survey works
-
మంత్రి హరీశ్‌రావు భావోద్వేగం: ఈ జన్మకిది చాలు..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం తగ్గినా ప్రభుత్వం రైతు సంక్షేమ పథకాలను ఎలాంటి ఆటంకం లేకుండా అమలు చేస్తోందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రైతుబంధు వానాకాలం సీజన్‌కు సంబంధించి రూ.7,500 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు రూ.6,012 కోట్లను 57.67 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. సంగారెడ్డి జిల్లాలో 1.65 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో నిర్మించతలపెట్టిన బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మనూరు మండలం బోరంచ గ్రామం వద్ద ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు. బసవేశ్వర ఎత్తిపోతల పథకం నిర్మాణం పనులు త్వరగా పూర్తయ్యేలా బోరంచ నల్లపోచమ్మ దీవించాలని అంటూ, నిర్మాణం పూర్తయితే అమ్మవారికి ముక్కుపుడక చేయిస్తానని మొక్కుకున్నారు. ఈ జన్మకిది చాలు.. బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనుల ప్రారంభ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావుకు ఓ మహిళ తారసపడింది. ఆమెను గుర్తుపట్టిన మంత్రి.. ‘చిమ్నీబాయి కైసే హో’ అని ఆప్యాయంగా పలకరించారు. ఆమె కూడా ‘కాలుబాబా తల్లి ఆశీర్వాదంతో మీరు చల్లగా ఉండాలి’ అని బదులిచ్చారు. కాగా, కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి మధ్యలో ఆమె ప్రస్తావన తెచ్చారు. ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగిందని తెలియగానే కంగ్టి మండలానికి చెందిన చిమ్నీబాయి ఫోన్‌చేసి తన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారని అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ జన్మకు ఇది చాలనుకున్నానని వ్యాఖ్యానించారు. -
వాటర్ గ్రిడ్ కు సవాళ్లు..!
⇒ జిల్లాలో ఎత్తయిన కొండలు, గుట్టలు ⇒ కడెం గ్రిడ్‌కు త్వరలో టెండర్లు ⇒ మిగితా మూడింటికి కొనసాగుతున్న సర్వే పనులు ⇒ పనుల పరిశీలనకు నేడు మంత్రి కేటీఆర్ రాక సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఎత్తయిన కొండలు.. గుట్టలు.. అడవి.. చెట్టు.. పుట్టలు.. భౌగోళికంగా విభిన్న పరిస్థితులున్న ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పనులకు ప్రధాన సవాల్‌గా మారనుంది. సముద్ర మట్టానికి ఎత్తయిన ప్రదేశాల్లో ఉన్న ఆవాసాలకు ఈ గ్రిడ్ల పైప్లైన్ల నిర్మాణం, వాటి నిర్వహణకు అనేక అడ్డంకులు అధిగమించాల్సి రానుందని ఆర్డబ్ల్యూఎస్ వర్గాలు భావిస్తున్నాయి.ఎత్తయిన ప్రదేశాలకు నీటిని తరలించడానికి సర్జ్ ట్రీట్మెంట్, జీరో వెలాసిటీ వాల్స్ వంటి నిర్మాణం అవసరమని అధికారులు గుర్తించారు. జిల్లాలో వాటర్ గ్రిడ్‌కు అవసరమైన నీటి వనరుల లభ్యత ఉన్నా, ఆ నీటిని జిల్లా ప్రజల చెంతకు చేర్చడానికి ఏ జిల్లాలో లేనివిధంగా అడ్డంకులు ఎదురవుతాయని గ్రామీణ నీటి సరఫరా శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. నార్నూర్, సిర్పూర్(యూ), తిర్యాణి, కెరమెరి, ఇంద్రవెల్లి, బోథ్, ఆదిలాబాద్ తదితర మండలాల పరిధిలో సుమారు వందకు పైగా ఆవాసాలకు ఈ గ్రిడ్ ద్వారా అసలు తాగునీటిని సరఫరా చేయడానికి వీలు లేని పరిస్థితి ఉంది.వీటి కోసం ప్రత్యేక నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందని ఆర్డబ్ల్యూఎస్ శాఖ భావిస్తోంది. జిల్లాలో కొనసాగుతున్న ఈ వాటర్ గ్రిడ్ పనులను పరిశీలించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం జిల్లాలో పర్యటిస్తున్నారు. పూర్తయిన కడెం గ్రిడ్ సర్వే పనులు.. ఖానాపూర్ నియోజకవర్గానికి తాగునీటిని సరఫరా చేసేందుకు మొదటి విడతలో కడెం గ్రిడ్ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పనుల సర్వే ఇప్పటికే పూర్తి కాగా, రూ.370 కోట్లతో అంచనాలను సిద్ధం చేశారు. త్వరలోనే టెండర్లు నిర్వహిస్తామని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పేర్కొంటున్నారు. మిగిలిన మూడు.. ఎస్సారెస్పీ, కొమురంభీమ్, ఎల్లంపల్లి గ్రిడ్ల సర్వే పనులకు ఇటీవలే శ్రీకారం చుట్టారు. ఈ మూడు గ్రిడ్ల సర్వే కోసం టెండర్లు పిలిస్తే ఏ ఒక్క ఏజెన్సీ కూడా ముందుకు రాలేదు. దీంతో అధికారులు నాలుగు ఏజెన్సీలను ఎంపిక చేసి నామినేషన్ పద్ధతిలోనే సర్వే పనులు అప్పగించారు. 26 బృందాలు ఈ సర్వే పనుల్లో నిమగ్నమయ్యాయి. ఈ నెలాఖరులోగా పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. ఇదీ వాటర్‌గ్రిడ్‌ల లక్ష్యం.. రానున్న మూడున్నరేళ్ల తర్వాత తాగునీటి కోసం ఏ ఒక్క మహిళా కూడా బిందెతో రోడ్డుపై రావద్దనే లక్ష్యంతో ప్రభుత్వం వాటర్‌గ్రిడ్‌ను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్కరికి వంద లీటర్లు, పట్టణ ప్రాంతల్లో 135 లీటర్ల చొప్పున స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలో సుమారు రూ.3,940 కోట్లతో నాలుగు గ్రిడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. మరో రూ.150 కోట్లతో ముథోల్ నియోజకవర్గానికి తాగునీటిని అందించేందుకు గడ్డెన్నవాగు గ్రిడ్‌ను కూడా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మంత్రి పర్యటన ఇలా.. కరీంనగర్ జిల్లా పర్యటనను ముగించుకుని హెలిక్యాప్టర్‌లో ఉదయం 11 గంటలకు చెన్నూరు మండలంలోని ఎల్ మడుగుకు చేరుకుంటారు. అక్కడ నిర్మించనున్న ఇన్‌టెక్ వెల్ పనుల ప్రదేశాన్ని పరిశీలిస్తారు. అక్కడి నుంచి ఆసిఫాబాద్‌కు చేరకుంటారు. గ్రిడ్ పనుల్లో భాగంగా కొమురం భీమ్ ప్రాజెక్టు వద్ద నిర్మించనున్న ఇన్‌టెక్ వెల్ ప్రదేశాన్ని సందర్శిస్తారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అక్కడ ఏర్పాటు చేయనున్న సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి చేరుకుని కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. ఈ సమీక్షలో కేటీఆర్‌తోపాటు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, జిల్లా మంత్రులు జోగురామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొంటారు. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో అధికార వర్గాల్లో హడావుడి నెలకొంది. చెన్నూరు మండలం సోమన్‌పల్లి, ఆసిఫాబాద్ వద్ద హెలిప్యాడ్లను నిర్మించారు. -
మాస్టర్‌ప్లాన్ అమలుకు శ్రీకారం
నగరంలో రోడ్లు విస్తరణకు సర్వే నెల్లూరు(నవాబుపేట): మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా నెల్లూరులో ప్రధాన రహదారుల విస్తరణకు కార్పొరేషన్ సన్నద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన సర్వే పనులను మంగళవారం నుంచి ప్రారంభించారు. నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ నుంచి బోసుబొమ్మ, ట్రంకురోడ్డు మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు 100 అడుగుల రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్ నుంచి కేవీఆర్, కరెంట్ ఆఫీస్, వేదాయపాళెం మీదుగా అయ్యప్పగుడి వరకు 150 అడుగులు రోడ్డు, అయ్యప్పగుడి నుంచి బీవీనగర్ మీదుగా మినీబైపాస్‌రోడ్డు వరకు 200 అడుగులు మేర రోడ్లు విస్తరణ చేపట్టనున్నారు. సుమారు 16 కిలోమీటర్లు మేరకు రోడ్లు విస్తరణ జరగనుంది. పెరుగుతున్న జనభా, వాహనాల రాకపోకలకు అసౌకర్యం కలగకుండా మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదనలు రూపొందించారు. చాలా కాలంగా దీని అమలుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి బాధ్యతలు చేపట్టిన తరుణంలో ఈ ప్రతిపాదనలకు దుమ్ముదులిపారు. సర్వే పనులు ప్రారంభించడం ద్వారా విస్తరణ పనులకు తొలి అడుగు పడినట్టయింది. 1978లో నగరానికి సంబంధించి అప్పటి మున్సిపల్ అధికారులు మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించారు. నగర అభివృద్ధిని పరిగణనలోకి తీసుకుంటూ ప్రతి పదేళ్లకోసారి మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది. అయితే ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈ క్రమంలో ఎట్టకేలకు 2013లో మాస్టర్‌ప్లాన్‌కు మెరుగులు దిద్దారు. ప్రస్తుతం దాని అమలుకు కార్యాచరణలోకి దిగారు. ఇందుకోసం ఆరుగురు సభ్యులతో కూడిన ఒక బృందాన్ని కార్పొరేషన్ నియమించింది. ఈ బృందంలో ఇద్దరు సర్వేయర్లు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్, టౌన్ సర్వేయర్, సిటీ సర్వేయర్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. అయ్యప్పగుడి సమీపం నుంచి రోడ్డు విస్తరణకు సంబంధించిన సర్వేకు శ్రీకారం చుట్టారు. రెండు వారల్లో ఈ సర్వే పూర్తి కావచ్చని భావిస్తున్నారు. ఇదంతా ఒక కొలిక్కి వచ్చిన తరువాత ఏయే ప్రాంతాల్లో ఎంతెంత భూ సేకరణ అవసరమవుతుందనేది కూడా తెలుస్తుంది. ఆ మేరకు తదుపరి కార్యాచరణ చేపట్టాల్సి ఉంటుంది. ట్రాఫిక్ కష్టాల నుంచి ఊరట మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా రోడ్డు విస్తరణ జరిగనట్లయితే నెల్లూరు నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. నగరంలోని గాంధీబొమ్మ కూడలి, అంబేద్కర్ సర్కిల్, మద్రాసు బస్టాండు, ఆర్టీసీ, కేవీఆర్ పెట్రోలు బంకు, వేదాయపాళెం, ముత్తుకూరు గేటు సెంటర్, తదితర ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే ఇదంతా ఒక రోజులో జరిగే పని కానప్పటికీ ఎట్టకేలకు సర్వే ప్రారంభించడంతో కొంతైనా కదలిక వచ్చిందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.