సాక్షి, చెన్నై: రాష్ట్రానికి చెందిన 66 మంది విద్యార్థులు ఢిల్లీ పయనం అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం భేటీ కానున్నారు. ప్రధానితో భేటీ సమయంలో సంధించేందుకు కొన్ని ప్రశ్నలను విద్యార్థులు సిద్ధం చేసుకున్నారు. ప్రతి ఏటా పబ్లిక్ పరీక్షలకు ముందుగా విద్యార్థుల్లో ధైర్యాన్ని, ఉత్తేజాన్ని కల్గించే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రసంగం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఆదిశగా ఈ ఏడాది పది, ప్లస్‌టూ పరీక్షలు రాయనున్న విద్యార్థుల్ని ఉత్తేజ పరిచే విధంగా ప్రసంగానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమంలో కనుమపండగ రోజున (16వ తేదీ) నిర్వహించేందుకు సన్నాహాలు జరిగాయి. అయితే, తమిళ పార్టీలు వ్యతిరేకించడంతో ఆ తేదీని మార్చుకున్నారు. ఈనెల 20వ తేదీ సోమవారం ఢిల్లీలో ప్రధాని విద్యార్థుల సమక్షంలో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల్లో విద్యార్థులు వీక్షించేందుకు తగ్గ ఏర్పాట్ల మీద అధికారులు దృష్టి పెట్టారు. అలాగే, ఢిల్లీలో జరగనున్న కార్యక్రమం నిమిత్తం రాష్ట్రానికి చెందిన 66 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వీరంతా ఢిల్లీకి బయలుదేరారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. అలాగే, ప్రధానిని ప్రశ్నించేందుకు తగ్గట్టుగా విద్యార్థులకు కొన్ని ప్రశ్నలను సిద్ధం చేసుకుని మరీ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
మోదీతో భేటీ కోసం ఢిల్లీకి 66మంది విద్యార్థులు
Published Sun, Jan 19 2020 9:56 AM | Last Updated on Sun, Jan 19 2020 9:56 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment