
సాక్షి, చెన్నై: సినిమా లైఫ్..రియల్ లైఫ్ ఒక్కటే అనుకున్నారో లేదా.. అప్పుడే ఫ్యాక్షన్ సినిమా చూశారేమో కానీ కొంత మంది విద్యార్థులు కత్తులతో ట్రైన్‌లో ప్రయాణిస్తూ వీరంగం సృష్టించారు. ఫ్యాక్షన్ సినిమాల్లో సుమో వాహనాల్లో హీరో, విలన్ అనుచరులు కత్తులు ఊపుకుంటూ వెళ్లడం చూసుంటాం. సేమ్ టూ సేమ్ వీరు అలాగే ట్రైన్‌లో ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తూ కత్తులను ఊపసాగారు. ఫ్లాట్ ఫామ్‌పై ఉన్న ఇతర ప్రయాణీకులను భయబ్రాంతులకు గురయ్యేల ప్రవర్తించారు.
అంతటితో ఆగకుండా ఈ తతంగాన్ని వీడియో తీసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. ఇంకేముంది ఇది కాస్త వైరల్ కావడంతో కటకటాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే చెన్నైలోని పచైయప్ప, ప్రెసిడెన్సీ కాలేజీల్లో చదువుతున్న కొంతమంది విద్యార్థులు తిరువల్లూర్ జిల్లా నెమిలిచెరి స్టేషన్‌లో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. వీరిలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఈ ఘటన శనివారం జరగగా..వీడియోలు సోమవారం వెలుగులోకి వచ్చాయి. ఆ విద్యార్థులు వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment