స్విస్ చాలెంజ్‌పై దిగొచ్చిన సర్కారు!
హైదరాబాద్: స్విస్ చాలెంజ్ విధానంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. స్విస్ చాలెంజ్‌కు సంబంధించి ప్రభుత్వం ఎందుకు గోప్యతను పాటిస్తుందంటూ హైకోర్టు మొట్టికాయలు వేసిన నేపథ్యంలో ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. ఇవాళ జరిగిన విచారణలో స్విస్ చాలెంజ్‌కు సంబంధించిన అన్ని వివరాలను వెల్లడిస్తామని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించింది. అయితే.. ఈ విషయాన్ని ముందే చెప్పి ఉంటే మరిన్ని కంపెనీలు బిడ్డింగ్‌లో పాల్గొనేవని హైకోర్టు తలంటింది. తదుపరి విచారణను మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా వేసింది.