tadiparthy
-
ఓటమి భయంతోనే టీడీపీ హింసా రాజకీయాలు: ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి
సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రిలో టీడీపీ హింసా రాజకీయాలను ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ఎస్పీ అమిత్ బర్దర్ సమక్షంలోనే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కాన్వాయ్‌పై దాడి జరిగిందని.. ఎస్పీ, ఏఎస్పీ రామకృష్ణ చౌదరి ఏకపక్షంగా వ్యవహరించారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలీసుల సహకారంతోనే తాడిపత్రిలో వైఎస్సార్సీపీ నేతలపై దాడులు జరిగాయన్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల దౌర్జన్యం అమానుషమని.. ఏఎస్పీ రామకృష్ణ చౌదరిని కూడా సస్పెండ్ చేయాలని అనంతవెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు.చంద్రబాబు డైరెక్షన్లోనే..: విశ్వేశ్వరరెడ్డి ఉరవకొండ వైఎస్సార్ సీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ఓటమి భయంతోనే టీడీపీ హింసా రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్లో ఇష్టారాజ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం వల్లే ఎన్నికల్లో హింస చెలరేగిందన్నారు. రౌడీషీటర్లు, ఖూనీకోర్లను పయ్యావుల కేశవ్ పోలింగ్ ఏజెంట్లగా పెట్టారు. తాడిపత్రిలో టీడీపీ అరాచకాలకు పోలీసులే నైతిక బాధ్యత వహించాలని విశ్వేశ్వరరెడ్డి అన్నారు.టీడీపీ దాడులు.. పిరికిపంద చర్య: వీరాంజనేయులుటీడీపీ-జనసేన-బీజేపీలకు ఓటమి భయం పట్టుకుందని..అందుకే వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు అన్నారు.తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి పిరికిపంద చర్యగా భావిస్తున్నామన్నారు. -
అశ్వవాహనంపై రామలింగేశ్వరుడు
తాడిపత్రి టౌన్: బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజు మంగళవారం రాత్రి బుగ్గరామలింగేశ్వరస్వామి అశ్వవాహనంపై విహరించారు. పార్వతీ సమేత బుగ్గరామలింగేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం పురవీధుల్లో అర్చకుల వేదమంత్రోచ్ఛారణ, వాయిద్యాల నడుమ ఊరేగించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. -
శుభోదయం తాడిపత్రి కార్యక్రమం నిర్వహించిన హర్షవర్దన్ రెడ్డి
-
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం: ప్రియురాలి మృతి
మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం తాడిపర్తిలో గురువారం విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటనలో ప్రియురాలు మృతి చెందగా.. ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. తాడిపర్తి గ్రామానికి చెందిన వారు ఈ విషయాన్ని గమనించి... యువకుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని యవతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాలిక దారుణహత్య
పెట్రోల్ పోసి తగలబెట్టిన దుండగులు తాడిపర్తి శివారులో వెలుగుచూసిన ఘటన క్లూస్‌టీంతో పోలీసుల విస్తృతతనిఖీలు గోపాల్పేట : గుర్తుతెలియని బాలికను దుండగులు అతికిరాతంగా హత్యచేసి, ఆపై మృతదేహాన్ని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి తగులబెట్టారు. స్థానికంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటన శనివారం మండలంలోని తాడిపర్తిలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. గుర్తుతెలియని బాలిక(14)ను ఎక్కడో చంపి తాడిపర్తి సమీపంలోని ప్రధానరహదారి పక్కనుంచి జమ్మికుంటకు వెళ్లే దారిలో వ్యవసాయ పొలంలో పడేసి నిప్పంటించారు. ఉదయం అటువైపు వెళ్తున్న కొందరు రైతులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో వనపర్తి టౌన్ ఎస్ఐ గాంధీనాయక్, గోపాల్పేట ఏఎస్ఐ ఇలియాజ్, హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాస్‌రెడ్డి సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. అప్పటికే పొగలు వస్తుండటాన్ని గమనించిన నీళ్లు పోయించి మంటలను ఆర్పించారు. తెల్లవారుజామునే శవాన్ని తీసుకువచ్చి ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని తెలుస్తోంది. మృతదేహం పక్కనే బైకు టైరు గుర్తులు ఉన్నాయి. బైకుపై తీసుకొచ్చి ఉంటారని, శరీరంపై బురఖా ధరించి ఉండటంతో ముస్లిం బాలికగా పోలీసులు భావిస్తున్నారు. ముఖం పూర్తిగా కాలిపోవడంతో ఆమెను గుర్తుపట్టలేకపోతున్నారు. మృతదేహం పక్కనే ఓ బెడ్‌షిట్, చున్నీ, లోదుస్తులు, ఓ చిన్న కత్తి పడి ఉంది. కుడికాలి బోటన వేలు పూర్తిగా రాసుకుపోయి ఉండడంతో మృతదేహాన్ని బైకుపై తీసుకొచ్చే సమయంలో రోడ్డుపై రాసుకుపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తలపై కొట్టి.. ఆపై ఈడ్చుకొచ్చి మతురాలి కుడి చేతికి ఓ ఎర్రని దారం ఉంది. తల వెనుక భాగంలో బలమైన రక్తపు గాయాన్ని పోలీసులు గుర్తించారు. తలపై కొట్టిచంపి తీసుకొచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. బెడ్‌షిట్, దుస్తులు ఉండటంతో బాలికను హాస్టల్ నుంచిగానీ, ఇంటి నుంచిగానీ తీసుకువచ్చారా? ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలికలను గుర్తించడం కోసం అన్ని పీఎస్‌లకు సమాచారం ఇచ్చి మిస్సింగ్ కేసులపై ఆరా తీస్తున్నారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంతో గాలించగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. బాలిక వంటిపై చిలుకపచ్చ రంగు పైజామా (లెగ్గిన్) ఉంది. తాడిపర్తి వీఆర్ఓ మంజుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో తాడిపర్తిలో భయాందోళనలు నెలకొన్నాయి.