symptoms of the disease
-
పార్కిన్సన్స్ డిసీజ్ ప్రాణాంతక వ్యాధా? ఎలా నివారించాలి?
పార్కిన్సన్స్ డిసీజ్ (పీడీ)ని ఆయుర్వేద వైద్యంలో "కంపా వట" అని పిలుస్తారు, ఇది శరీరం యొక్క అవయవాలు అతిశయోక్తి కదలికలను ప్రదర్శిస్తాయని అర్థం. పీడీ అనేది కేంద్ర నాడీ వ్యవస్థ క్షీణించిన వ్యాధి, ఇది మోటారు నైపుణ్యాలు, ప్రసంగం మరియు అనేక ఇతర విధులను ప్రభావితం చేస్తుంది, ఇది ప్రధానంగా డోపమైన్-ఉత్పత్తి చేసే కణాల నష్టం కారణంగా సంభవిస్తుంది. దీని లక్షణాలు, తీసుకోవాల్సిన ఫుడ్స్ గురించి ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి మాటల్లో చూద్దాం.! పార్కిన్సన్స్ వ్యాధి అనేది కేంద్ర నాడీ వ్యవస్థలో సంభవించే దీర్ఘకాలిక క్షీణత అనే రుగ్మత. ఇది ప్రధానంగా మోటారు వ్యవస్థను, అనగా శరీర అవయవ చలనమును ప్రభావితం చేస్తుంది. వ్యాధి తీవ్ర పడే కొద్ది, నాన్ మోటార్ లక్షణాలు సర్వసాధారణం అవుతాయి. ఈ వ్యాధి లక్షణాలు సాధారణంగా నెమ్మదిగా బయటపడతాయి..వ్యాధి ప్రారంభంలో, చాలా స్పష్టమైన లక్షణాలు అంటే వణుకు, బిగుసుకు పోవడం , కదలిక మందగించడం, నడకలో ఇబ్బంది వంటివి ఉంటాయి. ఆలోచించడం, ప్రవర్తనా సమస్యలు కూడా సంభవించవచ్చు. వ్యాధి ప్రారంభదశల్లో చిత్తవైకల్యం, జ్ఞాపక శక్తి తగ్గటం సాధారణం అవుతుంది. లక్షణాలు: కండరాల దృఢత్వం వణుకు నెమ్మదిగా శారీరక కదలిక (బ్రాడికినిసియా) మరింత తీవ్రమైన సందర్భాల్లో భౌతిక కదలిక (అకినేసియా) తోపాటు సంతులనం పూర్తిగా కోల్పోవడం. సాధారణ నిర్వహణ: విటమిన్ ఇ, బి12, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చండి ఎందుకంటే ఈ పోషకాలు మొత్తం మెదడు ఆరోగ్యానికి ముఖ్యమైనవి. ఉదా. అవకాడో, సాల్మన్, సార్డిన్, అవిసె గింజలు, నానబెట్టిన గింజలు మొదలైనవి. బెర్రీలు, తాజా సాల్మన్ మొదలైన యాంటీఆక్సిడెంట్-రిచ్ ఫుడ్స్ తీసుకోండి. అశ్వగంధ, కర్కుమిన్ కూడా ఈ పరిస్థితికి చాలా సహాయకారిగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి దూలగొండి (ముకునా ప్రూరీన్స్ (Mucuna Pruriens(కపికచ్చు)), దాని సహజ L-డోపా కంటెంట్‌కు కూడా ప్రసిద్ధి చెందింది. పార్కిన్సన్స్ వ్యాధికి ప్రామాణిక ఔషధ చికిత్సలో ఎల్-డోపా కీలకమైన భాగం. --ఆయర్వేద నిపుణులు నవీన్ నడిమింటి (చదవండి: సర్జరీ చేసే టైంలో పేషెంట్‌పై డాక్టర్ దాడి! వీడియో వైరల్) -
కరోనాతో మంచాన పడ్డవారికి... లాంగ్ కోవిడ్ ముప్పు!
న్యూఢిల్లీ: కరోనా రోగుల్లో వారం పాటు, ఆపై మంచానికి పరిమితమైన వారిలో లాంగ్ కోవిడ్ లక్షణాలు ప్రస్ఫుటంగా కని్పస్తున్నట్టు తాజా పరిశోధనలో తేలింది. వారిలో చాలామంది కనీసం రెండేళ్లపాటు విపరీతమైన ఒంటి నొప్పులు తదితర లక్షణాలతో బాధపడుతున్నారట. లాన్సెట్ రీజనల్ హెల్త్ యూరప్ జర్నల్ అధ్యయనం ఈ మేరకు తేలి్చంది. లింగ, వయో తదితర భేదాలకు అతీతంగా అందరిలోనూ ఇది సమానంగా కనిపించినట్టు వివరించింది. కరోనాతో రెండు నెలలకు, అంతకుమించి ఆస్పత్రిపాలైన వారిలో ఈ సమస్యలు, లక్షణాలు మరింత ఎక్కువగా తలెత్తినట్టు పేర్కొంది... ఇలా చేశారు... ► అధ్యయనం కోసం స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఐస్‌లాండ్‌ల్లో 64,880 మంది వయోజనులను ఎంచుకున్నారు. ► వీరంతా 2020 ఏప్రిల్ నుంచి 2022 ఆగస్టు మధ్య నానారకాల కొవిడ్ తరహా శారీరక సమస్యలను ఎదుర్కొన్నవారే. ► అందరూ పూర్తిగా, లేదా పాక్షికంగా కరోనా టీకాలు వేయించుకున్నవారే. ► వీరిలో 22 వేల మందికి పైగా కరోనా కాలంలో ఆ వ్యాధితో బాధపడ్డారు. ► వీరిలోనూ 10 శాతం మంది కనీసం ఏడు రోజులు, అంతకంటే ఎక్కువ సమయం పాటు మంచాన పడ్డారు. ఇలా మంచాన పడ్డవారిలో చాలామంది ఇతరులతో పోలిస్తే 37 శాతం ఎక్కువ లాంగ్ కోవిడ్ లక్షణాలతో సతమతమయ్యారు. అవేమిటంటే... ► శ్వాస ఆడకపోవడం ► ఛాతీ నొప్పి ► తల తిప్పడం ► తలనొప్పి ► మంచాన పడ్డ వారితో పోలిస్తే ఇతరుల్లోనూ ఇలాంటి లక్షణాలు తలెత్తినా వాటి తీవ్రత మాత్రం అంత ఎక్కువగా లేదు. లాంగ్ కోవిడ్ అంటే... ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం కోవిడ్ సోకిన మూడు నెలల తర్వాత దాని తాలూకు లక్షణాలు తిరగబెట్టి కనీసం రెండు నెలలు, ఆ పైనకొనసాగితే దాన్ని లాంగ్ కోవిడ్‌గా పేర్కొంటారు. ► కోవిడ్ బారిన పడ్డ వారిలో కనీసం 10 నుంచి 20 శాతం మందిలో లాంగ్ కోవిడ్ తలెత్తినట్టు పలు అధ్యయనాల్లో తేలింది. ‘‘లాంగ్ కోవిడ్ ప్రజారోగ్యానికి పెద్ద సమస్యగా మారింది. అంతర్జాతీయంగా ఎంతోమంది దీని బారిన పడ్డారు’’అని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ డాక్టోరల్ స్టూడెంట్ ఎమిలీ జోయ్స్ వివరించారు. ‘అందుకే కోవిడ్ తాలూకు దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావంపై ఓ కన్నేసి ఉంచాలి. కనీసం రెండేళ్ల దాకా శారీరక మార్పులు, సమస్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ఉండాలి’అని సూచించారు. -
ఎవాస్క్యులార్ నెక్రోసిస్ అంటే?
మన దేహంలోని నడుము భాగంలో కటి ఎముకలో రెండు గిన్నెల (సాకెట్స్) వంటి ఖాళీ భాగాలుంటాయి. ఆ రెండింటిలో తొడ ఎముక చివరన బంతిలా గుండ్రంటి భాగం (బాల్) సరిగ్గా అమరి ఉంటుంది. ఈ బంతి వంటి భాగాన్ని ‘ఫీమోరల్ హెడ్’ అంటారు. గిన్నె వంటి భాగంలో బంతి అమరి ఉండటం వల్లనే దీన్ని బంతి గిన్నె కీలుగా చెబుతారు. ఈ నిర్మాణమూ, ఈ అమరికే మనల్ని నిలబెడుతుంది, నిటారుగా ఉంచుతుంది, కదిలేందుకు ఉపకరిస్తుంది. కొంతమందిలో తొడ ఎముక చివర్న ఉండే ఆ బంతి వంటి భాగానికి ఆహారం, పోషకాలు, ఆక్సిజన్ అందక చచ్చుబడినట్లుగా అవుతుంది. ఆ కండిషన్‌ను ‘ఎవాస్క్యులార్ నెక్రోసిస్’ అంటారు. అలా అయినప్పుడు దాన్ని చక్కదిద్దడానికి తుంటి ఎముక సర్జరీ చేయాల్సి వస్తుంది. భారత్‌లోని తుంటి ఎముక సర్జరీల్లో ఈ కారణంగా జరిగేవే చాలా ఎక్కువ. ఈ ఎవాస్క్యులార్ నెక్రోసిస్ గురించి అవగాహన కోసమే ఈ కథనం. తొడ ఎముకలోని బంతి వంటి భాగం (ఫీమోరల్ హెడ్) చచ్చుబడిపోయిపోవడం వల్ల వచ్చే ఎవాస్క్యులార్ నెక్రోసిస్ కేసులు ఇటీవల ఎక్కువగా వస్తున్నాయి. ఇలా చచ్చుబడ్డాక తుంటి ఎముక కూడా క్రమంగా అరుగుతూ ఉంటుంది. గతంలో (ఇప్పటికీ) ఏ మూత్రపిండాల జబ్బుల కారణంగానో లేదా ఏ ఇతర ఆరోగ్య సమస్యల వల్లనో స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడినప్పుడు ఎవాస్క్యులార్ నెక్రోసిస్‌కు దారితీయడానికి అవకాశాలు ఎక్కువ. అయితే ఇటీవల కోవిడ్–19 వచ్చినప్పుడు స్టెరాయిడ్స్‌తో చికిత్స చేయడం చాలా ముమ్మరంగా జరగడంతో 20 – 30 ఏళ్ల వారిలో సైతం ఈ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. వీళ్లలోనూ యువతులతో పోలిస్తే యువకులే ఎవాస్క్యులార్ నెక్రోసిస్‌కు ఎక్కువగా గురవుతున్నారు (యువకులు, యువతుల నిష్పత్తి 3 : 2గా ఉంది). ఈమధ్య ఈ కేసులు గతంతో పోలిస్తే ఐదు నుంచి పదింతలు ఎక్కువ కావడం ఆందోళన కలిగించే అంశం. ఎందుకు వస్తుందంటే..? ఏదైనా ప్రమాదంలోగానీ లేదా ఏదైనా కారణంతో తుంటి ఎముకకు గాయం కావడం. ఎసెటాబ్యులర్ ఫ్రాక్చర్ (అంటే బాల్ అండ్ సాకెట్ ప్రాంతంలోని స్కెలిటల్ స్ట్రక్చర్‌లో ఎక్కడైనా ఫ్రాక్చర్ కావడం) వంటి కారణాలతో ఫీమోరల్ హెడ్‌కు రక్తసరఫరా సరిగా జరగకపోవడం. ∙ఇతర ఆరోగ్య సమస్యలను మాయం చేయడానికి స్టెరాయిడ్స్ వాడాల్సి రావడంతో.. ఆ దుష్ప్రభావం ఫీమోరల్ హెడ్‌పై పడి, దానికి పోషకాలు, ఆక్సిజన్ ఆగిపోవడం. ∙ముందుగా చెప్పుకున్నట్లు కోవిడ్ సమయంలో కొందరు రోగులను ప్రాణాపాయం నుంచి రక్షించేందుకు స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడాల్సి రావడం.. రెండేళ్ల తర్వాత ఆ దుష్ప్రభావాలు ఈ రూపంలో ఇప్పుడు కనిపించడం. ∙కొన్ని సందర్భాల్లో నిర్దిష్టంగా ఏ కారణమూ కనిపించకుండా కూడా ఈ పరిణామం చోటు చేసుకోవచ్చు. లక్షణాలు.. తుంటి ఎముక ప్రాంతంలో, గజ్జెల్లో నొప్పి రావడం. ∙తుంటి ప్రాంతంలో తీవ్రమైన నొప్పితో నడకకష్టం కావడం. కొన్ని సందర్భాల్లో కనీసం నిలబడలేకపోవడం లేదా ఏమాత్రం కదల్లేకపోవడం. ఎక్కువ సేపు కూర్చుని, ఆ తర్వాత నిలబడ్డప్పుడు కీళ్లు స్టిఫ్‌గా అయినట్లు అనిపించడం. నడిచే సామర్థ్యం క్రమక్రమంగా తగ్గిపోతుండటం.. ఎక్కువ దూరం నడవలేక కుంటుతున్నట్లుగా నడవడం. వ్యాధి బాగా ముదిరాక... పై కారణాలతో బాధితులు తమ రోజువారీ పనులు కూడా చేసుకోలేకపోవడం. చికిత్స స్టేజ్1, స్టేజ్2లో సాధారణంగా స్టేజ్–1, స్టేజ్–2 లలో ఫీమోరల్ హెడ్ కొంతవరకు నొక్కుకుపోయినట్లుగా కావడంతో దానికి మందులతోనే చికిత్స చేస్తారు. ఇలా ఫీమోరల్ హెడ్ నొక్కుకుపోవడంతో కొంతమంది బాధితుల్లో చాలా తీవ్రమైన నొప్పి, కదలలేకపోవడం, కుంటటం వంటివి జరుగుతుంటే తొలిదశలో ‘కోర్ డికంప్రెషన్’ అనే శస్త్రచికిత్స చేస్తారు. దీంతోపాటు దెబ్బతిన్న / నశించిపోయిన అక్కడి కణాలు తిరిగి పుట్టేందుకు స్టెమ్‌సెల్స్‌ను పంపించి చికిత్స అందిస్తారు. అయితే ఈ తరహా ‘కోర్ డి–కంప్రెషన్’ శస్త్రచికిత్స గానీ, స్టెమ్‌సెల్ థెరపీగానీ అందరిలోనూ ఒకేలాంటి ఫలితాలు ఇవ్వదు. కేవలం 65% మాత్రమే సక్సెస్ రేటు ఉంటుంది. అందునా ఫీమోరల్ హెడ్ పూర్తిగా దెబ్బతినక ముందు మాత్రమే ఈ ‘కోర్ డి–కంప్రెషన్’ శస్త్రచికిత్స సాధ్యమవుతుంది. చికిత్స స్టేజ్-3, స్టేజ్-4లలో స్టేజ్–3, స్టేజ్–4 స్థాయి బాధితుల్లో సమస్య తీవ్రత చాలా ఎక్కువగా ఉండటం, ఫీమోరల్ హెడ్ అనే ఆ బాల్ పూర్తిగా దెబ్బతినడంతో ‘హిప్ రీప్లేస్మెంట్’ అనే తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అవసరమవుతుంది. పైగా ఆ దశలో ఆ శస్త్రచికిత్స తప్పక అవసరం. ఒకవేళ సరైన సమయంలో చికిత్స జరగకపోతే అది ఆ తర్వాత ‘ఆస్టియో ఆర్థరైటిస్’ అనే ఎముకల తీవ్రమైన అరుగుదల, అవి బోలుగా మారిపోవడం వంటి కండిషన్స్ ఏర్పడతాయి. నిజానికి ఇప్పడున్న పరిస్థితుల్లో 20, 30 ఏళ్ల యువత ‘ఎవాస్క్యులార్ నెక్రోసిస్’ బారిన పడుతున్న తరుణంలో, ఈ వయసువాళ్లను కదల్లేకుండా ఒకేచోట కుదురుగా ఉంచే పరిస్థితులు ఉండవు. అది సరికాదు కూడా. ఇప్పుడు అందుబాటులో ఉన్న సాంకేతికత, తుంటి ఎముక మార్పిడికి దోహదపడేందుకు వాడే సిరామిక్, పాలీ సిరామిక్ వంటి నాణ్యమైన పదార్థాలు, రోబోటిక్ సర్జరీ వంటి ప్రక్రియల వల్ల ఈ యువత బాగా కోలుకునేలా చేసే అవకాశాలున్నాయి. ఎవాస్క్యులార్ నెక్రోసిస్ రాకమునుపు ఉన్న పరిస్థితే పునరావృతమయ్యేలా, నొప్పి ఏమాత్రం లేకుండా పూర్తిగా బాసిపట్లు వేసుకుని కూర్చునేలా చేయగలగడం ఇప్పుడు సాధ్యమే. అయితే లక్షణాలు కనిపించగానే, ముందు దశల్లోనే డాక్టర్‌ను సంప్రదించడం అవసరం. నిర్ధారణ ఎవాస్క్యురాల్ నెక్రోసిస్‌కు సంబంధించిన లక్షణాలు కనిపించినప్పుడు.. వారికి ఎక్స్–రే, ఎమ్మారై స్కాన్ పరీక్షలు చేసి, ఎవాస్క్యులార్ నెక్రోసిస్‌ను నిర్ధారణ చేస్తారు. చికిత్స ఎవాస్క్యులార్ నెక్రోసిస్ సమస్య స్టేజ్–1, స్టేజ్–2, స్టేజ్–3, స్టేజ్–4 అనే నాలుగు దశల్లో జరుగుతుంది. అంటే... ఫీమోరల్ హెడ్ అనే బంతి లాంటి నిర్మాణానికి ఏమేరకు రక్తసరఫరా, పోషకాలు, ఆక్సిజన్ తగ్గుతాయనే అంశాన్ని బట్టి ఎవాస్క్యులార్ నెక్రోసిస్ తీవ్రత, స్టేజ్ అనేవి ఆధారపడి ఉంటాయి. నివారణ నిజానికి దీనికి నివారణ అంటూ లేదు. ఎందుకంటే ఫీమోరల్ హెడ్‌గా పేర్కొనే ఆ బాల్వంటి ప్రాంతానికి రక్తప్రసరణలో అంతరాయం కలగడం లేదా ఆగిపోయాక మాత్రమే లక్షణాలు బయటపడతాయి. అందుకే ముందుగా నివారణ అన్నది సాధ్యం కాదు. అయితే స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకునేవారిలో ఇది కనిపిస్తుందన్న అంశాన్ని బట్టి... ఈ విషయంలో కాస్త నియంత్రణ పాటిస్తే నివారణకు కొంతవరకు అవకాశం ఉంటుంది. ఉదాహరణకు... స్టెరాయిడ్స్ తీసుకునే బాధితులు రోజుకు 20 మి.గ్రా. నుంచి 30 మి.గ్రా. వాడేవారూ, అలాగే చాలాకాలం పాటు స్టెరాయిడ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నవారు తమ ఫిజీషియన్‌ను సంప్రదించి, మున్ముందు తమకు హానికరం కాని మోతాదుల్లో మాత్రమే స్టెరాయిడ్స్ తీసుకునేలా జాగ్రత్త వహించవచ్చు. (చదవండి: 127 గంటలు.. డ్యాన్స్!) -
ఒత్తిడి సైలెంట్ కిల్లర్.. స్ట్రెస్‌తో వచ్చే వ్యాధులేంటో తెలుసా?
లబ్బీపేట(విజయవాడతూర్పు): మానసికంగా బలంగా ఉన్నప్పుడే ఆరోగ్యకరంగా జీవించగలం... మనసు, ఆలోచనలు అదుపులో ఉంచుకోవడం ద్వారానే ఎవరైనా ప్రశాంతంగా జీవించేందుకు వీలుంటుంది. కానీ నేటి పోటీ ప్రపంచంలో ఉరుకులు, పరుగుల జీవన విధానంలో యంత్రాల్లా మారిన జీవితంలో ప్రతి ఒక్కరూ ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. విధి నిర్వహణ, వ్యాపారం, ఉద్యోగరీత్యా ఇలా రకరకాల ఒత్తిళ్లు సహజంగానే ఉంటున్నాయి. చదవండి: దగ్గును బలవంతంగా ఆపుకోకండి! ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు సైతం ఎక్కువగానే వస్తున్నాయి. తీవ్రమైన ఒత్తిళ్లు చుట్టుముడుతూ మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నారు. ఆ ఫలితంగా శారీరక సమస్యలు చుట్టు ముడుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా సెకండ్‌వేవ్ సమయంలో భయం, ఆందోళన, ఒత్తిడితోనే ఎక్కువ మంది శ్యాస ఇబ్బందులతో మృతి చెందినట్లు వైద్యులు అంటున్నారు. హార్మోన్స్‌పై ప్రభావం.. మానసికంగా తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొనే వారిలో డొపమైన్, కార్టిసోల్ అనే హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. ఇవి మిగతా హార్మోన్స్‌పై ప్రభావం చూపుతాయని వైద్యులు అంటున్నారు. ఆ ఫలితంగా శరీరంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగిపోవడం, అధిక రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈటింగ్ డిజార్డర్స్‌తో కొందరు అసలు ఆహారం తీసుకోకపోవడం, మరికొందరు అధిక ఆహారం తీసుకోవడం చేస్తారు. దీంతో కొందరు రక్తహీనత సమస్యలు ఎదుర్కొంటారని, మరికొందరు ఊబకాయలుగా మారుతున్నారు. అంతేకాదు తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొనే వారిలో గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. గుండె లయ తప్పుతుంది.. తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొనే వారిలో హార్ట్‌బీట్‌లో తేడా వస్తుంది. ఒత్తిడి, ఆందోళన ఎక్కువైన వారిలో ఒక్కోసారి హార్ట్‌రేట్ పెరిగి సడన్ హార్ట్ ఎటాక్‌కు గురయ్యే ప్రమాదమూ లేకపోలేదు. ఒత్తిళ్లతో రక్తపోటు అదుపులో లేని వారిలో హెమరైజ్డ్ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఈ తరహా బ్రెయిన్ స్ట్రోక్ ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. రిలాక్సేషన్ అవసరం.. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఒత్తిడికి గురికాకుండా, దాని పరిష్కారంపై దృష్టి పెట్టాలి. ఒత్తిళ్లను అధిగమించేందుకు వ్యాయామం, యోగా, మెడిటేషన్ ఉపయోగకరంగా ఉంటాయి. వాటి ద్వారా మన ఆలోచనలను మళ్లించి మనసు రిలాక్సేషన్ కలిగేలా దోహదపడతాయి. ఏదైనా పనిలో ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడు దానికి ఉపశమనం కలిగే మార్గాన్ని అన్వేషించాలి. మానసిక ప్రశాంతత అవసరం ప్రతి ఒక్కరికీ మానసిక ప్రశాంతత చాలా అవసరం. ఒత్తిళ్లకు గురైనప్పుడు వ్యాయామం, యోగా, మెడిటేషన్ వంటివి చేయడం ద్వారా ప్రశాంతత లభిస్తుంది. సమస్య ఎదురైనప్పుడు పరిష్కారంపై దృష్టి పెట్టాలి. మానసిక ఒత్తిళ్లు శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. హార్మోన్‌పై ఎఫెక్ట్ చూపి షుగర్ లెవల్స్ పెరగడం, రక్తపోటు, హార్ట్‌రేట్‌లో తేడాలు వంటివి చోటుచేసుకుంటాయి. మానసికంగా పటిష్టంగా ఉన్పప్పుడే శారీరకంగా బలంగా ఉంటారు. మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా జీవించగలుగుతారు. – డాక్టర్ వెంకటకృష్ణ, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి జీజీహెచ్ ఏకాగ్రత తగ్గుతుంది మానసికంగా తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొనే వారిలో ఏకాగ్రత తగ్గుతుంది. ఉద్యోగులైతే పనిమీద, విద్యార్థులైతే చదువుపై దృష్టి పెట్టలేరు. పనిని తర్వాత చేయవచ్చులే అని వాయిదా వేస్తూ ఉండటంతో సోమరితనం పెరిగిపోతుంది. ఇలాంటి వారు ఈటింగ్ డిజార్డర్‌కు గురవుతారు. అసలు ఆహారం తీసుకోకపోవడం, లేకుండా ఎక్కువ ఆహారం తీసుకోవడం చేస్తారు. దీంతో జీర్ణకోశ ఇబ్బందులు తలెత్తుతాయి. మనసు, ఆలోచనలు అదుపులో ఉంచుకోవడం ద్వారా మానసికంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. – డాక్టర్ గర్రే శంకర్రావు, మానసిక నిపుణులు, విజయవాడ -
Diabetes: బార్లీ, కొర్రలు.. వేపుళ్లు, నేతి వంటకాలు.. ఏవి తినాలి? ఏవి వద్దు?
ఇటీవలి కాలంలో ఎక్కువమందికి వస్తున్న జీవనశైలి వ్యాధులలో మధుమేహం ఒకటి. షుగర్ వ్యాధి పేరులోనే చక్కెర ఉంది కానీ, రుచికి మాత్రం చేదే. ఇది చాపకింద నీరులా కిడ్నీల పనితీరు మందగించేలా చేస్తుంది. ముఖ్యంగా కనుదృష్టిని క్షీణింపచేస్తుంది. అలాగని షుగర్ ఉన్న వారంతా భయపడాల్సిన పనిలేదు. చాలామంది మధుమేహం ఉన్నా దశాబ్దాల తరబడి చక్కగానే ఉంటున్నారు. అయితే ఏ వ్యాధినైనా వచ్చాక బాధపడేకంటే రాకుండా నివారించుకోవడమే చాలా మేలు. చిత్రం ఏమిటంటే బీపీ, షుగర్ చాలా మందికి అవి వచ్చినట్లే తెలియదు. ఏవో కొన్ని లక్షణాలను బట్టి డాక్టర్ దగ్గరకు వెళ్తే, వారి సలహా మేరకు పరీక్షలు చేయించుకుని ఉన్నట్లు తెలుసుకుని అప్పుడు చికిత్స తీసుకుంటున్నారు. అందువల్ల షుగర్ వ్యాధి లక్షణాలేమిటో, అది ఎందుకు వస్తుందో, అది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకుందాం. లక్షణాలు ►ఆరోగ్యవంతులు 24 గంటల కాలాన విసర్జించే మూత్ర ప్రమాణం 800 – 2500 మిల్లీలీటర్లు ఇంతకన్నాఅధికంగా మూత్రవిసర్జన జరిగితే దానిని అతి మూత్రవ్యాధిగా చెప్పవచ్చు. ఇలా అతిగా మూత్రం పోవడం అన్నది డయాబెటిస్‌కు ఒక సూచన. ►మొదటి ప్రధాన లక్షణం మాటిమాటికీ మూత్ర విసర్జన చేయాల్సి రావడం... అదీ ఎక్కువ ప్రమాణంలో. అంతేగాకుండా చెమట ఎక్కువ పట్టడం, నిద్ర పట్టకపోవడం, ఆకలి, నిస్సత్తువ, నిస్త్రాణ, ఎక్కువ దాహం కావడం, కళ్లు తిరిగినట్లుండటం, కంటిచూపు మసకబారటం వంటివి ఇందులో ప్రధాన లక్షణాలు. అలాగని ఈ లక్షణాలు ఉన్నవారందరికీ షుగర్ ఉందని కాదు. థైరాయిడ్ సమస్య ఉన్నవారిలోనూ ఇంచుమించు ఇటువంటి లక్షణాలే ఉంటాయి. అందులో అయితే గొంతు వద్ద వాపు, జుట్టు ఊడిపోవటం వంటివి అదనపు లక్షణాలు. యువ తరం నుంచి మధ్య వయసులోకి వస్తున్న వారు మధుమేహం, రక్తపోటు వంటివి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ►ఆఫీసుల్లో లేదా పని ప్రదేశాల్లో శారీరక శ్రమ లేకుండా అదే పనిగా కూర్చుండటం, ఎక్కువసేపు నిద్రించటం, పెరుగు, రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోవడం, పాలు, బెల్లం, తీపివస్తువులు, అరటి, సపోటా, మామిడి లాంటి తీపి ఎక్కువగా ఉండే పండ్లను అధికంగా తినడం, కొవ్వుపదార్థాలు తీసుకోవడం, చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు తరచు తీసుకోవడం మధుమేహానికి ప్రధాన కారణాలు. స్థూలకాయం... షుగర్ క్లోజ్ ఫ్రెండ్స్ అని గుర్తించాలి. ►సక్రమమైన ఆహారాలు, క్రమం తప్పకుండా వ్యాయామం వలన చక్కెర అదుపులో ఉంటుంది. నివారణ ►మధుమేహ నివారణలో మందులతో పాటు ఆహార నియమాలు కూడా ప్రధానపాత్ర పోషిస్తాయి. ►ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయపు నడక లేదా సాయంత్రపు నడకను కచ్చితంగా అలవర్చుకోవాలి. పైన చెప్పిన నియమాలు పాటిస్తూ మధ్యాహ్న సమయంలో మజ్జిగ అన్నంలో 50 గ్రాముల ఉల్లిపాయని నంజుకొని తినడం మంచిది. అయితే పెరుగన్నం లేదా చిక్కటి మజ్జిగ బదులు పలుచటి మజ్జిగే మంచిది. ►పరగడుపునే ఒక లీటర్ నీటిని తాగడం, కాకర కాయ కూరను తరచు ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. ►నెలకి ఒకసారి కచ్చితంగా ఉపవాసం చేయాలి. ఇది షుగర్ లేనివాళ్లకు మాత్రమే. ►యోగాసనాలు, సూర్య నమస్కారాలు దినచర్యలో భాగం చేసుకుంటే దాదాపుగా మధుమేహం, రక్తపోటు నుంచి బయటపడవచ్చు. తినవలసినవి.. బార్లీ, గోధుమలు , కొర్రలు , రాగులు, పాతబియ్యపు అన్నం , పెసలు , కాయగూరలు, ఆకుకూరలు , చేదుపొట్ల , కాకరకాయ , మెంతులు, దొండకాయ, వెలగపండు, మారేడు , నేరేడు గింజలు, ఉసిరిక పండు, పసుపు, పండ్లలో యాపిల్, బొప్పాయి, జామ, బత్తాయి. దానిమ్మ మంచిది. తినకూడనివి.. ఎక్కువగా పాలిష్ చేసిన బియ్యం, వేపుళ్లు, నేతి వంటకాలు, మద్యం, చెరుకు రసం, పుల్లటి పదార్థాలు, చింతపండు, పెరుగు, వెన్న , జున్ను , దుంప కూరలు, కొవ్వులు అధికంగా ఉండే పదార్థాలు వాడకూడదు. అదేవిధంగా రాత్రిపూట మేలుకొని పగలు ఎక్కువ నిద్రించటం, ధూమపానం, మద్యపానం మంచిది కాదు. మలమూత్రాలను ఆపుకోకపోవడం మంచిది. తనంతట తానుగా మన శరీరం దాదాపు ప్రతి వ్యాధిని నివారణ చేసుకోగలదు. కానీ మధుమేహం వస్తే అది కుదరకపోవచ్చు. అందుకే డయాబెటిస్ విషయంలో నివారణకే ప్రాధాన్యం ఇవ్వాలి. చదవండి: ఈ హెర్బల్ టీతో ఇమ్యునిటీని పెంచుకోండి ఇలా.. -
ఏడాది దాటినా లక్షణాలు
బీజింగ్: కరోనా సోకి ఆస్పత్రిలో చేరిన వారిలో.. వ్యాధి తగ్గిన ఏడాది తర్వాత కూడా లక్షణాలు కనిపిస్తున్నాయని తాజా అధ్యయనంలో తేలింంది. చైనాలోని వుహాన్‌లో జరిగిన ఈ అధ్యయనం శుక్రవారం ది లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైంది. కరోనా సోకినప్పటి నుంచి 12 నెలల పాటు 1,276 మందిపై ఈ అధ్యయనం చేసినట్లు వుహాన్‌లోని చైనా–జపాన్ ప్రెండ్షిప్ హాస్పిటల్ ప్రొఫెసర్ బిన్ కావ్ తెలిపారు. అధ్యయనంలో ఉన్న చాలా మంది కరోనా నుంచి బాగానే కోలుకున్నప్పటికీ, వ్యాధి ముదిరి ఐసీయూ వరకు వెళ్లిన రోగులకు మాత్రం ఏడాది తర్వాత కూడా లక్షణాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. 2020 జనవరి 7 నుంచి మే 29 మధ్య డిశ్చార్జ్ అయిన వారిపై ఈ ప్రయోగం జరిగిందని పేర్కొన్నారు. ఆరోగ్యంగా లేరు.. కరోనా సోకిన వారిని, సోకని వారిని పోల్చి చూస్తే వ్యాధి సోకిన వారు ఏడాది తర్వాత కూడా వ్యాధి సోకని వారిలా ఆరోగ్యంగా లేరని లాన్సెట్ జర్నల్ తెలిపింది. కరోనా నుంచి కోలుకోవడానికి కొందరికి ఏడాదికి పైగా పడుతుందని ఈ అధ్యయనంద్వారా వెల్లడైనందున, కోవిడ్ అనంతరం ఆరోగ్య సేవలు అందించే వ్యవస్థల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ అధ్యయనంలో పాల్గొన్న రోగులకు సంబంధించిన ఆరోగ్య వివరాలను ఆరు నెలల తర్వాత మొదటి సారి, పన్నెండు నెలల తర్వాత రెండో సారి సేకరించినట్లు వెల్లడించింది. లక్షణాలేవంటే.. కరోనా సోకి నయమైన వారిలో చాలా మందికి ఏ లక్షణాలు లేకుండా పోగా, సగం మందిలో మాత్రం పలు లక్షణాలు అధ్యయనకర్తలు గుర్తించినట్లు లాన్సెట్ వెల్లడించింది. నీరసంగా ఉండటం, కండరాల బలహీనతలు అత్యంత ఎక్కువగా కనిపించినట్లు లక్షణాలని తెలిపింది. ఆరు నెలల తర్వాత సగం మందిలో ఈ లక్షణాలు కనిపించగా, ఏడాది తర్వాత ఇవి ప్రతి అయిదు మందిలో ఒకరికి పరిమితమయ్యాయని పేర్కొంది. పన్నెండు నెలల తర్వాత కూడా ప్రతి ముగ్గురిలో ఒకరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లు చెప్పింది. లక్షణాలు కనిపించిన వారిలో.. కరోనా సోకిన సమయంలో ఐసీయూ వరకు వెళ్లి ఆక్సిజన్ ట్రీట్మెంట్ పొందిన వారు అత్యధికంగా ఉన్నట్లు వెల్లడించింది. పరీక్షలివే.. 349 మందికి లంగ్ ఫంక్షన్ టెస్టు (ఊపిరితిత్తుల పనితీరు పరీక్ష) నిర్వహించామని, వారిలో 244 మందికి 12 నెలల తర్వాత కూడా అదే పరీక్షను తిరిగి నిర్వహించినట్లు పరిశోధకులు తెలిపారు. ఆరు నెలల సమయంలో నిర్వహించిన పరీక్షలో వచ్చిన ఫలితాలే సంవత్సరం తర్వాత కూడా వచ్చాయని, ఏ మాత్రం మెరుగు పడలేదని తాము గుర్తించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. మరో 353 మందికి ఆరు నెలల తర్వాత సీటీ స్కాన్ చేయగా, వారిలో సగం మంది ఊపిరితిత్తులు అసహజ పనితీరును చూపినట్లు తెలిపారు. అనంతరం 12 నెలల తర్వాత 118 మందికి సీటీ స్కాన్ నిర్వహించగా, అసహజ పనితీరు తగ్గినట్లు గుర్తించామని తెలిపారు. మహిళల్లోనే ఎక్కువ.. పురుషులతో పోలిస్తే మహిళల్లో నీరసం, కండరాల బలహీనత 1.4 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలిందని లాన్సెట్ జర్నల్ తెలిపింది. ఆందోళన, కుంగుబాటు వంటివి కూడా పురుషులతో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువగా మహిళల్లో నమోదైందని చెప్పింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ పురుషులతో పోలిస్తే మహిళల్లో 12 నెలల తర్వాత కూడా ఏకంగా మూడు రెట్లు ఎక్కువగా నమోదైందని పేర్కొంది. స్టెరాయిడ్స్ తీసుకున్న వారిలో కూడా 1.5 రెట్లు ఎక్కువ లక్షణాలు కనిపించినట్లు తెలిపింది. అయితే ఈ పరిశోధన మొత్తం ఒకే ఆస్పత్రిలో చేరిన వారిపై జరిగిందని, అందువల్ల అన్ని ప్రాంతాలకు దీన్ని వర్తింపజేయలేమని పరిశోధనలో పాల్గొన్న జియోయింగ్ గున్ అభిప్రాయపడ్డారు. అధ్యయనం సాగిందిలా.. అధ్యయనంలో భాగంగా ఆస్పత్రికి చెందిన నిపుణులు కరోనా నుంచి కోలుకున్న వారితో రెండు సార్లు ముఖాముఖి సమావేశాలను నిర్వహించారు. భౌతిక పరీక్షలు, ల్యాబ్ పరీక్షలు, ఆరు నిమిషాల నడక పరీక్ష వంటి పలు టెస్టులను జరిపారు. కరోనా తగ్గిన 185, 349వ రోజున ఈ ముఖాముఖిలను, పరీక్షలను నిర్వహించినట్లు తెలిపారు. అధ్యయనంలో పాల్గొన్న వారి సగటు వయసు 57 ఏళ్లుగా ఉందని స్పష్టం చేశారు. కరోనా తగ్గిన తర్వాత ఆరు నెలలకు 68 శాతం మందిలో కరోనా లక్షణాలు కొనసాగాయని, ఏడాది తర్వాత అది 49 శాతానికి తగ్గిందన్నారు. అంటే ఏడాది తర్వాత కూడా సగం మందికి కరోనా లక్షణాలు కొనసాగినట్లు తేలిందని పరిశోధనలో పాల్గొన్న వారు పేర్కొన్నారు. -
సెకండ్ వేవ్: చిన్నారులపై పంజా.. తల్లిదండ్రుల్లో ఆందోళన
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌లో పిల్లల్నీ విడిచిపెట్టడం లేదు. ఎక్కువగా ప్రీ టీన్స్‌లో ఉన్న చిన్నారులపై దాడి చేస్తోంది. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఎందుకిలా జరుగుతోంది? నిపుణులు చెబుతున్న జాగ్రత్తలేంటి? కరోనా సెకండ్ వేవ్‌లో చిన్నారులు కూడా ఈ మహమ్మారి బారినపడటం ఆందోళన పెంచుతోంది. 10 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న వారిపై ఎక్కువగా కరోనా దాడి చేస్తోంది. 1–8 మధ్య వయసున్న వారిలో స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ వేవ్‌లో లక్షణాలు లేకుండా... గత ఏడాది కూడా పిల్లలకి కరోనా సోకినప్పటికీ వారిలో లక్షణాలు లేకపోవడంతో దానికి సంబంధించిన వార్తలు పెద్దగా బయటకి రాలేదు. కరోనా వారికి ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు పోయిందో తెలిసే అవకాశం లేదని అపోలో ఆస్పత్రిలో పీడియాట్రిషన్ డాక్టర్ అంజన్ భట్టాచార్య తెలిపారు. ‘గత ఏడాది చిన్నపిల్లల్లో 1 శాతం మందికి కరోనా సోకితే, ఈ సారి 1.2 శాతం మందికి సోకింది. శాతాల్లో చూస్తే తక్కువగానే కనిపించినా సంఖ్యలో ఇది చాలా ఎక్కువ. ప్రభ్వుత్వం పిల్లల్లో కరోనాకి సంబంధించి ఎలాంటి అధికారిక గణాంకాలు విడుదల చేయడం లేదు’’ అని ఆయన వెల్లడించారు. డబుల్ మ్యూటెంట్ కారణమా? కరోనా సెకండ్ వేవ్‌లో పిల్లలకి కరోనా సోకడానికి డబుల్ మ్యూటెంట్ కారణమని వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఈ వైరస్‌కి త్వరగా వ్యాప్తి చెందే లక్షణంతో పాటుగా రోగనిరోధక వ్యవస్థని నిర్వీర్యం చేసే సామర్థ్యం కూడా ఉంది. దీంతో పిల్లల్లో ఈ వైరస్ సులభంగా సోకుతోంది. కరోనా తగ్గిన తర్వాత రెండు నుంచి నాలుగు వారాల్లో వచ్చే ఎంఐఎస్‌సి (మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్) వ్యాధితో ఎక్కువ మంది పిల్లలు తమ దగ్గరకి వస్తున్నట్టుగా కోల్‌కతాకు చెందిన పీడియాట్రిషన్ డాక్టర్ జయదేవ్ రే చెప్పారు. అంతేకాకుండా కోవిడ్ సోకిన పిల్లల్లో 40–50 శాతం మంది గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నట్టుగా రే వెల్లడించారు. పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ లేదు పిల్లల్లో ఇప్పటివరకు పెద్ద కంపెనీలేవీ వ్యాక్సిన్ ప్రయోగాలు ఇంకా జరపలేదు. గత వారం అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజం ఫైజర్ తమ వ్యాక్సిన్ 12–15 ఏళ్ల వయసు వారిపై బాగా పని చేస్తుందని వెల్లడించింది. హైదరాబాద్‌కి చెందిన భారత్ బయోటెక్ 5 నుంచి 18 ఏళ్ల మధ్య వారిపై ప్రయోగాలు జరపడానికి అనుమతి కోరినప్పటికీ తగినంత గణాంకాలు (డేటా) సమర్పించకపోవడంతో కేంద్రం అనుమతి నిరాకరించింది. మరోవైపు అమెరికాలో అత్యధికంగా 13 శాతం మంది పిల్లలు కరోనా బారినపడటంతో ఆ దేశం కూడా చిన్నారులకి వ్యాక్సిన్ ప్రయోగాలు మొదలు పెట్టే యోచనలో ఉంది. యూకే, ఇజ్రాయెల్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. – నేషనల్ డెస్క్, సాక్షి చిన్నారుల్లో కోవిడ్ లక్షణాలు ♦గ్యాస్ట్రిక్ సమస్యలు ♦ఆకలి మందగించడం ♦వాంతులు, విరోచనాలు ♦ఒళ్లంతా దద్దుర్లు ♦కళ్లు ఎర్రబారడం ♦జ్వరం, పొడి దగ్గు ♦శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ♦భౌతిక దూరం పాటించాలి ♦ఆడుకోవడానికి బయటకి వెళ్లనివ్వకూడదు, ఇండోర్ గేమ్స్‌కే ప్రాధాన్యతనివ్వాలి ♦స్నేహితులతో వీడియో కాల్స్ ద్వారా మాత్రమే మాట్లాడనివ్వాలి ♦తప్పనిసరిగా మాస్కు ధరించాలి ♦ముక్కు, ముఖంతో పాటు కళ్లపైకి కూడా చెయ్యి వెళ్లకుండా చూసుకోవాలి. కళ్ల ద్వారా ఎక్కువగా వైరస్ సోకే అవకాశాలున్నాయి. -
కేన్సర్ ప్రాథమిక లక్షణాలు ఏంటో తెలుసా?
గడ్డిమోపులో పడ్డ చిన్న నిప్పు రవ్వను గమనించకుండా నిర్లక్ష్యం చేస్తే చివరికి ఏమవుతుందో... శరీరానికి సోకిన క్యాన్సర్‌ను సకాలంలో గుర్తించకపోతే అదే అనర్థం జరుగుతుంది. అందుకే కొన్ని లక్షణాలను బట్టి క్యాన్సర్‌ని మొదట్లోనే గుర్తించగలిగితే ఎంతో ప్రమాదాన్ని నివారించగలుగుతాం. క్యాన్సర్ లక్షణాలు అవయవానికీ అవయవానికీ మారిపోతాయి. అయితే క్యాన్సర్ రోగులందరిలో కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. ఇవి ఆరోగ్యవంతుల్లోనూ అప్పుడప్పుడూ కనిపించేవి కావడంతో వాటిని గుర్తించడం కష్టం. తల నుంచి శరీరం కింది భాగం వరకు ఆయా అవయవ భాగాల్లో తొలి దశలోనే క్యాన్సర్‌ను గుర్తించేందుకు కొన్ని ప్రాథమిక లక్షణాలివి. గుర్తించేందుకు కొన్ని సాధారణ అంశాలు... అకారణంగా ఆకలి మందగించడం, బరువు తగ్గడం, ఎడతెరిపి లేకుండా దగ్గు లింఫ్ గ్లాండ్స్ (బాహుమూలాల్లో, గజ్జల్లో, గొంతుదగ్గర) వాపు (కొన్నిసార్లు కొన్ని అవయవాలలో మాత్రమే) అవయవాలనుంచి రక్తస్రావం... ఇవి సాధారణంగా కనిపించే లక్షణాలు. అయితే ఈ లక్షణాలన్నీ తప్పనిసరిగా క్యాన్సర్‌వే కానక్కర్లేదు. వీటిలో ఏదో ఒకటి కనిపించిన మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరమూ లేదు. కానీ ప్రాథమిక చికిత్స తీసుకున్న తర్వాత కూడా, అదేపనిగా ఇబ్బంది పడుతుంటే మాత్రం ఒకసారి డాక్టర్‌చేత పరీక్ష చేయించుకుని అది క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకొని నిశ్చింతగా ఉండాలి. చదవండి: తేనెతో గుండెపోటు నివారణ సాధ్యమా? -
పశ్చిమగోదావరి: మళ్లీ వింత వ్యాధి కలకలం..
సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలో మళ్లీ వింత వ్యాధి కలకలం రేపింది. అంతుచిక్కని వ్యాధి కొవ్వలి గ్రామానికీ విస్తరించింది. దీంతో రాష్ట్ర వైద్య శాఖ అప్రమత్తమయ్యింది. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. దెందులూరు ఎమ్మెల్యే కోఠారు అబ్బయ్యచౌదరి గ్రామంలో మంగళవారం పర్యటించారు. ప్రజలెవరూ భయాందోళన చెందనవసరం లేదన్నారు. కాగా, జిల్లాలో అంతు చిక్కని వింత వ్యాధి పట్ల ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. కొన్ని రోజులుగా కొమరవోలు, పూళ్లలో విస్తరించిన అంతుచిక్కని వ్యాధిపై అధికార యంత్రాంగం చర్యలు చేపట్టడంతో వ్యాధి ప్రభావం పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చింది. చదవండి: నేనే శివుడిని.. నాకు ఏ టెస్టు వద్దు: పద్మజ వింత వ్యాధికి గురై డిశార్జ్ అయిన రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సదుపాయం, వారు తీసుకుంటున్న ఆహార పానీయాలపై కూడా వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఇంటింటికి సర్వే కొనసాగుతుంది. ప్రజలు ఎవరు ఎక్కడా కూడా భయపడాల్సిన పరిస్థితి లేదని ఎక్కడైనా వింత వ్యాధి లక్షణాలు ఉంటే వారికి పూర్తిగా వైద్య ఆరోగ్య శాఖ వైద్య సదుపాయం కల్పించడానికి ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు చేపట్టింది. చదవండి: ఉద్యోగాల పేరిట మోసం -
కరోనా సోకితే ఏమవుతుంది..?
-
వెంటాడుతున్న స్వైన్ ఫ్లూ
కడప రూరల్: స్వైన్ ఫ్లూ భయూలు జిల్లా వాసులను వెంటాడుతున్నారుు. బుధవారం ప్రొద్దుటూరులో మరొకరిలో వ్యాధి లక్షణాలు కనిపించారుు. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వారి సంఖ్య మూడుకు చేరింది. విషయం తెలియగానే వైద్య బృందం హుటాహుటిని వెళ్లి జాగ్రత్తలు చేపట్టింది. జనవరికి ముందు కడప నగరంలోని ఆర్కే నగర్, ప్రకాశ్నగర్లలో ఒక్కొక్కరికి స్వైన్ ఫ్లూ లక్షణాలు బయటపడ్డాయి. వారు తక్షణమే హైదరాబాదులో చికిత్స పొందడంతో ఆరోగ్యం కుదుటపడింది. జిల్లాలో వ్యాధి సోకిన ఆ ముగ్గురు కూడా హైదరాబాదులో బంధువుల వద్ద ఉండి వచ్చిన తర్వాతనే లక్షణాలను గుర్తించినట్లు వైద్యులు అంటున్నారు. ముందస్తు జాగ్రత్తలు చేపట్టిన డీఎంహెచ్ఓ ఈ వ్యాధికి సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. ప్రొద్దుటూరులో వ్యాధి లక్షణాలు బయటపడగానే డీఎంహెచ్ఓ ఒక అత్యవసర బృందాన్ని అక్కడికి పంపారు. అవసరమైన తక్షణ చర్యలు చేపట్టడానికి సిబ్బందిని సిద్ధం చేశారు. ముందస్తు జాగ్రత్తగా 100 ట్యామిఫ్లూ మాత్రలను కూడా అందుబాటులో ఉంచారు. అలాగే కడప రిమ్స్‌లో ఒక ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. చలి తీవ్రంగా ఉండడంతో అంతటా వైరస్ వ్యాపిస్తోందని, చలి తీవ్రత తగ్గి గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరగితే వైరస్ కనుమరగవుతుందనే అభిప్రాయాన్ని వైద్యులు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ స్వైన్‌ఫ్లూ కారణంగా ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పుకార్లను అసలు నమ్మవద్దని సూచిస్తున్నారు. జిల్లాకు ఈ వైరస్ ఎలాంటి పరిస్థితిలో రాదని వైద్యులు అంటున్నారు. కాగా, ప్రజలు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే సూచనలు, సలహాల కోసం తక్షణమే వైద్యులను సంప్రదించాలన్నారు. ఆందోళన అవసరం లేదు స్వైన్‌ఫ్లూ వ్యాధికి సంబంధించి ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఈ వైరస్ మన జిల్లా వాతావరణానికి ఇమడదనే చెప్పవచ్చు. అయితే ప్రజలు జాగ్రత్తలు పాటించడం మంచిది. ఈ వ్యాధి సోకిన వారికి తీవ్రమైన జులుబు, జ్వరం, గొంతునొప్పి, ఆయాసం, శ్వాస సంబంధిత ఇబ్బందికర లక్షణాలు కనిపిస్తాయి. అలాంటి వారు తక్షణమే వైద్యులను సంప్రదించాలి. ముందస్తు జాగ్రత్తగా ట్యామిఫ్లూ మాత్రలను అందుబాటులో ఉంచాం. ఇతర ప్రాంతాలకు వెళ్లే జిల్లా వాసులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. అలాగే జిల్లాకు వచ్చేవారు కూడా జాగ్రత్తలు పాటించడం మంచిది. ఈ వ్యాధికి సంబంధించి అన్ని చర్యలు చేపట్టాం. ఎలాంటి ఆందోళన అవసరం లేదు. జిల్లా వాసులు పుకార్లను నమ్మవద్దు. - నారాయణ నాయక్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, వెఎస్సార్‌జిల్లా