swiss national banks
-
స్విస్ ఖాతాల్లో సొమ్ము తగ్గింది!!
జ్యూరిక్/న్యూఢిల్లీ: స్విస్ ఖాతాల్లో భారతీయులు దాచుకునే నగదు పరిమాణం గణనీయంగా తగ్గుతోంది. 2018లో ఇది 955 మిలియన్ స్విస్ ఫ్రాంకులకు (దాదాపు రూ. 6,757 కోట్లు) పడిపోయింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 6 శాతం తగ్గుదల కాగా, దాదాపు రెండు దశాబ్దాల కనిష్ట స్థాయి కూడా కావడం గమనార్హం. స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్ఎన్బీ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. అయితే, ఇలా దాచుకున్న డిపాజిట్లలో వివాదాస్పద నల్లధనం ఎంత? సక్రమమైన డిపాజిట్ల మొత్తమెంత? అనే వివరాలు ఇందులో లేవు. అలాగే, వివిధ దేశాల నుంచి వేర్వేరు సంస్థలు, వ్యక్తుల పేరిట భారతీయులు, ప్రవాస భారతీయులు చేసిన డిపాజిట్లకు సంబంధించిన వివరాలు కూడా ఈ డేటాలో లేవు. భారత్‌లోని స్విస్ బ్యాంకుల శాఖల్లో ఉన్న డిపాజిట్ల పరిమాణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఎస్ఎన్బీ ఈ డేటా రూపొందించింది. స్విస్ ఖాతాల్లో బ్లాక్‌మనీ దాచుకునే నల్ల కుబేరులపై కేంద్రం కొరడా ఝుళిపిస్తున్న నేపథ్యంలో తాజా గణాంకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎస్ఎన్బీ గణాంకాల ప్రకారం స్విస్ బ్యాంకు ఖాతాల్లో విదేశీ ఖాతాదారుల సొమ్ము దాదాపు 4 శాతం క్షీణించి 1.4 లక్షల కోట్ల స్విస్ ఫ్రాంకుల (దాదాపు రూ. 99 లక్షల కోట్లు) స్థాయికి తగ్గింది. -
స్విస్‌లో మళ్లీ మనోళ్ల డిపాజిట్ల జోరు
-
స్విస్‌లో మళ్లీ మనోళ్ల డిపాజిట్ల జోరు
జ్యూరిచ్/న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచిపెట్టిన డిపాజిట్ల విలువ 2017లో 50 శాతం పెరిగి రూ.7,000 కోట్లకు చేరుకుంది. కేంద్రం చేపట్టిన నల్లధనం నియంత్రణ చర్యలతో మూడేళ్ల క్షీణత తర్వాత మళ్లీ డిపాజిట్లు పెరగడం ఆశ్చర్యకరమే. స్విస్ నేషనల్ బ్యాంకు (స్విట్జర్లాండ్‌లో కేంద్ర బ్యాంకు) గురువారం విడుదల చేసిన వార్షిక గణాంకాల ప్రకారం... ఆ దేశంలోని బ్యాంకుల్లో విదేశీ క్లయింట్ల డిపాజిట్ల విలువ 3 శాతం పెరిగి 1.46 లక్షల కోట్ల స్విస్ ఫ్రాంక్‌లకు చేరింది. అంటే మన కరెన్సీలో రూ.100 లక్షల కోట్లు. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 2014లో 10 శాతం... 2015లో 50 శాతం... 2016లో 45 శాతం చొప్పున క్షీణించాయి. 2016లో డిపాజిట్లు రూ.4,500 కోట్లకు పరిమితమయ్యాయి. అయితే 2017లో ఇవి 999 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు చేరాయి. అంటే మన కరెన్సీలో రూ.6,891 కోట్లు. ఇక ట్రస్టీలు, వెల్త్ మేనేజర్ల ద్వారా కలిగి ఉన్న నిధులు రూ.112 కోట్లు. ఈ లెక్కన 2017లో డిపాజిట్లు 50 శాతం పెరిగినట్లు లెక్క. భారతీయులు ఇతర దేశాల్లోని సంస్థల ద్వారా స్విస్ బ్యాంకుల్లో కలిగి ఉన్న డిపాజిట్ల గణాంకాలు ఇందులో కలవలేదు. 2006లో గరిష్టంగా నిధులు ఇక భారతీయుల నిధులు అధికంగా ఉన్న సంవత్సరం 2006. అప్పట్లో రూ.23,000 కోట్ల మేర భారతీయుల డిపాజిట్లు స్విస్ బ్యాంకుల్లో ఉన్నాయి. అప్పటి నుంచి చూస్తే మూడుసార్లే భారతీయుల డిపాజిట్లు పెరిగాయి. 2011లో 12 శాతం, 2013లో 43 శాతం, 2017లో 50 శాతం. నల్లధనం నియంత్రణకు గాను సమాచార పరస్పర మార్పిడికి భారత్, స్విట్జర్లాండ్ మధ్య నూతన మార్గదర్శకాలు అమల్లోకి వచ్చిన తర్వాత విడుదలైన తొలి గణంకాలివి. భారత్, ఇతర దేశాలతో సమాచార మార్పిడిని స్విట్జర్లాండ్ ఇప్పటికే ప్రారంభించింది కూడా. నల్లధనంపై భారత్ చేపడుతున్న చర్యల నేపథ్యంలో మరింత సహకారానికి కూడా అంగీకరించింది. అయితే, 2017కు ముందు మూడు సంవత్సరాల్లో భారతీయుల డిపాజిట్లు తగ్గడానికి కారణం, నల్లధనంపై అంతర్జాతీయంగా కఠిన చర్యల కారణంగా ఇతర దేశాలకు మళ్లించడమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. స్విస్ బ్యాంకులకు లాభాలే లాభాలు స్విట్జర్లాండ్ బ్యాంకుల లాభాలు గతేడాది 25% పెరిగి 9.8 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు చేరాయి. 2016లో లాభాలు సగం తగ్గి 7.9 బిలియన్ డాలర్లకు పడిపోయాక తిరిగి పుంజుకున్నాయి. మొత్తం డిపాజిట్లు 1% పెరిగి 1.8 లక్షల కోట్ల స్విస్ ఫ్రాంక్‌లుగా ఉన్నాయి. ఇందులో 1.46 లక్షల కోట్ల స్విస్ ఫ్రాంక్‌లు విదేశీయులవే. ముఖ్యంగా స్థానికుల డిపాజిట్లు 57.6 బిలియన్ ఫ్రాంక్‌ల మేర పెరిగాయి. మొత్తం 253 బ్యాంకుల్లో 229 లాభాల్లో నిలవగా, మిగిలినవి నష్టాలను ప్రకటించాయి. పెద్ద బ్యాంకులు తమ విదేశీ లావాదేవీలను స్విట్జర్లాండ్‌కు మళ్లించడం వృద్ధికి దోహదపడింది. -
దుబాయ్‌లో నల్లధనం!
న్యూఢిల్లీ/బెర్న్: విదేశాల్లో భారతీయులు దాచుకున్న నల్లధనాన్ని వెనక్కి తెప్పించేందుకు భారత్ తన దర్యాప్తును విస్తరించిన నేపథ్యంలో కొత్త ప్రాంతాల్లోనూ నల్లధన జాడలు వెలుగు చూస్తున్నాయి. భారత్ దృష్టి సారించిన స్విట్జర్లాండ్‌లోనే కాకుండా వివిధ ద్వీప దేశాలు, దుబాయ్, సింగపూర్, లక్సెంబర్గ్, సైప్రస్ వంటి ప్రపంచ ఆర్థిక కేంద్రాల్లోనూ నల్లధనం ఉందని దర్యాప్తులో ఆధారాలు లభించాయి. స్విస్, భారత్‌లు కొనసాగిస్తున్న సహకారం ఫలితంగా కొత్త అంశాలు వె లుగు చూస్తున్నాయని, స్విస్ అవతల అక్రమ లావాదేవీలు సాగినట్లు తెలుస్తోందని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. భారత్‌లోని 15 నుంచి 20 కంపెనీల నల్లధనానికి సంబంధించిన వాటి తరఫున స్విస్‌కు బయటున్న కొన్ని బ్యాంకులు వ్యవహారాలు నడుపుతున్నట్లు తేలిందని వెల్లడించాయి. భారత్‌లోనూ కార్యకలాపాలు సాగిస్తున్న ఈ బ్యాంకుల ఉన్నతాధికారుల్లో కొందరు తమ ఖాతాదార్ల నల్లడబ్బును పెట్టుబడుల సాకుతో తిరిగి భారత్‌కు చేరవేయడానికి సాయపడినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. స్విస్‌లోని నల్లధనాన్ని షేర్ మార్కెట్లు, ఎగుమతులు-దిగుమతులు తదితర మార్గాల్లో భారత్, ఇతర ప్రాంతాలకు తరలించాలని ఈ బ్యాంకులు తమ ఖాతాదారులకు చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే నల్లధనంపై దర్యాప్తు నేపథ్యంలో కొన్ని బ్యాంకు లు భారతీయుల ఖాతాలకు వారు బాధ్యత వహించేలా వారి నుంచి హామీలు తీసుకుంటున్నాయి. స్విస్ జాతీయ బ్యాంకుల తాజా సమాచారం ప్రకారం 2013 నాటికి స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల డబ్బు రూ.14 వేల కోట్లు.