'మిషన్ కాకతీయపై శ్వేతపత్రం విడుదల చేయాలి'
హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ముందుచూపు వల్లే రాష్ట్రంలో ప్రాజెక్టులు నెలకొన్నాయని తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...కేసీఆర్ సర్కార్ చేస్తోంది కేవలం ప్రచార ఆర్భాటమేనన్నారు.
నకిలీ విత్తనాలతో లక్షల ఎకరాల్లో రైతులు నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దశల వారీగా కాకుండా ఒకేసారి రైతులకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రంలో చేపట్టిన మిషన్ కాకతీయ పథకంపై శ్వేతపత్రం విడుదల చేయాలని కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు.