షెట్కారే టార్గెట్
కాంగ్రెస్‌లో అసంతృప్తులు,రెబెల్స్ బెడత
అసెంబ్లీ అభ్యర్థులపైనా ప్రభావం
పార్టీ మారిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే
దిష్టిబొమ్మల దహనంతో ఇదివరకే నిరసనలు
సట్ల కేటాయింపుపై పా చల్లారని రగడ
జహీరాబాద్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్‌కు తిరుగుబాటుదారులు, అసంతృప్తుల బెడద తప్పేలా కనిపించడం లేదు. షెట్కార్ ప్రమేయంతోనే అసెంబ్లీ టికెట్‌లు కోల్పాయామని నమ్ముతున్న పలువు రు సీనియర్ నేతలు ఆయనను టార్గెట్‌గా చేసుకున్నారు. జుక్కల్‌లో అరుణతార రెబల్‌గా రంగంలో ఉండగా, ఎల్లారెడ్డిలో పార్టీ మారిన మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌గౌడ్ కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. వీరిని చల్లబర్చేందుకు దిగ్విజయ్ సింగ్ మంతనాలు జరిపినా ఫలితం లేకుండాపోయింది.
నిజామాబాద్ : కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులు, తిరుగుబాటు అభ్యర్థులు జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేశ్ కుమార్ షెట్కార్‌ను టార్గెట్ చేసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ టికెట్ల కేటాయింపులో ఇంకా చల్లారడం లేదు. రెబల్స్‌ను బుజ్జగించేందుకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. టికెట్ల ఖరారులో కీలకంగా వ్యవహరించిన ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ తమ లక్ష్యమంటూ అసంతృప్తులు, రెబల్స్ బాహాటంగానే ప్రకటిస్తూ, వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులకూ సంకటంగా మారుతోంది.
మంతనాలు జరిపినా
నామినేషన్ల ఉపసంహరణ వరకు అసంతృప్తివాదులు, రెబల్స్‌ను బుజ్జగించేందుకు దిగ్విజయ్‌సింగ్ ఢిల్లీ నుంచి చేసిన ఫోన్ మంతనాలు బెడి సికొట్టాయి. మాజీ మంత్రి నేరెళ్ల అంజనేయులు, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్ పార్టీ ప్రాథమిక సభ్వత్యం, పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చిన విషయం విదితమే. అనంతరం నేరెళ్ల బీజేపీలో చేరగా, జనార్దన్ గౌడ్ టీఆర్‌ఎస్‌లో చేరారు. వారు సురేశ్ షట్కార్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ టికెట్‌ను నల్లమడుగు సురేందర్‌కు ఇవ్వడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, ఎన్‌డీసీసీబీ డైరక్టర్ సంపత్, ఏఎంసీ చైర్మన్ క్రిష్ణగౌడ్‌తోపాటు పలువురు స ర్పంచ్‌లు, మాజీ సర్పంచులు పార్టీని వీడటం, వారు సైతం షెట్కా రే టార్గెట్‌గా పని చేస్తుండటం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారిం ది. కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిం చిన రోజే జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడలలో షెట్కార్ దిష్టిబొమ్మలను కాంగ్రెస్ కార్యకర్తలు దహనం చేశారు.
రెబల్ అభ్యర్థిగా అరుణతార
జుక్కల్‌లో అరుణతారకు నచ్చజెప్పడం అధిష్టానానికి సాధ్యం కావడం లేదు. పార్టీ బహిష్కృత నేత గంగారాంకు టికెట్ ఇవ్వడం కోసం ఎంపీ సురేశ్ షెట్కార్, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ తమ సర్వశక్తులు ఒడ్డారన్న ప్రచారాన్ని అసమ్మతివాదులు నమ్ముతున్నారు. ఈ నెల 12న షెట్కార్‌తో పాటు జుక్కల్‌లో షబ్బీర్ అలీ దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు. అవకాశం కోసం ఇన్నాళ్లుగా ఎదురుచూసిన కాంగ్రెస్‌లోని ఆశావహులకు పార్టీ టికెట్ చేజారడంతో రెబల్స్‌గా బరిలోకి దిగారు. వారి అసమ్మతి కాంగ్రెస్ అభ్యర్థులకు నష్టం చేసే పరిస్థితి ఉండగా, ప్రత్యర్థులకు కలిసివస్తోంది. అరుణతారను బుజ్జగించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె ససేమిరా అనడం కాంగ్రెస్‌కు సంకటంగా మారింది. ఎంపీ సురేశ్ షెట్కార్ నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది.