ఐక్యతతోనే సమస్యలు పరిష్కారం
పోచమ్మమైదాన్, న్యూస్‌లైన్ : తెలంగాణ ఉ ద్యోగులు ఐక్యతగా ఉన్నప్పుడే సమస్యల ప రిష్కారం సాధ్యమవుతుందని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు రాజేష్ కుమార్ అన్నారు. వరంగల్ ములుగు రోడ్డు సమీపంలోని ప్ర భుత్వ ఐటీఐలో టీఎన్జీవోస్ ఉపాధి శిక్షణ శా ఖ బ్రాంచ్ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది. సమావేశంలో ముఖ్యఅతిథిగా రా జేష్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగులకు రక్ష ణ కవచంగా టీఎన్జీవోస్ నిలుస్తుందని తెలి పారు. తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించిన ఉద్యోగులు ఆవిర్భావ ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు.
జిల్లా కార్యదర్శి రత్నావీచారి మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టి కి తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో రత్నాకర్‌రెడ్డి, రాజేందర్, వెంకటేశ్వర్ రావు, సాంబారి సుదర్శన్ పాల్గొన్నారు. అనంతరం టీఎన్జీవోస్ ఉపాధి శిక్షణ శాఖ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు.
నూతన కమిటీ ఇదే...
టీఎన్జీవోస్ ఉపాధి శిక్షణ శాఖ బ్రాంచ్ నూత న కమిటీ వివరాలిలా ఉన్నాయి. జిల్లా అధ్యక్షుడిగా కె.సమ్మయ్య, ఉపాధ్యక్షులుగా కుమారస్వామి, సీహెచ్.రవీందర్, రజిత, ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్, సహాయ కార్యదర్శులుగా శ్రీనివాసరావు, జగన్మోహన్ సింగ్, జయ, కోశాధికారిగా భాస్కర్, ఆర్గనైజింగ్ సె క్రటరీగా నరేందర్, ప్రచార కార్యదర్శిగా విజ య్‌కుమార్, ఈసీ మెంబర్లుగా ఆదిత్య, రమే ష్, రజిత, జాయికెరల్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కమిటీ 2014 నుంచి 2017 సం వత్సరం వరకు అమలులో ఉంటుంది. కమిటీని ప్రకటించిన అనంతరం బాధ్యులు ఐటీఐల జిల్లా కన్వీనర్, వరంగల్ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ సాంబారి సుదర్శన్‌ను మార్యదపూర్వకంగా కలిశారు.