swords in hand
-
మత్తులో కత్తులతో వీరంగం!
సాక్షి, తాడేపల్లి(మంగళగిరి): పట్టణ పరిధిలోని నులకపేట ప్రాంతంలో స్థానికేతరులు కొంతమంది మద్యంతో పాటు వివిధ రకాల మత్తు పదార్థాలు తీసుకుని, స్థానికంగా నివసించే మహిళలు, విద్యార్థులను ఇబ్బందులకు గురిజేస్తున్నారు. స్థానికులు శనివారం రాత్రి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా కత్తులు చూపించి పరారయ్యారు. ఎవరిదారిన వారు వెళ్లిన అనంతరం తిరిగి మరలా ఆదివారం తెల్లవారుజామున ఘటనా స్థలానికి వచ్చి కొంతమందిని నిద్రలేపి దౌర్జన్యానికి పాల్పడ్డారు. మొదట యువకులు కత్తులు తీసుకొని నులకపేట వీధుల్లో వీరంగం వేయడంతో, స్థానికులు అడ్డుకున్నారు. వారు వేసుకొచ్చిన ద్విచక్రవాహనాన్ని, ఆటోను అక్కడే వదిలి పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత వదిలిపెట్టిన ఆటోను అక్కడ నుంచి తీసుకెళ్లారు. తిరిగి మరలా అదే వాహనంలో వచ్చి స్థానికంగా నివసించే వారిని భయభ్రాంతులకు గురిచేయడంతో, తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మత్తులో ఉండి ఓ ద్విచక్ర వాహనాన్ని కూడా అక్కడే వదిలివెళ్లారు. ఆ వాహనాన్ని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఆ వాహనానికి లైట్లు, వెనుక ముందు నంబరు ప్లేటు లేకపోవడం మరో ఎత్తు. ఈ వాహనంతో రాత్రి సమయంలో పెద్దపెద్ద శబ్దాలు చేసుకుంటూ మసీదు దగ్గర ఉన్న ఉర్దూ పాఠశాలలో కూర్చుని గంజాయి తాగి, వచ్చిపోయే ఆడవారిని, విద్యార్థినులను ఏడిపిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇదే యువకులు మసీదులో ప్రార్థన జరుగుతున్నప్పుడు ద్విచక్ర వాహనానికి సైలెన్సర్ తీసేసి, హడావుడి చేయడంతో, ముస్లిం పెద్దలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు అప్పట్లో జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి, నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజరు పరిచారు. మరలా బయటకు వచ్చిన తరువాత కొంతకాలం స్తబ్దుగా ఉన్న యువకులు మరలా అదే తరహాలో రోడ్లమీద తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టారు. మత్తులో గొడవ పడిన నలుగురు యువకులు పరారీలో ఉండటంతో వారి ఆచూకీ కోసం పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
అగ్రిగోల్డ్ చైర్మన్ కొడుకుపై హత్యాయత్నం
-
బెజవాడలో కత్తుల స్వైర విహారం..!
సాక్షి, విజయవాడ: కిరాయి హంతకుల ముఠా పట్టపగలే కత్తులతో స్వైర విహారం చేయడంతో నగర ప్రజలు భయందోళనలకు గురయ్యారు. వివరాలు.. దుర్గాపురంలోని అగ్రిగోల్డ్ వైఎస్ చైర్మన్ సదాశివ ప్రసాద్ ఇంట్లోకి గురువారం దుండగులు చొరబడ్డారు. ఇంట్లోని సీసీ కెమెరాల కనెక్షన్లని తొలగించారు. ఆయన కుమారుడు సాగర్‌పై కత్తులతో దాడి చేశారని స్థానికులు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి ఉడాయించేందుకు యత్నించారు. ఈ క్రమంలో పారిపోతున్న దుండగుల్ని పట్టుకునే ప్రయత్నం చేసిన స్థానికులను కత్తులతో బెదిరించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రికత్త నెలకొంది. దేహశుధ్ది.. దాడి చేసి పారిపోతున్న దుండగుల్ని తీవ్రంగా ప్రతిఘటించిన స్థానికులు చివరకు ముఠాలోని ఇద్దరిని పట్టుకోగలిగారు. వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కాగా, ఆర్థిక వ్యవహారాల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఘటనలో సాగర్ గాయపడ్డారు. దాడి ఘటనపై మీడియాతో మాట్లాడేందుకు బాధితుడి కుటుంబ సభ్యులు నిరాకరించడం గమనార్హం. ఇక అగ్రిగోల్డ్ మోసం కేసులో సదాశివ ప్రసాద్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. సంస్థకు భూముల కొనుగోళ్లలో ప్రసాద్ కీలకపాత్ర పోషించినట్టు ఆరోపణలున్నాయి. -
కత్తులతో కాలేజీ స్టూడెంట్స్.. వీరంగం..
సాక్షి, చెన్నై: సినిమా లైఫ్..రియల్ లైఫ్ ఒక్కటే అనుకున్నారో లేదా.. అప్పుడే ఫ్యాక్షన్ సినిమా చూశారేమో కానీ కొంత మంది విద్యార్థులు కత్తులతో ట్రైన్లో ప్రయాణిస్తూ వీరంగం సృష్టించారు. ఫ్యాక్షన్ సినిమాల్లో సుమో వాహనాల్లో హీరో, విలన్ అనుచరులు కత్తులు ఊపుకుంటూ వెళ్లడం చూసుంటాం. సేమ్ టూ సేమ్ వీరు అలాగే ట్రైన్లో ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తూ కత్తులను ఊపసాగారు. ఫ్లాట్ ఫామ్‌పై ఉన్న ఇతర ప్రయాణీకులను భయబ్రాంతులకు గురయ్యేల ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా ఈ తతంగాన్ని వీడియో తీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. ఇంకేముంది ఇది కాస్త వైరల్ కావడంతో కటకటాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే చెన్నైలోని పచైయప్ప, ప్రెసిడెన్సీ కాలేజీల్లో చదువుతున్న కొంతమంది విద్యార్థులు తిరువల్లూర్ జిల్లా నెమిలిచెరి స్టేషన్లో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. వీరిలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఈ ఘటన శనివారం జరగగా..వీడియోలు సోమవారం వెలుగులోకి వచ్చాయి. ఆ విద్యార్థులు వివరాలు తెలియాల్సి ఉంది. -
మా చేతిలో కత్తులు కూడా ఉన్నాయి జాగ్రత్త!
కాశ్మీర్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తే.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పాకిస్థాన్‌ను భారత్ గట్టిగా హెచ్చరించింది. ''మా చేతుల్లో డాలు మాత్రమే కాదు.. కత్తులు కూడా ఉన్నాయి జాగ్రత్త'' అని రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. సాహసాలు చేయాలనుకుంటే అనుభవించాల్సి వస్తుందని చెప్పారు. ప్రతిసారీ వాళ్లు దాడి చేసినప్పుడు కేవలం రక్షణాత్మక చర్యలే అవలంబించేవాళ్లమని, ఈసారి ఎదురుదాడి చేయాల్సి ఉంటుందని అన్నారు. కేవలం ఈ నెలలోనే 20 మంది భారత పౌరులు సరిహద్దు కాల్పుల్లో మరణించారు. అనేకమంది గాయపడ్డారు. ఇలాంటి పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడూ లేదు. దాంతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సరిహద్దుల్లో శాంతి నెలకొనేందుకు ఏం కావాలన్నా చేయాలని మన సైన్యానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వేచ్ఛనిచ్చారు. కానీ మరోవైపు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు బిలావల్ భుట్టో మాత్రం ఎగిరెగిరి పడుతూనే ఉన్నాడు. కాశ్మీర్ తమదేనని, దాన్ని భారతదేశం నుంచి లాక్కుని తీరుతామని తాజాగా మరోసారి అన్నాడు.