Syria chemical attack
-
సిరియాపై అమెరికా క్షిపణి దాడి
59 క్షిపణులతో షాయ్‌రత్ ఎయిర్‌బేస్ విధ్వంసం ► నలుగురు చిన్నారులు సహా 9 మంది మృతి ► ‘రసాయనిక దాడి’కి ప్రతీకారంగానే డమాస్కస్: మధ్య సిరియాలోని షాయ్‌రత్ వైమానిక స్థావరం చుట్టుపక్కల శుక్రవారం అమెరికా క్షిపణులతో దాడి చేసింది. ఇటీవల సిరియాలోని ఖాన్ షేఖున్ లో జరిగిన రసాయనిక దాడికి ఈ ఎయిర్‌బేస్ నుంచే కార్యాచరణ జరిగిందనే సమాచారంతో 59 తొమాహాక్ క్రూయిజ్ క్షిపణులతో మెరుపు దాడి చేసింది. ఈ దాడుల్లో 9 మంది సిరియన్ పౌరులు మృతిచెందారు. ఇందులో నలుగురు చిన్నారులున్నారని సిరియా వార్తా సంస్థ సనా వెల్లడించింది. ‘అమెరికా షాయ్‌రత్ ఎయిర్‌బేస్ చుట్టుపక్కన ఉన్న అల్–హమ్రత్, అల్–మంజుల్ గ్రామాలపై క్షిపణులతో విరుచుకుపడింది. సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులపై ఆరేళ్లుగా అమెరికా, రష్యా వేర్వేరు సంకీర్ణాలుగా పోరాటం చేస్తున్నాయి. మంగళవారం ఐసిస్ ఆధీనంలోని ఓ పట్టణంపై జరిగిన రసాయనిక దాడిలో వంద మందికి పైగా మరణించటం.. వందల సంఖ్యలో తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరటం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘రసాయనిక దాడి అనాగరికం’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన రెండ్రోజుల్లోనే క్షిపణి దాడి జరిగింది. దాడి అనాలోచితం, బాధ్యతారాహిత్యం తమ ఎయిర్‌బేస్‌పై అమెరికా క్షిపణి దాడి అనాలోచితం, బాధ్యతారాహిత్యమని సిరి యా అధ్యక్షుడు అసద్ తీవ్రంగా విమర్శిం చారు. ‘అమెరికా నేడు చేపట్టిన ఈ దాడులు అర్థరహితం. ఇది అమెరికా హ్రస్వదృష్టికి, గుడ్డి రాజకీయ, మిలటరీ విధానాలకు నిదర్శనం. సిరియా సార్వభౌమత్వం లక్ష్యంగా జరిగిన దురదృష్టకర ఘటనగా భావిస్తున్నాం’ అని అల్–అసద్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. సిరియన్ మిలటరీ వద్ద ఎలాంటి రసాయనిక ఆయుధాల్లేవని స్పష్టం చేసింది. స్వాగతించిన ప్రపంచ దేశాలు సిరియా ఎయిర్‌బేస్‌పై అమెరికా దాడిని ప్రపంచ దేశాలు స్వాగతించాయి. వంద మందిని పొట్టన పెట్టుకున్న రసాయనిక దాడికి ప్రతీకారంగానే క్షిపణి దాడి జరిగిందని, దీనికి తమ సంపూర్ణ మద్దతుంటుందని యూకే, ఇజ్రాయిల్, ఆస్ట్రేలియా, టర్కీ తదితర దేశాలు ప్రకటించాయి. సిరియాలో శాంతి నెలకొనేందుకు అన్ని దేశాలూ సహకరించాలని.. సిరియా ప్రజలను మరిన్ని ఇబ్బందులకు గురిచేసే చర్యలను ఆపేయాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గ్యుటెరస్ కోరారు. దీనిపై భద్రతామండలి అత్యవసరంగా సమావేశమైంది. తొమాహాక్ మిసైల్ అంటే! సిరియాపై దాడిలో 59 తొమాహాక్ క్రూయిజ్ క్షిపణులు వినియోగించింది. 2వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేయటంలో వీటిని అమెరికా వాడింది. వెయ్యి పౌండ్ల బరువైన వార్హెడ్లను ఇది మోసుకెళ్లగలదు. 20 అడుగుల పొడుగుండే తొమాహాక్ గంటలకు 880 కిలోమీటర్ల వేగంతో దూసుపోతుంది. అయితే శుక్రవారం నాటి దాడుల్లో తొలిసారిగా నేవీ నౌకలనుంచి ఎయిర్‌బేస్‌పైకి దీన్ని వినియోగించారు. రష్యా, ఇరాన్ ఖండన ఇది ఏకపక్ష నిర్ణయమని ఇరాన్, రష్యా విమర్శించాయి. ఈ దాడులు ‘సిరియా సార్వభౌమత్వానికి వ్యతిరేకం. అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘన’ అని పేర్కొన్నాయి. భవిష్యత్తులో అమెరికా–రష్యా సంబంధాలను ఇది దెబ్బతీస్తుందని వెల్లడించింది. అమెరికా క్షిపణి దాడులపై చర్చించేందుకు అత్యవసరంగా భద్రతా మండలి సమావేశానికి పిలుపునిచ్చింది. అమెరికన్ క్షిపణి దాడుల్లో షాయ్‌రత్ ఎయిర్‌బేస్‌లోని 9 సిరియన్ విమానాలతోపాటుగా.. సమీపంలోని ఆయుధాగారం, ఇంధన డిపోలు పూర్తిగా ధ్వంసమయ్యాయని రష్యా టీవీ చానెల్ వెల్లడించింది. -
‘రష్యా ఫెయిలైంది.. అందుకే మేం దిగాం’
వాషింగ్టన్: సిరియా విషయంలో రష్యా విఫలమైందని అమెరికా ఆరోపించింది. రసాయన ఆయుధాల బారి నుంచి సిరియాను రక్షిస్తామని 2013లో తీసుకున్న బాధ్యతను నిర్వర్తించడంలో ఆ దేశం ఘోర వైఫల్యం చెందిందని అమెరికా ప్రభుత్వ సహాయ కార్యదర్శి రెక్స్ టిల్లర్సన్ మండిపడ్డారు. వచ్చేవారమే ఆయన మాస్కో పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ట్రంప్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతినిధిగా తొలిసారి రష్యాలో వచ్చే వారం టిల్లర్సన్ అడుగుపెట్టనున్నారు. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు చేసుకునేందుకు, ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు, గతంలో చేసుకున్న ఒప్పందాలను మరింత పటిష్టం చేసుకునేందుకు అమెరికా ప్రతినిధిగా టిల్లర్సన్ రష్యా పర్యటనకు వెళబోతున్నారు. ఈలోగా, భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో సిరియాలోని షైరత్ వైమానిక స్థావరంపై సుమారు 60 వరకు తోమహాక్ క్షిపణులను అమెరికా ప్రయోగించింది. తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ప్రాంతంపై సిరియా వైమానిక దళం పాల్పడిన రసాయన దాడులకు ప్రతీకారంగానే ఈ క్షిపణి దాడి చేసినట్లు చెప్పింది. ఈ దాడిని ప్రస్తుతానికి సిరియాకు అండగా ఉన్న రష్యా, ఇరాన్‌లు ఖండించాయి. ఈ నేపథ్యంలో రష్యా విఫలమైనందునే తాము రంగంలోకి దిగామంటూ అమెరికా తరుపున టిట్టర్సన్ ప్రకటన చేశారు. అంతేకాదు, సిరియా పాలకుడు బషర్ అల్ అస్సాద్ ఆదేశాలతోనే రసాయన విషవాయువుల బాంబుదాడులు జరిగాయని తమకు పూర్తి సమాచారం ఉందని కూడా ప్రకటించారు. అమాయకులైనవారిని విషవాయువులతో పొట్టన పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
72కి చేరిన సిరియా విషదాడి మృతుల సంఖ్య
బీరుట్: సిరియాలో విషదాడి మృతుల సంఖ్య బుధవారం 72కు పెరిగింది. దాడి జరిగిన చోటుకి సమీపంలోని ఆవాసాల్లో ఇంకా పలువురు ఆశ్రయం పొందుతున్నట్లు సహాయక సిబ్బంది గుర్తిం చారు. మరోవైపు ఖాన్ షేకౌన్ పట్టణంలో వాయు దాడులు తిరిగి ప్రారంభమయ్యాయని సిరియా ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. మంగళవారం నాటి విషదాడులకు అధ్యక్షుడు బషర్ అసద్, ఆయన మద్దతుదారులు, ఇరాన్, రష్యాలు బాధ్యత వహించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. ఈ దాడి వెనక తమ పాత్ర లేదని సిరియా, రష్యా ప్రభుత్వా లు తెలిపాయి. తిరుగుబాటుదారుల ఆయుధాగారాలపై సిరియా వాయుసేన దాడి చేసిన తరువాతే విష వాయు వులు విడుదలయ్యాయని రష్యా రక్షణ విభాగం తెలిపిం ది. సిరియాలో విషదాడులపై చర్చించడానికి ఐరాస భద్రతా మండలి బుధవారం అత్యవసరంగా సమావేశమ వుతోంది. 70 దేశాల ప్రతినిధులు బ్రసెల్స్‌లో సమా వేశమై సిరియా భవిష్యత్తు గురించి చర్చించారు. -
అమెరికాకు ‘సిరియా’ కళ్లెం
విశ్లేషణ: సిరియాపై రష్యా వెనక్కు తగ్గుతుందన్న ధీమాతో ఒబామా జూదమాడారు. అంచనాలు తప్పడంతో మధ్యప్రాచ్యంపై అమెరికా ఆధిపత్యాన్ని, అద్వితీయ స్థానాన్ని పోగొట్టుకోవాల్సివచ్చింది. మిత్రులను దూరం చేసుకోవాల్సివస్తోంది. ఇరాక్ యుద్ధంతో మధ్యప్రాచ్య రాజకీయ పటాన్ని తిరిగి రాయాలని అమెరికా భావించింది. ఆ ఆశలను సిరియాలో సమాధి చేసుకొని, అమెరికా తన తలరాతను తానే తిరిగి రాసుకోవాల్సివస్తోంది. కట్టుకున్నోడు కొట్టాడు, అత్త కొట్టింది, ఆడబిడ్డ కొట్టింది, నేనూ నాలుగు తగిలించి పోతే పోలా... అని దారినపోయే దానయ్య కూడా కొట్టి పోయాడట వెనుకటికో ఇల్లాలిని. అలా తయారైంది అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పరిస్థితి. లేకపోతే అమెరికా సైన్యం అండ లేనిదే బతికిబట్టగట్టలేని రాచరిక సౌదీ ఆరేబియా... భద్రతా మండలి సభ్యత్వాన్ని గెలుచుకున్న వెంటనే తిరస్కరించేదా? ఈ నెల 18న దౌత్య ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేయగలిగేదా? సిరియా అంతర్యుద్ధంలాంటి అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించడంలో ఐరాస ైవె ఫల్యానికి నిరసనగానే సౌదీ ఈ అసాధారణ చర్యకు పాల్పడిందనేది పైకి చెప్పే సాకు. నిజానికి అది అమెరికాపై ఆగ్రహ ప్రకటన. సౌదీకి కాబోయే అమీర్‌గా భావిస్తున్న ప్రిన్స్ బందర్ బిన్ సుల్తాన్ (‘బందర్ బుష్’)... ‘ఇది ఐరాసకు పంపుతున్న సందేశం కాదు, అమెరికాకు పంపుతున్న సందేశం’ అని స్పష్టం చేశారు. రసాయనిక ఆయుధాల నిర్మూలన పేరిట సిరియాపై సైనిక చర్యతో బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని కూల్చడానికి సర్వం సిద్ధం చేసుకొని కూడా అమెరికా వెనుకడుగు వేయడమే సౌదీ ఆగ్రహానికి కారణం. మధ్యప్రాచ్యంలో అమెరికా ప్రాబల్యానికి మూల స్తంభాల్లో ఒకటిగా, చిరకాల మిత్ర దేశంగా ఉన్న తమను అమెరికా ఒంటరిని చేసిందని సౌదీ భావిస్తోంది. సెప్టెంబర్‌లో అతి నాటకీయంగా రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్... ఇంద్రజాలికుడు టోపీలోంచి పావురాన్ని తీసినట్టు సిరియా రసాయనిక ఆయుధాలను నిర్వీర్యం చేసే ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. అంతే ఠక్కున ఒబామా సైనిక చర్యను విరమించారు. మధ్యప్రాచ్యంలోని చిరకాల సన్నిహిత మిత్రులను అమెరికా దూరం చేసుకోవాల్సి వచ్చింది. నమ్మశక్యం కానివిగా కనిపించే ఈ పరిణామాల తదుపరి మధ్యప్రాచ్య రాజకీయాలలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. ‘సిరియా’ మలుపు... పుతిన్ గెలుపు సెప్టెంబర్‌లో సిరియాపైకి అమెరికా ఐదు డిస్ట్రాయర్ యుద్ధ నౌకలను ఎక్కుబెడితే... ప్రతిగా రష్యా తన క్షిపణి విధ్వంసక ‘మాస్క్వా’ క్రూయిజర్ సహా పదకొండు యుద్ధనౌకలను రంగంలోకి దించింది. వాటికి తోడు చైనా యుద్ధ నౌకలు కూడా నిలిచాయి. సిరియాపై దాడికి బదులు చెప్పడానికి సిద్ధమయ్యాయి. 1962 నాటి ‘క్యూబా మిస్సయిల్ సంక్షోభం’తో సరితూగక పోయినా ఆ తదుపరి ప్రపంచం ఇలాంటి ఉద్రిక్త పరిస్థితిని ఎరుగదు. ‘గుర్తు తెలియని వారు’ సిరియాపై రెండు క్షిపణులను ప్రయోగించగా అవి గురితప్పినట్టు వార్తలు వచ్చాయి. ఆ ‘గుర్తు తెలియని’ క్షిపణులు స్పెయిన్‌లోని నాటో సైనిక శిబిరం నుంచి ప్రయోగించిన అమెరికా తయారీ టామ్‌హాక్ క్షిపణులనేది ఇప్పుడు బహిరంగ రహస్యం. ఇక వాటిని రష్యా నిర్వీర్యం చేసిన తీరుపై భిన్న కథనాలున్నా గల్ఫ్ దేశాల మీడియా అది రష్యా పనేనని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఇంతకూ ఒబామా ఎందుకు వెనుకడుగు వేశారు? లిబియాపై రష్యా చివరి నిమిషంలో వెనక్కు తగ్గింది. అలాగే సిరియాపై కూడా అది వెనక్కు తగ్గక తప్పదని ఒబామా ప్రభుత్వం భావించింది. ప్రపంచ మీడియా పండితులంతా దానికి వంత పాడారు. అయితే ఒక్క విషయాన్ని మరిచారు. నాటి రష్యాకు వెన్నెముకలేని ద్మిత్రీ మెద్వదేవ్ అధ్యక్షుడు కాగా నేటి అధ్యక్షుడు పుతిన్! పదమూడేళ్లుగా పుతిన్ రష్యా పూర్వప్రాభవాన్ని సంపాదించడానికి చేస్తున్న కృషినంతటినీ సిరియాలో సమాధి చేసుకోడానికి సిద్ధపడలేదు. సిరియాపై సైనిక చర్యను సహించడమంటే ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా ఇరాన్‌పై దాడికి దిగడానికి అనుమతించడమేనని పుతిన్‌కు బాగా తెలుసు. అందుకే తాడో పేడో తేల్చుకోడానికి సిద్ధపడ్డారు. 70 శాతం అమెరికన్లేగాక, జర్మనీవంటి కీలకమైన యూరోపియన్ దేశాలు సైతం వ్యతిరేకిస్తుండగా సుదీర్ఘ యుద్ధానికి ఒబామా సిద్ధంగా లేరు. అయినా రష్యా వెనక్కు తగ్గుతుందన్న ధీమాతో సర్వం ఒడ్డి జూదమాడారు. ఆయన అంచనాలు తప్పడంతో మధ్యప్రాచ్యంపై అమెరికా ఆధిపత్యాన్ని, ఆధిక్యతను, అద్వితీయ స్థానాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. నమ్మకమైన మిత్రులనుకున్నవారిని అందరినీ దూరం చేసుకోవాల్సి వస్తోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఒబామా రష్యా, చైనాలతో తలపడాల్సి వచ్చేసరికి తోక ముడిచారు. పరువు దక్కించుకోడానికి రష్యా ‘హామీ మేరకు’ సైనిక చర్యను విరమించారు. ‘నమ్మక ద్రోహం’ హడావిడిగా ఇరాన్ నూతన అధ్యక్షుడు హస్సన్ రుహానీతో ఒబామా మొట్టమొదటిసారిగా పోన్లో సంభాషించారు. దీంతో రష్యా ప్రతిపాదనకు అసద్ తల ఊపారు, అమెరికా కనుసన్నల్లోని ‘ఫ్రీ సిరియన్ నేషనల్ ఆర్మీ’ ఠక్కున అసద్‌తో శాంతి చర్చలకు అంగీకరించింది. రెండేళ్ల క్రితం నాటి రష్యా పాత ప్రతిపాదన... సిరియాపై జెనీవాలో శాంతి చర్చలకు తెరలేచింది. ఇరాన్‌తో అణు చర్చలకు కూడా హఠాత్తుగా దారి తెరచుకుంది. చకచకా జరిగిపోయిన ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలోని అమెరికా నమ్మకమైన మిత్రులంతా ఖంగుతిన్నారు. ఇరాన్, అమెరికాల మధ్య సయోధ్య కుదిరితే దానిపై ఆంక్షల ఎత్తివేత తథ్యం. అదే జరిగితే ప్రాంతీయ శక్తిగా ఇరాన్ సౌదీకేగాక, ఇజ్రాయెల్‌కు కూడా గట్టి పోటీదారవుతుంది. సిరియా, ఇరాన్ యుద్ధాలపై ఆ రెండు దేశాలు చాలా ఆశలు పెట్టుకున్నాయి. సౌదీ, ఖతార్‌లు సిరియాలోని అల్‌కాయిదా అనుబంధ ఉగ్రవాద మూకలకు అపారంగా నిధులను సమకూర్చాయి. అమెరికా ైవె ఖరిని సౌదీతో పాటూ దాని నేతృత్వంలోని గల్ఫ్సహకార మండలి దేశాలన్నీ నమ్మక ద్రోహంగా పరిగణిస్తున్నాయి. భద్రతారాహిత్యానికి గురవుతున్నాయి. జూలైలో రష్యాతో రహస్య ఆయుధాల ఒప్పందం కోసం ప్రయత్నించిన బందర్ బుష్ నేడు తిరిగి రష్యా వేపు చూస్తున్నారు. ఇజ్రాయెల్ ఒంటరిగానైనా ఇరాన్ అణుకర్మాగారాలపై దాడులు చేసే విషయాన్ని పరిశీలిస్తోంది. ఇదిలా ఉండగా అరబ్బు దేశాలకు ‘ఆదర్శ నమూనా’గా అమెరికా కీర్తించే టర్కీ కూడా ఒబామాపై ఆగ్రహంతో ఉంది. సిరియాలో అసద్ పాలనను అంతం చేయడానికి పట్టుబట్టిన టర్కీ ప్రధాని రెసెప్ తెయ్యిప్ ఎర్డోగాన్ అమెరికా నూతన వైఖరితో తమ దేశ భద్రతపట్ల ఆందోళన చెందుతున్నారు. సహజంగానే ఇరాన్... రష్యా, చైనాలతో సత్సంబంధాల ద్వారా సిరియా నుంచి ముప్పును నివారించుకోవాలని ప్రయత్నిస్తోంది. నాటోలోని ఏకైక ముస్లిం మెజారిటీ దేశమైన టర్కీ నేడు నాటోయేతర క్షిపణి రక్షణ వ్యవస్థలపై ఆధారపడటం అవసరమని భావిస్తోంది. ఈయూలో చేరుతానని ఊరిస్తున్న ఎర్డోగాన్ యూరోపియన్ కంపెనీలను కాదని... క్షిపణి రక్షణ వ్యవస్థల కోసం (ఎఫ్డీ-200) 300 కోట్ల డాలర్ల కాంట్రాక్టును చైనాకు కట్టబెట్టారు. పైగా ఇరాన్‌కు ఆయుధాలను సరఫరా చేస్తున్నందుకుగానూ అమెరికా ఆంక్షలకు గురైన చైనా కంపెనీ సీపీఎమ్ఐఈసీతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. మరోవంక ఈ నెల మొదటి వారంలో ఎర్డోగాన్ ప్రభుత్వం ఇరాన్‌తో సత్సంబంధాలకు పటిష్టమైన ‘వారథి’ని నిర్మించింది. ఇజ్రాయెల్ తరఫున గూఢచారులుగా పనిచేస్తున్న పది మంది ఇరానీయుల జాబితాను ఇరాన్‌కు అందజేసింది. దీంతో అమెరికా టర్కీకి తమ పేట్రియాట్ క్షిపణుల సరఫరాను నిలిపివేసిందనేది వేరే సంగతి. అమెరికా గూటి చిలుక అనుకున్న ఎర్డోగాన్ రెక్కలు గట్టుకొని కొత్త మిత్రులను అన్వేషించుకుంటున్నారు. దెబ్బ మీద దెబ్బ సిరియా సమస్యపై ఒబామాకు ‘నాకింగ్ పంచ్’ను (పడగొట్టే దెబ్బ) రుచి చూపించిన పుతిన్ అదే ఉత్సాహంతో అమెరికా ఆధిపత్యాన్ని దెబ్బ మీద దెబ్బ తీస్తున్నారు. మధ్య ఆసియా ప్రాంతంలోని ఒకప్పటి సోవియట్ యూనియన్ రిపబ్లిక్కుల చమురు సంపదపై రష్యా ఆధిపత్యాన్ని దెబ్బ తీయడానికి అమెరికా, ఈయూలు చేస్తున్న ప్రయత్నాలకు గండి కొట్టడానికి ఇదే సమయమని భావించారు. అందుకే యూరోపియన్ యూనియన్‌లో చేరడానికి ఒప్పందం కుదుర్చుకోడానికి సిద్ధంగా ఉన్న ఉక్రేనియాకు హెచ్చరికను జారీ చేశారు. నవంబర్ చివర్లో ఈయూతో జరిగే సమావేశంలో ఉక్రెయిన్ ఆ ఒప్పందంపై సంతకాలు చేస్తే తమ ‘కస్టమ్స్ యూనియన్’ సభ్యత్వంపై ఆశ వదులుకోక తప్పదని తేల్చేశారు. ఉక్రెయిన్ విదేశీ వాణిజ్యంలో 36 శాతం వాటా రష్యా, బెలారస్, కజకిస్థాన్లతో కూడిన ఆ కూటమితో జరిగేదే. రష్యా కూడా ఈయూకు ప్రధాన వాణిజ్య భాగస్వామే. మిత్రుని మిత్రుడు మిత్రుడు కానవసరం లేదు. పేకాట పేకాటే బామ్మర్ది బామ్మర్దే. రష్యా సరిహద్దుల్లోని ఉక్రెయిన్ జనాభాలో సగం మంది రష్యాతో అనుబంధానికే ప్రాధాన్యం ఇస్తారు. రష్యా మాట పెడ చెవిని పెడితే రష్యా జాతీయుల ఆధిక్యత ఉన్న తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో వేర్పాటువాద ఉద్యమాలు తలెత్తితే రష్యా జోక్యం చేసుకోవాల్సి వస్తుందని ప్రధాని మెద్వదేవ్ స్పష్టం చేశారు. ఇది బ్లాక్ మెయిల్ కాదని, రష్యాతో కుదుర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు ప్రతి చర్యని ముక్తాయించారు. మధ్య ఆసియాలో రష్యన్ భల్లూకం తిరిగి పంజా విసురుతున్న సమయంలో అమెరికా ఆ ప్రాంతంలోని తమ ఏకైక సైనిక స్థావరాన్ని ఎత్తివేయక తప్పడం లేదు. క్రిజిగిస్థాన్ ప్రభుత్వం అమెరికా సైనిక స్థావరం కొనసాగింపునకు అంగీకరించలేదు... ఎందుకో చెప్పనవసరం లేదు. ఇరాక్ యుద్ధంతో మధ్యప్రాచ్యపు రాజకీయ పటాన్ని తిరిగి రాయాలని అమెరికా భావించింది. ఆ ఆశలన్నిటినీ సిరియాలో సమాధి చేసుకొని, అమెరికా తన తలరాతను తానే తిరిగి రాసుకోవాల్సి వస్తోంది. ఇదంతా రష్యా తిరిగి బలీయమైన శక్తిగా ఆవిర్భవించిన ఫలితమో, చైనా అగ్రరాజ్యంగా మారిన ఫలితమో కాదు. అమెరికా ‘సామ్రాజ్య’ ప్రాభవం అస్తమిస్తున్న సూచన. -
సిరియా రసాయనిక దాడిలో 1300 మంది మృతి
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు అంతర్జాతీయం సిరియా రసాయనిక దాడిలో 1300 మంది మృతి సిరియా రాజధాని డెమాస్కస్ దగ్గర్లోని తూర్పు గౌటాలో ఆగస్టు 21న తిరుగుబాటుదారులపై ప్రభుత్వ బలగాలు రసాయనిక దాడి చేశాయి. ఈ ఘటనలో 1300 మంది మరణించారని ప్రతిపక్షాలు తెలిపాయి. వందలాదిమంది అస్వస్థతకు లోనయ్యారు. మరణించినవారిలో ఎక్కువ మంది పిల్లలున్నారు. అయితే, రసాయనిక దాడులు జరగలేదని ప్రభుత్వం పేర్కొంది. ఈ మరణాలపై దర్యాప్తు జరపాలని యూరోపియన్ యూనియన్ కోరింది. ఐక్యరాజ్యసమితి బృందాలు వాస్తవాలు తెలుసుకోవాలని అమెరికా, జర్మనీ, స్వీడన్, ఫ్రాన్స దేశాలు కోరాయి. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా 2011 నుంచి ఉద్యమాలు చెలరేగాయి. అసద్ అధికారం నుంచి వైదొలగి ప్రజాస్వామిక సంస్కరణలు ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాలు, తిరుగుబాటు దళాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ పోరాటంలో 2012 జూన్ వరకు లక్షమంది మరణించారని, 40 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. ప్రముఖ రచయిత ఎల్మోర్ లియోనార్డ్ మృతి ప్రముఖ అమెరికన్ రచయిత ఎల్మోర్ లియోనార్డ్ (87) న్యూయార్కలో ఆగస్టు 20న మరణించారు. ఆయన క్రైం, సస్పెన్సతో కూడిన అనేక నవలలు రాశారు. గ్లిట్జ్, గెట్సార్ట్ల, అవుట్ ఆఫ్ సైట్, బండిట్స్ నవలలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఆయన 47వ పుస్తకం ‘బ్లూడ్రీమ్స్’ ఈ సంవత్సరం ప్రచురణ కావాల్సి ఉంది. జాతీయం ఎత్తై వైమానిక స్థావరంలో దిగిన సూపర్ హెర్క్యూలస్ విమానం జమ్మూ, కాశ్మీర్‌లోని లడక్‌లో ఉన్న దౌలత్‌బేగ్ ఓల్దీ వైమానిక స్థావరంలో భారత వాయుసేన.. సి-130 జె-30 సూపర్ హెర్క్యూలస్ రవాణా విమానాన్ని ఆగస్టు 20న దింపింది. ఈ స్థావరం ప్రపంచంలోనే ఎత్తై ప్రదేశంలో ఉంది. ఇది ఆక్సాయ్‌చిన్‌లో 16,614 అడుగులు (5,065 మీటర్లు) ఎత్తులో ఉంది. వాస్తవాధీన రేఖకు దగ్గరగా ఉంది. గత ఏప్రిల్‌లో చైనా బలగాలు ఇక్కడి భారత భూ భాగంలోకి చొచ్చుకువచ్చిన నేపథ్యంలో సూపర్ హెర్క్యూలస్‌ను దించారు. దీంతో ఈ ప్రాంతానికి జవాన్లు, యుద్ధ సామాగ్రి తరలింపు, కమ్యూనికేషన్ల నిర్వహణ సజావుగా సాగుతాయి. ఈ విమానం 20 టన్నుల బరువును అవలీలగా మోసుకెళ్తుంది. ఆహార భద్రత పథకం ప్రారంభం ఆహార భద్రత పథకాన్ని ఢిల్లీలో ఆగస్టు 20న సోనియా గాంధీ ప్రారంభించారు. ఢిల్లీతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్లు కూడా ఈ పథకాన్ని ప్రారంభించాయి. దేశంలో 80 కోట్ల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రతి సంవత్సరం ఈ పథకం కోసం 1.25 లక్షల కోట్లు ఖర్చు చేస్తారు. 6.2 కోట్ల టన్నుల బియ్యం, గోధుమలు, తృణ ధాన్యాలు సబ్సిడీపై పేదలకు అందజేస్తారు. దేశవ్యాప్తంగా చేపట్టే ఈ పథకానికి చట్టబద్ధత కల్పించేందుకు బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది. నాలుగు ఒప్పందాలపై భారత్ - ఇరాక్ సంతకాలు ఇరాక్ ప్రధానమంత్రి నౌరీ అల్ - మాలికీ భారత పర్యటనలో ఆగస్టు 23న నాలుగు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇందులో బ్లాక్-8లో చమురు తవ్వకాలకు సంబంధించిన ఒప్పందాన్ని పూర్తి చేయడం ఒకటి. ఈ కాంట్రాక్టును సద్దాం హుస్సేన్ పాలనలో 2000లో ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్‌కు కేటాయించారు. అయితే రెండో గల్ఫ్ యుద్ధం తర్వాత ఇరాక్ తిరిగి సంప్రదింపులకు పిలుపునిచ్చింది. ఈ పర్యటనలో ఇరాక్ ప్రధాని మాలికీ భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో చర్చలు జరిపారు. చమురుశుద్ధి కర్మాగారాలు, ఎరువుల పరిశ్రమలు, స్టీల్ ప్రాజెక్టుల్లో ఉమ్మడి భాగస్వామ్యంపై కూడా ఇరు దేశాలు చర్చించాయి. వాయుసేనలోకి భారీ రవాణా విమానం వాయుసేన రవాణా సామర్థ్యం మరింత పటిష్టం కానుంది. అమెరికా నుంచి కొనుగోలు చేసిన భారీ తరహా రవాణా ఎయిర్‌క్రాఫ్ట్ సీ-17ను రక్షణమంత్రి ఏకే ఆంటోనీ సెప్టెంబర్ 2న వైమానిక దళంలో అధికారికంగా ప్రవేశపెట్టనున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని హిండన్ ఎయిర్‌బేస్‌లో వీటి సేవలను ఆయన ప్రారంభిస్తారు. వాయుసేన 81వ స్క్వాడ్రన్‌లో చేర్చనున్న సీ-17 ఎయిర్‌క్రాఫ్ట్‌లను సుమారు రూ.20,000 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసేందుకు అమెరికాతో ఒప్పందం కుదిరింది. దాదాపు 80 టన్నుల లోడ్‌ను ఇవి మోసుకెళ్లగలవు. 2011లో అమెరికాతో కుదిరిన ఒప్పందం ప్రకారం పది సీ-17 విమానాల సరఫరాకు భారత్ ఆర్డర్ ఇచ్చింది. ఇప్పటికే 3 విమానాలను అందచేయగా వచ్చే ఏడాది చివరినాటికి మిగతావి సరఫరా కానున్నాయి. ప్రకృతి విపత్తుల సమయంలో వీటి ద్వారా మెరుగైన సేవలు అందించవచ్చు. ఇంటర్నెట్ వినియోగంలో భారత్‌కు మూడో స్థానం ఇంటర్నెట్ వినియోగంలో భారత్ మూడో స్థానానికి చేరింది. మొదటి స్థానంలో చైనా, రెండో స్థానంలో అమెరికా ఉన్నాయి. జపాన్ను అధిగమించి భారత్ మూడో స్థానంలో చేరిందని ప్రపంచ డిజిటల్ మెజర్మెంట్ అండ్ అనలిటిక్స్ సంస్థ ‘కాంస్కోర్’ తన నివేదికలో పేర్కొంది. భారత్‌లో ప్రస్తుతం 74 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులున్నారు. 2012 మార్చి నుంచి వీరి సంఖ్య 31 శాతం పెరిగింది. వినియోగదారుల్లో మూడింట ఒక వంతు 35 ఏళ్లకంటే తక్కువ వయసువారున్నారు. పీసీ, ల్యాప్‌ట్యాప్ సర్వీసుల ఆధారంగా భారత్ నెట్ వినియోగదారుల సంఖ్య 74 మిలియన్లుగా కాంస్కోర్ సంస్థ పేర్కొంది. మొబైల్, టాబ్లెట్ నెట్ వినియోగదారులను కలుపుకుని ఈ సంఖ్య మార్చి 31 నాటికి 164.81 మిలియన్లని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తెలిపింది. రచయిత్రి మాలతీ చందూర్ కన్నుమూత ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్ (84) ఆగస్టు 21న చెన్నైలో మరణించారు. ఆమె కృష్ణా జిల్లా, నూజివీడులో 1928లో జన్మించారు. ఆమె తెలుగులో మొత్తం 26 నవలలు రాశారు. మరెన్నో ఆంగ్ల రచనలను అనువదించారు. తొలి నవల ‘చంపకం - చెదపురుగులు’ కాగా, మొదటి కథ రవ్వలడ్డూలు. ఆమె నవల హృదయనేత్రికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆమె ఆంధ్రప్రభ వారపత్రికలో నిర్వహించిన ప్రమదావనం శీర్షిక వరుసగా 47 ఏళ్లపాటు కొనసాగి గిన్నిస్ రికార్డుకెక్కింది. సంగీత దర్శకుడు రఘునాథ్ పాణి గ్రాహి కన్నుమూత ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు పండిట్ రఘునాథ్ పాణిగ్రాహి(80) ఆగస్టు 25న భువనేశ్వర్‌లో మృతి చెందారు. ఆయన ఒడిశాలోనే తొలి సంగీత దర్శకుడు. ఒరియా, తమిళం, తెలుగు, కన్నడ చిత్రాల్లో అనేక పాటలు పాడారు. జయదేవుడి ‘గీత గోవిందం’ ఆలపించినందుకు 70వ దశకంలో ఫ్రెంచ్ ప్రభుత్వం ఆయనను సత్కరించింది. సంగీతంలో ఆయన సేవలకుగాను భారత ప్రభుత్వం 2010లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. హేతువాద నేత నరేంద్ర దభోల్కర్ హత్య ప్రముఖ హేతువాద నేత, మూఢనమ్మకాల వ్యతిరేక ప్రచారకుడు నరేందర దభోల్కర్ (69)ను పూణెలో ఆగస్టు 20న కాల్చి చంపారు. వైద్యుడైన నరేంద్ర అంధ శ్రద్ధ నిర్మూలన కమిటీకి అధ్యక్షుడిగా, సాధన వారపత్రిక సంపాదకుడిగా వ్యవహరించారు. గత రెండు దశాబ్దాలుగా సామాజిక రుగ్మతలపై ప్రజలలో చైతన్యం తెచ్చేందుకు కృషి చేశారు. క్రీడలు ప్రపంచకప్ ఆర్చరీలో భారత్‌కు స్వర్ణం పోలండ్‌లో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచ కప్‌లో భారత మహిళల జట్టు స్వర్ణ పతకం గెలుచుకుంది. ఆగస్టు 25న జరిగిన టీమ్ రికర్వ్ విభాగం ఫైనల్లో దీపిక కుమారి, రిమిల్, బొంబేలా దేవిలతో కూడిన భారత జట్టు, ప్రపంచ నంబర్‌వన్, లండన్ ఒలింపిక్స్ చాంపియన్ దక్షిణ కొరియాను ఓడించింది. గత నెలలో కొలంబియాలో జరిగిన ప్రపంచ కప్‌లోనూ టీమిండియాకు బంగారు పతకం లభించింది. గోపీచంద్ అకాడమీకి రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ కేంద్ర ప్రభుత్వం అందజేసే ప్రతిష్టాత్మక రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ - 2013 అవార్డు హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ (పీజీబీఎ)కి లభించింది. అత్యుత్తమ అకాడమీల ఏర్పాటు, నిర్వహణ విభాగం కింద గోపీచంద్ అకాడమీని కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ సిఫార్సు చేసింది. ఈ అకాడమీ సైనా నెహ్వాల్, పి.వి.సింధు, పారుపల్లి కాశ్యప్ వంటి బ్యాడ్మింటన్ క్రీడాకారులను అందించింది. ఈ అవార్డు సర్వీసెస్ స్పోర్ట్స కంట్రోల్ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ), పెట్రోలియం స్పోర్ట్స ప్రమోషన్ బోర్డ, యు.కె. మిశ్రా జాతీయ స్పోర్ట్స అకాడమీ -అలహాబాద్‌లకు కూడా ప్రకటించారు. ఆసియా యూత్ క్రీడల్లో భారత్‌కు మూడు స్వర్ణ పతకాలు చైనాలో జరిగిన ఆసియా యూత్ క్రీడల్లో ఆంధ్రపదేశ్‌కు చెందిన వెంకట్ రాహుల్ స్వర్ణ పతకం సాధించాడు. ఆగస్టు 21న జరిగిన వెయిట్‌లిఫ్టింగ్ 77 కిలోల విభాగంలో రాహుల్ మొత్తం 310 కిలోల బరువెత్తి స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. మహిళల 800 మీటర్ల పరుగులో అంజనా తమాకే స్వర్ణపతకం సాధించింది. భారత్‌కు తొలి స్వర్ణపతకం స్క్వాష్‌లో కుశ్కుమార్ అందించాడు. ఈ క్రీడల్లో భారత్ 3 స్వర్ణాలు, 4 రజతాలు, 7 కాంస్య పతకాలతో పదో స్థానంలో నిలిచింది. చైనా 46 స్వర్ణం, 23 రజతం, 24 కాంస్యాలతో మొదటిస్థానంలో నిలిచింది. దక్షిణ కొరియా (25-13-14) రెండోస్థానంలోనూ, జపాన్ (7-5-6) మూడోస్థానంలోనూ నిలిచాయి. ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు నాలుగో స్థానం ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పురుషుల విభాగంలో భారత్‌కు నాలుగో స్థానం దక్కింది. సెర్బియాలో ఆగస్టు 25న ముగిసిన పోటీలో భారత రెజ్లర్లు బాలరాజ్ 76 కిలోల ఫ్రీ స్టయిల్ కేటగిరీలో రజతం, జతిన్ 42 కిలోల ఫ్రీ స్టయిల్ కేటగిరీలో కాంస్యం సాధించారు. 48 దేశాలు పాల్గొన్న ఈ చాంపియన్‌షిప్‌లో రష్యా మొదటి స్థానం సాధించగా, అజర్బైజాన్ రెండో స్థానంలో, ఇరాన్ మూడో స్థానంలో, భారత్ నాలుగో స్థానంలో నిలిచాయి. మహిళల విభాగంలో రష్యా మొదటి స్థానం, జపాన్ రెండో స్థానం, ఉక్రెయిన్ మూడో స్థానం, భారత్ ఏడో స్థానం సాధించాయి. లియాండర్ పేస్‌కు 52వ డబుల్స్ టైటిల్ అమెరికాలో ఆగస్టు 25న జరిగిన విన్స్టన్-సాలెమ్ ఓపెన్ ఏటీపీ టోర్నమెంట్లో భారత టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్, కెనడా ప్లేయర్ డానియల్ నెస్టర్ జంట డబుల్స్ విజేతగా నిలిచింది. ఫైనల్లో పేస్ జంట.. ట్రీట్ హుయ్ (ఫిలిప్పీన్స్) - ఇంగ్లోట్ (బ్రిటన్)లపై గెలిచారు. 40 ఏళ్ల లియాండర్ పేస్‌కు ఇది 52వ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. నెస్టర్‌కు ఇది 81వ టైటిల్. అంతేకాకుండా ఈ విజయంతో నెస్టర్ తన కెరీర్లో డబుల్స్‌లో 900 పైగా విజయాలు సాధించిన తొలి క్రీడాకారుడిగా రికార్డులకెక్కాడు. నేషనల్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో సౌరవ్, జోత్స్నలకు టైటిల్స్ 61 నేషనల్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సౌరవ్ ఘోషల్ గెలుచుకున్నాడు. జైపూర్‌లో ఆగస్టు 23న జరిగిన ఫైనల్స్‌లో మహేశ్ మంగోంకర్ను సౌరవ్ ఓడించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను జోత్స్న చిన్నప్ప గెలుచుకుంది. ఫైనల్స్‌లో అపరాజితా బాలమురుకన్ను ఓడించింది. న్యూహవెన్ ఓపెన్ టోర్నమెంట్ డబుల్స్ విజేత సానియా-జీ జెంగ్ భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన ఖాతాలో 17వ డబుల్స్ టైటిల్‌ను జమ చేసుకుంది. అమెరికాలో ఆగస్టు 25న జరిగిన న్యూ హవెన్ ఓపెన్ టోర్నమెంట్లో తన భాగస్వామి జీ జెంగ్ (చైనా)తో కలిసి సానియా విజేతగా నిలిచింది. మహిళల డబుల్స్ ఫైనల్లో మూడో సీడ్ సానియా-జీ జెంగ్ , రెండో సీడ్ అనాబెల్ మెదీనా గారిగెజ్ (స్పెయిన్)-కాటరీనా స్రెబోత్నిక్ (స్లొవేనియా) జంటపై గెలిచింది. ఓవరాల్‌గా సానియా కెరీర్లో ఇది 17వ డబుల్స్ టైటిల్‌కాగా ఈ ఏడాది మూడోది. విజేతగా నిలిచిన సానియా జంటకు 36,500 డాలర్ల (రూ. 23 లక్షల 12 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 470 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ప్రముఖ సెయిలర్ సి.ఎస్. ప్రదీపక్ మృతి ప్రముఖ సెయిలర్, అర్జున్ అవార్డు గ్రహీత సి.ఎస్. ప్రదీపక్ (66) ఆగస్టు 24న హైదరాబాద్‌లో మరణించారు. హుస్సేన్‌సాగర్‌లో సెయిలింగ్ నిర్వహించడాన్ని ప్రోత్సహించిన వారిలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. 1972 - 1992 మధ్య కాలంలో ఆయన ప్రముఖ సెయిలర్‌గా కొనసాగారు. ఆయన వరల్డ్ మాస్టర్స్‌లో కాంస్యం, ఆసియన్ గేమ్స్‌లో కాంస్యం, ఆసియన్ రెగట్టాలో స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. -
సిరియా రసాయనిక దాడిలో 1300 మంది మృతి
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు అంతర్జాతీయం సిరియా రసాయనిక దాడిలో 1300 మంది మృతి సిరియా రాజధాని డెమాస్కస్ దగ్గర్లోని తూర్పు గౌటాలో ఆగస్టు 21న తిరుగుబాటుదారులపై ప్రభుత్వ బలగాలు రసాయనిక దాడి చేశాయి. ఈ ఘటనలో 1300 మంది మరణించారని ప్రతిపక్షాలు తెలిపాయి. వందలాదిమంది అస్వస్థతకు లోనయ్యారు. మరణించినవారిలో ఎక్కువ మంది పిల్లలున్నారు. అయితే, రసాయనిక దాడులు జరగలేదని ప్రభుత్వం పేర్కొంది. ఈ మరణాలపై దర్యాప్తు జరపాలని యూరోపియన్ యూనియన్ కోరింది. ఐక్యరాజ్యసమితి బృందాలు వాస్తవాలు తెలుసుకోవాలని అమెరికా, జర్మనీ, స్వీడన్, ఫ్రాన్స దేశాలు కోరాయి. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా 2011 నుంచి ఉద్యమాలు చెలరేగాయి. అసద్ అధికారం నుంచి వైదొలగి ప్రజాస్వామిక సంస్కరణలు ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాలు, తిరుగుబాటు దళాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ పోరాటంలో 2012 జూన్ వరకు లక్షమంది మరణించారని, 40 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. ప్రముఖ రచయిత ఎల్మోర్ లియోనార్డ్ మృతి ప్రముఖ అమెరికన్ రచయిత ఎల్మోర్ లియోనార్డ్ (87) న్యూయార్కలో ఆగస్టు 20న మరణించారు. ఆయన క్రైం, సస్పెన్సతో కూడిన అనేక నవలలు రాశారు. గ్లిట్జ్, గెట్సార్ట్ల, అవుట్ ఆఫ్ సైట్, బండిట్స్ నవలలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఆయన 47వ పుస్తకం ‘బ్లూడ్రీమ్స్’ ఈ సంవత్సరం ప్రచురణ కావాల్సి ఉంది. జాతీయం ఎత్తై వైమానిక స్థావరంలో దిగిన సూపర్ హెర్క్యూలస్ విమానం జమ్మూ, కాశ్మీర్‌లోని లడక్‌లో ఉన్న దౌలత్‌బేగ్ ఓల్దీ వైమానిక స్థావరంలో భారత వాయుసేన.. సి-130 జె-30 సూపర్ హెర్క్యూలస్ రవాణా విమానాన్ని ఆగస్టు 20న దింపింది. ఈ స్థావరం ప్రపంచంలోనే ఎత్తై ప్రదేశంలో ఉంది. ఇది ఆక్సాయ్‌చిన్‌లో 16,614 అడుగులు (5,065 మీటర్లు) ఎత్తులో ఉంది. వాస్తవాధీన రేఖకు దగ్గరగా ఉంది. గత ఏప్రిల్‌లో చైనా బలగాలు ఇక్కడి భారత భూ భాగంలోకి చొచ్చుకువచ్చిన నేపథ్యంలో సూపర్ హెర్క్యూలస్‌ను దించారు. దీంతో ఈ ప్రాంతానికి జవాన్లు, యుద్ధ సామాగ్రి తరలింపు, కమ్యూనికేషన్ల నిర్వహణ సజావుగా సాగుతాయి. ఈ విమానం 20 టన్నుల బరువును అవలీలగా మోసుకెళ్తుంది. ఆహార భద్రత పథకం ప్రారంభం ఆహార భద్రత పథకాన్ని ఢిల్లీలో ఆగస్టు 20న సోనియా గాంధీ ప్రారంభించారు. ఢిల్లీతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్లు కూడా ఈ పథకాన్ని ప్రారంభించాయి. దేశంలో 80 కోట్ల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రతి సంవత్సరం ఈ పథకం కోసం 1.25 లక్షల కోట్లు ఖర్చు చేస్తారు. 6.2 కోట్ల టన్నుల బియ్యం, గోధుమలు, తృణ ధాన్యాలు సబ్సిడీపై పేదలకు అందజేస్తారు. దేశవ్యాప్తంగా చేపట్టే ఈ పథకానికి చట్టబద్ధత కల్పించేందుకు బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది. నాలుగు ఒప్పందాలపై భారత్ - ఇరాక్ సంతకాలు ఇరాక్ ప్రధానమంత్రి నౌరీ అల్ - మాలికీ భారత పర్యటనలో ఆగస్టు 23న నాలుగు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇందులో బ్లాక్-8లో చమురు తవ్వకాలకు సంబంధించిన ఒప్పందాన్ని పూర్తి చేయడం ఒకటి. ఈ కాంట్రాక్టును సద్దాం హుస్సేన్ పాలనలో 2000లో ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్‌కు కేటాయించారు. అయితే రెండో గల్ఫ్ యుద్ధం తర్వాత ఇరాక్ తిరిగి సంప్రదింపులకు పిలుపునిచ్చింది. ఈ పర్యటనలో ఇరాక్ ప్రధాని మాలికీ భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో చర్చలు జరిపారు. చమురుశుద్ధి కర్మాగారాలు, ఎరువుల పరిశ్రమలు, స్టీల్ ప్రాజెక్టుల్లో ఉమ్మడి భాగస్వామ్యంపై కూడా ఇరు దేశాలు చర్చించాయి. వాయుసేనలోకి భారీ రవాణా విమానం వాయుసేన రవాణా సామర్థ్యం మరింత పటిష్టం కానుంది. అమెరికా నుంచి కొనుగోలు చేసిన భారీ తరహా రవాణా ఎయిర్‌క్రాఫ్ట్ సీ-17ను రక్షణమంత్రి ఏకే ఆంటోనీ సెప్టెంబర్ 2న వైమానిక దళంలో అధికారికంగా ప్రవేశపెట్టనున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని హిండన్ ఎయిర్‌బేస్‌లో వీటి సేవలను ఆయన ప్రారంభిస్తారు. వాయుసేన 81వ స్క్వాడ్రన్‌లో చేర్చనున్న సీ-17 ఎయిర్‌క్రాఫ్ట్‌లను సుమారు రూ.20,000 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసేందుకు అమెరికాతో ఒప్పందం కుదిరింది. దాదాపు 80 టన్నుల లోడ్‌ను ఇవి మోసుకెళ్లగలవు. 2011లో అమెరికాతో కుదిరిన ఒప్పందం ప్రకారం పది సీ-17 విమానాల సరఫరాకు భారత్ ఆర్డర్ ఇచ్చింది. ఇప్పటికే 3 విమానాలను అందచేయగా వచ్చే ఏడాది చివరినాటికి మిగతావి సరఫరా కానున్నాయి. ప్రకృతి విపత్తుల సమయంలో వీటి ద్వారా మెరుగైన సేవలు అందించవచ్చు. ఇంటర్నెట్ వినియోగంలో భారత్‌కు మూడో స్థానం ఇంటర్నెట్ వినియోగంలో భారత్ మూడో స్థానానికి చేరింది. మొదటి స్థానంలో చైనా, రెండో స్థానంలో అమెరికా ఉన్నాయి. జపాన్ను అధిగమించి భారత్ మూడో స్థానంలో చేరిందని ప్రపంచ డిజిటల్ మెజర్మెంట్ అండ్ అనలిటిక్స్ సంస్థ ‘కాంస్కోర్’ తన నివేదికలో పేర్కొంది. భారత్‌లో ప్రస్తుతం 74 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులున్నారు. 2012 మార్చి నుంచి వీరి సంఖ్య 31 శాతం పెరిగింది. వినియోగదారుల్లో మూడింట ఒక వంతు 35 ఏళ్లకంటే తక్కువ వయసువారున్నారు. పీసీ, ల్యాప్‌ట్యాప్ సర్వీసుల ఆధారంగా భారత్ నెట్ వినియోగదారుల సంఖ్య 74 మిలియన్లుగా కాంస్కోర్ సంస్థ పేర్కొంది. మొబైల్, టాబ్లెట్ నెట్ వినియోగదారులను కలుపుకుని ఈ సంఖ్య మార్చి 31 నాటికి 164.81 మిలియన్లని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తెలిపింది. రచయిత్రి మాలతీ చందూర్ కన్నుమూత ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్ (84) ఆగస్టు 21న చెన్నైలో మరణించారు. ఆమె కృష్ణా జిల్లా, నూజివీడులో 1928లో జన్మించారు. ఆమె తెలుగులో మొత్తం 26 నవలలు రాశారు. మరెన్నో ఆంగ్ల రచనలను అనువదించారు. తొలి నవల ‘చంపకం - చెదపురుగులు’ కాగా, మొదటి కథ రవ్వలడ్డూలు. ఆమె నవల హృదయనేత్రికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆమె ఆంధ్రప్రభ వారపత్రికలో నిర్వహించిన ప్రమదావనం శీర్షిక వరుసగా 47 ఏళ్లపాటు కొనసాగి గిన్నిస్ రికార్డుకెక్కింది. సంగీత దర్శకుడు రఘునాథ్ పాణి గ్రాహి కన్నుమూత ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు పండిట్ రఘునాథ్ పాణిగ్రాహి(80) ఆగస్టు 25న భువనేశ్వర్‌లో మృతి చెందారు. ఆయన ఒడిశాలోనే తొలి సంగీత దర్శకుడు. ఒరియా, తమిళం, తెలుగు, కన్నడ చిత్రాల్లో అనేక పాటలు పాడారు. జయదేవుడి ‘గీత గోవిందం’ ఆలపించినందుకు 70వ దశకంలో ఫ్రెంచ్ ప్రభుత్వం ఆయనను సత్కరించింది. సంగీతంలో ఆయన సేవలకుగాను భారత ప్రభుత్వం 2010లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. హేతువాద నేత నరేంద్ర దభోల్కర్ హత్య ప్రముఖ హేతువాద నేత, మూఢనమ్మకాల వ్యతిరేక ప్రచారకుడు నరేందర దభోల్కర్ (69)ను పూణెలో ఆగస్టు 20న కాల్చి చంపారు. వైద్యుడైన నరేంద్ర అంధ శ్రద్ధ నిర్మూలన కమిటీకి అధ్యక్షుడిగా, సాధన వారపత్రిక సంపాదకుడిగా వ్యవహరించారు. గత రెండు దశాబ్దాలుగా సామాజిక రుగ్మతలపై ప్రజలలో చైతన్యం తెచ్చేందుకు కృషి చేశారు. క్రీడలు ప్రపంచకప్ ఆర్చరీలో భారత్‌కు స్వర్ణం పోలండ్‌లో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచ కప్‌లో భారత మహిళల జట్టు స్వర్ణ పతకం గెలుచుకుంది. ఆగస్టు 25న జరిగిన టీమ్ రికర్వ్ విభాగం ఫైనల్లో దీపిక కుమారి, రిమిల్, బొంబేలా దేవిలతో కూడిన భారత జట్టు, ప్రపంచ నంబర్‌వన్, లండన్ ఒలింపిక్స్ చాంపియన్ దక్షిణ కొరియాను ఓడించింది. గత నెలలో కొలంబియాలో జరిగిన ప్రపంచ కప్‌లోనూ టీమిండియాకు బంగారు పతకం లభించింది. గోపీచంద్ అకాడమీకి రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ కేంద్ర ప్రభుత్వం అందజేసే ప్రతిష్టాత్మక రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ - 2013 అవార్డు హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ (పీజీబీఎ)కి లభించింది. అత్యుత్తమ అకాడమీల ఏర్పాటు, నిర్వహణ విభాగం కింద గోపీచంద్ అకాడమీని కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ సిఫార్సు చేసింది. ఈ అకాడమీ సైనా నెహ్వాల్, పి.వి.సింధు, పారుపల్లి కాశ్యప్ వంటి బ్యాడ్మింటన్ క్రీడాకారులను అందించింది. ఈ అవార్డు సర్వీసెస్ స్పోర్ట్స కంట్రోల్ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ), పెట్రోలియం స్పోర్ట్స ప్రమోషన్ బోర్డ, యు.కె. మిశ్రా జాతీయ స్పోర్ట్స అకాడమీ -అలహాబాద్‌లకు కూడా ప్రకటించారు. ఆసియా యూత్ క్రీడల్లో భారత్‌కు మూడు స్వర్ణ పతకాలు చైనాలో జరిగిన ఆసియా యూత్ క్రీడల్లో ఆంధ్రపదేశ్‌కు చెందిన వెంకట్ రాహుల్ స్వర్ణ పతకం సాధించాడు. ఆగస్టు 21న జరిగిన వెయిట్‌లిఫ్టింగ్ 77 కిలోల విభాగంలో రాహుల్ మొత్తం 310 కిలోల బరువెత్తి స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. మహిళల 800 మీటర్ల పరుగులో అంజనా తమాకే స్వర్ణపతకం సాధించింది. భారత్‌కు తొలి స్వర్ణపతకం స్క్వాష్‌లో కుశ్కుమార్ అందించాడు. ఈ క్రీడల్లో భారత్ 3 స్వర్ణాలు, 4 రజతాలు, 7 కాంస్య పతకాలతో పదో స్థానంలో నిలిచింది. చైనా 46 స్వర్ణం, 23 రజతం, 24 కాంస్యాలతో మొదటిస్థానంలో నిలిచింది. దక్షిణ కొరియా (25-13-14) రెండోస్థానంలోనూ, జపాన్ (7-5-6) మూడోస్థానంలోనూ నిలిచాయి. ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు నాలుగో స్థానం ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పురుషుల విభాగంలో భారత్‌కు నాలుగో స్థానం దక్కింది. సెర్బియాలో ఆగస్టు 25న ముగిసిన పోటీలో భారత రెజ్లర్లు బాలరాజ్ 76 కిలోల ఫ్రీ స్టయిల్ కేటగిరీలో రజతం, జతిన్ 42 కిలోల ఫ్రీ స్టయిల్ కేటగిరీలో కాంస్యం సాధించారు. 48 దేశాలు పాల్గొన్న ఈ చాంపియన్‌షిప్‌లో రష్యా మొదటి స్థానం సాధించగా, అజర్బైజాన్ రెండో స్థానంలో, ఇరాన్ మూడో స్థానంలో, భారత్ నాలుగో స్థానంలో నిలిచాయి. మహిళల విభాగంలో రష్యా మొదటి స్థానం, జపాన్ రెండో స్థానం, ఉక్రెయిన్ మూడో స్థానం, భారత్ ఏడో స్థానం సాధించాయి. లియాండర్ పేస్‌కు 52వ డబుల్స్ టైటిల్ అమెరికాలో ఆగస్టు 25న జరిగిన విన్స్టన్-సాలెమ్ ఓపెన్ ఏటీపీ టోర్నమెంట్లో భారత టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్, కెనడా ప్లేయర్ డానియల్ నెస్టర్ జంట డబుల్స్ విజేతగా నిలిచింది. ఫైనల్లో పేస్ జంట.. ట్రీట్ హుయ్ (ఫిలిప్పీన్స్) - ఇంగ్లోట్ (బ్రిటన్)లపై గెలిచారు. 40 ఏళ్ల లియాండర్ పేస్‌కు ఇది 52వ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. నెస్టర్‌కు ఇది 81వ టైటిల్. అంతేకాకుండా ఈ విజయంతో నెస్టర్ తన కెరీర్లో డబుల్స్‌లో 900 పైగా విజయాలు సాధించిన తొలి క్రీడాకారుడిగా రికార్డులకెక్కాడు. నేషనల్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో సౌరవ్, జోత్స్నలకు టైటిల్స్ 61 నేషనల్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సౌరవ్ ఘోషల్ గెలుచుకున్నాడు. జైపూర్‌లో ఆగస్టు 23న జరిగిన ఫైనల్స్‌లో మహేశ్ మంగోంకర్ను సౌరవ్ ఓడించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను జోత్స్న చిన్నప్ప గెలుచుకుంది. ఫైనల్స్‌లో అపరాజితా బాలమురుకన్ను ఓడించింది. న్యూహవెన్ ఓపెన్ టోర్నమెంట్ డబుల్స్ విజేత సానియా-జీ జెంగ్ భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన ఖాతాలో 17వ డబుల్స్ టైటిల్‌ను జమ చేసుకుంది. అమెరికాలో ఆగస్టు 25న జరిగిన న్యూ హవెన్ ఓపెన్ టోర్నమెంట్లో తన భాగస్వామి జీ జెంగ్ (చైనా)తో కలిసి సానియా విజేతగా నిలిచింది. మహిళల డబుల్స్ ఫైనల్లో మూడో సీడ్ సానియా-జీ జెంగ్ , రెండో సీడ్ అనాబెల్ మెదీనా గారిగెజ్ (స్పెయిన్)-కాటరీనా స్రెబోత్నిక్ (స్లొవేనియా) జంటపై గెలిచింది. ఓవరాల్‌గా సానియా కెరీర్లో ఇది 17వ డబుల్స్ టైటిల్‌కాగా ఈ ఏడాది మూడోది. విజేతగా నిలిచిన సానియా జంటకు 36,500 డాలర్ల (రూ. 23 లక్షల 12 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 470 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ప్రముఖ సెయిలర్ సి.ఎస్. ప్రదీపక్ మృతి ప్రముఖ సెయిలర్, అర్జున్ అవార్డు గ్రహీత సి.ఎస్. ప్రదీపక్ (66) ఆగస్టు 24న హైదరాబాద్‌లో మరణించారు. హుస్సేన్‌సాగర్‌లో సెయిలింగ్ నిర్వహించడాన్ని ప్రోత్సహించిన వారిలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. 1972 - 1992 మధ్య కాలంలో ఆయన ప్రముఖ సెయిలర్‌గా కొనసాగారు. ఆయన వరల్డ్ మాస్టర్స్‌లో కాంస్యం, ఆసియన్ గేమ్స్‌లో కాంస్యం, ఆసియన్ రెగట్టాలో స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు.