sureshbabu
-
టీడీపీ కార్యాలయంలో లైంగిక దాడి నిందితుడు
పట్నం బజారు (గుంటూరు), పెదకాకాని: ఓ దళిత యువతిని పెళ్లి పేరుతో మోసగించి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ నేత పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పార్టీ కార్యాలయంలోకి చొరబడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై శుక్రవారం గుంటూరులో టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. కానిస్టేబుళ్లను నిర్బంధించే యత్నం చేశారు. సీఐ స్థాయి అధికారి వారిస్తున్నా వినకుండా బరి తెగించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా పెదకాకాని సీఐ సురేష్‌బాబు కథనం ప్రకారం గుంటూరు స్వర్ణభారతీనగర్‌లో నివాసం ఉంటున్న టీడీపీ నేత చల్లా లక్ష్మీనారాయణ కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామానికి చెందిన ఓ దళిత యువతిని పెళ్లి పేరుతో వంచించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు నాగార్జున వర్సిటీలో చదివిన సమయంలో అక్కడ కాంట్రాక్టర్‌గా పని చేసిన లక్ష్మీనారాయణ పరిచయం పెంచుకుని శారీరకంగా లొంగదీసుకున్నాడు. అప్పటికే అతడికి వివాహం అయిందని తెలియడంతో నిలదీసిన బాధితురాలిని నగ్న వీడియోలు, ఫోటోలు చూపించి బెదిరించి పలుమార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అనంతరం పెళ్లి చేసుకున్న బాధితురాలి భర్తను కూడా బెదిరించి వారి కాపురాన్ని విచ్ఛిన్నం చేశాడు. తన కుమార్తె జీవితం అన్యాయమైందనే బాధతో బాధితురాలి తండ్రి ఈ ఏడాది ఆగస్టులో గుండెపోటుతో మరణించాడు. దీంతో నిందితుడు లక్ష్మీనారాయణపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. టీడీపీ కార్యాలయంలో నక్కిన నిందితుడు: సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడి లైవ్ లొకేషన్‌ను గుర్తించిన కానిస్టేబుళ్లు ఇర్ఫాన్, మణిప్రసాద్ అతడి కారును వెంబడిస్తూ గుంటూరు అరండల్‌పేటలోని టీడీపీ జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులను గుర్తించిన టీడీపీ నేతలు, కార్యకర్తలు పార్టీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ సమక్షంలోనే దాడికి యత్నించారు. తాము పోలీసులమని చెబుతున్నా వినకుండా దాడికి పాల్పడ్డారు. అనంతరం సీఐ సురేష్‌బాబు అక్కడకు చేరుకోవడంతో నిందితుడు చల్లా లక్ష్మీనారాయణ ఇక్కడ లేడంటూ బుకాయించారు. అయితే లక్ష్మీనారాయణను టీడీపీ కార్యాలయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మెల్లగా జారుకున్నారు. -
రానా తమ్ముడిని హీరోగా పెట్టి సినిమా తీయడానికి కారణం ఏంటిఅంటే..
-
పోచంపల్లిలో హీరో నాగచైతన్య సందడి
సాక్షి, భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లిలో ఆదివారం హీరో నాగచైతన్య సందడి చేశారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సురేశ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ‘వెంకీమామ’ సినిమా షూటింగ్ రెండో రోజు జరిగింది. ఈ సందర్భంగా స్కూల్ తరగతి గదిలో హీరో నాగచైతన్య, హీరోయిన్లు రాశీఖన్నా, పాయల్ రాజ్‌పూత్, జబర్దస్త్ కామెడీ నటుడు హైపర్ ఆదిపై పలు టాకీ పార్ట్ సన్నివేశాలను చిత్రీకరించారు. స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న పాయల్ రాజ్‌పూత్ విద్యార్థులకు చదువు చెబుతుండగా క్లాస్‌రూమ్‌లో హీరో నాగచైతన్య, హైపర్ ఆది సరదాగా గడిపే సన్నివేశాలను దర్శకుడు కేఎస్ రవీంద్ర(బాబీ) చిత్రీకరించాడు. ఈ సినిమాలో ప్రముఖ హీరో వెంకటేశ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. నిర్మాతలు సురేశ్‌బాబు, విశ్వప్రసాద్, వివేక్, కెమెరామన్ ప్రసాద్ మురెళ్ల, సంగీతం తమన్, ప్రొడక్షన్ మేనేజర్ నాగు తదితరులు పాల్గొన్నారు. కాగా హీరో నాగచైతన్యను చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో షూటింగ్ లోకేషన్ వద్ద సందడి నెలకొంది. అనంతరం నాగచైతన్య ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో గ్రూప్ ఫొటో దిగారు. అలాగే హైపర్‌ఆదితో పలువురు అభిమానులు పోటీపడి సెల్ఫీలు దిగారు. -
‘గండికోటకు చుక్కనీరు ఎందుకివ్వడం లేదు’
సాక్షి, కడప : వైఎస్ఆర్ జిల్లాలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయని వైఎస్సార్సీపీ నేతలు రవీంద్రనాథ్ రెడ్డి, సురేష్ బాబులు అన్నారు. రాష్ట్రంలోనే అత్యంత తక్కువ వర్షపాతం కడపలో ఉందని పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చినా, నాగార్జున సాగర్‌కు కూడా నీరు విడుదల చేస్తున్నారన్నారు. అయినా గండికోటకు ఎందుకు చుక్కనీరు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కడప జిల్లాకు చుక్క నీరు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వమని రవీంద్రనాథ్ రెడ్డి, సురేష్ బాబులు మండిపడ్డారు. ప్రభుత్వం తాత్సారం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. వరద సమయం పూర్తి అవ్వక ముందే గండికోటకు 10 వేల కూసెక్కులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బ్రహ్మంసాగర్‌కు సరిపడా నీళ్లు విడుదల చేయాలన్నారు. ఆగస్ట్ 30లోపు కేంద్రం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు ఉలుకూ పలుకూ లేకుండా చంద్రబాబు ఉన్నారని ధ్వజమెత్తారు. -
శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు
తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని గురువారం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, నిర్మాత సురేశ్ బాబు, సినీనటులు నితిన్, మేఘా ఆకాష్, కార్తీ తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ప్రముఖులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. అనంతరం రంగనాయకుల మండలం వద్ద శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించారు. -
ఆర్‌ఐఓగా సురేష్‌బాబు
అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ ప్రాంతీయ తనిఖీ అధికారి (ఆర్ఐఓ)గా కేఎస్ఆర్ ప్రభుత్వ బాలికల కళాశాల ప్రిన్సిపల్ బి. సురేష్‌బాబును నియమించారు. గురువారం ఆయన బాధ్యతలు చేపట్టారు. కొన్నేళ్లుగా రెగ్యులర్ ఆర్ఐఓ లేరు. సీనియర్ ప్రిన్సిపాళ్లకు ఎఫ్ఐఏ బాధ్యతలు అప్పగిస్తున్నారు. నిబంధనల ప్రకారం మూడేళ్లకు మించి కొనసాగించరాదు. ప్రస్తుత ఆర్ఐఓ వెంకటేశులు 2013 జూన్ 28 నుంచి కొనసాగుతున్నారు. దాదాపు నాలుగేళ్లవుతోంది. ఈ క్రమంలో ఆయనను తప్పించి సురేష్‌బాబను నియమించారు. వైఎస్సార్ కడప జిల్లా జమ్ములమడుగుకు చెందిన సురేష్‌బాబు ఏపీపీఎస్సీ ద్వారా 1984లో ఇంగ్లిషు అధ్యాపకుడిగా ఉద్యోగం సాధించారు. జిల్లాలో తనకల్లు, కదిరి, అనంతపురం, రామగిరిలో పని చేశారు. 2005లో ప్రిన్సిపల్‌గా పదోన్నతి పొంది వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్లకు వెళ్లారు. అక్కడి నుంచి శింగనమల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వచ్చారు. గతేడాది కేఎస్ఆర్ ప్రభుత్వ బాలికల కళాశాలకు బదిలీపై వచ్చారు. ఇంటర్ విద్య బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. -
షూటింగ్‌కు అనువుగా ‘అనంత’
–నిర్మాత దగ్గుబాటి సురేష్ –అనంతలో సినిమా చిత్రీకరణ సందడి అనంతపురం కల్చరల్ : సురేష్ ప్రొడక్షన్స్‌పై రానా హీరోగా నటిస్తున్న చిత్ర షూటింగ్ బుధవారం అనంతలో సందడి చేసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్థానిక ఆర్ట్స్ కళాశాలలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. హీరో రానాతో పాటు చిత్రంలో నటిస్తున్న నటీనటులు తనికెళ్ల భరణి, శివాజీరాజా, నవదీప్, అన్నపూర్ణమ్మ, చిత్రం శీనూ తదితరులు పాల్గొన్న సన్నివేశాలను దర్శకులు తేజ నేతృత్వంలో చిత్రీకరించారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ విలేకర్లతో మాట్లాడుతూ అనంత వాసుల ఆదరణ బాగుందని, ఇక్కడి అందమైన లోకేషన్స్ షూటింగ్స్‌కు అనువుగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. రానా హిందీ, తెలుగు భాషల్లో నటించిన ‘ఘాజీ’ చిత్రం ఫిబ్రవరి 17న విడుదల అవుతోందన్నారు. అలాగే బాహుబలి చిత్రం కూడా ఏప్రిల్ నెలలో విడుదలవుతుందన్నారు. తాజాగా రానా, కాజల్ హీరో హీరోయిన్లగా నటిస్తున్న చిత్రం షూటింగ్ జరుగుతోందని దీనికి ఇంకా పేరు నిర్ణయించలేదన్నారు. ఈనెల 13 వరకు జిల్లా పరిసరాలతో పాటు కర్నూలు, యాగంటి క్షేత్రంలో షూటింగ్ సాగుతుందన్నారు. పొలిటికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విద్యార్థులతో నిరాహార దీక్ష చేసే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నామన్నారు. చివరి రోజు ప్రభుత్వ హాస్పిటల్లో జరిగే చిత్రీకరణతో జిల్లాలో షూటింగ్ ముగుస్తుందన్నారు. అంతకు ముందు పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులతో కళాశాల పరిసరాలు కిటకిటలాడాయి. -
ఆర్టీసీ ఉనికిని ప్రమాదంలో పడేసిన ప్రభుత్వం
కడప కార్పొరేషన్: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ ఉనికి ప్రమాదంలో పడిందని వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రీజనల్ గౌరవాధ్యక్షుడు, నగర మేయర్ కె. సురేష్‌బాబు విమర్శించారు. ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండు నుంచి రీజనల్ మేనేజర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఆర్ఎం కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా సురేష్‌బాబు మాట్లాడుతూ ఆర్టీసీని ప్రై వేటీకరణ చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. ఎంపీలు కేశినేని, జేసీ దివాకర్‌రెడ్డి బస్సుల వల్లే అక్రమ రవాణా పెరిగిపోతోందన్నారు. చంద్రబాబు గత తొమ్మిదేళ్ల ప్రభుత్వంలో ఆర్టీసీని నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. ఇప్పుడు కూడా రాష్ట్రంలో అలాంటి పరిస్థితే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులు అన్ని యూనియన్లను సమానంగా చూడకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులకు ఉజ్వల భవిష్యత్ జగన్ వల్లే సాధ్యం– ఎమ్మెల్యే ఆర్టీసీ మనుగడ, కార్మికుల ఉజ్వల భవిష్యత్ వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్లే సాధ్యమని కడప డివిజన్ గౌరవాధ్యక్షుడు, శాసనసభ్యుడు ఎస్బి అంజద్‌బాషా తెలిపారు. 2004 నాటికి నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి జవసత్వాలు నింపింది వైఎస్ రాజశేఖర్‌రెడ్డేనని గుర్తు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారానే కార్మికులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఆ యూనియన్లకు సమ్మెనోటీసు ఇచ్చే ధైర్యం కూడా లేదు– రాజారెడ్డి ఆర్టీసీలో ప్రధాన యూనియన్లుగా చెప్పుకొనే రెండు యూనియన్లు కార్మికుల సమస్యల పరిష్కారంలో ఘోరంగా విఫలమయ్యాయని, వాటికి సమ్మెనోటీసు ఇచ్చే ధైర్యం కూడా లేదని వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ. రాజారెడ్డి విమర్శించారు. ఆర్టీసీ రూ.3000 కోట్ల నష్టంతో, రూ.400 కోట్లు వడ్డీలు చెల్లిస్తూ కొనసాగుతోందన్నారు. ప్రతినెలా ఆర్టీసీకి రూ.2కోట్ల నష్టం వాటిల్లుతున్నా ప్రభుత్వం ఒక్కపైసా చెల్లించడం లేదన్నారు. అక్రమ రవాణా వల్ల ఆర్టీసీకి రూ.1500 కోట్ల నష్టం వస్తోందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రెండు సంతకాలతో ఆర్టీసీకి ప్రతిఏటా రూ.500కోట్ల లబ్ధి కలిగేలా చేశారని, ప్రస్తుత ప్రభుత్వం కార్మికులకు డీఏ అరియర్స్ కూడా చెల్లించడం లేదని ధ్వజమెత్తారు. అనంతరం వారు ఆర్టీసీ ఆర్ఎంకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ఎస్ ప్రసాద్, రీజనల్ ప్రెసిడెంట్ గోపాల్‌రెడ్డి, కార్యదర్శి ఫకద్దీన్, రీజనల్ గౌరవ ఉపాధ్యక్షులు పులి సునీల్, చిరంజీవిరెడ్డి, రెడ్డిబాషా, కడప డిపో కార్యదర్శి జయరాం తదితరులు పాల్గొన్నారు. -
సురేశ్‌బాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్
విజయవాడ: రెండు కేసుల విషయంలో విజయవాడ నగర ఎస్సై సురేశ్ బాబుకు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కేసులకు సాక్ష్యం చెప్పేందుకు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాకినాడ కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. రెండు క్రిమినల్ కేసుల్లో మూడు వాయిదాలకు సాక్ష్యం చెప్పేందుకు రావాల్సిందిగా కాకినాడ మొబైల్ కోర్టు ఆదేశించింది. అయితే, వాటిని బేఖాతరు చేస్తూ ఎస్సై హాజరుకాకపోవడంతో నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేసింది. -
పల్లె ఖజానాఖాళీ
ఇందూరు, న్యూస్‌లైన్: పల్లెసీమల అభివృద్ధికి మూలమైన గ్రామ పంచాయతీలకు ఆర్థిక వనరులను సమకూర్చడంలో పంచాయతీ అధికారులు విఫలమవుతున్నారు. పంచాయతీలలో సకాలంలో పన్నులను వసూలు చేయడంలో గ్రామ కార్యదర్శులు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు. జిల్లాలోని 718 గ్రామ పంచాయతీల ఆదాయాలను లెక్కించిన ప్రభుత్వం 2013-14 సంవత్సరానికి గాను రూ. 47.24 కోట్లు పన్నుల రూపంలో వసూలు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆగస్టులోగా 60 శాతం పన్నుల వసూళ్లు పూర్తికావాల ని సూచించింది. అయితే, అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడంతో లక్ష్యం నీరుగారిపోయింది, గ్రామ కార్యదర్శులు సైతం పన్నుల వసూలును తీవ్రంగా పరిగణించడం లేదు. దీంతో ఇప్పటి వరకు రూ. 9.23 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ఇంకా రూ.38.01 కోట్లు వసూలు కావాల్సి ఉంది. జిల్లాలోని 74 మేజర్ గ్రామ పంచాయతీలలోనూ పన్నులను 30 శాతం మాత్రమే వసూలు చేశారు. ఇంటి పన్ను, నల్లా బిల్లులు, మార్కెట్ సెస్సు, లెసైన్సు ఫీజు, సెల్‌టవర్ స్థలాల అద్దెలను సిబ్బంది నెలనెలా కచ్చితంగా వసూలుచేయాలి. కానీ, ఎక్కడా ఇది సక్రమంగా సాగడం లేదు. దీంతో పంచాయతీలకు నిధులు సమకూరక ప్రజలకు సౌకర్యాలు అందడం లేదని అంటున్నారు. మరోవైపు పంచాయతీ కార్యదర్శుల కొరత సైతం పన్నుల వసూళ్లకు ఆటంకంగా మారింది. జిల్లాలో 718 పంచాయతీలు ఉంటే 200 మంది కార్యదర్శులు మాత్రమే పని చేస్తున్నారు. నోటీసులు జారీ గ్రామాలలో పన్నుల వసూళ్లు కుంటుపడడంతో అధికారులు స్పందించారు. బకాయి పడిన రూ.38.01 కోట్ల పన్నులను రాబట్టేందుకు చర్యలు చేపట్టారు. బకాయిలు చెల్లించని వారికి డిమాండ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌బాబు గ్రామ కార్యదర్శులను ఆదేశించారు. దీంతో కార్యదర్శులు పన్ను బకాయి దారులకు నోటీసులు జారీ చేయడం మొదలు పెట్టారు. గడువులోగా బకాయిలును చెల్లించకుంటే చట్టపరమైన తీసుకుంటామని హెచ్చరికలు చేస్తున్నారు. రాష్ట్ర అధికారులు కూడా జిల్లాలో పన్నుల వసూలు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రేక్షక పాత్ర గ్రామ పంచాయతీ కార్యదర్శులు డీఎల్పీఓలు, ఈఓపీఆర్డీల ఆధీనంలో పని చేస్తారు. వీరు కార్యదర్శులకు పన్ను వసూళ్ల విషయంలో ఏనాడు సమావేశాలు నిర్వ హించి మార్గదర్శకాలు జారీ చేసిన సందర్భాలు లేవని సంబంధితలే వర్గాలు పేర్కొంటున్నాయి. చర్యలు తీసుకుంటున్నాం.. -సురేశ్‌బాబు, జిల్లా పంచాయతీ అధికారి జిల్లాలో బకాయి పడిన పన్నులను రాబట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. లక్ష్యం మేరకు 38.01 కోట్లు వసూలు చేయాలని జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులను ఆదే శించాం. పన్నులు కట్టని వారికి నోటీసులు ఇవ్వాలని సూచించాం.