T-bill
-
సీమాంధ్రలో నిరసనలు
-
దాదా సూచనలు
-
కాంగ్రెస్ బీజేపీ పై బురదజల్లుతోంది: వెంకయ్య
-
తెలంగాణ కోసం మరో బలిదానం
దుబ్బాక, న్యూస్‌లైన్: తెలంగాణ కోసం మరో బలిదానం జరిగింది. టీ బిల్లును అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు కుట్రలకు పాల్పడుతుండటంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో దుబ్బాకలో విషాదం అలుముకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. దుబ్బాకకు చెందిన వంగ శేఖర్(29) నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లాడు. ఆదివారం మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా గంభీర్రావుపేట మండలం మానేరులో శవమై తేలాడు. తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతు తెలపడం లేదన్న వార్తలు అతణ్ణి కలచివేశాయి. దీంతో మానేరు ప్రాజెక్టు వద్దకు వెళ్లాడు. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, టీఆర్ఎస్ నాయకులకు, బంధువులకు ఫోన్ చేశాడు. వీరు తెలంగాణ రావడం ఖాయమని, ఆత్యహత్య చేసుకోవద్దని సూచించారు. కానీ శేఖర్ ఫోన్ కట్ చేసినట్లు సమాచారం. నాలుగు రోజులుగా మానేరు ప్రాజెక్టు వద్ద శేఖర్ ఆచూకీ కోసం గాలించారు. ఆదివారం మధ్యాహ్నం మానేరులో శేఖర్ మృతదేహం బయటపడింది. సమాచారం తెలుసుకున్న మృతుడి తల్లి రుక్కవ్వ, బంధువులు ఘటనా స్థలానికి వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కూడా మానేరు ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిరిసిల్లకు తరలించారు. ఆదివారం రాత్రి మృతదేహాన్ని దుబ్బాకకు తెచ్చి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శేఖర్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవాడు. గతంలో తడిపై కేసులు కూడా నమోదయ్యాయి. జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. దుబ్బాకలో విషాదం శేఖర్ మరణ వార్త తెలియగానే దుబ్బాకలో విషాద ఛాయలు అలముకున్నాయి. శనివారం వరకు శేఖర్ బతికే ఉంటాడని భావించిన దుబ్బాక ప్రజలు, అతని మిత్రులు చనిపోయాడని తెలియడంతో కన్నీరుమున్నీరయ్యారు. నేడు దుబ్బాక బంద్ తెలంగాణ కోసం ప్రాణాలు వదిలిన వంగ శేఖర్ మృతికి సంతాపకంగా టీఆర్ఎస్ నాయకులు సోమవారం దుబ్బాక బంద్ కు పిలుపునిచ్చారు. ఈ విషయమై మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో శేఖర్ పాత్ర చాలా విలువైందని కొనియాడారు. అతని మృతి తనకు దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. తెలంగాణ ఏర్పాటు ఖాయమని ఇలాంటి నేపథ్యంలో ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన సూచించారు. బంద్‌కు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. శేఖర్ మృతి బాధాకరం శేఖర్ మృతి తెలంగాణ ఉద్యమానికి తీరని లోటు. అతని మరణం బాధించింది. రాష్ట్ర ప్రక్రియ సాగుతున్న తరుణంలో ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. - కొత్త ప్రభాకర్‌రెడ్డి టీఆర్ఎస్ నాయకుడు ముదిరాజ్ యువసేనా సంతాపం తెలంగాణ ఏర్పాటు కోసం ప్రాణాలు అర్పించిన శేఖర్‌కు తెలంగాణ ముదిరాజ్ యువసేన సంతాపం ప్రకటించింది. -
ఆంధ్రప్రదేశ్ విభిజనకు సంపూర్ణ సహకారం
-
టీ బిల్లుపై ఆగ్రహ జ్వాల
చిత్తూరు(జిల్లాపరిషత్), తిరుపతి అర్బన్/లీగల్, న్యూస్‌లైన్ : తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ శుక్రవారం రాత్రి జిల్లాలో నిరసనలు మిన్నంటాయి. వివిధ వర్గాల జేఏసీలు, నాయకుల నుంచి ఆగ్రహ జ్వాలలు పెల్లుబికాయి. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై దుమ్మెత్తి పోశారు. రాష్ట్రపతి అయినా తెలుగు ప్రజల ఆత్మఘోషను అర్థం చేసుకుని రాష్ట్ర విభజన ప్రక్రియకు పుల్‌స్టాప్ పెట్టాలని పలువురు అభిప్రాయపడ్డారు. సీమాంధ్రుల జీవితాలతో ఆడుకోవద్దు కేంద్ర ప్రభుత్వం సీమాంధ్రుల జీవితాలతో ఆడుకుంటోంది. గత సంవత్సరం జూలై 30న రాష్ట్ర విభజనపై ప్రకటన వచ్చినప్పటి నుంచి సీమాంధ్ర అట్టుడుకుతోంది. ఇదేమీ పట్టించుకోకుండా కేంద్రం స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విడదీసేందుకు ముందుకెళ్లడం సరికాదు. సమ్మెలోకి దిగిన ఏపీ ఎన్జీవోలు శనివారం నుంచి నిరసన కార్యక్రమాలు మరింత ఎక్కువ చేస్తారు. - కృష్ణమనాయుడు, ఏపీ ఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్నిక నేపథ్యంలో స్పీడ్ పెంచింది ఎన్నికలు సమీపిస్తున్నందునే విభజనపై కేంద్రం స్పీడ్ పెంచింది. అసెంబ్లీలో బిల్లు తిప్పి పంపామని జబ్బలు చరుస్తున్న నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు. కేంద్ర మంత్రి పదవుల్లో ఉన్న నేతలు నిశ్శబ్దంగా సమావేశాల్లో కూర్చొని వస్తున్నారు. పచ్చగా ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్‌పార్టీ నాశనం చేస్తోంది. - రెడ్డిశేఖర్‌రెడ్డి, ఉపాధ్యాయ సంఘం నేత తెలుగు ప్రజలంటే విశ్వాసం లేదు తెలుగు ప్రజలు రెండు దఫాల పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కిస్తే ఇప్పుడు వారిపై విశ్వాసం లేకుండా వ్యవహరిస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయానికి విలువ లేకపోవడం దారుణం. కేంద్రం నిరంకుశ విధానానికి శుక్రవారం కేబినెట్ ఆమోదమే తార్కాణం. - డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, జేఏసీ కన్వీనర్,తిరుపతి పోరాటాలు తీవ్రతరం తెలుగు ప్రజల అభిప్రాయాన్ని ఏమాత్రం లెక్కలోకి తీసుకోకుండా వ్యవహరిస్తున్న కేంద్రప్రభుత్వంపై పోరాటాలు తీవ్రతరం చేయడానికి అన్ని జేఏసీలతో కలసి ముందుకు సాగుతాం. రాష్ట్ర విభజన ప్రక్రియపై ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం)లో మన ప్రాంతానికి చెందిన ఒక్కరూ లేకపోవడం విడ్డూరం. విభజన అంశంలో రాష్ట్రపతి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. - డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, మెడికల్ జేఏసీ జిల్లా చైర్మన్ ఇది తెలుగువారి ఆత్మఘోష విభజన ప్రక్రియపై తెలుగువారి ఆత్మఘోషను ఢిల్లీ పెద్దలు పరిగణనలోకి తీసుకోలేదు. సీమాంధ్రనాయకులు ఢిల్లీ పెద్దలకు తాకట్టయ్యారు. మన ప్రాంత నాయకుల ఉదాసీనత, ప్యాకేజీల కక్కుర్తి వైఖరి వల్లే కేంద్రం మొండిగా ముందుకెళుతోంది. విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళుతోంది. సీమాంధ్ర కూడా వెనుకబాటుకు గురైందన్న విషయాన్ని ఏ ఒక్కరూ పరిగణనలోకి తీసుకోవడంలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. వెంటనే విభజన ప్రక్రియను ఆపాలి. - డాక్టర్ పెన్నా కృష్ణప్రశాంతి, ఐఎంఏ ఉపాధ్యక్షురాలు -
టి-బిల్లును తిప్పిపంపే, నైతిక హక్కు కిరణ్‌కు లేదు: ఈటెల
-
టీ బిల్లుపై భగ్గు
=అసెంబ్లీలో వైఎస్సార్సీపీ నేతలపై దాడికి నిరసన =దిగ్విజయ్ దిష్టిబొమ్మ దహనం సిరిపురం, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అసెంబ్లీలో శాంతియుతంగా కోరిన తమ పార్టీ ఎమ్మెల్యేలపై తెలంగాణ ఎమ్మెల్యేలు దాడి చేయడాన్ని వైఎస్సార్ సీపీ నేతలు ఖండించారు. రాష్ట్ర విభజన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు పార్టీ నగర విభాగం ఆధ్వర్యంలో మద్దిలపాలెం కూడలి వద్ద సోమవారం సాయంత్రం మానవహారం చేపట్టారు. టీ బిల్లు ప్రతులను చించి వేసి, దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్టీ అధికార ప్రతినిధి కంపా హనోక్ మాట్లాడుతూ ఎలాగైనా రాష్ట్రాన్ని విభజించాలనే దురుద్దేశంతో కాంగ్రెస్, టీడీపీ నేతలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారన్నారు. విభజన ను అడ్డుకుంటానని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి ఆ బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఎందుకు గైర్హాజరయ్యారో చెప్పాలన్నారు. పార్టీ నాయకుడు కొయ్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటని అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ నేతలు సీమాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారన్నారు. అనంతరం దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలుగుతల్లి విగ్రహం ముందు బైఠాయించి జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు.