రాకపోకలను నిలిపివేయాలని ఆదేశించామన్నారు. వైద్య సేవలందించేందుకు 52 మంది డాక్టర్లు, 120 మంది స్టాఫ్ నర్సులు, మరికొంతమంది సిబ్బంది, రెడ్‌క్రాస్ సహాయకులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలను నియోగించామని చెప్పారు. వ్యాపార, విద్యా సంస్థలు మూసివేయాలి తుపాను కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలున్నందున శనివారం, అవసరమైతే ఆది వారం వ్యాపార, వాణిజ్య సంస్థలు, పాఠశాల లు, కళాశాలలు, సినిమాహాళ్లు, దుకాణాలను మూసివేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ నవీన్‌గులాఠీ మాట్లాడుతూ విపత్తును ఎదుర్కొనేందుకు పోలీస్ యంత్రాం గం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే ఆర్మడ్ పోలీస్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, స్పెషల్ పోలీ సుల సహాయం తీసుకుంటున్నామని చెప్పారు. టెక్కలి డివిజన్లో ప్రతి సహాయ బృందానికి ఒక సీఐని కేటాయించి బాధ్యతలు అప్పగించామన్నారు. సమావేశంలో కమాం డెంట్ విశ్వప్రశాంత్, ఏజేసీ ఆర్.ఎస్.రాజకుమార్, డీఆర్ఓ నూర్‌బాషా ఖాసీం పాల్గొన్నారు. -
జగన్‌కు మద్దతుగా కడపలో దీక్షలు