Syndicate Banks clients
-
ఈ బ్యాంకు కస్లమర్లకు అలర్ట్..!
ముంబై: బ్యాంకుల విలీన ప్రక్రియలో భాగంగా పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా మారుస్తున్నట్లు 2019 లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా సిండికేట్ బ్యాంకు కెనరా బ్యాంకుతో విలీనమైంది. బ్యాంకుల వీలినంతో సిండికేట్ బ్యాంక్ ఖాతాదారులు ఐఎఫ్ఎస్సీ కోడ్లు, చెక్‌బుక్‌లు జూన్ 30 వరకే చెల్లుబాటు కానుంది. జూలై 1 నుంచి సిండికేట్ బ్యాంకుల ఐఎఫ్ఎస్సీ కోడ్లు మారనున్నాయి. ఈ మార్పును గమనించాలని, వెంటనే చెక్‌బుక్‌లను ఆప్డేట్ చేసుకోవాలని కెనరా బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. సిండికేట్ బ్యాంకు ఖాతాదారులు జరిపే నెఫ్ట్, ఆర్జిజీఎస్, ఐఎంపీఎస్ లావాదేవీలు జరిపేటప్పుడు కచ్చితంగా కెనరా బ్యాంక్ ఐఎఫ్ఎస్సీ కోడ్‌ను వినియోగించాలని తెలిపింది. పాత ఎమ్ఐసీఆర్, ఐఎఫ్ఎస్సీ లతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ-సిండికేట్ బ్యాంక్ చెక్ బుక్ కూడా జూన్ 30, 2021 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. థర్డ్ పార్టీకి జారి చేసిన ఈ-సిండికేట్ చెక్‌బుక్ లేదా చెక్‌లు జూన్30,2021వ తేది తరువాత చెల్లవు. వాటి స్థానంలో కొత్తవి తీసుకోవాలని కెనరా బ్యాంకు ఖాతాదారులకు తెలిపింది. చదవండి: క్రిప్టోకరెన్సీ పై భారీగా ఇన్వెస్ట్ చేస్తోన్న భారతీయులు..! -
డబ్బుల కోసం రోడెక్కిన జనం
జిల్లాలో ‘మనీ’పాట్లు కొనసాగుతున్నాయి. డబ్బుల కోసం జనం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. అయినా చేతికందకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. డబ్బుల కోసం సోమవారం మల్లాపూర్, ఇబ్రహీంపట్నంలో జనం రోడ్డెక్కారు. మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట సిండికేట్ బ్యాంక్ ఖాతాదారులు రాస్తారోకో నిర్వహించారు. బ్యాంకర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా, ఎర్రాపూర్, అమ్మక్కపేట, కొజన్ కొత్తుర్, కేశాపూర్, ఎర్దండి, కోమటికొండాపూర్, వర్షకొండ, ఇబ్రహీంపట్నం గ్రామాల ఖాతాదారులకు రోజుకొక్క గ్రామానికి డబ్బులు అందజేసేందుకు చర్యలు తీసుకున్నట్లు బ్యాంకు మేనేజర్ శేషఫణిరావు తెలిపారు. –మల్లాపూర్/ఇబ్రహీపట్నం