swearing cermony
-
జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి మొదలైన ఏర్పాట్లు
-
జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి ఏర్పాట్లు మొదలు
సాక్షి, అమరావతి: అఖండ విజయం సాధించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆ రోజు మధ్యాహ్నం 12.23 గంటలకు జరిగే ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం శాఖల వారీగా బాధ్యతలు అప్పగించింది. అవసరమైన సౌకర్యాలు సమకూర్చేలా 15 ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యం చేస్తూ సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమాణ స్వీకారం చేసే ప్రధాన వేదిక, సభకు, ఆహ్వానితులకు అవసరమైన ఏర్పాట్లు కృష్ణా జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు. సభకు అవసరమైన బందోబస్తు, వీఐపీల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, వాహనాల పార్కింగ్, కార్యక్రమానికి వచ్చిన ఆహ్వానితులు వేచి చూసే అవకాశం లేకుండా చూడటం వంటి బాధ్యతలను డీజీపీ, ఇంటెలిజెన్స్ ఏడీజీలకు అప్పగించారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికల పంపిణీ ఏర్పాట్లను డైరెక్టర్ ఆఫ్ ప్రొటొకాల్, జీఏడీ అసిస్టెంట్ సెక్రటరీకి అప్పగించారు. గవర్నర్‌తో సీఎం, సభ్యుల గ్రూప్ ఫొటో, మీడియా కవరేజ్, ఫొటోగ్రాఫర్స్, ఎల్ఈడీ స్క్రీన్స్, ప్రసార మాధ్యమాల ఏర్పాట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌కు అప్పగించారు. సభా ప్రాంగణంలో క్లీనింగ్, రోలింగ్, లెవలింగ్, వాటరింగ్ పనులు పట్టణాభివృద్ధి(ఎంఎయూడీ) ప్రిన్సిపల్ సెక్రటరీ, మంచినీటి సరఫరా బాధ్యతను విజయవాడ మున్సిపల్ కమిషనర్‌కు, తాత్కాలిక టాయిలెట్స్ ఏర్పాటు పనులు సీఆర్డీఏ కమిషనర్ పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బారికేడ్లు, వీఐపీ బారికేడ్లకు మెస్, వాటర్ ప్రూఫ్ టెంట్లు, సిట్టింగ్, ఫ్యాన్లు, లైటింగ్ వంటి ఏర్పాట్లు ట్రాన్సుపోర్టు, ఆర్అండ్బి, విద్యుత్ శాఖలకు అప్పగించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి వీవీఐపీల ఏర్పాట్లను డీజీపీ సహకారంతో ప్రొటొకాల్ డైరెక్టర్ చూడాల్సి ఉంది. మినిట్ టు మినిట్ కార్యక్రమ షెడ్యూల్‌తోపాటు ముద్రణాపరమైన బాధ్యతలను ప్రొటోకాల్ డిప్యూటీ సెక్రటరీకి అప్పగించారు. జీఏడీ, విపత్తుల నిర్వహణ మరియు అగ్నిమాపక సర్వీసు డీజీ, హార్టీకల్చర్ డైరెక్టర్, వైద్యఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, ఏపీ ట్రాన్స్‌కో, ఐటీఇ అండ్ సిలకు పలు బాధ్యతలు అప్పగించారు. ఏర్పాట్లను పర్యవేక్షించేలా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) నుంచి లైజనింగ్ అఫీసర్లుగా ప్రభుత్వ అదనపు కార్యదర్శి (ప్రొటోకాల్) ఎం.అశోక్‌బాబు, డిప్యూటీ సెక్రటరీ ఇ.విశాలక్షిలను నియమించారు. -
నువ్వు ఏదో ఒకరోజు సీఎం అవుతావు!
జైపూర్ : రాజస్తాన్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. చరిత్రాత్మక ఆల్బర్ట్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాజస్తాన్ మాజీ సీఎం వసుంధర రాజే సహా పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా, వసుంధర రాజేల మధ్య ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. వసుంధర రాజే, జ్యోతిరాదిత్య సింధియా ఇద్దరూ కూడా రాజవంశీకులన్న విషయం తెలిసిందే. ప్రమాణస్వీకారోత్సవంలో భాగంగా సింధియాను పలకరించిన రాజే.. రాజవంశీకుల ఆచారం ప్రకారం ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో... రాజకీయ పరంగా సిద్ధాంత విభేదాలు ఉన్నప్పటికీ రక్తసంబంధీకుల మధ్య ఉన్న ఆప్యాయతల్లో ఎటువంటి తేడా ఉండదు అనేందుకు ఇదొక చక్కని ఉదాహరణ అంటూ వీరి అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు గాసిప్ రాయుళ్లు మాత్రం...’ ఈ వేడుకలో భాగంగా మేనత్త వసుంధర.. తన మేనల్లుడు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆనందపడుతూనే.. నువ్వు ఏదో ఒకరోజు తప్పకుండా మధ్యప్రదేశ్ సీఎం అవుతావంటూ ఆశీర్వదించి ఉంటారు’ అంటూ కథనాలు అల్లేస్తున్నారు కూడా. కాగా సింధియా కుటుంబం దశాబ్దాలుగా మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవరావు సింధియా మొదట జన్ సంఘ్ నుంచి పోటీ చేసినప్పటికీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారారు. కాగా అదే కుటుంబానికి చెందిన బీజేపీ వ్యవస్థాపక సభ్యురాలు విజయ రాజే సింధియా, ఆమె కుమార్తెలు వసుంధరా రాజే(రాజస్తాన్ మాజీ సీఎం), యశోదర రాజే(మధ్యప్రదేశ్ ఎంపీ) బీజేపీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే సిద్ధాంతాల పరంగా విభేదాలు ఉన్నప్పటికీ సింధియాలు ఎప్పుడూ ఒకరిపై ఒకరు పోటీకి నిలబడలేదు. -
రైతు రుణమాఫీపైనే సీఎం తొలి సంతకం!
భోపాల్ : మధ్యప్రదేశ్ 18వ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆనందిబెన్ పటేల్ సమక్షంలో సీఎంగా సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఎన్నికలకు మందు వాగ్దానం చేసినట్టుగానే... ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కమల్‌నాథ్ రైతు రుణమాఫీపై తొలి సంతకం చేశారు. తద్వారా రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణభారం తప్పిందని సీఎంవో అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఇక కమల్‌నాథ్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ కార్యదర్శి మల్లికార్జున ఖర్గే, రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు హాజరయ్యారు. కాగా 1984 సిక్కు వ్యతిరేక ఘర్షణల కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్‌ను దోషిగా తేలుస్తూ ఢిల్లీ హైకోర్టు సోమవారం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టిపారేస్తూ ఆయనకు జీవిత ఖైదు విధించింది. అయితే సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసుతో కమల్‌నాథ్‌కు కూడా సంబంధాలు ఉన్నాయంటూ గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, సీఎం కమల్‌నాథ్ లక్ష్యంగా ప్రతిపక్ష బీజేపీ విమర్శల దాడికి దిగింది. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ పార్టీ నేతలు కోర్టు తీర్పును రాజకీయం చేయొద్దని హితవు పలికారు. -
ఆంధ్రప్రదేశ్ సీఎంగా నేడు బాబు ప్రమాణం
నాగార్జున వర్సిటీ వద్ద ఆర్భాటంగా ఏర్పాట్లు రాత్రి 7:27 గంటలకు ప్రమాణం.. ఖర్చు రూ. 30 కోట్లు ఢిల్లీ, హైదరాబాద్‌ల నుంచి కార్యక్రమానికి వస్తున్న వీఐపీలు, పాత్రికేయులు, బంధుమిత్రులకు ప్రత్యేక విమానాలు గన్నవరం నుంచి సభాస్థలి వరకూ నాలుగు హెలికాప్టర్లు సభా స్థలి వద్దే నాలుగు హెలిపాడ్లు, అంతర్గత తారు రోడ్లు విజయవాడ, గుంటూరుల్లో పెద్ద సంఖ్యలో హోటల్ గదులు వివిధ ప్రాంతాల నుంచి 12 ప్రత్యేక రైళ్లు, భారీగా బస్సులు సభా ప్రాంగణంలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాట్లు సభలో సినీ తారలతో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు చంద్రబాబుతో పాటు 17 మంది వరకూ మంత్రుల ప్రమాణం ప్రమాణ స్వీకారం వెంటనే 3 ఫైళ్లపై బాబు సంతకాలు! సాక్షి, విజయవాడ/హైదరాబాద్: అవశేష ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రిగా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆదివారం నాడు చేయబోయే ప్రమాణ స్వీకార కార్యక్రమం దేశంలోనే అత్యంత ఆర్భాటంగా, ఆడంబరంగా జరిగే కార్యక్రమంగా రికార్డుకెక్కనుంది. ఇందుకోసం విజయవాడ - గుంటూరు మధ్య ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో సభా ప్రాంగణం, వేదికల ఏర్పాట్లకు ప్రభుత్వ, ప్రైవేటు (టీడీపీ పార్టీ పరంగా) 30 కోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతున్నట్లు చెప్తున్నారు. చంద్రబాబు ఆదివారం రాత్రి 7:27 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 17 లేదా అంతకంటే తక్కువ మంది రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారనేది ఖరారు కాలేదు. మంత్రివర్గంలో బీజేపీ నుంచి ఒకరికి చోటు కల్పించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల రాక కోసం ఢిల్లీ, హైదరాబాద్‌ల నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయగా.. అక్కడ నుంచి వారిని ప్రమాణ స్వీకారం జరిగే వేదిక వరకు చేర్చడానికి నాలుగు ప్రత్యేక హెలికాప్టర్లను ఏర్పాటు చేశారు. వీవీఐపీలు, వీఐపీల బస కోసం పెద్ద ఎత్తున హోటళ్ల రిజర్వేషన్లు, సభా ప్రాంగణంలో సైతం అత్యాధునిక ఏసీలు, వీవీఐపీలకు గదులు, జనరేటర్లు, తారురోడ్లతో భారీ స్థాయిలో వసతి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. గత కొద్ది రోజులుగా గుంటూరు, కృష్ణా జిల్లాల అధికార యంత్రాగం దాదాపు పూర్తిగా.. రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు వారం రోజులుగా అన్ని పనులను పక్కన పెట్టి ఈ ఏర్పాట్లలోనే నిమగ్నమయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విశేష ప్రచారం కల్పించే లక్ష్యంతో.. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కొందరు జర్నలిస్టులను ఆహ్వానించారు. వీరితోపాటు అక్కడి నుంచి మరికొంత మంది అతిథులు ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు వీలుగా ఢిల్లీ - గన్నవరం విమానశ్రయం మధ్య రెండు ప్రత్యేక విమానాలను.. నారా, నందమూరి కటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి మరో ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు వచ్చే ప్రత్యేక విమానాలు వీటికి అదనం. విమాన మార్గంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకునే అతిథులను అక్కడ నుంచి ప్రమాణ స్వీకార సభాస్థలి వరకు చేర్చడానికి గాను నాలుగు ప్రత్యేక హెలికాప్టర్లు రోజంతా నిరంతరం అందుబాటులో ఉంటాయి. వ్యవసాయ పొలాల మధ్య ఏర్పాటు చేసిన సభాస్థలిలో అతిథుల రాకపోకలకు సౌకర్యంగా ఉండేలా అంతర్గతంగా అప్పటికప్పుడు తారు రోడ్లను నిర్మించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, వీఐపీలు, రాష్ట్రానికి చెందిన అధికారులు, ముఖ్యులు బస చేయడానికి వీలుగా ప్రభుత్వ యంత్రాంగం విజయవాడ, గుంటూరు నగరాల్లోని అన్ని ప్రధాన హోటళ్లల్లో దాదాపు 650 గదులు, ప్రభుత్వ అతిథి గృహాలను ప్రత్యేకంగా సిద్ధంగా చేశారు. అతిథుల సౌకర్యాల కోసం దాదాపు కోటి రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తోన్నట్టు ప్రాథమిక అంచనా. ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రుల బసల ఏర్పాట్ల పర్యవేక్షణకే వంద మంది ప్రభుత్వ అధికారులను నియమించారు. ముఖ్య అతిథులు విశ్రాంతి సమయంలో వినోదం కోసం హాయిలాండ్ పర్యాటక స్థల సందర్శనకు వీలుగా ఆర్టీసీకి చెందిన గరుడ, ఇంద్ర వంటి ఎసీ బస్సులను పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉంచారు. సభాప్రాంగణంలోనే 400 మంది ఆసీనులయ్యేలా ఒక గ్రీన్ రూం నిర్మాణం. జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో దానికి ప్రత్యేకంగా ఏసీ సౌకర్యం కల్పించారు. సభా స్థలిలోనే వీవీఐపీ కోసం యుద్ధప్రాతిపదికన ప్రత్యేకంగా పది గదులను ఏర్పాటు చేశారు. సభా ప్రాగంణమంతా వెలుగులు నింపడానికి విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఆరు 315 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు.. మూడు 100 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు.. శబ్ద కాలుష్యం లేని 125 కేవీఏ సామర్థ్యం కలిగిన 20 జనరేటర్లు అందుబాటులో ఉంచారు. పెదకాకాని నుంచి జాతీయ రహదారిపై కరెంట్ స్తంభాలకు హైమాస్ దీపాలు ఏర్పాటు. వర్షం పడినా సభకు అంతరాయం కలగకుండా సభాస్థలిలో ఎక్కువ భాగం రెయిన్ ప్రూఫ్ షామియానాలు ఏర్పాటు చేశారు. సభా ప్రాగంణంలో వర్షం నీరు నిల్వ ఉండకుండా ముందస్తు జాగ్రత్తగా కాల్వలు, తూములు, కల్వర్టులకు ప్రత్యేకంగా మరమ్మత్తులు చేశారు. వీవీఐపీల కోసం ప్రమాణస్వీకార ప్రాగంణంలో హైదరాబాద్ నుంచి పది అత్యవసర మరుగుదొడ్లు తెప్పించి సిద్ధం చేశారు. సీమాంధ్రలోని 13 జిల్లాల నుంచి పార్టీ అభిమానులు కార్యక్రమానికి హాజరయ్యేందుకు వీలుగా 12 ప్రత్యేక రైళ్ల సిద్ధం చేశారు. ఆర్టీసీ, ప్రయివేటు బస్సులు, వాహనాలను భారీ సంఖ్యలో ఏర్పాటు చేశారు. సభాస్థలిలో భారీ ఖర్చుతో సినీ తారలతో ప్రత్యేక వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే వారందరికీ మంచినీరు, మజ్జిగ, పులిహోర అందజేసేందుకు ప్రభుత్వ పరంగానే ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఏర్పాట్లు పూర్తి.. భారీ బందోబస్తు... చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్రాంగణంలో అంతర్గత రోడ్లు మొదలుకొని వేదికల నిర్మాణం, ఫ్లెక్సీల అలంకరణ వరకు అన్ని పనులు పూర్తయ్యాయి. చంద్రబాబుతో పాటు మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మూడు వే దికలను ఏర్పాటు చేస్తున్నారు. 480 అడుగుల ప్రధాన వేదిక, 240 అడుగుల సాంస్కృతిక వేదికను ఏర్పాటు చేశారు. సభా వేదికపై దివంగత ఎన్టీఆర్ విగ్రహంతో పాటు తెలుగుతల్లి విగ్రహాలను ఏర్పాటు చేశారు. వీవీఐపీలు, ప్రత్యేక అతిథుల కోసం మరో వేదికను ఏర్పాటు చేశారు. మొత్తం ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జాస్తి వెంకటరాముడులు పరిశీలించారు. కేంద్రం, ఇతర రాష్ట్రాల నుంచి వీవీఐపీలు హాజరుకానున్న క్రమంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేసి సభా ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మొత్తం 8,568 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడు ఫైళ్లపై బాబు సంతకాలు! ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో సభ ప్రారంభంకానుంది. రాత్రి 7:27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశాక 8 గంటలకల్లా కార్యక్రమం ముగుస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం మూడు ఫైళ్లపై సంతకాలు చేయనున్నారు. తొలి సంతకం రైతుల రుణమాఫీ విధివిధానాలు ఖరారు చేయడానికి కమిటీని ఏర్పాటు చేస్తూ ఒక ఫైలుపై ఉంటుంది. రెండో ఫైలు మద్యం బెల్టు షాపుల రద్దుపై ఉంటుంది. మూడో సంతకం ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకంపై సంతకం చేస్తారు. నేడు విజయవాడకు బాబు, గవర్నర్... ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరే చంద్రబాబు తొలుత నెక్లెస్‌రోడ్‌లోని ఘాట్‌లో ఎన్టీఆర్‌కు నివాళులర్పిస్తారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రమాణస్వీకార స్థలికి ప్రదర్శనగా చేరుకుంటారు. చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి విజయవాడ చేరుకుని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం రోడ్డు మార్గంలో ప్రమాణ స్వీకార స్థలానికి చేరుకుని ఆ కార్యక్రమం పూర్తై వెంటనే రైలులో హైదరాబాద్ బయలుదేరి వెళతారు. ప్రత్యేక విమానాల్లో సీఎంలు, కేంద్రమంత్రులు సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి పలువురు కేంద్ర మంత్రులు, కేంద్ర సహాయ మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవనున్నారు. బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడుతో పాటు మంత్రులు రవిశంకర్‌ప్రసాద్, స్మృతి ఇరానీ, డాక్టర్ హర్షవర్ధన్, నజ్మాహెప్తుల్లా, పీయూష్‌గోయల్, నిర్మలాసీతారామన్, ప్రకాశ్‌జవదేకర్, మనోజ్సింగ్, అనంతగీతే, కల్రాజ్మిశ్రాలు బాబు ప్రమాణానికి అతిథులుగా వస్తున్నారు. వీరితోపాటు ముఖ్యమంత్రులు వసుంధ రరాజే (రాజస్థాన్), నెప్యూయూరియో (నాగాలాండ్)లు కూడా ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లనున్నట్టు సమచారం. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లగా, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ముంబై నుంచి నేరుగా కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇక కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సైతం మరో ప్రత్యేక విమానంలో వెళ్లే అవకాశాలున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. వీరితోపాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు శివరాజ్‌సింగ్‌చౌహాన్ (మధ్యప్రదేశ్), ఆనందీబెన్‌పటేల్ (గుజరాత్), రమణ్‌సింగ్ (ఛత్తీస్‌గఢ్), ప్రకాశ్‌సింగ్‌బాదల్ (పంజాబ్), మనోహర్పారిక్ (గోవా) హాజరవుతున్నట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి. అనివార్య కారణాల వల్ల ప్రధానమంత్రి నరేంద్రమోడీ హాజరు కాలేకపోతున్నారని పీఎంఓ కార్యాలయవర్గాలు ఇప్పటికే తెలిపాయి. ఢిల్లీ నుంచి మీడియా ప్రతినిధులు సైతం కేంద్రమంత్రులు వెళుతున్న ప్రత్యేక విమానంలోనే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లనున్నారు. కార్యక్రమం అనంతరం వీరంతా రాత్రి 9:30 గంటలకు అదే విమానంలో ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు. మరోవైపు.. తమ పార్టీ అధినేత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని కొత్తగా ఎన్నికైన లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్‌ను టీడీపీ ఎంపీలు అశోక్‌గజపతిరాజు, సి.ఎం.రమేశ్, తోట నరసింహంలు శనివారం ఆహ్వానించారు. అయితే వివిధ కారణల వల్ల తాను హాజరుకాలేకపోతున్నానని, తన తరఫున ప్రతనిధిని పంపుతానని ఆమె చెప్పినట్టు భేటీ అనంతరం అశోక్‌గజపతిరాజు తెలిపారు. పవన్‌తో పాటు నందమూరి ఫ్యామిలీ... జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌తో పాటు నందమూరి కుటుంబ సభ్యులందరూ సభకు హాజరుకానున్నారని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావు, టీడీపీ రాష్ట్రనేత మన్నవ సుబ్బారావులు తెలిపారు. నందమూరి హరికృష్ణ, ఆయన తనయుడు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ ఇతర కుటుంబ సభ్యులంతా సభలో పాల్గొంటారని వివరించారు. -
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ట్రయల్ రన్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా రేపు బాధ్యతలు స్వీకరించనున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే శనివారం ట్రయల్ రన్ నిర్వహించారు. దీంతో నగరంలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రెండు గంటలకు పైగా నగరంలోని ప్రధాన మార్గాల్లోని ట్రాఫిక్ కు నిలిచిపోయింది. ప్రకాశం బ్యారేజీపై వారధిపై కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ కు విఘాతం కలగడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో నగరం అష్టదిగ్బంధంనంగా మారింది. -
భద్రతా దళాల గుప్పిట్లో రాష్ట్రపతి భవన్
-
భద్రతా దళాల గుప్పిట్లో రాష్ట్రపతి భవన్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్ భద్రతా దళాల గుప్పిట్లోకి వెళ్లింది. ఇక్కడ భారత నూతన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో అసాధారణ భద్రత ఏర్పాటు చేశారు. రాష్ర్టపతి భవనం చుట్టూపక్కల సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు వైమానిక సిబ్బందితో పాటు ఆరు వేల మంది పార్లమెంట్ కమాండోలు, పోలీసు షార్ప్ షూటర్లు భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గం.లకు మోడీ ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని అత్యంత కట్టుదిట్టుమైన భద్రత మధ్య ఉండే రాష్ట్రపతి భవన్‌ను మరింత పటిష్ట రక్షణ ఏర్పాట్లతో దుర్భేద్యంగా మారుస్తున్నారు. ఈ కార్యక్రమానికి మూడు వేలమంది అతిథులు హాజరుకానున్నారు. తొలిసారిగా సార్క్ దేశాల అధినేతలు కూడా రేపటి వేడుకల్లో పాల్గొననున్నారు. దీంతో పాటుగా వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఏడువేల సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లును పర్యవేక్షించనున్నారు. గణతంత్ర దిన పరేడ్‌కు చేపట్టే భద్రతా ఏర్పాట్లకు సరిసమాన స్థారుులో ఇటు భూమి అటు గగనతలాన్ని పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. మోడీ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి విదేశీ అతిథులతో పాటు దేశంలోని ప్రముఖులంతా హాజరవుతున్న సంగతి తెలిసిందే. -
మోడీ ప్రమాణా స్వీకారానికి 3 వేల మంది అతిథులు
ఢిల్లీ: భారత నూతన ప్రధానిగా రేపు నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సోమవారం సాయంత్రం 6 గం.లకు నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని అత్యంత కట్టుదిట్టుమైన భద్రత మధ్య ఉండే రాష్ట్రపతి భవన్‌ను మరింత పటిష్ట రక్షణ ఏర్పాట్లతో దుర్భేద్యంగా మారుస్తున్నారు. ఈ కార్యక్రమానికి మూడు వేలమంది అతిథులు హాజరుకానున్నారు. తొలిసారిగా సార్క్ దేశాల అధినేతలు కూడా రేపటి వేడుకల్లో పాల్గొననున్నారు. దీంతో పాటుగా వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఏడువేల సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లును పర్యవేక్షించనున్నారు. గణతంత్ర దిన పరేడ్‌కు చేపట్టే భద్రతా ఏర్పాట్లకు సరిసమాన స్థారుులో ఇటు భూమి అటు గగనతలాన్ని పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. -
2నే సీఎంగా కేసీఆర్ ప్రమాణం
వేదిక రాజ్‌భవన్, ఉదయం 8.55కు ముహూర్తం? సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో టీఆర్ఎస్ అధినేత, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత కె.చంద్రశేఖరరావు శుక్రవారం సాయంత్రం సమావేశమయ్యా రు. రాష్ట్ర విభజనపై అధికారులతో సమావేశమైన తర్వాత ఆయన నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ అయ్యారు. పంపకాలకు చేసిన ఏర్పాట్లపై తన అభ్యంతరాలతో పాటు తన మంత్రివర్గ ప్రమాణస్వీకారంపై కూడా ఆయనతో చర్చించారు. జూన్ 2న ప్రమాణస్వీకారం చేయాలనే నిర్ణయాన్ని కేసీఆర్ ఇప్పటికే గవర్నర్‌కు తెలియజేశారు. అయితే ముహూర్తం మా త్రం ఇంకా ఇదమిత్థంగా నిర్ణయం కాలేదు. ఉదయం 8.55కు, మధ్యాహ్నం 12.57కు మంచి ము హూర్తాలున్నట్టు సన్నిహితులు కేసీఆర్‌కు చెబుతున్నారు. దేన్ని ఎంచుకుంటారో ఇంకా ఖరారు కాకపోయినా 8.55కే ప్రమాణం చేయవచ్చని చెబుతున్నారు. ముహూర్తాలు, వాస్తు, సంఖ్యా శాస్త్రం తదితరాలను కేసీఆర్ బాగా నమ్ముతారన్నది తెలిసిందే. అందుకే ఈ విషయంలో ఆయన కచ్చితంగా ఉండే అవకాశముంది. రాజ్‌భవన్‌లోనే.. తెలంగాణలో తొలి ప్రభుత్వం గనుక ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎల్బీ స్టేడియం, నిజాం కాలేజీ మైదానం, పెరేడ్ మైదానం వంటివాటిలో భారీ జనసందోహం మధ్య కార్యక్రమం జరగాలని వాదిస్తున్నారు. కేసీఆర్ మాత్రం అందుకు విముఖంగా ఉన్నారు. తెలంగాణ ఆవి ర్భావ దినోత్సవాన్ని ఎక్కడికక్కడ నిర్వహించుకోవాలని పార్టీ శ్రేణులకు ఇప్పటికే అంతర్గతంగా సమాచారమిచ్చినందున హైదరాబాద్‌లో భారీ జన సమీకరణ చేస్తే గ్రామాల్లో ఆవి ర్భావ దినోత్సవం సజావుగా జరగకపోవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజ్‌భవన్‌లోనే సాదాసీదాగా, నిరాడంబరంగా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేయాలని స్థూలంగా నిర్ణయించుకున్నారు. 15 మందితోనే ప్రమాణస్వీకారం? శాసనసభ పరిమాణంలో మంత్రివర్గం సంఖ్య 15 శాతం మించరాదన్న నిబంధన ప్రకారం తెలంగాణలో మంత్రులుగా గరిష్టంగా 18 మందికే అవకాశముంది. ముందుగా తనతో పాటు 15 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసేలా కేసీఆర్ ఏర్పాట్లు చేసుకున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కేసీఆర్ అదృష్ట సంఖ్య 6 గనుక 15(1+5) మందికే మొగ్గుతారని వారంటున్నారు. శాఖలన్నీ కేసీఆర్ మదిలోనే... మంత్రివర్గంలో ఎవరుంటారు, ఎవరికి ఏ శాఖలన్న వివరాలు కూడా ఇంకా బయటకు రాలేదు. జిల్లాలవారీగా మంత్రివర్గంలో ఎవరుండాలనే దానిపై పార్టీ ముఖ్యులు, సన్నిహితులతో కేసీఆర్ ఇప్పటికే చర్చించి ఒక అవగాహనకు వచ్చారు. అయితే శాఖలపై మాత్రం కేసీఆర్ తన మనోగతాన్ని ఎక్కడా బయట పెట్టలేదు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఐదారుగురికి మినహా మిగతా వారికి మంత్రులుగా చేసిన అనుభవం లేదు. అందుకనే ఏ రంగాలపై ఎవరికి అవగాహన ఉందనే దాన్ని బట్టి శాఖల కేటాయింపు ఉంటుందని కేసీఆర్ సన్నిహితులు చెబుతున్నారు. ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, కె.స్వామి గౌడ్లకు మంత్రివర్గంలో చోటు ఉంటుందని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. రెండు సభల్లోనూ సభ్యత్వం లేని సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి, మాజీ ఐఏఎస్ కె.వి.రమణాచారికి కూడా మంత్రివర్గంలో చోటు ఉండొచ్చని కేసీఆర్ సన్నిహితులు అంటున్నారు. ఆశావహులు ఎక్కువగా ఉండటంతో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన వారికి అవకాశం లేదని ప్రకటన చేసే ఆస్కారముంది. అంతా కొత్తవాళ్లే గెలిచిన నల్లగొండకు మాత్రమే మినహాయింపు ఇస్తారంటున్నారు. లోక్‌సభకు ఎల్లుండి రాజీనామా? మెదక్ లోక్‌సభ స్థానానికి టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు సోమవారం రాజీనామా చేయనున్నారు. మెదక్ నుంచి లోక్‌సభకే గాక గజ్వేల్ నుండి ఆయన శాసనసభకు కూడా ఎన్నికవడం తెలిసిందే. ఇలా రెండు చోట్ల గెలిచిన వారు అధికారిక గెజిట్ జారీ అయిన నాటి నుంచి 14 రోజుల్లోగా ఏదో ఒక పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. లోక్‌సభ ఎన్నికల విజేతల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 18 న రాష్ట్రపతికి అందజేసింది. 19న గెజిట్ విడుదలైంది. కేసీఆర్ టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా ఎన్నికవడం, జూన్ 2న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనుండటం తెలిసిందే. అందుకే మెదక్ లోక్‌సభ సభ్యత్వాన్ని ఆయన వదులుకుంటున్నారు. ప్రధానిగానరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం సాయంత్రం కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారు. ఆ సందర్భంగానే సోమవారం రాజీనామా లేఖ సమర్పిస్తారని ఆయన సన్నిహితులు చెప్పారు. అప్పటికి లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశాలు లేనందున రాజీనామా లేఖను నేరుగా రాష్ట్రపతికి ఇచ్చే అవకాశాలున్నాయన్నారు. కేసీఆర్ రాజీనామా జూన్ 2 లోపల ఆమోదం పొందాల్సి ఉంటుంది.