Surya bhagavan
-
సూర్య భగవానుడికి ప్రీతికరమైన ఆదివార వ్రతం
మాఘమాసంలో ఆదివారం వ్రతం ప్రత్యక్ష భగవానుడు శ్రీ సూర్యనారాయణ మూర్తి. అతనికి ప్రీతికరమైనది ఆదివార వ్రతము. ఈ వ్రతం ఏ ఆదివారమైన చేయవచ్చు. అయితే మాఘమాసంలో అన్ని ఆది వార లైనా వీలుకాక పోతే ఒక ఆది వారమైనా చేయపచ్చు. సూర్యభగవానుడు ఆనంతమైన కిరణాలు కలవాడు. జగత్తుకు వెలుగు ప్రసాదించేవాడు జ్యోతి స్వరూపుడు. దినరాత్రాలు ఏర్పరిచినవాడు. ఆయురారోగ్యాలు ప్రదాయించేవాడు. శుభాలను కలిగించేవాడు.ముల్లోకాలకు చూడామణి.దినమునకు మణి వంటివాడు. అతని పేరు మీద ఏర్పడిన రోజు ఆదివారం. మాఘమాసంలో ఈ ఆదివార వ్రతం చేయడం శుభప్రదం.ఈ వ్రతం వల్ల అనంతమైన లాభాలు కలుగుతాయి. ఇందుకు సంబంధించిన ఒక పురాణ కథ ఉంది.పూర్వం ఉజ్జయినీ నగరంలో ఒక అవ్వ ఉండేది.ఆమెకు ఎవరూ లేరు. దైవభక్తి పరురాలు. తెల్లవారు ఝామునే లేచి ఆవు పేడతో నీళ్లు జల్లి బియ్యపు పిండితో ముగ్గులు వేసేది. స్నానం చేసి శుచిగా దేవుని పూజించేది. అంతవరకు మంచినీళ్ళు కూడా ముట్టేది కాదు. అవ్వ వద్ద ఆవు లేనందున పొరు గింటివారి నుంచి గోమయం తెచ్చుకునేది. అవ్వ ఏ రోగాలు లేకుండా ఆరోగ్యం గాను సంతోషంగాను ఉండడం చూసి పోరుగామె ఈర్ష్య పడేది. నా ఆవు పేడవల్లనే కదా ఆ అవ్వ ఇల్లు అలుకుతున్నాది.సుఖంగాఉంది నేను పేడ ఇవ్వకపోతే అవ్వకు సుఖసంతోషాలు వుండవు అనుకొని పేడ ఇవ్వలేదు. ఇల్లు అలకని కారణంగా అవ్వ ఆ రోజు తిండి తినలేదు.కాకతాళీయంగా ఆ రోజు మాఘపాదివారం.నీరసంగా దినమంతా పస్తు ఉండి నిద్ర పోలేక పోయింది.రాత్రల్లా ఒకే ఆలోచన.రేపు పేడ దొరక్కపోతే ఉపవాసం ఉండాలి.అనుకుంది.కరుణామయుడైన దేవుడు ఈ చిన్నపాటి కోరిక తీర్చడా అనుకుంది. కోడి కూతతో పక్క మీద నుంచి దిగి వీధి గుమ్మం వద్దకు వచ్చింది.ఆమె ఆనందానికి హద్దులు లేవు.గుమ్మం ముందు ధవళ వర్ణం తో మెరిసి పోతున్న ఆవు అక్కడ ఉంది. అవ్వను చూడగానే పేడ వేసింది.అప్పుడే భాస్కరుడి కిరణాలు నేల మీద పడుతు న్నాయి. గోవుకి దండం పెట్టి గోమయంతో ఇల్లంతా అలికి సంతోషంగా నిత్యకర్మలు పూర్తి చేసింది.ఆవు అక్కడ నుంచి కదల్లేదు తను వండుకున్నదే ఆవుకు ముందు పెట్టి తరువాత తను తింది.రాత్రైనా ఆవు కదల లేదు. దేవుడే తన కిచ్చాడని అనుకోని ఇంట్లో కట్టింది. రోజూ ఆవుకు మేత పెడుతోంది పొరుగింటామె ఈ ఆవు అవ్వకు ఎవరిచ్చా రు. బహుశా దొంగలించిందని కక్షతో గ్రామాధికారికి ఫిర్యాదు చేసింది.గ్రామాధికారి మనుషులు వచ్చి నువ్వు దొంగవు అని నేరం మోపి అవును తోలుకెళ్ళి పోయారు.ఆ రాత్రి ఆమె దేవుడిని తలచుకుంటేనే గడిపింది. అదే రాత్రి సూర్యభగవానుడు గ్రామాధికారికి కలలో కన్పించి ఆ అవ్వ దొంగ కాదు. ఆవునునేనే ఇచ్చాను. తెల్ల వారక మునుపే ఆవును తిరిగి ఆమె ఇచ్చి పరిహారంగా పది రూక లియ్యిఅన్నాడు. కోడి కూతతో లేచి ఈ రోజు అయినా పోరుగామె పేడ ఇస్తుందా లేదా అన్న శంకతో వీధిలోనికివచ్చింది.గ్రామాధికారి మనిషి ఆవును అవ్వ అప్పగించి "అవ్వా! ఈ ఆవు నీదే. నష్ట పరిహారంగా మా యజమాని పదిరూకలిచ్చాడు తీసుకో " అన్నాడు అది మాఘమాసం.ఆదివారం ఆనాటి నుంచి ఆ గ్రామవాసులు ఆదివారం వ్రతం చేయడం మొదలెట్టారు. అన్ని పూజలు వ్రతాలలాగే మాఘపాదివారం నాడు సూర్యోదయానికి ముందు లేచి తలస్నానం చేసి సూర్య భగవానుడి ప్రతిమనుంచి కలశం పెట్టి సూర్యభాగవానుడి షోడషోపచారపూజ చేయాలి ఇలా మాఘమాసంలో ఆదివారాలు ఈ వ్రతం చేయడం వలన జన్మజన్మల సంచిత పాపం నశించి అనంత పుణ్యం లభిస్తుంది. అంతే కాక రోగ భయాలుండవు.సిరిసంపదలతో ఇల్లు కళకళలాడుతుంది. -గుమ్మా ప్రసాద రావు -
పూర్తి కావొస్తున్న సూర్యక్షేత్రం..!
అర్వపల్లి (తుంగతుర్తి) : తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రథమంగా నిర్మిస్తున్న అఖండజ్యోతి స్వరూప శ్రీసూర్యనారాయణస్వామి మహాక్షేత్రం పనులు పూర్తి కావొస్తున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో అక్కడక్కడ చిన్నచిన్న సూర్యదేవాలయాలు ఉన్నాయే తప్ప సూర్యభగవానుడి క్షేత్రం ఎక్కడా లేదు. తొలిసారిగా సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం శివారులోని శ్రీపురంగిరులలో సూర్యాపేట ప్రాంతానికి చెందిన కాకులారపు జనార్దన్‌రెడ్డి–రజిత దంపతులు ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. సుమారు రూ.2కోట్ల వ్యయంతో మూడు గిరులు (గుట్టల మధ్య) ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో పచ్చని వనాల నడుమ ఈ ఆలయ నిర్మాణం జరుగుతోంది. అయితే ఈ ఆలయంతో పాటు దేవస్థాన కార్యాలయ భవనం, గోశాల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వీటితో పాటు రాబోయే రోజుల్లో ఇక్కడ నక్షత్రవనం, ధ్యానమండపం తదితర వాటిని నిర్మించ తలపెట్టారు. అయితే పర్వత శ్రేణుల మధ్య నిర్మించే ఈ క్షేత్రంలో ఆలయ గర్భగుడిలో అఖండజ్యోతి మూలాధారం. ఈ జ్యోతిని ఏకాగ్రతతో చూస్తూ సూర్యభగవానుడు చుట్టూ ఉండే సప్త ఆలయాల్లో సప్తవర్ణాలలో దర్శనమిస్తారు. అంతే కాకుండా ఇక్కడ కాస్మిక్ ఎనర్జీ అత్యధికంగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. కాస్మిక్ ఎనర్జీ అంటే సూర్యుడు కాలగమనంలో ఒక్కొక్క మాసం ఒక్కో రాశిలో ప్ర వేశిస్తారు. ఆ రాశి సంయమనం ప్రకారం కాంతి తీవ్రత ఉం టుంది. ఈ ఎనర్జీ మనిషి యొక్క ఆలోచనలను ఎంతో ప్రభా వితం చేస్తాయి. మేధాశక్తిని పెంపొందిస్తుంది. దీంతో ఈ క్షే త్రం రాబోయే రోజుల్లో గొప్ప విశిష్టత సంతరించుకునే అవకా శం ఉందని చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు సూర్యనా రాయణస్వామి దర్శనం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకా కుళం జిల్లా అరసవెల్లికి వెళుతున్నారు. త్వరలో తెలంగాణ ప్ర జలకు సూర్యభగవానుడి దర్శన బాగ్యం ఇక్కడే కలగనుంది. రూ.2కోట్లతో క్షేత్రం నిర్మాణం.. సుమారు రూ.2కోట్ల వ్యయంతో ఈ క్షేత్ర నిర్మాణం జరుగుతోంది. సూర్యనారాయణస్వామి గర్భగుడి, చు ట్టూ ఏడు సప్తవర్ణ ఆలయాలు, ఈ క్షే త్రంపై రాజ గోపురం నిర్మాణం పూర్తయ్యాయి. దేవాలయ కార్యాలయం రెండు అంతస్తుల్లో నిర్మించా రు. పశువుల కోసం గోశాల నిర్మాణం జరుగుతోంది. ఆల యం ఎదుట ధ్యానమందిరం నిర్మా ణం పూర్తయింది. మిగి లిన పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 24నుంచి ప్రతిష్ఠ, మహాసౌరయాగ మహోత్సవాలు ఈ అఖండజ్యోతి స్వరూప పంచాయతన దేవాలయ ప్రతిష్ఠ, మహా సౌరయాగ మహోత్సవాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 24నుంచి మార్చి 5వరకు జరపాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణస్వామి దేవాలయ ప్రధానార్చకుడు ఇప్పిలి శంకరశర్మ పర్యవేక్షణలో ప్రతిష్ఠ, మహాసౌరయాగ మహోత్సవాలు జరగనున్నాయి. ఇప్పటికే అరసవెల్లి దేవస్థాన అర్చక బృందం మహా సౌరయాగ మహోత్సవాలకు ఏర్పాట్లను పరిశీలించి వెళ్లింది. ఈ యాగానికి ఐదుగురు పీఠాధిపతులను ఆహ్వానిస్తున్నారు. అలాగే 36మంది రుత్వికులు 420మంది జంటలచే మహాసౌరయాగాన్ని 13రోజుల పాటు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆ ర్, గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌తో పాటు చినజీయర్, స్వరూపనంద స్వాములతో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ స్వాములను పిలవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మహోత్సవాలను రూ.కోటి వ్యయంతో నిర్వహిస్తున్నారు. ఇక్క డి క్షేత్రం తూర్పు దిశలో మూడు పర్వతాల మధ్య ఉన్నందున ఏపీలోని అరసవెల్లి దేవాలయం మాదిరిగా అభివృద్ధి చెందుతుందని దేవాలయ వ్యవస్థాపకుడు జనార్దన్‌రెడ్డి తెలిపారు. ప్రతిష్టా, మహాసౌరయాగ మహోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలిరావాలని కోరుతున్నారు. -
వి‘చిత్ర’ నోము!
తణుకు : చిత్రగుప్తుడిని ప్రసన్నం చేసుకునేందుకు నోములు నోచే ఆచారం పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి ప్రాంతంలో ఉండడం విశేషం. రెడ్డి, బ్రాహ్మణ, కాపు, వైశ్య, గవర కులస్తులు రథసప్తమి రోజు నుంచి చిత్రగుప్తుడి నోములు నిర్వహిస్తుంటారు. వెదురు తవ్వలో బియ్యం, వెదురుతో చేసిన పెట్టెలో పసుపు, అల్లీఅల్లని బుట్టలో ధాన్యం నింపి వాటిలో పూజా సామగ్రి నింపి శుక్రవారం చిత్రగుప్తుని నోములు ప్రారంభించారు. అత్తిలి మండలం ఈడూరులో తులసి కోటవద్ద తొలుత ఆవు పిడకలను వెలిగించి, దానిపై పాల పొంగలి వండి ప్రసాదం తయారు చేశారు. దేవుడి నిర్దేశిత పూజా ద్రవ్యాలతో పాటు వెదురు పెట్టె, బంగారు గంటం, వెండి ఆకును ఉంచి.. పురోహితుల సాయంతో నోమును పూర్తి చేశారు. పురోహితుడు నోము నోచిన వారి పేరు గోత్రాన్ని వెండి ఆకుపై బంగారపు గంటంతో రాస్తారు. ఇలా రాయడం వల్ల చిత్రగుప్తుడి చిట్టాలో అతడి నోమును నోచుకున్నట్టు నమోదవుతుందని, తద్వారా స్వర్గ ప్రాప్తి కలుగుతుందనేది భక్తుల విశ్వాసం. -
తాడేపల్లిగూడెంలో చోరీ
తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి జిల్లా): తాడేపల్లిగూడెం పట్టణంలోని రామారావుపేట- ఉంగరాలవారివీధిలో గల ఓ ఇంట్లో సోమవారం చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగలగొట్టి 12 కాసుల బంగారం, కిలో వెండి, రూ.5 వేల నగదు దొంగిలించారు. ఇంటి యజమాని ముత్తారామదుర్గారావు ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ఐ సూర్యభగవాన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.