Swami swaroopanandendra saraswati
-
జలహారతులిచ్చిన స్వామి స్వరూపానందేంద్ర
విశాఖ: సింహాచలం పూల తోటలో శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి జలహారతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఆయన జలధారలకు హారతులిచ్చారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ.. సింహగిరిపై ఎనిమిదేళ్లుగా జలధారలు శిథిలమయ్యాయని, ఇనేళ్ల తరువాత జలహారతి కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. సింహగిరిపై మొక్కలు నాటడం శుభపరిణామమని స్వామి పేర్కొన్నారు. అప్పన్న జలధారల పునరుద్ధరణకు గత ప్రభుత్వాలు ఏమాత్రం చొరవ చూపలేదని, సింహాచలం ట్రస్ట్‌బోర్డు ప్రత్యేక చొరవతో జలహారతి కార్యక్రమం పునఃప్రారంభానికి నోచుకుందని స్వామి పేర్కొన్నారు. ట్రస్ట్ బోర్డు చొరువను అడ్డుకునేందుకు కొందరు నేతలు ప్రయత్నించారని స్వామి ఆరోపించారు. అనతికాలంలోనే జలధారలను పునరుద్ధరించిన ట్రస్ట్ బోర్డును స్వామి ప్రశంసలతో ముంచెత్తారు. జలధారల పునరుద్ధరన విషయంలో సింహాచలం ట్రస్ట్ బోర్డు మిగతా దేవాలయాల ట్రస్ట్ బోర్డులకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులపై స్వరూపానందేంద్ర స్వామి స్పందిస్తూ.. స్వార్ధ ప్రయోజనాల కోసం కొన్ని రాజకీయ పార్టీలు దేవుడితో చలగాటం ఆడటం ఏమాత్రం మంచిది కాదని, దానికి వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. దేవాలయాలపై దాడుల నియంత్రణపై ప్రభుత్వ చిత్తశుద్దిని స్వామి ప్రశంశించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ త్వరగా పని చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
పూర్ణాహుతితో ముగిసిన చండీయాగం
సాక్షి, జగదేవ్‌పూర్ (గజ్వేల్): తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేపట్టిన మహారుద్ర సహిత సహప్ర చండీయాగం ముగిసింది. ఐదురోజుల పాటు కొనసాగిన ఈ యాగం విజయవంతంగా పూర్తయింది. యాగంలో చివరిరోజైన శుక్రవారం నాడు మొత్తం 8 మండపాలలో పుర్ణాహుతి జరిగింది. నేడు యాగానికి హాజరైన విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో కేసీఆర్ దంపతులు ప్రతీ మండపానికి వెళ్లి పూర్ణాహుతిలో పాల్గొన్నారు. తొలుత రాజశ్యామల, బగలాముఖి, నవగ్రహ, బుగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేద మంటపాలలో పూర్ణాహుతి జరిగింది. అనంతరం ప్రధాన యాగశాలైన చండీమాత మహా మండపంలో వేదపండితుల మంత్రోశ్చరణల నడుమ కేసీఆర్ దంపతులు పూజాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రుత్వికులను కేసీఆర్ ఘనంగా సన్మానించారు. -
వచ్చే నెలలో చండీ, రాజశ్యామల యాగాలు
సాక్షి, సిద్ధిపేట: యాగాలు, యజ్ఞాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై అపార నమ్మకం ఉన్న సీఎం కేసీఆర్ మరోసారి యాగాలకు సిద్ధమవుతున్నారు. కొంతకాలం కిందట అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఆయన.. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి సూచన మేరకు ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రంలో రెండు రోజులపాటు రాజ శ్యామల యాగాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ యాగం నిర్వహించారు. అనంతరం ఎన్నికల్లో టీఆర్ఎస్ అఖండ విజయం సాధించడం, రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టడం తెలిసిందే. కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కుటుంబసభ్యులతో కలసి విశాఖపట్నం వెళ్లి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు పొందారు. ఈ నేపథ్యంలో స్వామి సూచన మేరకు సీఎం కేసీఆర్.. జనవరి 21 నుంచి 25 వరకు రెండు యాగాల నిర్వహణకు శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. ఈ మేరకు ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. మొదటగా సహస్ర చండీ యాగం, ఆపై రాజ శ్యామల యాగం నిర్వహించనున్నట్లు సమాచారం. మొదటి రోజు సహస్ర చండీ యాగాన్ని స్వరూపానందేంద్ర సరస్వతి, రుత్వికులు కలసి పూర్ణకుంభంతో ప్రారంభిస్తారు. ప్రారంభ, ముగింపు రోజుల్లో స్వామి హాజరు కానున్నట్లు తెలిసింది. మిగతా రోజుల్లో రుత్వికులు యాగాన్ని నిర్వహించనున్నారు. ఆ దిశగా వ్యవసాయక్షేత్రంలో ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు సమాచారం. -
టీటీడీ అధికారుల ప్రకటన విస్మయం కలిగిస్తోంది
-
అమ్మ ప్రసాదం.. వివాదాస్పదం
ప్రసాదం పోటును కొండ కిందకు మార్చేందుకు ఆలయ అధికారుల నిర్ణయం పైనే ఉంచాలంటున్న శ్రీస్వరూపానందేంద్ర స్వామి విజయవాడ : దుర్గమ్మ ప్రసాదం తయారీ పోటును ఇంద్రకీలాద్రి పైనుంచి కిందకు మార్చాలనే దేవస్థానం అధికారుల నిర్ణయం వివాదాస్పదమవుతోంది. కొండపైనే లడ్డు, పులిహోర తయారుచేసి అమ్మవారికి నివేదించిన అనంతరం భక్తులకు విక్రయిస్తారు. కొండపై స్థలాభావం ఉన్నప్పటికీ తయారీ అక్కడే జరుగుతోంది. తాజాగా, దుర్గగుడి అభివృద్ధి పేరుతో ప్రసాదాల తయారీ పోటును కిందకు మార్చాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. దీనిపై భక్తుల నుంచి సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్నదానం సైతం.. అమ్మవారి దర్శనానంతరం లడ్డు, పులిహోర ప్రసాదాలు తీసుకున్న భక్తులు అన్నదాన భవనంలోకి వెళ్లి అన్నప్రసాదం స్వీకరిస్తారు. అభివృద్ధి పేరుతో అన్నదానం కార్యక్రమాన్ని కూడా కొండ కిందకు తరలించాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. దీనిని భక్తులు వ్యతిరేకిస్తున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం వెంటనే తీసుకోవాల్సిన ప్రసాదాలను కొండ దిగువకు వెళ్లిన తరువాత తీసుకోవాలనే అధికారుల ప్రతిపాదనపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమ్మ సన్నిధిలోనే ప్రసాదం తినాలి : శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ దుర్గమ్మ ఆలయంలో పల్లకి సేవ, కంకణాలను ప్రారంభించడానికి వచ్చిన శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఈ వివాదంపై స్పందించారు. అమ్మవారి సన్నిధిలోనే ప్రసాదాలు తయారు చేయాలని, అక్కడే తినాలన్నారు. ఇందుకు అనుగుణంగా ఈవో తగిన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని హితవు పలికారు. అన్నదానం కూడా అమ్మ సన్నిధిలోనే జరగాలని పేర్కొన్నారు. అయితే, తిరుపతి, సింహాచలం మాదిరిగా ఇంద్రకీలాద్రిపై తగినంత స్థలం లేకపోవడం వల్ల ఇబ్బంది వస్తోందని అధికారులు చెబుతున్నారు. అమ్మవారి ప్రసాదం కొండపైనే.. : ఈవో ఆజాద్ అమ్మవారికి, స్వామివారికి నివేదించే ప్రసాదాన్ని మాత్రం ఇంద్రకీలాద్రిపై అర్చకులు తయారు చేస్తారని, భక్తులకు విక్రయించే లడ్డు, పులిహోర ప్రసాదాలు మాత్రమే కింద తయారు చేయిస్తామని ఈవో ఆజాద్ తెలిపారు. ఇంద్రకీలాద్రి దిగువన మల్లికార్జున మహామడపం నుంచి గోడలు నిర్మిస్తామని, ఈలోపల ఉన్న ప్రదేశమంతా అమ్మవారికే చెందుతుందని, అందువల్ల బయట చేయించామనే భావన అవసరం లేదని పేర్కొన్నారు. ఎక్కువ మందికి అన్నప్రసాదం అందించేందుకే అన్నప్రసాద కేంద్రాన్ని తరలిస్తున్నామన్నారు.