Sweet Heart
-
మోదీ మెచ్చిన పాపులర్ గేమర్ పెళ్లి సందడి (ఫోటోలు)
-
లవ్వు బువ్వ
లవ్ లెటర్స్ కావలసినవి: మైదా పిండి - 2 కప్పులు; పంచదార - అర కప్పు; ఉప్పు - టీ స్పూను; బటర్ - కప్పు; నిమ్మతొక్కల తురుము - 2 టీ స్పూన్లు; కమలాపండు తొక్కల తురుము - టేబుల్ స్పూను; సోర్ క్రీమ్ - అర కప్పు; చెర్రీ ముక్కలు - కప్పు; పంచదార పొడి - 4 టీ స్పూన్లు తయారీ: 475 డిగ్రీల ఫారెన్ హీట్ దగ్గర అవెన్‌ను ప్రీ హీట్ చేయాలి ఒక పాత్రలో మైదా పిండి, పంచదార, ఉప్పు వేసి కలపాలి బటర్, నిమ్మతొక్కల తురుము, కమలాపండ్ల తొక్కల తురుము వేసి బాగా కలపాలి సోర్ క్రీమ్‌ను గిలక్కొట్టి జత చేయాలి అన్నీ బాగా కలిపి చిన్న చిన్న ఉండలు చేయాలి ఒక్కో ఉండను ఒత్తి, ఎన్వలప్ కవర్లా మడిచి, మధ్య భాగంలో చెర్రీ ఉంచాలి బేకింగ్ షీట్ మీద ఒక్కో కవరును జాగ్రత్తగా ఉంచాలి పై భాగం మీద నీళ్లను బ్రష్ చేసి, పంచదార చల్లి, సుమారు ఎనిమిది నిమిషాలు బేక్ చేసి తీసేయాలి. స్వీట్ హార్ట్ కావలసినవి: వైట్ కేక్ మిక్స్ - ఒక ప్యాకెట్; నీళ్లు - 1 + 1/4 కప్పులు; వెజిటబుల్ ఆయిల్ - 1/3 కప్పు; కోడిగుడ్లు - 3 (తెల్ల సొన మాత్రమే వాడాలి); రెడ్ ఫుడ్ కలర్ - 8 చుక్కలు; రాస్ప్బెర్రీ క్యాండీ ఆయిల్ - 2 చుక్కలు తయారీ: అవెన్‌ను 350 డిగ్రీల ఫారెన్ హీట్ దగ్గర ప్రీ హీట్ చేయాలి మఫిన్ టిన్‌లో పేపర్ కప్ కేక్ లైనర్లు ఉంచాలి ఒక పాత్రలో కేక్ మిక్స్, నీళ్లు, వెజిటబుల్ ఆయిల్, కోడిగుడ్ల తెల్ల సొన వేసి బాగా గిలక్కొట్టాలి కప్ కేక్‌లో మూడు వంతుల మిశ్రమం వే సి పక్కన ఉంచాలి మిగిలిన మిశ్రమంలో నాలుగు చుక్కల రెడ్ ఫుడ్ కలర్ వేసి కలిపాక, రాస్ప్బె ర్రీ ఆయిల్ వేసి, 1/3 వంతు మిశ్రమంలో పింక్ రంగు మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌లో వేసి పక్కన ఉంచాలి మిగిలిన మిశ్రమంలో రెట్టింపు ఫుడ్ కలర్ నీళ్లు వేసి, మిశ్రమాన్ని మరో ప్లాస్టిక్ కవర్లో వేసి పక్కన ఉంచాలి లేత గులాబీ రంగు మిశ్రమం ఉన్న కవర్‌ను కోన్‌లా పట్టుకుని చివర్లు కట్ చేసి రెండు మిశ్రమాలను కప్ కేక్‌ల మధ్య భాగంలో రెండు టీ స్పూన్ల మిశ్రమం వచ్చేలా గట్టిగా పిండాలి ముదురు గులాబీ రంగులో ఉండే మిశ్రమం ఉన్న కవర్‌ను కూడా అదేవిధంగా కట్ చేసి టీ స్పూను మిశ్రమం వచ్చేలా గట్టిగా పిండాలి ఈ కప్ కేక్‌లను అవెన్‌లో ఉంచి సుమారు 20 నిమిషాల సేపు బేక్ చేసి బయటకు తీసి చల్లారనివ్వాలి ఫ్రిజ్‌లో ఉంచి కొద్దిగా చల్లబడ్డాక అందించాలి. సుగర్ లిప్స్ కావలసినవి: బటర్ - ఒకటిన్నర కప్పులు; పంచదార - 2 కప్పులు; కోడిగుడ్లు - 4; వెనిలా ఎక్స్ట్రాక్ట్ - టీ స్పూను; మైదా పిండి - 5 కప్పులు; బేకింగ్ సోడా - 2 టీ స్పూన్లు; ఉప్పు - తగినంత తయారీ: ఒకపెద్ద పాత్రలో బటర్, పంచదార వేసి బాగా మెత్తగా క్రీమీగా అయ్యేవరకు గిలక్కొట్టాలి కోడిగుడ్లు, వెనిలా వేసి బాగా గిలక్కొట్టి, మైదా పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు మిశ్రమానికి జత చేసి బాగా కలిపి మూత పెట్టి ఫ్రిజ్‌లో ఒకరోజు రాత్రంతా ఉంచాలి అవెన్‌ను 400 డిగ్రీల ఫారెన్ హీట్ దగ్గర ప్రీ హీట్ చేయాలి ఫ్రిజ్‌లో నుంచి మిశ్రమాన్ని బయటకు తీసి, సుమారు పావు అంగుళం మందంగా ఒత్తి, కుకీ కటర్‌తో కావలసిన ఆకారంలో కట్ చేసి, అన్ గ్రీజ్డ్ కుకీషీట్ మీద ఉంచి, సుమారు ఎనిమిది నిమిషాలు వుంచి తీసి, చల్లారాక అందించాలి. -
గుండెపోటే గురుదేవుడు! ఆయిల్ ట్యాంకరే అవధూత!!
నవ్వింత ఈమధ్య మా రాంబాబు గాడిలో స్థితప్రజ్ఞత మరీ ఎక్కువైపోయింది. ఏం చెప్పినా అందులోంచి తాత్వికతను తవ్వి తీస్తున్నాడు. మొన్న నేనూ వాడూ ఆఫీసులోకి ప్రవేశించాక ఒక్కటంటే ఒక్క అడుగు దూరంలో లిఫ్ట్ మిస్సయ్యింది. సినిమాకు వెళ్లాక మన ముందు వాడికి టికెట్టు దక్కి, మనకు చిక్కనప్పటి బాధ ఆవరించి... నిరాశతో ‘అబ్బా’ అన్నాను. ‘‘హు... జీవితంలోనే లిఫ్ట్ దొరకలేదు. ఆఫ్టరాల్ ఈ లిఫ్ట్ మిస్సయితే బాధేముందిలేరా’’ అన్నాడు వాడు. ‘‘ఇందాకే కదరా, బస్సు మిస్సయితే ఎవరో బైకువాడు లిఫ్ట్ ఇచ్చాడు అన్నావ్’’ అని అడిగా. ‘‘కానీ బస్సులో నా స్వీట్హార్ట్ వెళ్తోంది కదా. బైకు లిఫ్టు దొరికిందని ఆనందించనా, బస్సు మిస్సయిందని విచారించనా?’’ ఊరెళ్దామని ఓరోజు రాత్రి ఎనిమిదింటికి వెళ్లాల్సిన రైలును పట్టుకోడానికి బయల్దేరాం మేం. కానీ నిమిషమున్నర వ్యవధిలో రైలు కాస్తా పాముల వాడి చేతుల్లోంచి పారిపోయే పాములా జారిపోయింది. పారిపోవడంతో సరిపెట్టిందా... చివరి బోగీ వెనక నల్లటి బ్యాక్‌గ్రౌండ్ మీద ‘ఎక్స్’ అనే అక్షరంతో వెక్కిరించింది. ‘ఆన్సర్‌షీటు మీద నీ జవాబు తప్పురా అనే మార్కే సదరు ఎక్స్’ - అంటాడు వాడు. ఎందుకైనా మంచిదని వాణ్ణి ఊరడిద్దామని ‘‘పోతే పోనీలేరా... ఇంకో రైల్లో వెళదాం లే’’ అన్నాను. ‘‘తప్పిపోయిన రైలుకు రిజర్వేషనైన టికెటుంటుంది. అయినా మిస్సవ్వక తప్పదు. ఇప్పుడెక్కాల్సిన రైలుకు రిజర్వేషనుండదు. అయినా ఎక్కక తప్పదు. అదేరా జీవితం’’ అన్నాడు వాడు. నిజమేననిపించింది. ‘‘నా బాధల్లా రైలు మిస్సయినందుకు కాదురా. మన చేతిలో టికెటు ఉన్నా, అధికారికంగా రిజర్వేషన్ చేయించుకుని సుఖంగా వెళ్లాల్సిన బెర్త్ అక్కడే ఉన్నా... దాని మీద ఎవడో తాను ఊహించని విధంగా, హాయిగా ప్రయాణిస్తుంటాడు. అధికారికంగా మనకు దఖలు పడాల్సిన సుఖాన్ని ఇంకెవడో అయాచితంగా అనుభవిస్తాడు. ఇదే జీవితం’’ అన్నాడు వాడు. అక్కసు లేదా అసూయ అనండి, మానవసహజమైన వాడి వైఖరికీ, ప్రవర్తనకూ సాటి మనిషిగా పూర్తిగా మద్దతుపలికాన్నేను. ఈమధ్యే రాంబాబు గాడికి మొదటిసారి హార్ట్ఎటాక్ వచ్చింది. హాస్పిటల్లో ఉన్నప్పుడు పరామర్శకు వెళ్లడం కుదరలేదు. వాడు కాస్త కోలుకున్నాక క్రమం తప్పక మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడు వాడితో జాయిన్ కావడం మొదలు పెట్టాను. ఈ క్రమంలో అప్పుట్లో మిస్ అయిన పరామర్శనూ, ఓదార్పునూ, ధైర్యాన్నీ ఒకే డోసులో ఇద్దామని- ‘‘పోన్లేరా... మైల్డ్ స్ట్రోకే కదా. మొదటి స్ట్రోకు వచ్చాక అన్ని జాగ్రత్తలూ తీసుకుంటే దాదాపు నలభై ఏళ్లు బతికారు ఏఎన్నార్. మామూలువాళ్ల కంటే ఇలా స్ట్రోక్ వచ్చాక జీవితాన్ని క్రమబద్ధం చేసుకున్నవాళ్లే సుదీర్ఘకాలం జీవించార్రా’’ అంటూ మంచి ఆరోగ్యకరమైన జీవితం కావాలంటే మామూలు వాళ్లైనా సరే అర్జెంటుగా గుండెపోటు తెచ్చుకోవడం చాలా అవసరం, అదెంతో మంచిది అన్నంత ఇన్స్పైరింగ్గా ఓ లెక్చర్ ఇచ్చా. రోడ్డు మీద మేము వాకింగ్ చేస్తున్న సమయంలోనే ఓ ఆయిల్ ట్యాంకర్ వెళ్తూ కనిపించింది. దాన్ని చూడగానే మళ్లీ మా రాంబాబుగాడిలో తాత్వికత నిద్రలేచింది. ‘‘హు... ఈ గుండే... దానితో నడిచే ఈ జీవితమూ ఆయిల్ ట్యాంకర్ వంటివేరా’’ అన్నాడు వాడు. నేను బిత్తరపోతూ అదేంట్రా అన్నాను. ‘‘చూశావా విచిత్రం... ఆయిల్ ట్యాంకర్ నిండా అనేక గ్యాలన్ల ఇంధనం ఉంటుంది. కానీ ఆ వాహనానికి గుండె కాయలాంటి చిన్న ట్యాంకర్లో ఉండే పెట్రోలు నిండుకుంటే అంతటి ఆయిల్ ట్యాంకరూ ఆగిపోతుంది. అలాగని నేరుగా ట్యాంకరులోని ఇంధనాన్ని వాహనానికి ఉన్న ట్యాంకులో పోసుకోడానికి వీలు కాదు. మన గుండె కూడా అంతేగదరా. దాని నాలుగ్గోడల నిండా ఎప్పుడూ రక్తం ఉండనే ఉంటుంది. అలాంటి గుండె కూడా మెదడుకు తన ఆధార్ కార్డూ, తన రేషన్ కార్డూ గట్రా చూపించి తన కోటా రక్తాన్ని మాత్రమే తాను వాడుకోవాలి. అన్ని అవయవాలకూ రక్తం సరఫరా చేసే దానికే రక్తం అందకపోతే, ఎంతటి మనిషైనా అంతటితో పోవాల్సిందే కదా. ఇది కూడా టికెట్టుండీ రెలైక్కలేకపోవడం, మన స్వీట్ హార్ట్ బస్సులో ఉండీ, బస్సెక్కలేకపోవడం లాంటిదే కదరా. జ్ఞానాన్ని నేర్చుకోవాలనే గుణం ఉండాలిగానీ... గుండెపోటూ గురువవుతుంది, ఆయిల్ ట్యాంకరూ అవధూత అవుతుంది. మిస్సయిన బస్సూ మహాతత్వ సారాన్ని బోధిస్తుంది’’ అంటూ పెద్ద పెద్ద మహాయోగులూ, యోగగురువులూ ఇచ్చేలాంటి స్పీచ్ ఇచ్చాడు వాడు. - యాసీన్