T papireddy
-
టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఈసెట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని జేఎన్టీయూహెచ్లో ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ టి.పాపిరెడ్డి విడుదల చేశారు. ఫలితాల్లో 90.32 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అమ్మాయిల్లో 92.38 శాతం, అబ్బాయిల్లో 89.51 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఎస్సీ (మ్యాథమెటిక్స్) అంశాల్లో ఈ నెల 11న నిర్వహించిన ఈ పరీక్షకు 28,037 రిజిస్టర్ చేసుకోగా 27,123 మంది (96.74 శాతం) హాజరయ్యారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో జేఎన్టీయూహెచ్ వీసీ ఎ.వేణుగోపాల్‌రెడ్డి, ఈసెట్ కన్వీనర్ ఎ.గోవర్ధన్, టీఎస్ ఈసెట్ కోకన్వీనర్ ఎం.చంద్రమోహన్, కోఆర్డినేటర్ నర్సింహ పాల్గొన్నారు. వరంగల్ విద్యార్థుల ప్రతిభ.. రామన్నపేట: టీఎస్ ఈసెట్‌లో వరంగల్ విద్యార్థులు మరోసారి ప్రతిభ చాటారు. హన్మకొండ గుడిబండల్ ప్రాంతానికి చెందిన జోగం గౌతమ్ మెకానికల్ విభాగంలో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకు సాధించాడు. ఇతను వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదివాడు. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ.. భవిష్యత్‌లో మెకానికల్ ఇంజనీరింగ్‌లో రాణిస్తానని పేర్కొన్నారు. కంప్యూటర్ విభాగంలో.. హన్మకొండ కాపువాడకు చెందిన విన్నకోట శ్రీవాణి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ విద్యార్థిని ఏపీ ఫలితాల్లోనూ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. భవిష్యత్తులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా రాణించాలన్నదే తన లక్ష్యమని విన్నకోట శ్రీవాణి పేర్కొంది. మెరిసిన కవలలు.. గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రానికి చెందిన కొండూరు నిర్మల, ఉమామహేశ్వర్ దంపతుల కవల పిల్లలు శ్రీకన్య, శ్రీలేఖ టీఎస్ ఈసెట్ ఫలితాల్లో అద్భుత ఫలితాలు సాధించారు. వరంగల్ పాలిటెక్నిక్‌లో ఈసీఈ పూర్తి చేసిన వీరిద్దరూ ఏపీ, తెలంగాణలో నిర్వహించిన ఈసెట్ పరీక్షలు రాశారు. ఏపీ ఈసెట్లోశ్రీకన్య రాష్ట్రస్థాయిలో 6వ ర్యాంకు, శ్రీలేఖ 50వ ర్యాంకు సాధించింది. అలాగే తెలంగాణ ఈసెట్‌లో శ్రీకన్య రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు, శ్రీలేఖ 65వ ర్యాంకు సాధించినట్లు వారి తండ్రి ఉమామహేశ్వర్ వెల్లడించారు. -
బాలురదే హవా
హైదరాబాద్: టీఎస్‌ఈసెట్‌లో బాలురే పైచేయి సాధించారు. మూడు బ్రాంచీలు మినహా మిగతా అన్ని బ్రాంచీల్లోనూ బాలురే అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. టీఎస్ఈసెట్–2018 ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ టి.పాపిరెడ్డి గురువారం విడుదల చేశారు. జేఎన్టీయూహెచ్లోని యూజీసీ అకడమిక్ స్టాఫ్ కళాశాల ఆడిటోరియంలో జేఎన్టీయూహెచ్ వీసీ వేణుగోపాల్‌రెడ్డి, రిజిస్ట్రార్ ఎన్.యాదయ్య, ఈసెట్ కన్వీనర్ ఎ.గోవర్ధన్, కో కన్వీనర్ చంద్రమోహన్, కో ఆర్డినేటర్ సమ్మూలాల్‌తో కలసి పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల సీడీని, పాస్‌వర్డ్‌ను, బ్రాంచీల వారీగా మొదటి ఐదు ర్యాంకులను సాధించిన విద్యార్థుల జాబితాలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఏడాది చోటుచేసుకున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టడం ద్వారా ఈసెట్ పరీక్షను సజావుగా నిర్వహించామన్నారు. గతేడాదితో పోల్చి తే రెండువేలకు పైగా విద్యార్థులు ఈ ఏడాది పరీక్షకు హాజరైనట్టు తెలిపారు. మొత్తం 27,652 మంది విద్యార్థులు ఈసెట్‌కు దరఖాస్తు చేసుకోగా 26,883 మంది పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. వీరిలో 24,746 మంది (92.05 శాతం) ఉత్తీర్ణత సాధించిన ట్టు తెలిపారు. ఇంజనీరింగ్ పది, ఫార్మసీ, బీఎస్సీ మ్యాథమెటిక్స్‌తో కలసి 12 బ్రాంచీలలో పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. కెమికల్ ఇంజనీరింగ్, బయో టెక్నాలజీ, ఫార్మసీ విభాగాల్లో మినహా అన్ని బ్రాంచీల్లోనూ బాలురే పైచేయి సాధించారు. ఫలితాలను చూసుకునేందుకు PROGRESSIVETS@ 2018 పాస్‌వర్డ్‌ను సైతం విడుదల చేశారు. జూన్ 10 నుంచి కౌన్సెలింగ్.. ఈసెట్ కౌన్సెలింగ్‌ను వచ్చే నెల 10 నుంచి చేపట్టనున్నట్టు పాపిరెడ్డి వెల్లడించారు. ఈసెట్ ఫలితాల విడుదల సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడా రు. జూన్ 10 నుంచి కౌన్సెలింగ్ చేపట్టి ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో సీట్ల కేటాయింపు ప్రక్రియను పూర్తిచేయనున్నట్లు ఆయన తెలిపారు. -
బీఎడ్‌లో ప్రవేశాల షెడ్యూలు జారీ
ఈ నెల 30న నోటిఫికేషన్.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కాలేజీల్లో బీఎడ్ ప్రవేశాల కోసం బుధవారం(30న) నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన సోమవారం ప్రవేశాల కమిటీ సమావేశం మండలి కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో షెడ్యూల్‌ను ప్రకటించారు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలికి (ఎన్సీటీఈ) అఫిడవిట్లు దాఖలు చేసిన కాలేజీల జాబితా ఈ నెల 31 తర్వాత వెల్లడికానున్న నేపథ్యంలో ఆ తర్వాత ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించేలా షెడ్యూల్‌ను ఖరారుచేశారు. ఇదీ షెడ్యూలు.. 7–9–2017 నుంచి 13–9–2017 వరకు అర్హులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 9–9–2017 నుంచి 16–9–2017వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం 17–9–2017న వెబ్ ఆప్షన్లలో మార్పులకు అవకాశం 20–9–2017న సీట్లు కేటాయింపు 25–9–2017లోగా కాలేజీల్లో చేరికలు, అదేరోజు నుంచి క్లాసులు ప్రారంభం.