షూటింగ్‌కు అనువుగా ‘అనంత’ | cinema shooting in anantapur | Sakshi
Sakshi News home page

షూటింగ్‌కు అనువుగా ‘అనంత’

Published Wed, Jan 4 2017 11:03 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

షూటింగ్‌కు అనువుగా ‘అనంత’ - Sakshi

షూటింగ్‌కు అనువుగా ‘అనంత’

–నిర్మాత దగ్గుబాటి సురేష్‌
–అనంతలో సినిమా చిత్రీకరణ సందడి


అనంతపురం కల్చరల్‌ : సురేష్‌ ప్రొడక్షన్స్‌పై రానా హీరోగా నటిస్తున్న చిత్ర షూటింగ్‌ బుధవారం అనంతలో సందడి చేసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్థానిక ఆర్ట్స్‌ కళాశాలలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. హీరో రానాతో పాటు  చిత్రంలో నటిస్తున్న నటీనటులు తనికెళ్ల భరణి, శివాజీరాజా, నవదీప్, అన్నపూర్ణమ్మ, చిత్రం శీనూ తదితరులు పాల్గొన్న సన్నివేశాలను దర్శకులు తేజ నేతృత్వంలో చిత్రీకరించారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్‌ విలేకర్లతో మాట్లాడుతూ అనంత వాసుల ఆదరణ బాగుందని, ఇక్కడి అందమైన లోకేషన్స్‌ షూటింగ్స్‌కు అనువుగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. రానా హిందీ, తెలుగు భాషల్లో  నటించిన ‘ఘాజీ’ చిత్రం ఫిబ్రవరి 17న విడుదల అవుతోందన్నారు.

అలాగే  బాహుబలి చిత్రం కూడా ఏప్రిల్‌ నెలలో విడుదలవుతుందన్నారు. తాజాగా రానా, కాజల్‌ హీరో హీరోయిన్లగా నటిస్తున్న చిత్రం షూటింగ్‌ జరుగుతోందని దీనికి  ఇంకా పేరు నిర్ణయించలేదన్నారు. ఈనెల 13 వరకు జిల్లా పరిసరాలతో పాటు కర్నూలు, యాగంటి క్షేత్రంలో షూటింగ్‌ సాగుతుందన్నారు. పొలిటికల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విద్యార్థులతో నిరాహార దీక్ష చేసే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నామన్నారు. చివరి రోజు ప్రభుత్వ హాస్పిటల్లో జరిగే చిత్రీకరణతో జిల్లాలో షూటింగ్‌ ముగుస్తుందన్నారు. అంతకు ముందు పెద్ద  ఎత్తున తరలి వచ్చిన అభిమానులతో కళాశాల పరిసరాలు కిటకిటలాడాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement