Suresh setkar
-
కిష్టారెడ్డి కుమారుడికే ‘ఖేడ్’ టికెట్
మెదక్ జిల్లా నేతలతో దిగ్విజయ్ ♦ షెట్కార్‌కు ప్రచార బాధ్యతలు ♦ ఈనెల 29న నారాయణఖేడ్‌లో భారీ సభ సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా నారాయణఖేడ్ శాసనసభ ఉప ఎన్నికలో దివంగత మాజీ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి కుటుంబానికే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఉప ఎన్నికపై చర్చించడానికి ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ టీపీసీసీ, మెదక్ జిల్లా ముఖ్యనేతలతో గాంధీభవన్‌లో మంగళవారం సమావేశమయ్యారు. టీపీసీసీ ముఖ్యనేతలు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహా, జె.గీతారెడ్డి, వి.సునీతా లక్ష్మారెడ్డి, టి.జగ్గారెడ్డి, సురేశ్ షెట్కార్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ ఉప ఎన్నికలో కిష్టారెడ్డి తనయుడు సంజీవరెడ్డి పార్టీ అభ్యర్థిగా ఉంటారని ఈ సమావేశంలో దిగ్విజయ్ ప్రకటించారు. అదే నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత సురేశ్ షెట్కార్ ఈ ఎన్నికల్లో ప్రచారం, గెలుపు బాధ్యతను భుజాన వేసుకోవాలని సూచించారు. గతంలో కిష్టారెడ్డి, షెట్కార్ ఐక్యంగా పనిచేసినట్టుగానే భవిష్యత్తులోనూ కలిసి పనిచేయాలని దిగ్విజయ్ కోరారు. పార్టీ నేతలంతా ఐక్యంగా ఉంటే వరంగల్ లోక్‌సభ, నారాయణఖేడ్ శాసనసభ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించడం పెద్దవిషయమేమీ కాదని చెప్పారు. ఈ నెల 29న సమావేశం ఈ నెల 29న నారాయణఖేడ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు దిగ్విజయ్‌సింగ్ ప్రకటించారు. పార్టీ కార్యకర్తలను, నేతలను ఉప ఎన్నికకోసం సమాయత్తం చేయడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సభకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో గతంలో ఉన్న సంప్రదాయం ప్రకారం నారాయణఖేడ్ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ఉందన్నారు. దీనికి అన్ని పార్టీలు సహకరిస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. అన్ని పార్టీలతో చర్చించడానికి టీపీసీసీ చొరవ తీసుకుంటుందన్నారు. అయితే నారాయణఖేడ్‌లోనే రాష్ట్ర బడ్జెట్‌ను అంతా కేటాయిస్తూ ప్రభుత్వం జీవోలను ఇస్తోందని ఆరోపించారు. ఇలాంటి నిర్ణయాలతో టీఆర్ఎస్ తీరు అనుమానాలను కలిగిస్తోందన్నారు. కిష్టారెడ్డి కుటుంబానికి దిగ్విజయ్ పరామర్శ నారాయణఖేడ్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నారాయణఖేడ్ ఎమ్మెల్యే దివంగత కిష్టారెడ్డి భార్య గాళమ్మను మంగళవారం పరామర్శించారు. హైదరాబాద్‌లోని సంజీవరెడ్డినగర్‌లోని నివాసానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ కిష్టారెడ్డి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ గొప్ప నాయకుడిని కోల్పోయిందన్నారు. గాళమ్మతో పాటు, కుమారుడు సంజీవరెడ్డిని వివరాలడిగి తెలుసుకున్నారు. వీరి వెంట డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి ఉన్నారు. పీసీసీ కార్యవర్గం ఏదీ? 15 రోజుల్లో మొత్తం కమిటీలకు దిగ్విజయ్ హామీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు మినహా ఆరునెలల నుంచి పూర్తిస్థాయి కార్యవర్గం లేదని పలువురు నేతలు ఏఐసీసీ ప్రధానకార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌కు మొరపెట్టుకున్నారు. టీపీసీసీకి పూర్తిస్థాయి కార్యవర్గం లేకపోవడంతో పనివిభజన లేదని, కేవలం ఇద్దరు నాయకులే పార్టీ పనిని ఎలా చేయగలరని ఆయనను ప్రశ్నించారు. దీనికి స్పందించిన దిగ్విజయ్ 15 రోజుల్లో గ్రామ స్థాయి నుంచి టీపీసీసీ దాకా అన్ని కమిటీలను పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ముందుగా గ్రామ, మండల, బ్లాక్, జిల్లా పార్టీలకు పూర్తిస్థాయి కమిటీలను వెంటనే నియమించాలని టీపీసీసీ అధ్యక్ష, కార్యనిర్వాహక అధ్యక్షులు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్కను ఆదేశించారు. టీపీసీసీ కార్యవర్గానికి సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే తమకు అందించాలని సూచించారు. -
లోక్‌సభ పోరులోనూ గులాబీ హోరు
సాక్షి, సంగారెడ్డి: లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయదుందిభి మోగించింది. మెదక్, జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. మెదక్ నుంచి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 3,97,029 ఓట్ల మెజారిటీతో గెలుపొంది కొత్త చరిత్ర సృష్టించారు. కేసీఆర్ 6,57,492 ఓట్లు సాధించగా.. కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ పి. శ్రవణ్ కుమార్ రెడ్డికి 2,60,463 ఓట్లు, టీడీపీ బలపర్చిన బీజేపీ అభ్యర్థి చాగండ్ల నరేంద్రనాథ్‌కు 1,81,804 ఓట్లు పోలయ్యాయి. 1980 ఎన్నికల్లో ఇందిరా గాంధీని మెదక్ లోక్‌సభ నియోజకవర్గ ఓటర్లు 2.19 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలిపించారు. ఇప్పటి వరకు ఇదే రికార్డు కాగా.. తాజాగా కేసీఆర్ ఇంతకు మించి భారీ మెజారిటీ సాధించి ఇందిరా పేరిట ఉన్న రికార్డును తిరగరాశారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 11,93,548 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోగా .. కేసీఆర్‌కు 55.08 శాతం ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి శ్రవణ్ రెడ్డికి 21.82, బీజేపీ అభ్యర్థి నరేంద్రనాథ్‌కు 15.23 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇదిలా ఉండగా.. మెదక్ లోక్‌సభ స్థానానికి రాబోయే ఆరు నెలల్లో మళ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. మెదక్ జిల్లా గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆయన మెదక్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేయాల్సి రానుంది. జహీరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ 1,44,631 ఓట్ల మెజారిటీతో సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్‌పై గెలుపొందారు. బీబీ పాటిల్‌కు 5,08,661 ఓట్లు పోలు కాగా సురేష్ షెట్కార్ 3,64,030 ఓట్లు, బీజేపీ బలపరిచిన టీడీపీ అభ్యర్థి మదన్ మోహన్ రావు 1,57,497 ఓట్లు సాధించారు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో సిద్దిపేట లోక్‌సభ స్థానం రద్దు అయి జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం ఆవిర్భవించిన విషయం తెలిసిందే. మొత్తం 10,97,242 ఓట్లు పోలుగా టీఆర్ఎస్కు 46.35 శాతం, కాంగ్రెస్‌కు 33.13 శాతం, టీడీపీకి 14.35 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి. 2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన సురేష్ షెట్కార్ నాటి టీఆర్ఎస్ అభ్యర్థి సయ్యద్ యూసుఫ్‌పై 17,407 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తాజా ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ 1.44 లక్షల ఓట్ల మెజారిటీ సాధించి కొత్త రికార్డును సృష్టించారు. -
షెట్కారే టార్గెట్
కాంగ్రెస్‌లో అసంతృప్తులు,రెబెల్స్ బెడత అసెంబ్లీ అభ్యర్థులపైనా ప్రభావం పార్టీ మారిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే దిష్టిబొమ్మల దహనంతో ఇదివరకే నిరసనలు సట్ల కేటాయింపుపై పా చల్లారని రగడ జహీరాబాద్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్‌కు తిరుగుబాటుదారులు, అసంతృప్తుల బెడద తప్పేలా కనిపించడం లేదు. షెట్కార్ ప్రమేయంతోనే అసెంబ్లీ టికెట్లు కోల్పాయామని నమ్ముతున్న పలువు రు సీనియర్ నేతలు ఆయనను టార్గెట్‌గా చేసుకున్నారు. జుక్కల్‌లో అరుణతార రెబల్‌గా రంగంలో ఉండగా, ఎల్లారెడ్డిలో పార్టీ మారిన మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌గౌడ్ కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. వీరిని చల్లబర్చేందుకు దిగ్విజయ్ సింగ్ మంతనాలు జరిపినా ఫలితం లేకుండాపోయింది. నిజామాబాద్ : కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులు, తిరుగుబాటు అభ్యర్థులు జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేశ్ కుమార్ షెట్కార్‌ను టార్గెట్ చేసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ టికెట్ల కేటాయింపులో ఇంకా చల్లారడం లేదు. రెబల్స్‌ను బుజ్జగించేందుకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. టికెట్ల ఖరారులో కీలకంగా వ్యవహరించిన ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ తమ లక్ష్యమంటూ అసంతృప్తులు, రెబల్స్ బాహాటంగానే ప్రకటిస్తూ, వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులకూ సంకటంగా మారుతోంది. మంతనాలు జరిపినా నామినేషన్ల ఉపసంహరణ వరకు అసంతృప్తివాదులు, రెబల్స్‌ను బుజ్జగించేందుకు దిగ్విజయ్‌సింగ్ ఢిల్లీ నుంచి చేసిన ఫోన్ మంతనాలు బెడి సికొట్టాయి. మాజీ మంత్రి నేరెళ్ల అంజనేయులు, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్ పార్టీ ప్రాథమిక సభ్వత్యం, పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చిన విషయం విదితమే. అనంతరం నేరెళ్ల బీజేపీలో చేరగా, జనార్దన్ గౌడ్ టీఆర్ఎస్లో చేరారు. వారు సురేశ్ షట్కార్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ టికెట్‌ను నల్లమడుగు సురేందర్‌కు ఇవ్వడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, ఎన్డీసీసీబీ డైరక్టర్ సంపత్, ఏఎంసీ చైర్మన్ క్రిష్ణగౌడ్తోపాటు పలువురు స ర్పంచ్‌లు, మాజీ సర్పంచులు పార్టీని వీడటం, వారు సైతం షెట్కా రే టార్గెట్‌గా పని చేస్తుండటం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారిం ది. కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిం చిన రోజే జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడలలో షెట్కార్ దిష్టిబొమ్మలను కాంగ్రెస్ కార్యకర్తలు దహనం చేశారు. రెబల్ అభ్యర్థిగా అరుణతార జుక్కల్‌లో అరుణతారకు నచ్చజెప్పడం అధిష్టానానికి సాధ్యం కావడం లేదు. పార్టీ బహిష్కృత నేత గంగారాంకు టికెట్ ఇవ్వడం కోసం ఎంపీ సురేశ్ షెట్కార్, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ తమ సర్వశక్తులు ఒడ్డారన్న ప్రచారాన్ని అసమ్మతివాదులు నమ్ముతున్నారు. ఈ నెల 12న షెట్కార్తో పాటు జుక్కల్‌లో షబ్బీర్ అలీ దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు. అవకాశం కోసం ఇన్నాళ్లుగా ఎదురుచూసిన కాంగ్రెస్‌లోని ఆశావహులకు పార్టీ టికెట్ చేజారడంతో రెబల్స్‌గా బరిలోకి దిగారు. వారి అసమ్మతి కాంగ్రెస్ అభ్యర్థులకు నష్టం చేసే పరిస్థితి ఉండగా, ప్రత్యర్థులకు కలిసివస్తోంది. అరుణతారను బుజ్జగించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె ససేమిరా అనడం కాంగ్రెస్‌కు సంకటంగా మారింది. ఎంపీ సురేశ్ షెట్కార్ నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది.