tajmahal visit
-
ట్రంప్‌కు ‘తాజ్’ను చూపించింది ఎవరో తెలుసా?
-
ట్రంప్‌కు ‘తాజ్’ను చూపించింది ఎవరో తెలుసా?
ఆగ్రా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అతని భార్య మెలానియాలు తాజ్ మహల్ అందాలను చూసి ఆనందం వ్యక్తం చేశారు. వారు తాజ్ అందాలను వీక్షిస్తున్న సమయంలో గైడ్‌గా నితిన్ కుమార్ సింగ్ వ్యవహరించారు. ఆయన ట్రంప్‌కే కాకుండా పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు, ఇతర ప్రముఖులకు తాజ్ గొప్పతనాన్ని వివరించి చూపారు. ఆగ్రాలోని కట్రా ఫులెల్‌కు చెందిన నితిన్ తాజ్ మహల్ ఘనతను, దాని వెనుకనున్న ప్రేమ కథను ట్రంప్‌కు వివరించారు. ఈ సందర్భంగా ట్రంప్, మెలానియాలు అతను చెబుతున్నదానిని శ్రద్ధగా విన్నారు. దీనిపై నితిన్ మాట్లాడుతూ.. ట్రంప్ దంపతులు తాజా మహల్‌ను చూసి సంతోషం వ్యక్తం చేశారన్నారు. అదొక అద్భుత కట్టడం అని ట్రంప్ దంపతులు పేర్కొన్నట్లు నితిన్ కుమార్ సింగ్ తెలిపారు. మరొకసారి తాజ్ మహల్‌ను వీక్షించడానికి వారు వస్తామని తెలిపారన్నారు. గతంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, మంగోలియా అధ్యక్షుడు ఖల్ట్మాగిన్ బతుల్గా, బెల్జియం రాజు ఫిలిప్‌లకు తాజ్ మహల్ గురించి వివరించిన ఘనత నితిన్ కుమార్ సింగ్‌ది. ప్రధాన నరేంద్ర మోదీకి ఎంతో ఇష్టమైన నితిన్ సింగ్.. ఎక్కువ శాతం ప్రముఖులకే గైడ్‌గా వ్యవహరిస్తారు. ఆగ్రాకు చెందిన నితిన్ సింగ్ తాజ్ మహల్ విశిష్టత గురించి తెలపడంలో అతనికే అతనే సాటని స్థానికుల మాట. (ఇక్కడ చదవండి: చేతిలో చెయ్యేసి) -
తాజ్‌మహల్ వీక్షించిన ట్రంప్ దంపతులు
-
చేతిలో చెయ్యేసి
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో చల్లని సాయంత్రం సమయంలో చిరుగాలులు మోముని తాకుతూ ఉంటే తన నెచ్చెలి మెలానియా చేతిలో చెయ్యేసి వెండికొండలా మెరిసిపోయే ప్రపంచ అద్భుతాన్ని తనివితీరా చూసి తన్మయత్వం చెందారు అగ్రరాజ్యాధీశుడు ఆగ్రా మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్‌పైనున్న అవ్యాజ్యమైన ప్రేమతో యమునా నది ఒడ్డున 16వ శతాబ్దంలో కట్టించిన ఈ పాలరాతి సౌధం ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచి ప్రఖ్యాతివహించింది. తాజ్‌మహల్‌ని సందర్శించడమంటే అదో అద్భుతమైన ప్రేమ భావన. అమెరికా ఇతర అధ్యక్షుల్లా మాదిరి కాదు.. ట్రంప్, మెలానియా ఎక్కడికి వెళ్లినా చేతులు పట్టుకొని కనిపించరు. కానీ ఈ తాజ్ ఏ మాయ చేసిందో ఏమో మెలానా చేతిలో చెయ్యి వేసుకుంటూ తాజ్ ఉద్యానవనంలో కలియతిరుగుతూ అలౌకికమైన ఆనందానికి లోనయ్యారు ట్రంప్. ఆ తన్మయత్వంలోనే సందర్శకుల పుస్తకంలో ‘‘తాజమహల్ వావ్ అనిపించింది. సుసంపన్నమైన, విలక్షణ విభిన్నమైన భారతీయ సంస్కృతికి ఈ కట్టడం కాలాతీతంగా నిలిచిన పవిత్ర శాసనం. థాంక్యూ ఇండియా’’అని రాశారు. ట్రంప్ దంపతులు తాజ్‌మహల్‌లో గంటకు పైగా కలియతిరుగుతూ అణువణువు సౌందర్యంతో నిండిపోయిన ఆ కట్టడం అందాలను ఆస్వాదించారు. ప్రపంచ వారసత్వ కట్టడమైన తాజ్‌మహల్ గొప్పతనాన్ని ఒక గైడ్ వారికి వివరించి చెప్పారు. ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జేర్డ్ కుష్నర్ కూడా వారి వెంట ఉన్నారు. అయితే ఇతర ప్రతినిధుల బృందంతో పాటు వారు దూరం నుంచి తాజ్‌మహల్ అందాలను వీక్షించారు. తాజ్ అందాలను ఇవాంకా తన మొబైల్ ఫోన్లో బంధిస్తూ కనిపించారు. ఆగ్రా వీధుల్లో ఘన స్వాగతం అహ్మదాబాద్ నుంచి ఆగ్రా చేరుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఆగ్రా ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిల్చొని ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్యంగా ట్రంప్ కారు బీస్ట్ క్షణ కాలమైనా కనిపిస్తుందని ఆత్రుతగా ఎదురుచూశారు. అహ్మదాబాద్ నుంచి ఆగ్రాలో ఖేరియా ఎయిర్‌బేస్‌కి చేరుకున్న ఆయనకి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. తాజ్‌మహల్‌కి సమీపంలోని ఓబరాయ్ అమర్‌విలాస్ హోటల్‌కి తన కాన్వాయ్‌లోనే చేరుకున్నారు. మొత్తం 13కి.మీ. దూరం ఉన్న ఈ ప్రయాణంలో 15 వేలకు మందికి పైగా విద్యార్థులు, సాధారణ ప్రజలు రోడ్డుకిరువైపులా అమెరికా, భారత్ జెండాలు పట్టుకొని ఉత్సాహంతో చేతులు ఊపారు. ఆ హోటల్ నుంచి తాజ్‌మహల్‌కి తన కుటుంబ సభ్యులతో కలిసి ట్రంప్ ఎకో ఫ్రెండ్లీ వాహనాల్లో వెళ్లారు. కాలుష్యం కోరల్లో చిక్కుకున్న తాజ్‌మహల్ గేటు నుంచి 500 మీ పరిధి వరకు పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలను సుప్రీం కోర్టు నిషేధించింది. అందుకే అధ్యక్షుడు ట్రంప్ తన బీస్ట్ కారుని హోటల్ ఆవరణలో ఉంచి ఎకో ఫ్రెండ్లీ వాహనాల్లోనే వెళ్లారు. తాజ్ కట్టడం దగ్గర మెలానియాతో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు వస్తూ ఉండడంతో తాజ్‌ని అద్దంలా ఉంచడానికి మరింత మెరుగులు దిద్దారు. వందలాది మంది పనివాళ్లు ముల్తానీ మిట్టీతో తాజ్‌ని శుభ్రం చేశారు. తాజ్‌మహల్‌ని సందర్శించిన అధ్యక్షుల్లో చివరి వాడు బిల్ క్లింటన్. 2000 సంవత్సరంలో తన కుమార్తె చెల్సీతో కలిసి ఆయన తాజ్‌ని సందర్శించారు. 2015లో బరాక్ ఒబామా తాజ్‌ని చూద్దామని భావించారు కానీ, భద్రతా కారణాల రీత్యా సందర్శించలేదు. ఇవాంకా మళ్లీ అదే డ్రెస్ సాధారణంగా సెలిబ్రిటీలు ఒకసారి వేసుకున్న డ్రెస్‌తో మళ్లీ బయట ప్రపంచానికి కనిపించరు. పూటకో ఫ్యాషన్‌తో డ్రెస్సులు మారుస్తూ ఉంటారు. కానీ ఇవాంకా గత ఏడాది ఫ్యాషన్‌నే మళ్లీ కొనసాగించారు. 2019 సెప్టెంబర్ అర్జెంటీనా పర్యటనలో ఏ మిడీ అయితే వేసుకున్నారో అదే మళ్లీ భారత పర్యటనలోనూ ధరించారు. బేబి బ్లూ రంగు పైన ఎరుపు రంగు పెద్ద పెద్ద పువ్వులున్న వీ నెక్ డ్రెస్ వేసుకున్నారు. ఇలా మళ్లీ అదే డ్రెస్ వేసుకోవడానికీ ఒక కారణం ఉంది. ఒక చిన్న వస్త్రం తయారు చెయ్యాలంటే దాని వెనుక ఎన్నో సహజవనరుల్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. సహజవనరుల్ని కాపాడాలంటే సెలిబ్రిటీలు కూడా వేసుకున్న డ్రెస్‌లే మళ్లీ ధరించాలన్న సందేశాన్ని పంపడానికే ఇవాంకా అదే డ్రెస్ ధరించారు. ఈ విధంగా ప్రకృతి పట్ల ఆమె చూపిస్తున్న ప్రేమ అందరినీ ఆకట్టుకుంటోంది. తాజ్ వద్ద ఇవాంకా, కుష్నర్ దంపతులు సాధారణ టూరిస్టులకు నో ట్రంప్ రాక సందర్భంగా సోమవారం ఆగ్రాలోని ప్రఖ్యాత పర్యాటక స్థలం తాజ్‌మహల్‌లో సాధారణ టూరిస్టుల సందర్శనను నిలిపివేశారు. సోమవారం సాయంత్రం 5.15 గంటలకు ట్రంప్ తాజ్‌మహల్ రాగా.. ఉదయం 11.30 గంటలకే తాజ్‌ను సాధారణ సందర్శకులకు దూరం చేశారు. ట్రంప్ భద్రత ఏర్పాట్ల దృష్ట్యా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ట్రంప్ రాకను పురస్కరించుకుని తాజ్‌మహల్‌ను అందం గా అలంకరించామని, ఉద్యానవనంలో మరిన్ని పూలమొక్కలు నాటడంతోపాటు ఫౌంటేన్లు మరమ్మతు చేయించామన్నారు. ట్రంప్ దంపతులకు సీఎం యోగి బహుమతి -
మా ఆవిడతో కలిసి తాజ్‌మహల్ చూడాలి: ఒబామా
ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. గడిచిన రెండేళ్లలో ఈ ఇద్దరు నాయకులు కలుసుకోవడం ఇది ఎనిమిదోసారి. లావోస్‌లో జరిగిన ఏసియాన్ సదస్సుకు మోదీతో పాటు ఒబామా కూడా హాజరయ్యారు. త్వరలోనే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనుండటం, ఒబామా పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో మోదీ ఆయనను మరోసారి భారతదేశానికి ఆహ్వానించారు. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా భారత్ రావాలని చెప్పారు. దానికి ఒబామా కూడా సానుకూలంగా స్పందించారు. ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహల్‌ను తాను ఇంతవరకు తన భార్య మిషెల్‌తో కలిసి చూడలేదని, ఒకసారి దాన్ని చూడాలని ఉందని, అందుకోసం తప్పకుండా వస్తానని చెప్పారు. 2008 నాటి ముంబై ఉగ్రదాడులతో పాటు పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఈ జనవరిలో జరిగిన దాడికి కారకులను పాకిస్థాన్ గుర్తించి శిక్షించాలని ఏషియాన్ సదస్సు సందర్భంగా ఒబామా, మోదీ ఇద్దరూ గట్టిగా డిమాండ్ చేశారు. తమ పొరుగున ఉన్న ఒక దేశం ఉగ్రవాదాన్ని తయారుచేసి, ఎగుమతి చేస్తోందని పాకిస్థాన్ పేరు చెప్పకుండానే నరేంద్రమోదీ అన్నారు. అలాంటి దేశాల మీద ఆంక్షలు విధించి, వాటిని ఒంటరి చేయాలని చెప్పారు. జి20 సదస్సులో సైతం.. ఒకే ఒక్క దేశం దక్షిణాసియాలో ఉగ్రవాదాన్ని వ్యాపింపజేస్తోందని మోదీ అన్నారు. కాగా, జీఎస్టీ బిల్లును ఆమోదించినందుకు ప్రధాని మోదీని బరాక్ ఒబామా అభినందించారు. -
ఒబామా వస్తారని.. రోడ్లు కడిగిస్తున్నారు!
మన దేశంలో ప్రజల కోసం రోడ్ల మీద గుంతలు పూడ్చడానికి, అసలు రోడ్లే లేని చోట రోడ్లు వేయడానికి కూడా తీరికలేని అధికారులు.. అమెరికా అధ్యక్షుడు ఒబామా వస్తున్నారంటే మాత్రం ఎక్కడలేని శ్రద్ధ కనబరుస్తున్నారు. కార్మికులను వందల సంఖ్యలో నియమించి.. రోడ్లన్నింటినీ అద్దాల్లా మారుస్తున్నారు. ఈ కార్మికులు స్వయంగా రోడ్లను బ్రష్‌లు పెట్టి తమ సొంత చేతులతో శుభ్రం చేస్తున్నారు. మోకాళ్ల మీద నిలబడి.. నడుం వంచి ఒక రోజంతా ఇలా రోడ్లను సర్ఫుతో కడిగినందుకు అతడికి లభించే కూలీ.. కేవలం రూ. 300. ఆగ్రా నగరం మొత్తాన్ని ఇలా శుభ్రం చేయించడానికి మొత్తం 600 మందిని నియమించారు. ఒబామా దంపతులు తాజ్ సందర్శనకు వస్తున్న నేపథ్యంలో ఈ నగరంలో ఎక్కడా చిన్న కాగితం ముక్కగానీ, దుమ్ము గానీ ఉండకూడదని జాగ్రత్త పడుతున్నారు. వీధికుక్కలు, ఆవులు, గేదెలు నగరంలో తిరగడానికి వీల్లేదని వాటిని కట్టిపారేశారు. చిన్న మరక కనపడినా అధికారులు ఊరుకోరని.. అందుకే తాము అత్యంత జాగ్రత్తగా అంగుళం అంగుళం శుభ్రం చేస్తున్నామని కార్మికుల్లో ఒకరు తెలిపారు. ఇక యమునా నదిలోంచి కూడా కేవలం రెండు రోజుల్లో రెండు టన్నుల చెత్తను తీసేశారు. తాజ్‌మహల్ యమునా తీరంలోనే ఉండటంతో ఆ నది కూడా అందంగా కనపడాలిన అధికారులు ప్రయత్నిస్తున్నారు. తాజ్‌మహల్ లోపల భాగాలను, లాన్లను కూడా మహిళలను పెట్టి శుభ్రం చేయిస్తున్నారు. ఒబామా వచ్చేరోజు పర్యాటకులు ఎవరినీ అనుమతించడం లేదు. ఇక తాజ్ చుట్టుపక్కల, ఆ కట్టడానికి వెళ్లే మార్గంలో ఉన్న ఇళ్ల వారిమీద కూడా నిషేధాజ్ఞలు ఉన్నాయి. బయటకు వెళ్లకూడదు, డాబా మీదకు వెళ్లకూడదు, కనీసం బయటకు బాత్రూంకైనా కూడా వెళ్లకూడదు.. పుట్టినప్పటి నుంచి ఇలాంటి నిబంధనలు ఎప్పుడూ చూడలేదని అనిల్ శంకర్ వాపోయారు.