suraksha home
-
జేపీ ఇన్ఫ్రాటెక్ : ఆ 20వేలమందికి త్వరలోనే ఫ్లాట్లు?!
న్యూఢిల్లీ: రుణ ఊబిలో చిక్కుకుని దివాలా చర్యలకు లోనైన జేపీ ఇన్ఫ్రాటెక్ కొనుగోలుకి సురక్షా గ్రూప్‌నకు లైన్ క్లియరైంది. రుణదాతలు, గృహ కొనుగోలుదారుల నుంచి సురక్షా బిడ్‌కు అనుమతి లభించింది. దీంతో ఫ్లాట్లను కొనుగోలు చేసినా సొంతం చేసుకునేందుకు వీలులేక ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారికి ఉపశమనం లభించనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో జేపీ ఇన్ఫ్రా వివిధ హౌసింగ్ ప్రాజెక్టులను చేపట్టింది. వీటికి సంబంధించి 20,000 మందికిపైగా గృహ కొనుగోలుదారులు ఫ్లాట్ల కోసం వేచిచూస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 10 రోజులుగా.. జేపీ ఇన్ఫ్రా టేకోవర్‌కు అటు పీఎస్‌యూ దిగ్గజం ఎన్బీసీసీ, ఇటు సురక్షా గ్రూప్ వేసిన బిడ్స్‌పై 10 రోజులపాటు వోటింగ్ ప్రాసెస్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సురక్షా గ్రూప్ బిడ్‌కు 98.66 శాతం మద్దతు లభించినట్లు తాజాగా రిజల్యూషన్ అధికారి అనుజ్ జైన్ వెల్లడించారు. ఎన్బీసీసీకి 98.54 శాతం వోట్లు లభించినట్లు తెలియజేశారు. వెరసి అతిస్వల్ప మార్జిన్‌తో సురక్షా గ్రూప్ ముందంజ వేసినట్లు వివరించారు. చదవండి : ఇండియన్ బ్యాంక్ షేర్ల అమ్మకం,రూ.4వేల కోట్లు సమీకరణే లక్ష్యం -
ఎవరి బాబో..
తుప్పల్లో కనిపించిన పసికందు వెలికితీసి సురక్షా హోమ్‌కు తరలించిన స్థానికులు ఏ తల్లి కన్నబిడ్డో.. పాపం ఎందుకు భారమైందో.. ఓ పసికందు తుప్పలపాలైంది. హృదయవిదారకమైన ఈ సంఘటన శుక్రవారం రాత్రి రావులపాలెంలో వెలుగులోకి వచ్చింది. – రావులపాలెం గ్రామంలోని ఇందిరా కాలనీ సమీపంలో ఎంప్లాయీస్ కాలనీలో చుట్టూ రేకులతో కాంపౌంyŠ నిర్మించి ఉన్న ఖాళీ స్థలం నుంచి శుక్రవారం రాత్రి ఓ పసికందు ఏడుపు వినిపించింది. దీంతో స్థానికులు వెతుకులాట ప్రారంభించారు. దీంతో తుప్పలతో నిండిన ఉన్న ఆ ఖాళీ స్థలంలో ఒక మూల సంచిలో కట్టి పడవేసిన మగ శిశువు కనిపించాడు. కాలనీకి చెందిన చింతల లక్ష్మణ్ అనే యువకుడు ఆ శిశువును వెలికితీశాడు. ఈ విషయాన్ని అదే ప్రాంతానికి చెందిన జెడ్పీ ప్రతిపక్షనేత సాకా ప్రసన్నకుమార్‌కు స్థానికులు తెలిపారు. ఆయన సూచన మేరకు శిశువును సమీపంలో డాన్‌బాస్కో సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న సురక్షా హోమ్‌కు తరలించారు. పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఎస్సై పీవీ త్రినాథ్, ఏఎస్సై ఆర్వీ రెడ్డి హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తుప్పల్లో దొరికిన ఆ బాలుడిని పరిశీలించారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం స్థానికంగా గల పిల్లల ఆస్పత్రికి తరలించారు. ఈ చిన్నారిని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొందరు పిల్లలు లేనివారు ఆ బిడ్డను తాము పెంచుకుంటామని కోరారు. అయితే శిశువును ఐసీడీఎస్ అధికారులకు అప్పగిస్తామని సురక్షా హోమ్ నిర్వహకులు తెలిపారు. దీనిపై ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎం.నిహారిక మాట్లాడుతూ ఆ శిశువును తాము స్వాధీనం చేసుకున్నామని రాత్రికి ప్లిలల ఆస్పత్రిలో ఉంచి శనివారం కాకినాడ శిశు గృహకు తరలిస్తామని చెప్పారు. బాలుడి తరఫు వారు వస్తే విచారించి అప్పగిస్తామని లేని యడల శిశుగృహా సంరక్షణలో ఉంచుతామని చెప్పారు. అసలు ఈ బిడ్డ ఎవరిది అన్నది స్థానికంగా చర్చినీయాంశమైంది.