- తుప్పల్లో కనిపించిన పసికందు
- వెలికితీసి సురక్షా హోమ్‌కు
- తరలించిన స్థానికులు
ఎవరి బాబో..
Published Fri, Aug 19 2016 11:59 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM
ఏ తల్లి కన్నబిడ్డో.. పాపం ఎందుకు భారమైందో.. ఓ పసికందు తుప్పలపాలైంది. హృదయవిదారకమైన ఈ సంఘటన శుక్రవారం రాత్రి రావులపాలెంలో వెలుగులోకి వచ్చింది.
– రావులపాలెం
గ్రామంలోని ఇందిరా కాలనీ సమీపంలో ఎంప్లాయీస్ కాలనీలో చుట్టూ రేకులతో కాంపౌంyŠ నిర్మించి ఉన్న ఖాళీ స్థలం నుంచి శుక్రవారం రాత్రి ఓ పసికందు ఏడుపు వినిపించింది. దీంతో స్థానికులు వెతుకులాట ప్రారంభించారు. దీంతో తుప్పలతో నిండిన ఉన్న ఆ ఖాళీ స్థలంలో ఒక మూల సంచిలో కట్టి పడవేసిన మగ శిశువు కనిపించాడు. కాలనీకి చెందిన చింతల లక్ష్మణ్ అనే యువకుడు ఆ శిశువును వెలికితీశాడు. ఈ విషయాన్ని అదే ప్రాంతానికి చెందిన జెడ్పీ ప్రతిపక్షనేత సాకా ప్రసన్నకుమార్‌కు స్థానికులు తెలిపారు. ఆయన సూచన మేరకు శిశువును సమీపంలో డాన్‌బాస్కో సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న సురక్షా హోమ్‌కు తరలించారు. పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఎస్సై పీవీ త్రినాథ్, ఏఎస్సై ఆర్‌వీ రెడ్డి హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తుప్పల్లో దొరికిన ఆ బాలుడిని పరిశీలించారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం స్థానికంగా గల పిల్లల ఆస్పత్రికి తరలించారు. ఈ చిన్నారిని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొందరు పిల్లలు లేనివారు ఆ బిడ్డను తాము పెంచుకుంటామని కోరారు. అయితే శిశువును ఐసీడీఎస్ అధికారులకు అప్పగిస్తామని సురక్షా హోమ్ నిర్వహకులు తెలిపారు. దీనిపై ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఎం.నిహారిక మాట్లాడుతూ ఆ శిశువును తాము స్వాధీనం చేసుకున్నామని రాత్రికి ప్లిలల ఆస్పత్రిలో ఉంచి శనివారం కాకినాడ శిశు గృహకు తరలిస్తామని చెప్పారు. బాలుడి తరఫు వారు వస్తే విచారించి అప్పగిస్తామని లేని యడల శిశుగృహా సంరక్షణలో ఉంచుతామని చెప్పారు. అసలు ఈ బిడ్డ ఎవరిది అన్నది స్థానికంగా చర్చినీయాంశమైంది.
Advertisement