డబ్బుల కోసం రోడెక్కిన జనం
జిల్లాలో ‘మనీ’పాట్లు కొనసాగుతున్నాయి. డబ్బుల కోసం జనం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. అయినా చేతికందకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. డబ్బుల కోసం సోమవారం మల్లాపూర్, ఇబ్రహీంపట్నంలో జనం రోడ్డెక్కారు. మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట సిండికేట్ బ్యాంక్ ఖాతాదారులు రాస్తారోకో నిర్వహించారు.
బ్యాంకర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా, ఎర్రాపూర్, అమ్మక్కపేట, కొజన్ కొత్తుర్, కేశాపూర్, ఎర్దండి, కోమటికొండాపూర్, వర్షకొండ, ఇబ్రహీంపట్నం గ్రామాల ఖాతాదారులకు రోజుకొక్క గ్రామానికి డబ్బులు అందజేసేందుకు చర్యలు తీసుకున్నట్లు బ్యాంకు మేనేజర్ శేషఫణిరావు తెలిపారు. –మల్లాపూర్/ఇబ్రహీపట్నం