సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : శాసనమండలిలో కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ ఎవరో తేలే సమయమొచ్చింది. మంగళవారం ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు సమావేశమై ఈ విషయాన్ని తేల్చేయనున్నారు. ఈ ప్రక్రియ నిర్వహించేందుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నారు. ఈనెల ఎనిమిదో తేదీనుంచి శాసనసభ, తొమ్మిదో తేదీనుంచి శాసనమండలి స మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష, శాసనమండలి నేతల ఎన్నుకునేందుకు ఆ పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ సోమవారం మధ్యాహ్నమే రాష్ట్ర రా జధానికి చేరుకున్నారు.
ఈ పదవులకోసం పలువురు నేతలు పోటీపడుతున్నారు. జిల్లానుంచి ఆ పార్టీ నేతలెవరూ శాసనసభ్యులుగా ఎన్నిక కాలేదు. దీంతో శా సనసభా పక్ష నేత పదవి రేసులో జిల్లానేతలు ఎవరూ లేరు. అయితే జిల్లాకు చెందిన పీసీసీ మాజీ అధ్యక్షు డు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్), మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మరో నేత రాజేశ్వర్ శాసనమండలిలో సభ్యులు గా ఉన్నారు. ఇందులో ప్రధానంగా డీఎస్, షబ్బీర్ అలీలు శాసనమండలిలో ఫ్లోర్ లీడర్ పదవికోసం పోటీ పడుతున్నారు. వీరిలో ఒకరికి ఈ పదవి దక్కే అవకాశాలున్నాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. డీఎస్ ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేశారు.
దేశ రాజధానిలో రెండు రోజులపాటు మకాం వేసి పార్టీ పెద్దలను కలిశారు. పార్టీ రాష్ట్ర వ్య వహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో నూ భేటీ అయ్యారు. మరోవైపు షబ్బీర్ అలీ కూడా ఈ పదవికోసం ప్రయత్నా లు చేసినట్లు తెలుస్తోంది. టీపీసీసీకి చెం దిన పలువురు ముఖ్యనేతలతో కలిసి అ ధిష్టానంతో మాట్లాడారని, శాసనమండ లి నేతగా అవకాశం కల్పించాలని కోరార ని సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ శా సనమండలి నేతగా డీఎస్‌ను ఎంపికవుతారా? లేక షబ్బీర్‌కు అవకాశం లభిస్తుందా? లేదా వేరే నేతను పదవి వరి స్తుందా అన్నది మంగళవారం తేలే అవకాశముంది.
‘పెద్దల’ సభలో ఫ్లోర్‌లీడర్ ఎవరో?
Published Tue, Jun 3 2014 2:22 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement