ఆర్‌ఐఓగా సురేష్‌బాబు | sureshbabu appoints rio | Sakshi
Sakshi News home page

ఆర్‌ఐఓగా సురేష్‌బాబు

Published Thu, Jun 15 2017 11:49 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

sureshbabu appoints rio

అనంతపురం ఎడ్యుకేషన్‌ : ఇంటర్మీడియట్‌ ప్రాంతీయ తనిఖీ అధికారి (ఆర్‌ఐఓ)గా కేఎస్‌ఆర్‌ ప్రభుత్వ బాలికల కళాశాల ప్రిన్సిపల్‌ బి. సురేష్‌బాబును నియమించారు. గురువారం ఆయన బాధ్యతలు చేపట్టారు. కొన్నేళ్లుగా రెగ్యులర్‌ ఆర్‌ఐఓ లేరు. సీనియర్‌ ప్రిన్సిపాళ్లకు ఎఫ్‌ఐఏ బాధ్యతలు అప్పగిస్తున్నారు. నిబంధనల ప్రకారం మూడేళ్లకు మించి కొనసాగించరాదు.  ప్రస్తుత ఆర్‌ఐఓ వెంకటేశులు 2013 జూన్‌ 28 నుంచి కొనసాగుతున్నారు. దాదాపు నాలుగేళ్లవుతోంది.

ఈ క్రమంలో ఆయనను తప్పించి సురేష్‌బాబను నియమించారు. వైఎస్సార్‌ కడప జిల్లా జమ్ములమడుగుకు చెందిన సురేష్‌బాబు ఏపీపీఎస్సీ ద్వారా 1984లో ఇంగ్లిషు అధ్యాపకుడిగా ఉద్యోగం సాధించారు. జిల్లాలో తనకల్లు, కదిరి, అనంతపురం, రామగిరిలో పని చేశారు. 2005లో ప్రిన్సిపల్‌గా పదోన్నతి పొంది వైఎస్సార్‌ కడప జిల్లా పోరుమామిళ్లకు వెళ్లారు. అక్కడి నుంచి శింగనమల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు వచ్చారు. గతేడాది కేఎస్‌ఆర్‌ ప్రభుత్వ బాలికల కళాశాలకు బదిలీపై వచ్చారు. ఇంటర్‌ విద్య బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement