అఖండ విజయం సాధించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆ రోజు మధ్యాహ్నం 12.23 గంటలకు జరిగే ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం శాఖల వారీగా బాధ్యతలు అప్పగించింది. అవసరమైన సౌకర్యాలు సమకూర్చేలా 15 ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యం చేస్తూ సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమాణ స్వీకారం చేసే ప్రధాన వేదిక, సభకు, ఆహ్వానితులకు అవసరమైన ఏర్పాట్లు కృష్ణా జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు.